మెయిన్ ఫీచర్

గెలుపు బాధ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యర్థి ఎన్నో టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న సివంగి.. అయినా బెదరలేదు..
ప్రేక్షకుల మద్దతు లేదు.. పైగా గేలి చేస్తున్నారు.. అయినా వెనుకంజ వేయలేదు..
కళ్ల ముందున్నది ఒకటే.. లక్ష్యం! గెలవాలన్న దృఢ సంకల్పం మనలో ఉంటే ఆ లక్ష్యాన్ని చేజిక్కించుకోవడం కష్టం కాదు అని చాటిచెప్పింది నవోమి ఒసాకా.
2018 యు ఎస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్‌ను చిత్తుచేసిన ఈ ఇరవై సంవత్సరాల అమ్మాయి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడి జపాన్ తరపున ఈ ఘనత సాధించిన మొదటి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
1999 ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి డబుల్స్ బరిలో దిగిన వీనస్, సెరెనా విలియమ్స్ జోడీ టైటిల్‌ను గెలిచింది. ఆ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌ను జపాన్‌లోని ఒసాకా పట్టణంలో టీవీలో చూసిన లియోనార్డ్ ఫ్రాంకోయిస్.. తన కూతుళ్లను కూడా టెన్నిస్ క్రీడాకారిణులుగా చేయాలని నిశ్చయించుకున్నాడు. సెరెనా తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచినప్పుడు ఒసాకా వయసు ఏడాదిన్నర. ఒసాకా పుట్టింది జపాన్‌లో అయినా పెరిగింది యుఎస్‌లో.. జపాన్ తరపున ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మారిన ఒసాకా ప్రస్తుతం యుఎస్‌లోనే నివశిస్తోంది. ఒసాకా తల్లిది జపాన్, తండ్రిది కరీబియన్ దీవుల్లోని హైతి. ఒసాకా మూడేళ్ల వయసు ఉన్నప్పుడే వాళ్ల కుటుంబం యుఎస్‌లో స్థిరపడింది. ఒసాకాకు రెండు దేశాల పౌరసత్వం ఉంది. అయితే యుఎస్ టెన్నిస్ సంఘం సరైన వసతులు, సౌకర్యాలు కల్పించకపోవడంతో లియోనార్డ్ తన కూతుర్ని జపాన్ తరపున ఆడించాలని నిర్ణయం తీసుకున్నాడు. దానితో ఆమె ఇప్పుడు జపాన్ తరపున ఆడుతోంది. చిన్నప్పటి నుంచీ సెరెనాను చూస్తూ, ఆమెనే తన ఆరాధ్య దైవంగా అనుకుంటూ పెరిగిన ఒసాకా.. ఇప్పుడు అదే సెరెనాను ఓడించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను సాధించడం విశేషం కాక మరేమిటి చెప్పండి!?
3విలియమ్ సిస్టర్స్ వాళ్ల నాన్నకు మొదట్లో టెన్నిస్ తెలియకపోయినా తన కూతుర్లను చాంపియన్స్‌ని చేసినప్పుడు, టెన్నితో పరిచయమున్న నేను.. నా పిల్లలను ఎందుకు చాంపియన్స్‌గా మార్చకూడదు..2 అనుకున్న లియోనార్డ్ పట్టుదలగా తన కూతుర్లిద్దరినీ టెన్నిస్‌వైపు నడిపించాడు. అతనే వారికి స్వయంగా శిక్షణ ఇచ్చేవాడు. కానీ శిక్షణలో ఒసాకా ఎప్పుడూ అక్క చేతిలో ఓడిపోయేది. కానీ ఎలాగైనా అక్కపై విజయం సాధించాలనే కసితో సాధన చేసేది. లక్ష్యం, ఆశయం, సంకల్పం మనసులో ఉంటే సాధించలేనిది ఏముంటుంది చెప్పండి.. అలాగే కసితో, పట్టుదలతో మొదటగా తన అక్కపై విజయం సాధించింది ఒసాకా. ఈ అక్కాచెళ్లెలిద్దరూ కలిసి మహిళల డబుల్స్ ఆడారు. కానీ అక్క మారి గాయం కారణంగా ఆటలో వెనుకబడింది. కసితో, పట్టుదలతో ముందుకు వచ్చిన ఒసాకా మరింత ముందుకు దూసుకుపోయింది. తర్వాత లియోనార్డ్ ఒసాకాపై ప్రత్యేక దృష్టి పెట్టి అత్యుత్తమ శిక్షణను ఇప్పించాడు. అలా ప్రపంచంలో అత్యుత్తమ టెన్నిస్ క్రీడాకారిణిగా తన కూతుర్ని చూడాలనే లక్ష్యంతో శిక్షణను ఇప్పించిన తన తండ్రికి, ప్రస్తుత టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో అత్యుత్తమ క్రీడాకారిణి అయిన సెరెనాపైనే విజయం సాధించి తండ్రి కలను నెరవేర్చింది.
ఇరవై ఏళ్ల వయసులో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ ఘనత సాధించిన తొలి జపాన్ ప్లేయర్. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే.. చిన్నప్పటి నుంచి ఎవర్నైతే టెన్నిస్ ఆరాధ్య దైవంగా కొలిచిందో, 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత అయిన సెరెనాపై గెలవడం.. ఇలా జరిగితే ఎవరైనా సంబరాలు చేసుకుంటారు. వారి ఆనందాలు అవధులు ఉండవు.. గాల్లో తేలిపోయినట్లుంటారు.. కానీ ఒసాకా కన్నీరు పెట్టుకుంది. ఇంత పెద్ద విజయం సాధించిన నవోమి ఒసాకాకు ఆనందమే లేకుండా పోయింది. కారణం అక్కడ కూర్చున్న ఎవరికీ తన విజయం ఇష్టం లేకపోవడమే.. వారందరికీ సెరెనా గెలుపే కావాలి. ఆద్యంతం సెరెనాను ఉత్సాహపరిచిన ప్రేక్షకులు, ఒక సందర్భంలో ఒసాకాను గేలిచేయడం మొదలుపెట్టారు. ఫలితంగా ఒసాకా ఎంతో వేదనకు గురైంది. ఒక శక్తివంతమైన ఫోర్ హ్యాండ్‌తో ఆటను ముగించినా ఆమెలో ఆనందం లేదు. ఉబికి వస్తున్న కన్నీటిని అణచిపెట్టడానికి విఫలయత్నం చేస్తూ టోపీని కళ్లమీదకు లాక్కుంది. అంత ఒత్తిడిలో కూడా అత్యంత సంయమనాన్ని ప్రదర్శించి, అద్భుతంగా ఆడి తన దేశానికి చారిత్రక విజయాన్ని అందించింది ఒసాకా. కానీ సంతోషపడలేదు. అవార్డుల కార్యక్రమంలో కూడా ఒసాకా కళ్లకు టోపీని అడ్డం పెట్టుకుని ఏడ్చింది. కన్నీటి కష్టంగా ఆపుకుంటూనే ట్రోఫీని అందుకుంది. 34మీ అందరి మద్దతు సెరెనాకే ఉందని నాకు తెలుసు.. మ్యాచ్‌ను ఇలా ముగించినందుకు క్షమించండి22 అని అందరికీ కన్నీళ్లతో క్షమాపణ చెప్పుకుంది ఒసాకా..