మెయిన్ ఫీచర్

సాహసం... శ్వాసగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**ఎటుచూసినా ఎతె్తైన పర్వతాలు..
చుట్టూ భయంకరమైన అడవి..
కాళ్లకు అతుక్కుపోతున్న జలగలు..
కొద్దిదూరం సాగగానే.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న
స్వచ్ఛమైన భాగీరథి నది.**...

ఇదంతా చెబుతున్నది అందమైన ప్రకృతి గురించి అనుకుంటున్నారా? కాదు.. బడికి వెళ్లాలనే తపనతో ఇద్దరు అమ్మాయిలు ప్రతిరోజూ సాగిస్తున్న సాహస యాత్ర విశేషాలు ఇవి!
యశోధ, రాధికలు ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎత్తయిన హిమాలయ పర్వతాలపై ఐదువందల మంది ప్రజలు నివసించే స్యాబా గ్రామం వారిది. ఈ గ్రామానికి ఎటువంటి రోడ్డు సౌకర్యం లేదు. వాళ్లిద్దరికీ చదువంటే ప్రాణం. వీరిద్దరితో పాటు మరో తమ్ముడు కూడా ఉన్నాడు. ఆ అబ్బాయిని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు తల్లిదండ్రులు. ఆడపిల్లలను కూడా చదివించే స్థోమత ఆ తల్లిదండ్రులకు లేదు. తమలాగే తమ పిల్లలకు కూడా చిన్నవయస్సులోనే పెళ్లిచేద్దామని భావించింది ఆ పిల్లల తల్లి. అందుకు యశోధ, రాధిక ఇద్దరూ ఒప్పుకోలేదు. యశోధకు పదహారు సంవత్సరాలు. కాస్త సీరియస్‌గా, వౌనంగా ఉంటుంది. రాధికలో చిలిపితనం ఎక్కువ. కాళ్లకు అంటుకున్న జలగలను తీసేటప్పుడు తప్ప రాధిక ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. ఈమెకు పధ్నాలుగు సంవత్సరాలు.
వారానికి ఆరు రోజులూ వీరీ సాహసయాత్రను చేస్తూ ఉంటారు. వేకువ జామున ఐదు గంటలకు వీరికి రోజు మొదలవుతుంది. ఆరు గంటల కల్లా తల్లిపెట్టింది తిని తయారై, మధ్నాహ్న భోజన డబ్బాలు తీసుకుని నడక మొదలుపెడతారు. ముఖంపై చెరగని చిరునవ్వుతో తండ్రికి ప్రేమగా టాటా చెబుతారు. ఆ తండ్రి మాత్రం ముఖం చిరునవ్వుని తగిలించుకుని, బరువెక్కిన హృదయంతో తన బంగారుతల్లులిద్దరినీ టాటా చెప్పి సాగనంపుతాడు. వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయాణానికి రెండు నుంచి మూడు గంటలు పడుతుంది బడికి చేరుకోవడానికి. ఆ ప్రాంతానికి చాలా దూరంగా ఉన్న మనేరి, మల్లా అనే పట్టణాలకు చేరుకోవాలంటే ఇదొక్కటే దారి.
దట్టమైన అడవిలో, ఇరుకైన రాళ్లదారి గుండా వీరి నడక సాగుతుంది. వారి వెంట మధ్యాహ్నం తినడానికి టిఫిన్ డబ్బా, పుస్తకాల సంచి ఉంటుంది. ఇలా దట్టమైన అడవిలో రెండు గంటలు నడవాలి. ఈ అడవిలో ఎలుగుబంట్లు, చిరుతలు ఉంటాయి. వర్షాకాలంలో అయితే జలగలు కాళ్లకు అంటుకుంటూ ఉంటాయి. ఈ సమయంలో పాముల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలా నడిచిన తర్వాత ఎదురవుతుంది అత్యంత ప్రమాదకరమైన ఘట్టం.. వేగంగా పారే భాగీరథి నదిని దాటడం. ఈ నదిని దాటడానికి వీరు ఒక లోహపు ట్రాలీని ఏర్పాటు చేసుకున్నారు. నదిని దాటి అటువైపుకు వెళ్లిన వారు ట్రాలీని అక్కడే వదిలేసి వెళతారు. ఆ బరువైన లోహపు ట్రాలీని తాడు సాయంతో ఇటువైపుకు లాగాల్సి ఉంటుంది. ఇలా లాగడానికి చాలా బలం అవసరం. వర్షం పడితే ఈ తాడు మరింత బరువెక్కుతుంది. దీన్ని లాగే సమయంలో తగిలే గాయాలు సరేసరి. ఈ వేలాడే తీగలను లాగే సమయంలో స్థానికులు చాలామంది చేతివేళ్లను కూడా కోల్పోయారు. ఈ ఇద్దరు అక్కాచెల్లెల్లు ఈ ట్రాలీని లాగి అందులోకి ఎక్కుతారు. నీటి ప్రవాహంలో పడిపోకుండా ఉండాలంటే ఈ ట్రాలీని గట్టిగా పట్టుకోవాలి.
వీరు భాగీరథి ఉత్తర గట్టుకు చేరాక.. కాసేపు టాక్సీ కోసం ఆగి తర్వాత రోడ్డు మార్గంలో స్కూలుకి వెళతారు. మళ్లీ వచ్చేటప్పుడు కూడా టాక్సీ భాగీరథి ఒడ్డున దిగి లోహపు ట్రాలీలో వెళ్లి, దట్టమైన అడవి గుండా రెండుగంటల నడకతో ఇల్లు చేరుకుంటారు. ఇలా స్కూలులో ఉన్న సమయం ఆరేడు గంటలయితే.. వీరు ప్రయాణించే సమయం కూడా అంతే.. అంటే దాదాపు వీరు స్కూల్‌కెళ్లి ఇంటికి రావడానికి పదిహేను గంటల సమయం పడుతుంది. యశోధ మాత్రం తాను బాగా చదువుకుని పెద్ద పోలీసు అధికారి కావాలని, సమాజానికి ఏదో చేయాలని కలలు కంటూండగా.. చిలిపిపిల్ల రాధిక మాత్రం తాను టీచర్ కావాలనుకుంటోందట. ఎందుకంటే తమలాగా మిగతా పిల్లలు కష్టపడకుండా తమ ఊళ్లోనే మంచి స్కూలు పెట్టి పిల్లలందరికీ చదువుచెప్పాలని ఆ చదువుల తల్లి కోరిక.
ఉత్తరకాశీ పర్వతాల్లో స్యాబా వంటి గ్రామాలు రెండు వందల దాకా ఉన్నాయి. వీటిలో కొన్నింటికి రోడ్డు మార్గం ఉన్నా.. చాలా గ్రామాలకు మాత్రం నడిచి వెళ్లాల్సిందే.. ఏది ఏమైనా చదువుకోవాలని, జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదలతో ఈ యశోధ, రాధికలు రాళ్లమార్గాలు, నీటి మార్గాలు ఎంతో కష్టంతో కూడుకున్నవైనా ఏమాత్రం వెరవర లక్ష్యం వైపు గురిపెట్టి తమ సాహస యాత్రను సాగిస్తున్నారు.

--ఎస్.ఎన్. ఉమామహేశ్వరి