మెయిన్ ఫీచర్

ఐశ్వర్యకు మరో పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందచందాలతోనే కాదు, అద్భుత నటనతోను ప్రేక్షకజన హృదయాలను గెలుచుకున్న బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను మరో అంతర్జాతీయ అవార్డు వరించింది. టీవీ, సినిమా రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన మహిళలకు ‘‘మెర్ల్ స్ట్రీప్’’ గౌరవార్థం ఇచ్చే తొలి అవార్డుకు ఐశ్వర్యను ఎంపిక చేశారు. ఈ అవార్డును శనివారం వాషింగ్టన్‌లో ప్రదానం చేస్తున్నట్లు 3విఫ్ట్- ఇండియా2 (ఉమెన్ ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్) సంస్థ ప్రకటించింది. మూడు ఆస్కార్ అవార్డులను గెలుచుకొని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన 69 ఏళ్ల అమెరికా నటి మెర్ల్ స్ట్రీప్ గౌరవార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. వినోద రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ మేటినటిగా రాణిస్తున్న ఐశ్వర్య కీర్తికిరీటంలో తాజాగా 3విఫ్ట్2 అవార్డు చేరింది. 3కేన్స్2 వంటి అంతర్జాతీయ సినీ ఉత్సవాలకు ఏటా భారత ప్రతినిధిగా హాజరవుతున్న ఐశ్వర్యకు దేశదేశాల్లో అభిమానుల సంఖ్య అసంఖ్యాకం.
పురుషాధిక్యతకు, లింగవివక్షకు నిలయమైన సినిమా రంగంలో మహిళల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేందుకు మెర్ల్ స్ట్రీప్ పేరిట అవార్డును అందజేస్తున్నట్టు 3విఫ్ట్ ఇండియా2 వ్యవస్థాపక అధ్యక్షురాలు పెట్రినా డి రోజిరియా తెలిపారు. 3విఫ్ట్ ఇంటర్నేషనల్2కు అనుబంధంగా పనిచేస్తున్న తమ సంస్థ సినిమా, వీడియో, టెలివిజన్ రంగాల్లో వృత్తిపరంగా మహిళలు ఎదిగేందుకు కృషి చేస్తున్నట్టు, ఇందులో భాగంగానే పురస్కారాలను ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు.