మెయిన్ ఫీచర్

అన్నం పరబ్రహ్మ స్వరూపమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వామన్ తాత్యా అనే కుమ్మరి బాబాకు రోజూ రెండు కాల్చని పచ్చి కుండల్ని ఇచ్చేవాడు. బాబా బావి నుంచి నీళ్లు తోడి ఆ కుండల్లో నింపి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు నీళ్లు పోసేవారు. సాయంకాలం వేళలో ఆ పచ్చి కుండల్ని వేపచెట్టు మొదట్లో బోర్లించేవారు. పచ్చికుండలు కావటంవల్ల అవి వెంటనే విరిగి ముక్కలయ్యేవి. మూడేళ్లలో బాబా కృషివల్ల అక్కడ చక్కని పూలతోట వెలసింది. ప్రస్తుతం ఆ స్థలంలోనే బాబా సమాధి మందిరం ఉంది.
కుస్తీ పోటీల్లో కలిగిన విరక్తి..
మహాత్ముల జీవితాల్లోనూ మార్పు అనేది ఉంటుంది. ఏదో సందర్భంలో అది మెరుపులా మెరుస్తుంది. అదే వారి జీవితాలను ధన్యం చేసే మలుపు తిప్పుతుంది. బాబా జీవితంలోనూ అలాంటి మెరుపును మనం చూడవచ్చు.
శిరిడీ కుస్తీ పోటీలకు పుట్టినిల్లు. షిర్డీ చేరిన కొత్తలో బాబా స్వయంగా కుస్తీలు పట్టేవారు. పలువురితో పోటీకి దిగేవారు. తాను దగ్గరుండి కొన్నిసార్లు కుస్తీ పోటీలు నిర్వహించేవారు. గెలిచినవారికి బహుమతులను ఇచ్చి ప్రోత్సహించేవారు. యవ్వనంలో ఉండగా బాబా వేషధారణ కూడా వస్తాదు మాదిరిగా ఉండేది. పహిల్వాన్‌లా కనిపించేవారు.
ఒకసారి బాబా మొహియిద్దీన్ తంబోళి అనే వస్తాదుకు, బాబాకు మధ్య ఏదో విషయంలో మాట పట్టింపు వచ్చింది. ఇద్దరూ కుస్తీకి దిగారు. ఆ పందెంలో బాబా ఓడిపోయారు. ఆ ఓటమి బాబాలో ‘విరక్తి’ కలిగించింది. అన్నిటిపై ఆసక్తిని పోగొట్టింది. అప్పటినుంచి బాబా వేషభాషలు, వేషధారణ మారిపోయాయి.
ఫకీర్లు ధరించే లంగోటిని బిగించుకుని, పొడవాటి చొక్కా (కఫ్నీ) తొడుక్కునేవారు. నెత్తిన గుడ్డ చుట్టుకునేవారు. చింకి గుడ్డలతోనే సంతుష్టి చెందేవారు. చిరిగిన గోనె ముక్కపై కూర్చునేవారు. రాజ్యభోగంకంటే దారిద్య్రమే మేలనేవారు. పేదలకు, సాధనాపరులకు భగవంతుడు స్నేహితుడని అనేవారు. తరచుగా ఆత్మానుసంధానంలో మునిగిపోయేవారు. వౌనమే భూషణమై, శాంతికి పెన్నిధిలా కనిపించేవారు. ఎవరైనా ఏదైనా అడిగినా మితంగా సమాధానం చెప్పేవారు.
రాత్రివేళల్లో మసీదులోనే పడుకునేవారు. పొగ పీల్చుకునే చిలుం గొట్టం, కొంత పొగాకు, రేకు డబ్బా (తంబిరేలు), కఫ్నీ, తలగుడ్డ, చేతిలో సటకా (చిన్న చేతికర్ర).. ఇవే బాబా ఆస్తులు.
తలపై గుడ్డను చుట్టి దాని అంచులను చక్కగా జడ మాదిరిగా మెలిపట్టి ముడివేసేవారు. దానిని ఎడమ చెవిపైనుంచి వెనుకకు వేలాడేలా వేసుకునేవారు. రోజుల తరబడి దుస్తులు మార్చేవారు కాదు.
మసీదులో ఈశాన్య భాగంలో ధునికి ఎదురుగా ఒక కొయ్యపై చేతిని ఆనించుకుని దక్షిణాముఖంగా కూర్చునేవారు. ధునిలో అహంకారం, కోరికల్ని ఆహుతి చేసేవారు. భక్తుల పాపాల్ని, కర్మల్ని కూడా కట్టెలుగా మార్చి కాల్చేసేవారు. నిత్యం ‘అల్లా మాలిక్’ (్భగవంతుడే యజమాని) అని అంటుండేవారు. అప్పుడప్పుడు బాబా కాళ్ళకు గజ్జెలు కట్టి మిక్కిలి సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకంగా రాగయుక్తంగా పాటలు పాడేవారు. బాబా నేత్ర, కర, పాద కదలికలు లయబద్ధంగా ఉండేవి. మధ్యాహ్న వేళ నాలుగైదు ఇళ్లకు బిక్షకు వెళ్ళేవారు. బాబాకు ఆహార పదార్థాలపై రుచి ఉండేది కాదు. అన్ని పదార్థాలను కలుపుకుని తినేవారు. తినగా మిగిలింది మసీదులోని ఓ పాత్రలో ఉంచేవారు. ఇదే సాయి జీవన విధానం. ఎవరు నేర్చుకోవాల్సింది వారు దీని నుంచి నేర్చుకోవచ్చు.
బాబాకు అన్నదానం అంటే మహాప్రీతి. ‘‘ఆహారమే పరబ్రహ్మ స్వరూపం. ఆహారం నుంచే అన్ని జీవులు ఉద్భవిస్తాయి. మరణానంతరం ఆహారంలోనే ప్రవేశిస్తాయి’’ అని తైత్తిరియోపనిషత్తు చెబుతోంది. ఆకలి బాధ అందరిదీ ఒక్కటే. ఆకలితో వున్నవారికి మొదట పెట్టిన తరువాతే మనం తినాలని చెప్పేవారు. అందుకే భక్తుల్లో బాబా అన్నదాన గుణాన్ని విపరీతంగా ప్రోత్సహించేవారు. అన్ని వ్యంజనాలలో పప్పుచారు ఎంత శ్రేష్టమైనదో, అన్ని దానాల్లో అన్నదానం అంత విశిష్టమైనది. బాబా మితాహారి. తనకు కావాల్సిన ఆహారాన్ని షిర్డీలోని నాలుగైదు ఇళ్లనుంచి భిక్ష చేసి తెచ్చుకునేవారు. ఎప్పుడైనా అందరికీ భోజనం పెట్టాలనిపిస్తే అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ తానే అయి చూసుకునేవారు. ఇతరులపై ఆధారపడేవారు కాదు. బాబా మొదట బజారుకు వెళ్లి ధాన్యం, పిండి, మసాలా దినుసులు నగదునిచ్చి కొని తెచ్చుకునేవారు. ధాన్యం, పప్పులు బాబాయే విసురుకునేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో పొయ్యి పెట్టి దానిపై వంట పాత్రను ఉంచేవారు. బాబా వద్ద రెండు వంట పాత్రలుండేవి. పెద్దది వందమందికి సరిపోయేది. రెండవది యాభై మందికి సరిపోయేది. వంట పాత్రలో కొలత ప్రకారం నీరు పోసి బియ్యం ఉడికించేవారు. ఒక్కోసారి చక్కెర పొంగలి, ఒక్కోసారి మాంసపు పులావు వండేవారు. పప్పుచారు ఉడుకుతుండగా అందుకి గోధుమ పిండి బిళ్లలను వదిలేవారు. మసాలా దినుసులను చక్కగా నూరి ఒక పాత్రలో ఉంచుకునేవారు. పదార్థాలన్నీ రుచిగా తయారయ్యేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు. జొన్నపిండిని నీళ్లలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలిపేవారు. భోజన పదార్థాలతో పాటు అంబలిని అందరికీ కొద్ది కొద్దిగా వడ్డించేవారు. అన్నం ఉడికిందో లేదో చూడ్డానికి బాబా చేతి వద్ద కఫనీ మడతను పైకెత్తి చేతిని నిర్భయంగా మండుతున్న డేకిసాలో పెట్టి కలిపేవారు. చెయ్యి కాలిన భావమే ముఖంలో కనిపించేది కాదు. వంట పూర్తికాగానే బాబా భోజన పాత్రల్ని మసీదులోకి తెచ్చి వౌల్వీలచే ఆరగింపునకు పెట్టేవారు. మొదట కొంత మహల్సాపతికి, తాత్యాకు ప్రసాదంగా పంపేవారు. అనంతరం బీదసాదలకు స్వయంగా వడ్డించేవారు.
బాబా భక్తులకు మాంసాహారం, శాఖాహారం వడ్డించటంలో యుక్తి కనబరిచేవారు. ఎవరు ఏ ఆహారం తీసుకుంటారో వారికి ఆ ఆహారమే వడ్డించేవారు. పొరపాటున కూడా ఒకరిది మరొకరికి వడ్డించటం చేసేవారు కాదు. ఒకరి మనసులో మరొక ఆహారం గురించి ఆలోచన రానిచ్చేవారు కాదు. గురువుగారు ఏదైనా ఇస్తే దానిని తినవచ్చునా? లేదా అని సంశయించేవారు. నరకానికి పోతారని ప్రతీతి. (ఇంకావుంది)

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566