మెయన్ ఫీచర్

పెట్రో ధరల రహస్యమిదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రాజకీయ పార్టీలు సృష్టించిన పరిస్థితుల కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి గురించి, మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు, విజయాల గురించి ప్రజలకు నిజాలు తెలియడం లేదు. మీడియా ద్వారా వాస్తవాలు తెలుస్తాయని ఆశించినవారికి నిరాశే మిగులుతోంది. లోతుగా ఆలోచిస్తే, కేంద్ర ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని ప్రతిరోజూ అనకపోతే- తమకు మనుగడ లేదని రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు నమ్ముతున్నాయి. అందుకే అమరావతిలో ఏటిఎం పనిచేయకపోయినా, గుంటూరులో మహిళపై అత్యాచారం జరిగినా, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరునికి నైవేద్యం కాస్త ఆలస్యమైనా, అనంతపురం రోడ్డుమీద గుంత కనపడినా అందుకు కారణం ఒకే ఒక్కడు- నరేంద్ర మోదీ.
2014లో నరేంద్ర మోదీ పేరు చెప్పుకొని, పవన్ కళ్యాణ్ చేయి పట్టుకొని అధికారంలోకొచ్చిన పార్టీ ఇపుడు- ఆ ఇద్దరినీ తిట్టి 2019లో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. అంటే అప్పుడూ, ఇప్పుడూ కేంద్రబిందువు నరేంద్ర మోదీయే. విచిత్రమైన విషయమేమిటంటే- ఇప్పుడు రాష్ట్రంలో రాహుల్ గాంధీని పొగిడితే ఓట్లు పడవు, నరేంద్ర మోదీని తిడితే ఓట్లు పడతాయి. ఆ విధంగా కొన్ని రాజకీయ పక్షాలు తమకున్న మీడియా సౌకర్యంతో ప్రజాభిప్రాయాన్ని మార్చివేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వాలు సత్యాన్ని దాచిపెడితే, దానికి విముక్తి కలిగించి దానిని ప్రజలకు తెలిసేలా చేయాల్సిన మీడియా- భావోద్వేగాలకు, వక్రీకరణలకు పెద్ద ఎత్తున ప్రచారం కలిగిస్తూ, పాత్రికేయ రంగంపైనే అనుమానాలు కలిగేలా ప్రవర్తిస్తోంది.
దీనికి ఉదాహరణగా పెట్రోలు ధరల అంశాన్ని తీసుకోండి. మోదీ పాలనలో పెట్రో ధరలు అదుపులేకుండా పెరుగుతున్నాయని, ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శించడం ఆశ్చర్యం కలిగించద., కానీ అసలు పెట్రో ధరలు ఎందుకు పెరిగాయి? అని పరిశోధించి వాస్తవాలేవో ప్రజలకు చెప్పాల్సిన మీడియా ప్రతిపక్షాల పాటకు సంగీతాన్ని అందించడమే ఆశ్చర్యకరం.
2012, 2013, 2014లో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. అంతే వేగంగా, భారత్‌లో అధికారంలో ఉండిన యూపీఏ ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా దిగజారుతుండింది. తమ జీవితాలను దారుణంగా దెబ్బతీసిన కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకొన్నారు. అపుడు మళ్లీ పెట్రోలు, డీజిల్ ధరలు పెంచితే, ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతామని ఊహించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పెట్రో ధరలను పెంచకుండా తగ్గించే ప్రయత్నం చేసింది. అయినా ప్రజాగ్రహం చల్లబడలేదు. ఫలితంగా చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా కాంగ్రెస్‌కు కేవలం 48 లోక్‌సభ సీట్లు వచ్చాయి. కానీ ఇక్కడ చర్చించాల్సింది- ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగినపుడు, భారత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ధరలను ఎలా తగ్గించగలిగింది అని. ఆ సమయంలో అందరూ అప్పటి ప్రధాని డా మన్మోహన్‌సింగ్‌ను, ఆర్థిక మంత్రి చిదంబరాన్ని చాలా మెచ్చుకున్నారు కూడా. కానీ దేశ ప్రజలకు ఒక రహస్యం తెలియలేదు. చమురు ఉత్పత్తి చేసే సంస్థలకు అప్పటి కేంద్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించకుండా, దాని స్థానంలో చమురు బాండ్లను జారీ చేసింది. ‘బాండ్’ అనేది డబ్బు కాదు, ‘‘్భవిష్యత్తులో డబ్బులు చెల్లిస్తామని చేసిన వాగ్దానం’’ మాత్రమే. డబ్బులు చెల్లించకుండా, రాబోయే రోజుల్లో మీ అప్పు తీరుస్తామని చేసే వాగ్దానాన్ని ప్రభుత్వాలు అందంగా ‘బాండ్’ అని పిలుస్తాయి. అమరావతి బాండ్లలాగా! బాండ్‌ను జారీ చేసేటపుడు, ఆ మొత్తంమీద వడ్డీని కూడా చెల్లిస్తామని హామీ ఇవ్వాల్సి వుంటుంది. అంటే ఈ బాండ్లు అనేవి దాదాపు క్రెడిట్ కార్డుల లాంటివే.
2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడేటప్పటికి- కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలకు 1.3 లక్షల కోట్ల రూపాయలు, దానిమీద వడ్డీ మరో 70 వేల కోట్లు చెల్లించాల్సి వుండింది. ఇపుడు ప్రభుత్వం భాజపాది. అంటే భాజపా ప్రభుత్వమే ఆనాడు కాంగ్రెస్ చేసిన అప్పులను తీర్చాలి. తమ ప్రభుత్వం చమురు సంస్థలకు 2 లక్షల కోట్ల రూపాయలను చెల్లించిందని కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇపుడు చెప్పారు. ప్రధాన్ బిహార్ రాజధాని పాట్నాలో ఈ విషయం చెప్పినపుడు మీడియాలో వున్న చాలామంది ఆశ్చర్యపోయారట. అంత పకడ్బందీగా వాస్తవాలను దాచిపెట్టగలిగింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం.
ఇది దేశ ప్రజలను మోసం చేయడమే అవుతుంది. తాము మంచివాళ్ళమని అనిపించుకోవడానికి, మరోసారి అధికారంలోకి రావడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ కుటిల ప్రయత్నం పర్యవసానం ఏమంటే- ఏ నేరమూ చేయని నరేంద్ర మోదీ ప్రభుత్వం, పెట్రో ధరలు తగ్గించి దేశ ప్రజలకు శుభవార్త చెప్పే అవకాశం లేకుండా పోయింది. 2 లక్షల కోట్ల రూపాయల భారీ అప్పును తీర్చాలంటే, పెట్రో ధరలు పెంచక తప్పలేదు. ఇదెలా వుంటుందంటే, జూదమాడే చెడు అలవాటున్న తండ్రి ఇంటిని తాకట్టుపెట్టి, అప్పు తెచ్చుకొని, దాన్ని తిరిగి చెల్లించక ఇల్లొదిలి పారిపోయనట్టు ఉంది. అప్పులిచ్చినవారు బాకీలు తీర్చమని ఆయన పిల్లలను అడుగుతారు. చచ్చినట్లు ఆ పిల్లలు అప్పు తీర్చాల్సిందే. కుటుంబ పరువును కాపాడుకోవాలి కదా!
ఈ రోజు పెట్రో ధరలు పెరిగినందుకు నిరసనగా బంద్‌లు, ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు- 2014కు ముందు చమురు సంస్థలకు చమురు బాండ్లు జారీచేసే సందర్భంలో అప్పటి ప్రధాని డా మన్మోహన్‌సింగ్ చెప్పిన కొన్ని మాటలు గుర్తుచేసుకోవాలి. అసాధారణ స్థాయిలో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘‘చమురు బాండ్లను జారీచేయడమనేది- సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. ఇది మనం అప్పులు చేసి, మన తరువాత వచ్చే పిల్లలను ఆ అప్పు తీర్చమని వాళ్ళమీద భారాన్ని నెట్టడమే అవుతుందని నేను దేశ ప్రజలకు గుర్తుచేస్తున్నాను’’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సరిగ్గా అదే చేసింది. ఆనాటి యూపీఏ ప్రభుత్వం చేసిన తప్పులకు, అప్పులకు ఈనాటి భాజపా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లిస్తోంది. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత, ఒత్తిడి ఎదురవుతున్నా, దాన్ని వౌనంగా భరిస్తూ, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, 2 లక్షల కోట్ల మేరకు- (తాము చేయని) అప్పును తీర్చేసిన మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించకపోతే అది అన్యాయమే అవుతుంది.
1998 వరకూ అస్తవ్యస్తంగా వుండిన ఆర్థిక రంగాన్ని, అపుడు అధికారంలోకి వచ్చిన అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం చక్కదిద్ది భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది. 2004లో కొందరి తప్పుడు మాటలను నమ్మి (వాళ్ళెవరో ప్రజలకు బాగా తెలుసు) అధికారాన్ని చేజేతులా జారవిడుచుకొంది. పుష్ఠిగా వున్న ఆర్థిక వ్యవస్థను అందుకొన్న కాంగ్రెస్- యూపీఏ ప్రభుత్వం 2004 నుండి 2014 వరకూ పూటకొక్క స్కాముతో తిరిగి ఛిన్నాభిన్నంచేసి పెట్టింది. మళ్లీ దాన్ని చక్కదిద్దే ప్రయత్నాన్ని 2014 నుండి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తోంది. అంటే అపుడూ ఇప్పుడూ పాపాలు కాంగ్రెస్‌వి, శాపాలు మాత్రం భాజపాకు అన్నమాట!
పెట్రోలు ధర వంద రూపాయలు చేస్తారేమోనని కేంద్రాన్ని కొందరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎద్దేవా చేస్తున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ను తీసుకోండి- ఇక్కడ ఒక లీటరు పెట్రోలు ధర ఖరీదు 85 రూపాయల దాకా వుంది. ఇందులో కేంద్రానికి దక్కేది 9 రూపాయల 44 పైసలుదాకా వుంటే, రాష్ట్రానికి 32 రూపాయల వరకూ వుంటుంది. పెట్రో ధరలు పెరిగి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి ఆవేదన వుంటే, తాము వసూలు చేస్తున్న సేల్స్‌టాక్స్‌ను తగ్గించుకొంటే లీటరు పెట్రోలును 70 రూపాయలకు గానీ, అంతకంటే ఇంకా తక్కువకుగానీ ప్రజలకు అందివ్వవచ్చు. అలా ఆ రాష్ట్రం ఒక్కటి చేసినా, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి పెరిగి ఆ రాష్ట్రాలు కూడా టాక్సును తగ్గించుకోక తప్పదు. అపుడు దేశమంతా సామాన్య ప్రజలకు ఇపుడున్న పెట్రో ధరల భారం తగ్గి ఊరట కలుగుతుంది కదా. మరి రాష్ట్రాలు ఎందుకు ఆ పని చేయవు? ప్రతి నిమిషమూ కేంద్రాన్ని మాత్రమే ఎందుకు నిందించాలి? అంటే పంచభక్ష్య పరమాన్నాలు రాష్ట్రాలకు, ఏకాదశి ఉపవాసాలు కేంద్రానికా?

-పి.సతీష్ 08554- 242691