Others

బడి.. ఓ సమన్వయకర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామనవడిని- ‘నువ్వు జీవితంలో ఏమవుతావ్? ఏమి కావాలనుకుంటున్నావ్?’ అని అడిగాను. అధ్యయనం చేస్తున్నాను కానీ, ఏమి కావాలోనని నిర్ణయం తీసుకోలేదని సమాధానం.
నేటి విద్యార్థిపై ప్రపంచీకరణ ప్రభావం ఎంతోఉంది. నేను మా వూళ్లో ఉన్నట్లయితే ఇలాంటి సమాధానం ఇవ్వగలిగేవాడినా? అనిపించింది. వలసల వల్ల నేను హైదరాబాద్‌కు రావటం, నా మనవుడు అమెరికా పోవటం వల్లనే కదా ఈ మార్పుకు కారణం. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పే వలసలకు కారణం. సాంకేతికతతో మనిషి జీవన ప్రమాణాలు పెరగటమే కాదు, దేశాల మధ్య అంతరాలు తగ్గే అవకాశాలున్నాయి. మన కల్చర్‌లోనూ మార్పు వచ్చే అవకాశం ఏర్పడింది. ఈనాడు మన పిల్లలు ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, చైనా వంటి దేశాల్లో ఎంతమంది కనపడుతున్నారో, దానివల్ల రాబోయే తరం ఆశయాలు కూడా మారిపోతున్నాయి. 10 నుంచి 12 ఏళ్ల వయసు వచ్చేసరికి పిల్లలు తాము జీవితంలో ఏం చదవాలి? ఎట్లా చదవాలనే విషయంపై ఆలోచిస్తున్నారు. ఆ మార్గంలో నడిచే ప్రయత్నాలు చేస్తున్నారు. పాఠశాలలు పాఠ్య పుస్తకాలకు, పరీక్షలకు పరిమితమయ్యే కాలం పోయింది. విద్య పరిధి పెరిగింది. తరగతి గదిలోని జ్ఞానాన్ని గ్రంథాలయాలతో, మ్యూజియంలతో, ఇతర వస్తువులతో సమన్వయం చేస్తున్నారు. స్కూలు అన్నిరంగాలకు సమన్వయకర్తగా తయారైంది. పాఠశాల లక్ష్యం పెరుగుతూ ఉంది.
ఓనమాలను విద్యార్థే నిర్ణయిస్తాడు...
21వ శతాబ్దంలో పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమానికీ విద్యార్థే కీలకం. ఈ విషయాన్ని స్పష్టీకరించటానికి బిఎడ్ కాలేజీలోనైనా లేక మానసిక శాస్త్ర శిక్షణాలయాల్లో కానీ ఒక కథ చెబుతారు.
జంతువులు, పక్షులు, చేపలు, బాతులు, ఉడతలు, కుందేళ్లు వంటివన్నీ కలసి తమలో ప్రతిభను పెంచుకోవటానికి ఒక శిక్షణాలయం పెట్టాలని అనుకున్నాయట! ఇవన్నీ సమావేశం కాగానే శిక్షణాలయానికి కావాల్సిన సిలబస్‌ను నిర్ణయించుకున్నాయట! పరుగెత్తటం, ఈత కొట్టడం, చెట్లు ఎక్కటం, గాలిలోకి ఎగరటం, దూకటం లాంటి అంశాలపై సిలబస్‌ను తయారుచేసుకున్నాయట! మిగతా జంతువులన్నీ కుందేలుతో- ‘నువ్వు చురుగ్గా కనపడేవరకు పరుగెత్తగలవా?’ అని అడిగాయి. అది వాటికి పరుగెత్తే క్లాసు.
అన్ని జంతువులకన్నా కుందేలు బాగా పరుగెత్తిందట. బాగా పరుగెత్తే కుందేలు దొరకటం తమ అదృష్టమని ఆ స్కూలు యాజమాన్యం అనుకున్నదట! పరుగెత్తే క్లాస్ తర్వాత ఈతకొట్టె క్లాసు వచ్చిందట. అన్ని జంతువులు, పక్షులూ మళ్లీ కుందేలు వైపు చూస్తున్నాయి. ‘నువ్వు హుషారుగా ఉన్నావు.. ఈత కొట్టాలి’ అన్నాయట. కుందేలు అనుమానంగా చూస్తున్నది. తీరా నీళ్ళల్లోకి పోగానే అది మునిగిపోయింది. ఎలాగోలా బయటపడి, ‘నేను ఈ స్కూల్లో ఉండను’ అన్నదట. కుందేలును చెట్టు ఎక్కగలుగుతావా? అని జంతువులు మళ్లీ అడిగాయి. తన కళ్లు అంత బలంగాలేవని కుందేలు సమాధానం. ‘ప్రయత్నమైనా చేస్తావా?’ అని ఇంకోసారి జంతువులన్నీ బలవంతం చేయగా, కుందేలు భయపడుతూ ఇక ఆ స్కూల్లో ఉండనని అక్కడి నుంచి వెళ్లిపోయిందట! ఉడత మాత్రం హుషారుగా దూకుతోంది. కుందేలు మాత్రం ఇంటిని వీడి బయటకు రానంది.
ఈ కథ వినగానే ఒక విద్యార్థికి విషయం అర్థమైపోయింది. ప్రతి ప్రాణిలోనూ ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను ప్రోత్సహిస్తే దాన్ని పురస్కరించుకుని వేరేవాటికి ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నం చేసేశక్తే ప్రతిభ. ఆ శక్తిని మనం పొగిడితే విద్యార్థి స్కూలుకు దూరమైపోతాడు. ఈ విషయాన్ని గమనించిన ఐఎఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ గురుకుల స్కూళ్లకు వచ్చేలా పిల్లల్ని ప్రోత్సహించాడు. గుట్టలను ఎక్కించాడు. ఏకంగా ఎవరెస్టు శిఖరానే్న అధిరోహించే విధంగా తయారుచేశాడు. ఇంగ్లీషు అంటే భయం పోగొట్టాడు. ఇంగ్లీషును అందరికీ మంచి నీళ్లలాగా అందించేశాడు. లెక్కలంటే భయం పోగొట్టాడు. ఈ విషయాన్ని నేను మాత్రం గ్రహించలేక పోయాను.
తరగతి గదికి రాగానే లెక్కలిచ్చి చేయమంటే లెక్కరాని పిల్లలు భయపడతారు. వారు తరగతికి క్రమంగా దూరమయ్యే ప్రమాదముంది. ఉపాధ్యాయునికి విద్యార్థిలో దాగివున్న ప్రతిభ గురించి తెలిస్తే- ధైర్యం, పోరాటం చేసే శక్తి, ఆత్మస్థయిర్యం పెరుగుతుంది. స్కూలుకు విద్యార్థిరాగానే మనం అనుకున్న చదువుకాకుండా ఆ పిల్లల్లో ఆత్మస్థయిర్యాన్ని పెంచే చదువుల మార్గాన్ని ఎన్నుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అప్పుడు విద్యార్థి తనకు రానిదానిపైన కూడా దృష్టిపెడతాడు. గురుకులాల్లో ప్రవీణ్‌కుమార్ చేసిన కృషి అభినందనీయం. ప్రతి విద్యార్థిలో దాగివున్న ప్రతిభను బయటకు తీయాలంటే ఆ విద్యార్థి నేపథ్యాన్ని అధ్యయనం చేయాలి. ఆత్మస్థయిర్యం కలిగించటమే ప్రతిభకు దారివేసినట్లవుతుంది. దానివలన విద్యార్థికి జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని కలిగించగలుగుతుంది. ఇది కలిగించగలిగితే విద్యార్థికి బలం ఏర్పడుతుంది. అప్పుడే పిల్లలు స్కూలుకు ‘డ్రాప్-అవుట్’ కారు. విద్యార్థిలో దాగివున్న ప్రతిభను వెలికితీసే పనే ఓనమాలుగా మారాలి.

-చుక్కా రామయ్య