మెయిన్ ఫీచర్

రైతు బాంధవుడు బలభద్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహా విష్ణువు అంశావతారుడు బలరాముడు. శ్రీహరి అంశతో జన్మించిన బలరాముడు హలధారియై, రైతుజన బాంధవునిగా భావించి, పూజించ బడుతున్నాడు. హలం చేతబూనిన హాలికుడే రైతు కనుక, నాగలితో నేలను తవ్వగా పుట్టిన నాగావళీ నది బలరాముని వరదాయిని అని ప్రజల విశ్వాసం. బలరాముని మరో ఆయుధం రోకలి. రోకలిని కూడా వివాహాది శుభ కార్యాలయాలలో గృహ జీవనంలో శుభాశుభాలకు వినియోగిస్తారు. ఆది శేషుడు, శ్రీహరిల బంధం, అనుబంధం ఆద్వితీయ, అసమాన, సనాతనమైనది. ‘సంభవామి యుగేయుగే’ అని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై శ్రీమహా విష్ణువు అవతారాలు దాల్చగా, ఆయనకు తోడు, నీడై, ధర్మ సంస్థాపనలో ఆదిశేషుడు వెన్నంటే ఉన్నాడు. శేషతల్పుడైన వైకుంఠ నాథునికి శాశ్వత పాన్పుగా వేరు చేయని స్థితిని పొందాడు శేషుడు. త్రేతాయుగాన విష్ణువు రామావతారియైతే, ఆది శేషుడు ఆదర్శ తమ్మునిగా లక్ష్మణుడై వెనువెంటే ఉన్నాడు. కృష్ణావతారంలో శేషుడు అగ్రజునిగా బలరాముడై గౌరవప్రదుడైనాడు. ఏడుకొండల స్వామికి, ఆది శేషుడు గోవిందరాజస్వామిగా, అన్నగా తిరుపతిలో నిలిచాడు. బల పరాక్రమంతో ప్రపంచాన్ని భద్రంగా చూసేవాడు, శుభాన్ని కలిగించే వాడు అయినందున బలభద్రుడని, ప్రజా హితం కోరేవాడై బల రాముడని, దేవకీ గర్భాన పిండ మార్పిడి వల్ల జన్మించినందున సంకర్షణుడని, రోహిణీ సుతుడైనందున రౌహిణీయుడని, హలాయుధుడని, రేవతీ రమణుడని, పిలువబడుతున్నాడు. బలరామకృష్ణుల బాల్య క్రీడలు లీలలుగా చిరస్మరణీయాలు. లోక కళ్యాణార్థం తమ వంతు కర్తవ్యంగా ప్రలంబాసురుని, చాణూర ముష్టికులనే మల్లురను సోదరులు హతమార్చారు. మహా బలపరాక్రముడు, వీరాధావీరుడైన బలదేవుని వద్ద కురుసార్వభౌముడు దుర్యోధనుడు గధా కౌశలాన్ని నేర్చుకుని, ప్రియ శిష్యుడైనాడు. ఒకసారి కోపోద్రిక్తుడై యుమునా నది దిశనే మార్చాడు. మరోమారు హస్తినాపురాన్ని తన హలాయుధంతో యుమనానదిలో కలపడానికి ఉద్యుక్తుడైనాడు. కురుక్ష్రేత యుద్ద సమయాన శాంతికాముకుడై తీర్థయాత్రలకు వెళ్ళాడు. బ్రహ్మ, పరమేశ్వరుడు, తాను పరమాత్మ అంశాల నుండి పుట్టామని ప్రకటించిన బలరాముడు, యదు వంశంలో పుట్టిన ముసలం కారణంగా, పరస్పర పోరులో యోగంతో తనువు చాలించాడు. తన ఆత్మను పరమాత్మలో, మూలరూపాన్ని శేషునిలో లీనం గావించాడు.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494