మెయిన్ ఫీచర్

ఆనందస్వరూపుడు సాయబాబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన భక్తుడు ఫలానాచోట ఆపద బారినపడ్డాడని, రక్షించటానికే అలాచేశానని బాబా అక్కడున్నవారికి చెప్పేవారు. వారికి అంతా ఆశ్చర్యంగానే ఉండేది. కొద్దిసేపటికి నిజంగానే సదరు భక్తుడు వచ్చి తను బాబా దయతో ఆపద నుంచి బయటపడినట్టు చెప్పేవారు. కూర్చున్నచోటనుంచే అంతా నడపటం, నడిపించటం బాబా లీలావిలాసం.
బాబా ఎప్పుడూ ప్రయాణాలుచేసి ఎరుగరు. ఎప్పుడూ రైలుబండిలో ప్రయాణించలేదు. కనీసం దానిని చూడనుకూడా చూడలేదు. కానీ, తన సర్వజ్ఞతతో రైలుబండ్ల రాకపోకల వేళల్ని సరిగాచెప్పేవారు. బాబా దర్శనానికి వచ్చినవారు వెళ్లేముందు బాబా అనుమతిపొందటం తప్పనిసరి. బాబా వెళ్లమంటే వెళ్లాలి. లేదంటే లేదు. కాదూ కూడదని వెళ్తే ప్రమాదాల బారిన పడేవారు. తన భక్తులు ఆపదల బారినపడతారనే బాబావారి యోగక్షేమాలను తన సర్వజ్ఞతతో గ్రహించి వెళ్లమని కాని, వద్దని కాని చెప్పేవారు. బాబా మాటలు విన్నవారు రక్షణ పొందేవారు. విననివారు కష్టాల పాలయ్యేవారు.
బాబా సాంగత్యం పొందినవారి పుణ్యమే పుణ్యం..
నిజంగా ఆ రోజులు మరుపురానివి. తిరిగి రానివి. బాబా చూపిన ప్రేమానురాగాలు కొలవలేనివి. బాబా అనుగ్రహం ఇంతని చెప్పవీలులేనిది. బాబా హృదయం సదా వాసుదేవ నిలయం. మహిమాత్ముడైన బాబా సాంగత్యం పొందినవారు ధన్యులు. బాబా శిరిడీకి వచ్చిన కొత్తలో మహల్సాపతి, తాత్యాకోతే పాటీలును బాగాచేరదీసేవారు. వారిద్దరినీ సమానంగా ఆదరించి, ప్రేమను పంచేవారు. వీరిద్దరితో కలిసి బాబా మసీదులో నిద్రించేవారు. ముగ్గురూ తమ తలలను తూర్పు, పడమర, ఉత్తర దిక్కులుగాచేసి పడుకునే వారు. పక్కలుపర్చుకుని, వాటిపై చతికిలబడేవారు. సగం రేయివరకు ఏవేవో కబుర్లు కలబోసుకునేవారు. వినే వారికి అవి కాలక్షేపం కబుర్లులా ఉండేవి. కొందరికి పిచ్చాపాటీగా తోచేది. కానీ మహల్సాపతి, తాత్యాకు మాత్రమే బాబా మాటల్లోని అంతరార్థం బోధపడేది. మాటలమధ్యలో ఎవరైనా నిద్రపోయినట్టనిపిస్తే మిగతావారు నిద్రలేపేవారు. తాత్యా గుర్రుపెడితే బాబా అతనిని అటూ ఇటూ ఊపి తలగట్టిగా నొక్కేవారు. బాబా ఒక్కోసారి మహల్సాపతిని అక్కున చేర్చుకునేవారు. అతని కాళ్లు పట్టేవారు. వీపు రుద్దేవారు. ఇలా పద్నాలుగేళ్లు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి రేయింబవళ్లు బాబాతోనే సాంగత్యం చేశాడు. తండ్రి మరణించాక, ఇంటి బాధ్యతలు పెరిగాకే అతను ఇంటిపట్టున ఉండటం ప్రారంభించాడు. మహల్సాపతికి మాత్రం బాబాయే లోకం. తుదకంటూ బాబా అతని చేయి విడవలేదు. బాబా సాంగత్యాన్ని పరిపూర్ణంగా పొందిన భక్తవత్సలుడు మహల్సాపతి. బాబా మహల్సాపతిని ‘్భగత్’(్భక్తా)అని పిలిచేవారు. బాబా ప్రేమను పరిపూర్ణంగా పొందినవారూ ధన్యులు. బాబా జీవనశైలి, వ్యవహారాలను రేఖామాత్రంగా స్ఫురింపచేసే లీలలను చదివినవారు కూడా ధన్యులు.
ఆనంద స్వరూపానికి పెన్నిధి బాబా
బాబా నిర్వ్యామోహులు. ఉపాధి రహితులు. ఆనంద స్వరూపానికి పెన్నిధి బాబా తన ఆసనంగా చిన్న గోనె ముక్కను ఉపయోగించేవారు. చింకిపోయిన గుడ్డలతో బాబా సంతుష్టి చెందేవారు. రోజుల తరబడి దుస్తులు మార్చేవారు కాదు. అయినా అవెప్పుడూ స్వచ్ఛంగా భాసిల్లుతుండేవి. బాబా రోజుల తరబడి స్నాన పానాదులు ఆచరించేవారు కాదు. కానీ, ఎప్పుడు చూసినా కడిగిన ముత్యంలా కన్పించేవారు. ఆజానుబాహుడైన బాబాది పచ్చని పసిడి ఛాయ. ఎప్పుడూ మెరుస్తూనే ఉండేవారు. రాజ్యభోగాల కంటే దారిద్య్రమే మేలని అంటుండేవారు. బాబా కూర్చోవటానికి వీలుగా భక్తులు చిన్న పరుపును కుట్టి, ఆనుకుని కూర్చునేందుకు వీలుగా చిన్న బాలీసును సమకూర్చారు. కొందరు భక్తులు బాబా చెంత నిల్చుని చామరాలతో, విసనకర్రలతో విసురుతుండేవారు. ఇష్టంలేకపోయినా భక్తులు అభీష్టాలను, కోరికలను మన్నించి ఈ సేవలను అనుమతించేవారు. భక్తుల ఇష్టానుసారం తనను సేవించటానికి బాబా అనుమతించేవారు. కానీ, ఆడంబరాల జోలికి పోవద్దని, ఆధ్యాత్మిక ఆడంబరాలు సత్యాన్ని మరుగుపరుస్తాయని భక్తులను పదే పదే హెచ్చరిస్తుంటేవారు.

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566