మెయిన్ ఫీచర్

సంప్రదాయాల్లో సడలింపులు సహజమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలలో ప్రతి రంగంలోనూ పోటీపడుతూనే ఉంది. అయినప్పటికీ కట్టుబాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పద్ధతులను ఏమాత్రం ప్రక్కనబెట్టడం లేదంటే భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు ఎంత విలువనిస్తుందో అర్థమవుతూనే ఉంది. భారతదేశంలో ఎన్ని కులాలు, మతాలు ఉన్నప్పటికీ ఒక్కో కులానికి, ఒక్కో మతానికి కొన్నికొన్ని కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలున్నాయి. అలాంటి కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టే ప్రపంచ దేశాలు కూడా మనవైపు చూస్తున్నాయి. కాకపోతే ఒకప్పుడు ఉన్న విధంగా సంప్రదాయాలు ఇప్పుడు కఠినంగా లేకపోవచ్చు. పరిస్థితుల దృష్ట్యా అలాంటి మార్పులు తప్పడం లేదు. పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు పేదవాడయినా, ధనవంతుడయినా ఇంట్లో దేవుళ్ళకు పూజ చేసుకొని, దేవాలయాలకు వెళ్ళి దైవదర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకోవల్సిందే. ఇంట్లో ఉన్నప్పుడు, వృత్తిరీత్యా బయటికి వెళ్ళినప్పుడు ఎన్నోరకాల దుస్తులు (ప్యాంట్లు, షర్ట్సు) వేసుకున్న పురుషులు దేవాలయాలకు వెళ్ళినప్పుడు సంప్రదాయ దుస్తులు అయినటువంటి పంచె, పై పంచె, షర్టు వేసుకొని వెళ్తుంటారు. కొంతమంది లాల్చీ, పైజామాలు, ఇంకొంతమంది ధోవతి కట్టుకుని వెళ్తుంటారు. ఇటువంటి వస్త్రాలు వేసుకున్నప్పుడు ఒక రకమైన నిండుతనం, మానసిక ప్రశాంతత, నిర్మలత్వం కన్పిస్తుంది. స్ర్తిలుకూడా ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళినపుడు యూనిఫాంలు (డ్రెస్‌కోడ్ ఉన్న ఉద్యోగాల్లో), పంజాశ్రీ్ప డ్రెస్సులు వంటివి వేసుకుంటారు. అదే వారు దేవాలయాలకు వెళ్ళినప్పుడు సంప్రదాయబద్ధంగా చీరెలు, లంగా, వోణీలు వేసుకుంటారు. చేతులు నిండుగా గాజులు వేసుకుంటారు. చక్కగా కురులు జడలు వేసుకొని, తలలో పువ్వులు పెట్టుకొని లంగా, వోణీలు, పంజాబి డ్రెస్సులు వేసుకుంటే అచ్చతెలుగు అమ్మాయిల్లా కన్పిస్తారు. భారతదేశంలో ప్రపంచ దేశాల్లో మాదిరిగా పాశ్చాత్య ధోరణి అలవడింది. వస్తధ్రారణ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. అందంగా కన్పించడంకోసం అమ్మాయిలు పాశ్చాత్య దేశాల్లోని వస్త్రాలు వేసుకున్నప్పటికినీ, హెయిర్ స్టయిల్, ఫేషియల్స్, బ్యూటీ టిప్స్ ఎన్ని ఉపయోగించినప్పటికినీ పండుగలు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు కచ్చితంగా సంప్రదాయ దుస్తులు వేసుకోవడం చూస్తూనే ఉన్నాము. ఇక కొన్ని ప్రాంతాల్లోనయితే దేవాలయాల్లోకి పంచె, చీరె ధరిస్తేనే ఆలయంలోనికి అనుమతిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా అంతరించిపోతున్న సంస్కృతీ, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను కాపాడుకున్నట్లు అవుతుంది.
ఈమధ్య కాలంలో భారతీయులు ఎవరయితే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో స్థిరపడ్డారో, అక్కడ ఉన్నటువంటి (దగ్గరగా ఉన్నటువంటి) వారంతా పండుగలకు, శుభకార్యాలకు కలుసుకొని హిందూ సాంప్రదాయ పద్ధతిలో పూజలు వగైరా చేసుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రస్తుత కాలంలో ఎక్కువగా జరుగుతుండటాన్ని పత్రికల్లో, మీడియాలో, సెల్‌ఫోన్లద్వారా చూస్తూనే ఉన్నాము. ఉంటున్న వాతావరణం ఏదయినప్పటికీ మన మూలాలు సంస్కృతీ, సంప్రదాయాలు పుట్టుకలోనే ఉన్నాయి. మన బంధుత్వాలు, చుట్టరికాలు ఎప్పటికీ కలిసుండటానికి గల ముఖ్యకారణం సంస్కృతీ, సంప్రదాయాలే. ప్రతి నెలలో ఏదో ఒక పండుగ, ఏదో ఒక కార్యం, పూజలు, శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల బంధువుల రాకపోకలు ఎప్పటికీ ఉంటాయి. ఇచ్చి పుచ్చుకోవడాలు, ఏ చిన్న కార్యమయినా బట్టలు, చిన్న చిన్న నగలు, నగదు కట్నకానుకలుగా పెట్టడం లాంటివి షరామామూలే. ఇలాంటివి కానుకలుగా ఇచ్చుకోవడమే కాకుండా, వాటితో పేదింట్లో పెళ్లిళ్లు చేస్తారు.
నలుగురు కలిస్తే ఆడపిల్ల పెండ్లి అవలీలగా జరిగిపోతుంది. ఇటువంటివి సేవ, ధర్మం రూపంలో శుభకార్యాలను సులువుగా చేయడానికి దోహదంచేస్తాయి. దానగుణం, సేవాగుణం హిందూ వ్యవస్థలో, భారతీయ సాంప్రదాయంలో ముఖ్య భాగాలు. వస్తధ్రారణ, కట్టుబాట్లు, సేవాగుణం, దానగుణం, ధర్మగుణాలు భారతీయులలో ఉన్నాయి కాబట్టే హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు మనగలుగుతున్నాయని చెప్పవచ్చు.

- శ్రీనివాస్ పర్వతాల