మెయిన్ ఫీచర్

కొత్తదనానికి ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచనల్లో కూరుకుపోతున్నారా...
నిజమే..
ఒక్కోసారి అనుకోకుండా పరిస్థితులన్నీ తారుమారు అవుతుంటాయి. ఉద్యోగం కూడా ఒడిదొడుకులకు గురవుతుంది. ఇక ఆర్థిక కష్టాలు మొదలవుతాయి. అనుబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అనుకోవడానికి మనకు అంత వీలు లేకపోయినా ఆ స్టేట్‌మెంట్‌ను మా
త్రం కాదనలేం.
ఉద్యోగం అనుకోని విధంగా చేయినుంచి జారిపోతే ఆర్థికభారం మోయలేనిది అవుతుంది. దాన్ని తట్టుకోవడానికి ప్రత్యామ్నాయం చూసుకోవలసిందే. ఉద్యోగం లేదు కదా అని ఆకలివేయడం మానదు. ఖర్చులు పెరగకా మానవు.
అందుకే ఆదాయమార్గాన్ని చూపే ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలంటే మార్కెటు తగ్గట్టుగా ఆ ఉద్యోగాన్ని మరింత మెరుగ్గా చేయడానికి అవసరమైన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి.
ఎప్పుడూ ఒకేలాగా పని చేస్తూ ఉంటే ఆ పనిలో నాణ్యత లోపిస్తుంది. చేసేవారిలోను విముఖత ఏర్పడుతుంది. ఇక అది మార్కెటులో దాని విలువలను తగ్గించుకుంటుంది.
అందుకే వస్తువులకే కాదు చేసే పనిలోను విలువ పెరగాలంటే ఎప్పటికప్పుడు నాణ్యత పెంచుకోవాలి. ఉదాహరణకు తినుబండారాలను అమ్మే షాపు అనుకోండి. పాత సంప్రదాయ వంటకాలకన్నా లేటస్టుగా ఉన్నవాటికి కొత్తకొత్తరుచులకు ఆహ్వానం పలుకకపోతే మీ తినుబండారాల షాపులో సందడి అంత ఉండదు.
అదే రెడీమేడ్ బట్టల దుకాణం అనుకోండి. ఫ్యాషన్‌కు తగ్గట్టు ఎప్పటికప్పుడు యువతకు నచ్చే మెటరీయల్‌ను అందుబాటులో ఉంచకపోతే మీ వస్తద్రుకాణంలో మెరుపులు అంతగా కనిపించవు.
అంతేకాదు మీరు ఒక దర్జీ అనుకోండి. మీరు ఆధునిక పోకడలకు తగ్గట్టుగా మీ కుట్టుపనిలో నైపుణ్యాలను మీరు నేర్చుకోకపోతే పక్క దర్జీల దగ్గరకు మీ కష్టమర్లు వెళ్లిపోతారు. అందుకే ఎప్పటికప్పుడు కొత్తట్రెండ్‌కు ఆహ్వానం పలకాల్సిందే.
అదే వస్పూత్పత్తి చేసే ఫ్యాక్టరీలో మీరు పని వారైతే వెంటనే మీరు చేస్తున్న పనిని తొందరగా ఉన్నదానికన్నా మెరుగ్గాను చేయగలిగే నైపుణ్యం పెంచుకుంటే మీకు తప్పనిసరిగా పదోన్నతి వస్తుంది.
అదే మీరు కంప్యూటర్ పోగ్రామర్‌గా ఉన్నారనుకోండి. కొత్త కొత్త యాప్స్ తయారు చేసుకోవాలి. లేకుంటే కొత్త టెక్నాలజీని ముందుగానే అందుకుని దాన్ని మీ పనిలో చూపించగలగాలి. అపుడు మీరు పోటిలో ముందే ఉండగలుగుతారు.
అదే మీరు రచనాస్రవంతిలో ఉన్నట్టయితే మీ రచనలను ఇప్పటి కాలానికి తగ్గట్టు మార్చుకోవాల్సిందే. అట్లాకాదంటే మీ రచనలకు కాలం చెల్లిపోతుంది. ఒకవేళ విషయం పాతదే అయనా నేటికాలానికి తగ్గట్టుగా దాన్ని మార్చుకోవలసిందే. అపుడే పేరు, మన్నిక అన్నీ వస్తాయ.
ఇలా ఏరంగంలోనైనా సరే కొత్తదనానికి ఆహ్వానం పలికితేనే మీరు ఉన్న రంగంలో పైకి ఎదగగలుగుతారు.

- వాణి ప్రభాకరి