మెయిన్ ఫీచర్

క్యాన్సర్‌పై నీలమ్ పోరాటం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘టు క్యాన్సర్ విత్ లవ్’ పుస్తకం బాధితులకు మార్గదర్శి
బౌద్ధమత గురువు నిచీరిన్ డైషోనిన్ బోధనతో ప్రేరణ

బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ తాను కీమోథెరపీకి వెళ్ళే ప్రతిసారీ ఈ పుస్తకాన్ని తనతో తీసుకువెళ్ళడంవలన, తప్పక క్యాన్సర్‌ను జయిస్తాను అనే నమ్మకం తనకు కలుగుతున్నదని పేర్కొన్నారు. దీన్నిబట్టి నీలమ్‌కుమార్ రచించిన టు క్యాన్సర్ విత్ లవ్ పుస్తకం పాఠకులను ఏ విధంగా ఆకట్టుకుందో ఇట్టే అవగతం అవుతున్నది.

మన దేశంలో ప్రస్తుతం ప్రతి 50 సెకండ్లకు ఒకరు క్యాన్సర్ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. రానున్న 20 సంవత్సరాలలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా. ‘‘ నన్ను భయరహితురాలిని చేసిన క్యాన్సర్‌కు నేను ఎప్పుడు కృతజ్ఞతలు చెబుతాను’’ అంటారు నీలమ్‌కుమార్. ప్రపంచ వ్యాప్తంగా తన పుస్తకాలు, ప్రసంగాల ద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో ఆత్మవిశ్వాసం పెపొందిస్తూన్న నీలమ్‌కుమార్ అభినందనీయురాలు.

వైద్యరంగంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, క్యాన్సర్ మహమ్మారి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా సాలీనా కోట్లాదిమందిని బలి తీసుకొంటున్నది. క్యాన్సర్ వ్యాధి సోకగానే ఇక తమకు మరణమే శరణ్యమని భావించేవారు ఎక్కువ. వాస్తవంగా అయితే, క్యాన్సర్ వ్యాధి తీవ్రత వలన మరణించేవారికన్నా, తమకు మరణం తప్పదనే భయం లేదా దిగులుతో మరణించేవారే ఎక్కువ. క్యాన్సర్ వ్యాధి సోకినప్పటికీ సరైన వైద్య సహాయంతో దానిని పారత్రోలవచ్చని ఇప్పటికే ప్రముఖ సినీ నటి మనీషా కొయిరాలా, క్రికెటర్ యువరాజ్‌సింగ్‌లు నిరూపించారు. రెండుసార్లు క్యాన్సర్‌కు గురై ఆత్మవిశ్వాసంతో వైద్య సహాయంతో క్యాన్సర్‌ను జయించిన ఘనత నీలమ్‌కుమార్‌కే దక్కుతుంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల జీవితాలలో వెలుగులు నింపి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ముంబాయికి చెందిన ఈమె కృషిచేస్తూన్నారు.
మన దేశంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు సంతోషకరమైన జీవితం ఎలా గడపవచ్చో తెలియజెప్పే సాహిత్యం ఏమీ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఆమె ‘టు క్యాన్సర్ విత్ లవ్’ అనే పుస్తకాన్ని వ్రాశారు. క్యాన్సర్ వ్యాధి సోకినంత మాత్రాన జీవితంలో సంతోషానికి ఫుల్‌స్ట్ఫా పెట్టాల్సిన అవసరం లేదన్నదే ఈ పుస్తకం సారాంశం. నీలమ్‌కపూర్ రాసిన పుస్తకం పలువురు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఆత్మవిశ్వాసం కలిగించడమే కాకుండా వారు తమ దైనందిన జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు అవసరం అయిన స్ఫూర్తిని ఇస్తుంది. టు క్యాన్సర్ విత్ లవ్ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా పలువురి మన్ననలను పొందింది.
జీవితంపై కొత్త ఆశలు
నీలమ్‌కపూర్ తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనే సమయంలోనే ఆమెకు తన జీవితంపై కొత్త ఆశలు కలిగాయి. ఆమె 35 సంవత్సరాల వయసులో భర్తను కోల్పోయింది. దీంతో కుటుంబ నిర్వహణా బాధ్యత ఆమెపై పడింది. ఒక్కసారిగా ఆర్థికపరమైన సమస్యలు చుట్టుముట్టాయి. అదే సమయంలో వైద్యులు ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకిందని నిర్థారించారు. దీంతో ఆమెకు తన జీవితం శూన్యంలా కనిపించింది. తాను లేకపోతే తమ పిల్లల్ని ఎవరు సాకుతారు, వారు ఎలా జీవించగలరు, వారికి తిండి ఎవరు పెడతారనే ప్రశ్నలు ఆమెను వేధించసాగాయి. దీంతో తీవ్ర నిరాశా, నిస్పృహలకు గురైన ఆమె మానసికంగా ధైర్యం పొందటానికి గల మార్గాలను అనే్వషించడం ప్రారంభించింది.
దేశంలో ఎందరో ఎటువంటి జబ్బులు లేనప్పటికీ పలు సమస్యలతో సతమతం అవుతున్నారు. వారు సమస్యలవలయం నుంచి బయపడే విధంగా చేయాలని నీలమ్‌కుమార్ సంకల్పించారు. దీంతో ఆమె పిల్లలకు పాఠశాల స్థాయినుంచే లైఫ్ స్కిల్స్ నేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొవాలి అనే అంశంపై ఆమె విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. దీంతోపాటుగా తల్లిదం డ్రులు, ఉపాధ్యా యులకు శిక్షణ ఇచ్చేందుకు ఆమె దేశంలోని పలు ప్రాంతాలలో వర్క్‌షాపులను నిర్వహిస్తున్నారు. ప్రజలకు స్ఫూర్తిని కలిగించే ఆమె ప్రసంగాలు యూ ట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం ఆమె ‘‘ఫ్రమ్ విక్టిమ్ టు విక్టర్- మై జర్నీ త్రూ క్యాన్సర్’’ అనే పేరు తో ఒక కామిక్ పుస్తకాన్ని రచించే పనిలో నిమగ్నమై ఉన్నారు. తన పుస్తకాల ద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఆశావహ జీవితం గడిపే విధంగా చేయడానికి ఆమె విశేషంగా కృషి చేస్తున్నారు.

- పి.హైమావతి