మెయన్ ఫీచర్

ఈ ‘బేతాళ ప్రశ్నల’కు బదులిచ్చేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో కశ్మీర్ తర్వాత అంతటి అందమైన ప్రదేశం కేరళ. ఇక్కడి సరస్సులు, కొబ్బరి తోటలు, మలయ మారుతాలు, సుగంధ ద్ర వ్యాల ఘుమఘుమలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఒకప్పుడు కేరళ ప్రాంతాన్ని తిరువాన్కూరు సంస్థానం అని పిలిచేవారు. 1947 ప్రాంతంలో కేరళలో ఆర్‌ఎస్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రవేశించాయి. ‘దునే్నవాడిదే భూమి-్ధనవంతుల దౌర్జన్యాలు నశించాలి’ వంటి నినాదాలతో కమ్యూనిజం వేళ్లూనుకుంది. కేవలం సేవా కార్యక్రమాలపై ఆర్‌ఎస్‌ఎస్ ఆధారపడి తన క్యాడర్‌ను విస్తరించుకుంది. సెయింట్ థామస్ క్రైస్తవ మత ప్రచారం కోసం కేరళ ప్రాంతానికి వచ్చాడు. క్రమంగా హిందూ రాజుల సహకారంతో చర్చిల నిర్మాణం జరిగింది. తమిళనాడులో ‘తిరుక్కురళ్’ రచించిన తిరువళ్లువర్ అనే ఋషి ఉండేవాడు. ఆయన సెంట్ థామస్ శిష్యుడు అని క్రైస్తవులు ప్రచారం చేశారు. కేరళకు పడవల మీద ముస్లిం వ్యాపార వర్గాల వారు ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ఇస్లామీకరణ కూడా కేరళలో జరిగి పోయింది. టిప్పు సుల్తాను వంటి పాలకులు మలబారు ప్రాంతంలో వేలాది హిందువులను హత్య చేయించడం, లక్షలాది మంది హిందువులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడం వంటి పనులకు పాల్పడ్డాడు.
కాగా, గత నెలలో కేరళలో జల ప్రళయం సంభవించి అపార నష్టం జరిగింది. దాదాపు 20వేల మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యం సంభవించిన తరుణంలో కేరళలోని సీపీఎం ప్రభుత్వం కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వింది. విపత్కర సమయంలో తాము కోరినన్ని నిధులు కేంద్రం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
కమ్యూనిస్టులు అనాదిగా హత్యా రాజకీయాలకు అలవాటుపడ్డారే కాని సేవా కార్యక్రమాలు వారికి అలవాటు లేదు. దేశంలో ఏ మూల విపత్తు వచ్చినా ముందుగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు రంగంలోకి దిగుతారు. ఆర్‌ఎస్‌ఎస్ అంటే ‘రెడీ ఫర్ సోషల్ సర్వీస్’ అని అభివర్ణించాడు తెలంగాణ సర్వోదయ నాయకుడు ప్రభాకర్‌జీ. ఈ వౌలిక భేదం కేరళలో జలప్రళయం సందర్భంగా మరోసారి ఆవిష్కృతమైంది.
* * *
‘ఆగస్టు 15’ భారతీయులకు చాలా పవిత్రమైన రోజు. మూడు వందల సంవత్సరాల బ్రిటీషు పాలన నుండి దేశానికి విముక్తి లభించిన దినమది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జమ్మూ కశ్మీరు రాజధాని శ్రీనగర్‌లో ఒక దేశభక్తుడు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తుంటే అతనిని ఐసిస్ ఉగ్రవాదులు కొట్టారు. ఈ తీవ్రవాదులు బహిరంగంగా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలివ్వటం మనం టీవీ చానళ్లలో చూశాము. సునీల్ చోప్రా అనే సీపీఎం నాయకుడు ఐసిస్ ఉగ్రవాదుల చర్యలను సమర్ధిస్తూ ఇటీవల ఓ టీవీ చానల్‌లో మాట్లాడగా- ‘నీ ముసుగు తొలగిపోయింది.. నీ నిజ స్వరూపం తెలిసింది..’ అని ఆ సందర్భంగా టీవీ యాంకర్ వ్యాఖ్యానించింది.
కొంతకాలం క్రితం కాకినాడ వెళ్లాను. ఆరోజు ఆగస్టు 15 కావడంతో అక్కడి వీధుల్లో ఏదో ఊరేగింపు వెళ్తున్నది. తరచి చూడగా అది స్కూలు పిల్లల ఊరేగింపు. దానికి ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ నేతృత్వం వహిస్తున్నారు. ‘మాకింకా స్వాతంత్య్రం రాలేదు’- అంటూ పిల్లలు చేత్తో అట్టలు పట్టుకొని ఊరేగుతున్నారు. ఈ ఊరేగింపును స్థానిక క్రైస్తవ మిషనరీలు చేయిస్తున్నాయని తెలిసింది. సర్వమత సహనానికి నిలయమైన భారతదేశంలో క్రైస్తవులకు ఏం అన్యాయం జరిగింది? స్వాతంత్ర దినోత్సవం నాడు ఇలా నిరసన తెలపటం న్యాయమేనా? పలు చోట్ల క్రైస్తవ మత ప్రచారకులపై అత్యాచారం కేసులు, భూకబ్జా కేసులు, లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. ఒకప్పుడు క్రైస్తవ మిషనరీలు సేవాభావంతో పనిచేసేవి. ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది. ప్రభుత్వం నుంచి ఉపకార వేతనాలు, ఉద్యోగాలు పొందుతూ క్రైస్తవులు విదేశాల నుండి భారీగా నిధులు తెచ్చుకొని మతం మార్పిడులు చేస్తున్నారు. దీనిని ఎవరూ ఎదుర్కోలేకపోతున్నారు.
* * *
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినపుడు- ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన ప్రవేశించడానికి వీలులేదని తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. నిజానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను అన్ని రాజకీయ పార్టీలు కరివేపాకులా వాడుకొని వదిలేశాయి. ‘తెలంగాణ నుంచి ఆంధ్రోళ్లు వెళ్లిపోతే లక్ష ఉద్యోగాలు మీకు వస్తాయి’- అని తెరాస అధినేత కేసీఆర్ చెప్పిన మాటలను ఉద్యమ సమయంలో విద్యార్థులు నమ్మారు. బలిదానాలు చేశారు. ఇప్పుడు ఉద్యోగాలు రాలేదు. తాము మోసపోయామని తెలంగాణ విద్యార్థులు రాజకీయ పార్టీల మీద చాలా కోపంతో ఉన్నారు.
కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు తెలంగాణ సర్కారుపై ఆగ్రహం ప్రకటిస్తూ, ‘ఉస్మానియా యూనివర్సిటీలోకి రాహుల్ గాంధీ రాకుండా అడ్డుకోవటం అప్రజాస్వామికం’ అని తీవ్రంగా విమర్శించారు. స్వామి పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్ నుండి యాదాద్రికి పాదయాత్ర చేయాలనుకుంటే దానిపై నిషేధం ప్రకటించి, అతడిని నగర బహిష్కరణకు గురిచేశారు. స్వామి వారి భక్తులు కోర్టుకుపోతే ‘నగర బహిష్కరణ నిషేధం చెల్లదు’ అని తీర్పునిచ్చింది. కొద్ది వారాల క్రితం భాజపా నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ సంస్మరణ సభలో మాట్లాడారు. ఆ సభ జరగనివ్వకుండా కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్‌ఎస్‌యుఐకు చెందిన కార్యకర్తలు అల్లరి చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకులు ఎలాంటి సమాధానం చెప్పలేదు. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్నట్లు రాహుల్ గాంధీ తమ ప్రాంగణానికి వస్తానంటే ఉస్మానియాలోని కొందరు విద్యార్థులు నిరసన తెలిపారు. మరోవైపు విద్యార్థులను చదువుకోనివ్వకుండా పలు సందర్భాల్లో వివిధ రాజకీయ పార్టీల జెండాలు మోసేందుకు వాడుకుంటున్నాయి.
* * *
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇంగ్లీషులో మంచి వక్త. ఆ మధ్య లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని గూర్చి ఆయన చేసిన ప్రసంగం విద్యావేత్తలందరినీ ఆకర్షించింది. తెదేపా ఎంపీ అయిన ఆయన ఇటీవల గుంటూరులో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల సందర్భంగా జనసేన-్భజపా- వైకాపా అపవిత్ర పొత్తు పెట్టుకొని తెదేపాను ఓడించేందుకు వ్యూహరచన చేశాయని అన్నారు. జయదేవ్ లాంటి చదువుకున్న వ్యక్తి చేసిన ఈ వ్యాఖ్యలో నిజమెంత? రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలలో పొత్తులు, ఎత్తులు సహజమే కదా? కాగా, రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రుల నోట్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మట్టికొట్టిందని తెదేపా వారు తరచూ ఆరోపిస్తుంటారు. మరి- ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు తెదేపా ఎందుకు పావులు కదుపుతోంది? ఆగర్భశత్రువైన కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ ఎలా కలసి అడుగులు వేస్తుంది? ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అంతరించి నాలుగున్నరేళ్లు గడిచిపోయాయి. దానిని బతికించాలని రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకుంటే ఎన్‌టిఆర్ ఆత్మ క్షోభించదా?
విజయనగరం మాజీ సంస్థానాధీశుడు, ప్రస్తుత ఎంపీ అశోక గజపతిరాజు వంటివారు రాజకీయ సన్యాసం తీసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. రైలు ఎక్కిన వారు ఎప్పుడో ఒకప్పుడు తమ గమ్యం రాగానే దిగిపోక తప్పదు. ఈ సిద్ధాంతం అందరికీ వర్తిస్తుంది. ఏ పార్టీ కూడా కాలానికి అతీతం కాదు. పదమూడు సార్లు ఎంఎల్‌ఏగా, ఐదుసార్లు మఖ్యమంత్రిగా పనిచేసిన తమిళనాడు డిఎంకె నేత కరుణానిధి తన చివరి రోజుల్లో అధికారం పొందలేక పోయాడు.
* * *
డీఎంకే పార్టీలో అంతఃకలహాలు కొత్తవేమీ కాదు. ముత్తు అనే పేరుగల తన కుమారుడు ఎంజీఆర్ అభిమానిగా మారాడని అతనిని దూరంగా పెట్టిన మనస్తత్వం కరుణానిధిది. ఒకప్పుడు తన స్నేహితుడైన ఎంజీఆర్‌ను పార్టీనుండి ఆయన బహిష్కరించారు. జయలలితను శాసనసభలో అగౌరవ పరిచారు. కరుణానిధి మరణానంతరం ఆయన కుమారులైన అళగిరి, స్టాలిన్ మధ్య ఆధిపత్య పోరాటం బహిరంగమైంది. ఈ అంతర్గత విభేదాలతో టీఎంకే పార్టీ బలహీనపడితే అది తమిళనాడులో ద్రవిడ రాజకీయాలకు తెర దించుతుంది. ఈ పరిణామం భారతదేశ సమగ్రతకు చాలా మంచిదని వాదించేవారు లేకపోలేదు. డీఎంకేలో స్టాలిన్ హవా ప్రారంభం కావడంతో అళగిరి ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. కానీ- మధురై కేంద్రంగా దక్షిణ తమిళనాడు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఉద్యమిస్తారా? పాత డిమాండ్‌ను ఆయన మరోసారి తెరపైకి తెస్తారా?
* * *
ఉడత ఊపులకు చింతకాయలు రాలవు, తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని టీవీ చానళ్లకు చేరవేసి, అర్ధరాత్రి వేళ సైతం చర్చాగోష్టులను చూపిస్తే వీక్షకులకు ఒరిగేదేమిటి? రాహుల్ గాంధీ 153 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను ఎగ్గొట్టాడట! అయితే ఏమిటి? రాజకీయ దిగ్గజాలపై కోర్టుల్లో కేసులు నిలబడవు. 2జీ స్పెక్ట్రమ్ కేసు, బోఫోర్సు కేసు, బొగ్గు కుంభకోణం కేసు, హెలికాప్టర్ల కొనుగోలులో అక్రమాల కేసు, పనామా పేపర్ల బాగోతం, నేషనల్ హెరాల్డ్ కేసు, జగన్ అక్రమాస్తుల కేసులు, చంద్రబాబుపై కేసులు, మమతా బెనర్జీపై చిట్‌ఫండ్ కేసులు, సునంద పుష్కర్ హత్యకేసు.. ఇలా ఎన్నో కేసులు మరుగున పడుతున్నాయి. రాజకీయ వేత్తలకు శిక్షలు పడిన ఉదంతాలు చాలా అరుదు. శిక్షలు పడినా బెయిల్‌పై వారు జీవితాంతం బయటే ఉంటారు. ఎన్ని కేసులున్నా, ఎన్ని ఆరోపణలున్నా ఇలాంటి నేతలు మోదీని గద్దె దించి, వచ్చే ఏడాది ప్రధాని పీఠంపై కూర్చోవాలని తపన పడుతుంటారు. ఎవరు ప్రధాని అయినా జనం చేసేది ఏమీ లేదు.
* * *
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీపీఐ నాయకుడు రామకృష్ణ ఆమధ్య మాట్లాడుతూ, నూతన భావజాలంతో తృతీయ ప్రత్యామ్నాయం రావాలని అభిలషించారు. ఈ ఆలోచన బాగుంది. దీన్ని సాధించేందుకు కార్యాచరణ ఏమిటి? ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్‌ను, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జేపీని, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను కలుపుకోవడమేనా రామకృష్ణ చెబుతున్న ‘నూతన భావజాలం’? కానీ, లోక్‌సత్తా పార్టీ ఇప్పటికే మూతపడింది. లక్ష్మీనారాయణ కొత్తగా పార్టీ పెడతారో, ఏ పార్టీలో చేరతారో ఇంకా తెలియదు. ‘జనసేనాని’ వెంట తిరిగితే పవన్‌కే లాభం తప్ప, సీపీఐకు సీట్లు దక్కే అవకాశం లేదు. ఒకప్పుడు సొంతబలం చూపిన వామపక్షాలు ఇటీవలి కాలంలో ఏదో ఒక పార్టీకి ‘తోకలు’గా ఉండాలని ఎందుకు ఆరాటపడుతున్నాయి?
మరోవైపు- ‘విప్లవం తెస్తామంటు’న్న మావోయిస్టులు కూడా బలహీన పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీల మధ్య, నేతల మధ్య సిద్ధాంతాల రీత్యా అభిప్రాయ భేదాలుంటాయి. అంతమాత్రాన ‘వర్గ నిర్మూలన’ పేరిట మారణహోమాన్ని జరపడం తగునా? ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో మావోయిస్టులు సామాన్యులనే కాదు, రాజకీయ నేతలను, జవాన్లను అంతం చేస్తున్నారు. ఇందుకు రాజ్యాంగం అంగీకరిస్తుందా? ‘్భరత రాజ్యాంగం మీద మాకు నమ్మకం లేదు’ అనే వారిని ఏమనాలి? కోర్టుల్లో అగ్రకులాలవారున్నారు కాబట్టి వారు ఇచ్చే తీర్పులపై మాకు విశ్వాసం లేదని మావోయిస్టు సానుభూతిపరులైన విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు అనడం విడ్డూరం. ఇదీ వర్తమాన భారతదేశ ముఖచిత్రం? దేశ ప్రధానిని హత్యచేయాలనుకున్న వారిని అరెస్టు చేస్తే వారిని విడిపించేందుకు రొమిల్లా థాపర్ వంటి లాయర్లు కోర్టుకు హాజరై వాదించారు. ఆమె రచనలు పాఠ్యగ్రంథాలుగా నేడు లక్షలాది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇదీ మన విద్యావ్యవస్థ!

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్