మెయిన్ ఫీచర్

సాయి తత్త్వం - మోక్ష మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయి జీవనమే సాయితత్త్వం. సాయితత్త్వంలోని జ్ఞాన వికాసాన్ని, మానవత్వాన్ని ఒంటబట్టించుకుంటే బతుకు ఆనందనందనమవుతుంది. జీవితం ధన్యమవుతుంది. నేడు మనిషి ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులు, చిక్కులకు ఏకైక పరిష్కారం సాయితత్వమే. ఎవరికీ అర్థం కానిదేదీ బాబా చెప్పలేదు. అర్థంకానిదేదీ చెప్పటానికి కూడా కనీసం ప్రయత్నించలేదు. బాబా చెప్పింది సత్యమార్గం. ఆ బాటలో నడిచి మంచిని పెంచుకోమన్నారు. సాయి బోధనలను మనసా, వాచా కర్మణా ఆచరిస్తే బతుకులు తీయనవుతాయి. యోగీశ్వరులు ఒక లక్ష్యం, కర్తవ్యం కోసం ఈ భూమిపై అవతరిస్తారు. కర్తవ్యం పూర్తయ్యాక శరీరాన్ని విడుస్తారు. అయితే తమ భావాల్ని అందరిలో నింపి వెళ్లటంవల్ల అదెప్పటికీ సజీవంగా ఉంటుంది. ఆ సజీవ భావమే శిరిడీలో సచ్చిదానంద రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ స్వరూపమై వెలుగొందుతోంది.
‘‘నేను ఏం చెబుతున్నానో గ్రహించువారు ఒక్కరూ లేరు. నా ఖజానాలో ఆధ్యాత్మిక జ్ఞానమనే ధనం నిండుగా ఉంది. ఎవరు కావాల్సింది వారు బండ్లకొద్దీ దీనిని తీసుకుపోవచ్చు’’ అని బాబా ఆహ్వానిస్తున్నారు. బాబా బోధనల్లోని పరమార్థాన్ని గ్రహించి, ఆచరించి మానవ జన్మను చరితార్థం చేసుకుందాం.
‘సాయి’ నామమే ఈ విశ్వంలో దివ్యధామం
‘సా’ అంటే సంసార సాగరాన్ని అవలీలగా దాటించే సాధనం.
‘యి’ అంటే ఇలపైనే జన్మరాహిత్యాన్ని ప్రసాదించే దివ్యౌషధం.
‘సాయి’ నామంలో సర్వశక్తులూ ఇమిడి ఉన్నాయి.
‘సాయి’ బోధనల్ని చదివితే అనంతమైన శక్తి సామర్థ్యాలు సొంతమవుతాయి.
‘సాయి’తత్వాన్ని ఒంటబట్టించుకుంటే అద్భుతమైన వికాసం పురివిప్పుతుంది.
లోన స్థిరచిత్తం - బాహ్యంకి చాంచల్యం
పైకి కనిపించే ఆరున్నర అడుగుల దేహమే బాబా అని భావించేవారి కళ్లు తెరిపించేందుకే బాబా అవతరించారు. బాబా సర్వాంతర్యామి. భూమి, గాలి, వెలుతురు, స్వర్గం సమస్త విశ్వంలో బాబా ఉన్నారు. బాబా అనంతుడు. అహర్నిశలు బాబానే ధ్యానిస్తే చక్కెర - తీపి, కెరటములు - సముద్రము, కన్ను-కాంతి కలిసి ఉన్నట్టే బాబాతో ఆ సంబంధాన్ని పొందుతాం. బాబా సచ్చరిత్రను, హితోక్తులను ఆచరిస్తే శాంతము, స్థిరమైన జీవనవిధానం అలవడతాయి.
బాబా అంతరంగం శాంతికి ఉనికిపట్టు.
ఆత్మజ్ఞానానికి గని.
దివ్యానందానికి బాబా ఆటపట్టు.
స్థిరచిత్తానికి పట్టుగొమ్మ.
బాబా దివ్య స్వరూపం ఆద్యంతాలు లేనిది. అక్షయమైనది. అనగా నానము లేనిది. అది భేదరహితమైనది.
విశ్వమంతా అనేకత్వంలో ఏకత్వంలా అవరించి ఉన్న పరబ్రహ్మతత్వమే సాయి రూపంలో శిరిడీలో అవతరించింది.
బాబా చూడటానికి మూడు మూరల మనిషిలా కనిపిస్తారు. కానీ, అందరి హృదయాల్లోనూ నివశిస్తారు. అందరి హృదయాలను పాలిస్తారు.
బాబా అంతరంగాన అన్నిటినీ త్యజించిన నిర్వ్యామోహులైనా, బయటికి లోకహితాన్ని కోరుతుంటారు.
బాబా లోలోన మమకార రహితులైనా బయట భక్తుల యోగక్షేమాల కోసం తాపత్రయపడేవారు.
లోన స్థిరచిత్తం. బాహ్యంకి చాంచల్యం. అదే బాబా స్వరూపం.
లోపల పరబ్రహ్మస్థితిలో ఉండే బాబా, బయటికి ఫకీరులా కనిపించేవారు.
బాబా అంతరంగం ఎవరికీ అర్థం కాదు.
ఎవరలా అర్థం చేసుకుంటే అలా పరమార్థం బోధపడుతుంది.
బాబా ఒక్కోసారి అందరికీ ప్రేమను పంచేవారు. కొన్నిసార్లు తనను చూడవచ్చిన వారిపైకి రాళ్లు రువ్వేవారు.
ఆశీర్వదించిన నోటితోనే తిట్టిపోసేవారు. ఆ నోట తిట్లు కూడా ఆశీర్వాదాలనే విషయం ఆ తర్వాత గాని తెలిసేది కాదు.
ఒక్కోసారి భక్తుల్ని ప్రేమతో హృదయానికి హత్తుకునేవారు. చక్కని బుద్ధులు చెప్పేవారు.
బాబా నిత్యం ఆత్మానుసంధానంలో మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యాన్ని చూపేవారు.
ఒకే ఆసనంలో స్థిరంగా కూర్చునేవారు. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు కాదు.
చిన్న చేతి కర్ర (సటకా) బాబా చేతి దండం. చింతారహితులై శాంతమునకు ఉనికిపట్టుగా భాసిల్లేవారు.
సిరిసంపదలు, కీర్తిప్రతిష్ఠలను లెక్కపెట్టేవారు కాదు. భిక్షాటనంతో పొట్ట పోసుకునేవారు.
నిత్యం ‘అల్లా మాలిక్’ అనే స్మరణ బాబా నాలుకపై నాట్యమాడుతుండేది. ‘అల్లా అచ్చా కరేగా’ (్భగవంతుడు మేలు చేస్తాడు) అని భక్తులకు అభయం ఇచ్చేవారు.
బాబా భక్తులపై చూపే ప్రేమ అవిచ్ఛిన్నమైనది.
బాబా నిజతత్వాన్ని గ్రహించువారు ధన్యులు.
బాబా పిచ్చి ఫకీరు అని భావించేవారు నిజంగా దురదృష్టవంతులు.

-డా కుమార్ అన్నవరపు