మెయిన్ ఫీచర్

గురువు మాటే వేదమంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవత్వాన్ని పవిత్రమైన దివ్యత్వములో ప్రవేశింపజేయడానికి చేసే ప్రయత్నంలో తమ యొక్క కామతత్వాన్నీ, క్రోధతత్వాన్నీ, తమ యొక్క విజృంభణమునూ కొంతవరకు అణచుకునే ప్రయత్నంగావించాలి. మన యొక్క తలను పవిత్రమైన భావాలతో, సుకృతమైన శీలంతో, దివ్యమైన జ్ఞానంతో నింపుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగాక ప్రపంచంలో జరిగే నానా లౌకికమైన మలిన విషయాలను, రోత పుట్టే పాత గుణాలనూ నింపుకోరాదు. అపవిత్రమైన భావాలను ఒకే పర్యాయము చక్కదిద్దుకోవటానికి వీలుపడదు. మెల్లమెల్లగా సరియైన మార్గంలోకి తెచ్చుకోవాలని భగవద్గీతకూడా ప్రబోధించింది. చెడు మార్గాలను ఉద్రేకపర్చే గుణాలను క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
భగవదనుగ్రహానికి, భగవత్ప్రేమకూ హృదయాన్ని అర్పితం కావించాలి. అపుడే దుర్గుణాలు క్రమక్రమేణా తగ్గిపోవడానికి ఆస్కారం వుంటుంది. కొందరికి ఒకవిధమైన అనుమానం వుంటుంది. అంత గాఢంగా నిల్చిపోయిన దుర్గుణాలను తప్పించుకోవడానికి ఏ విధంగా వీలు పడుతుంది? ఈ జన్మలో సాధ్యం కాదమో అనుకుంటారుకూడాను. అలాంటి బలహీనతకు తావివ్వరాదు. గట్టి పట్టుదలతో, అభ్యాసంతో సాధించాలి. తగిన ప్రయత్నాలు చేయాల్సి వుంది. ఇక్కడ ఒక చిన్న కథను చెప్పుకుందాము.
ఒక వ్యక్తి నిరంతరమూ నల్లమందు తినడానికి అలవాటుపడిపోయాడు. కానీ ఎంత కోరుకున్నా దాన్ని నియంత్రించడం సాధ్యపడలేదు. నిరంతరమూ మత్తులో వుండి తన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ వున్నాడు. ఇలా వుండగా ఒక రోజున ఆ వూరికి ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయనను దర్శించుకోడానికి గ్రామస్థులందరూ తరలివెళ్లారు. ఈ వ్యక్తి కూడా వారివద్దకు వెళ్లాడు. వచ్చిన వారంతా వారి వారి కష్టాలూ, నష్టాలూ, అనారోగ్యము వంటి విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. ఆ మహనీయుని ప్రబోధాలు ఆలకించేవారు, వారు చెప్పినట్లు చేయాలనుకుని ఆదేశాలు స్వీకరించేవారు. సరే ఇక మన నల్లమందు బాబు కూడా ఆ మహనీయుని సమీపించేటప్పటికీ, ‘నాయనా! నీ ఆరోగ్యాన్ని పాడుచేసుకున్న తర్వాత ఈ లోకంలో నీవు చేయాల్సిన అనేక కార్యక్రమాలను ఏ విధంగా చేయగలవు’ అన్నారు. నీ ఆరోగ్యాన్ని ముందుగా చూసుకోవాలి. దేహమే ఆరోగ్యము. ‘్ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమమ్’. ఆరోగ్యం చక్కగా వుంటేనే కదా ఈ ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలను మనం సాధించడానికి వీలుపడుతుంది అంటూ అనేక విధాలుగా బోధించాడు. నల్లమందు తగ్గించుకోవడానికి తగిన ప్రయత్నం చేయమన్నాడు. అతను ఆ మాటలు విని, ‘స్వామీ, నా చేత కావడంలేదు. తమరే అనుగ్రహించి అభ్యాసం ఏ రీతిగా గావించాలో చెప్పండి. నేను తప్పక ఆచరిస్తాను’ అన్నాడు. గురువు ఎంత ప్రమాణం నల్లమందు తింటావు అనడిగాడు. ఒక్కొక్క దినము ఎక్కువ, ఒక్కొక్క రోజు తక్కువగా తింటూ వున్నానని అన్నాడు. ఇదిగో ఇంత అంటూ కొలతగా ఒక సైజు చెప్పాడు.
గురువు సరేనని అంతే ప్రమాణమున్న సుద్దముక్కను తెప్పించాడు. నాయనా ఇంత ప్రమాణము మాత్రమే ప్రతిరోజూ తింటూ వుండు అన్నాడు. అతను చాలా సంతోషించాడు. ఎందుకంటే తినవద్దని గురువు చెప్పలేదు కావున, స్వామి మీరు చెప్పినట్లుగానే చేస్తాను, అనగానే గురువు అతనికి ఇలా చెప్పాడు. ‘‘నీవు ఇంత ప్రమాణంగా నల్లమందు తీసుకున్న తర్వాత, ఈ సుద్దముక్కతో మూడుసార్లు ‘ఓం’ అని వ్రాయి. తర్వాత దాన్ని భద్రంగా వుంచుకో అని బోధించాడు. ఆ విధంగా అతగాడు ప్రతిరోజూ నల్లమందును సుద్దముక్క ప్రమాణంలో స్వీకరిస్తున్నాడు. ‘ఓం’ అంటూ మూడుసార్లు వ్రాస్తున్నాడు. ఆ సుద్దముక్క రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. చివరకు ఆ సుద్దముక్క మొత్తంగా అయిపోయింది. ఆ సరికి వ్యాధి పూర్తిగా నయం అయిపోయింది. సుద్దముక్కతోబాటే అతని దుర్వ్యసనం మాయమైపోయింది.
ఈ విధంగా కొందరు సిగరెట్లను త్రాగుతూ రోజురోజుకీ పెంచుకుంటూ పోతుంటారు. అలాగాక దాన్ని క్రమ క్రమేణా తగ్గించుకుంటూ రావాల్సి వుంది. ఈ దుర్గుణాలు మనకు అపకారం అని తెల్సి కూడా అలా చేయడం మంచిపని కాదు. తప్పు అని తెల్సి కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం మన తెలివితేటలు కాల్చుకోవటానికా? ఎందుకు ఈ తెలివితేటలు. మూఢమతులుగాకుండా ముక్తమతులు కావాల్సి వుంది. అహంకార భావాలను వదులుకుని మానవుడు నిరహంకారిగా మసలుకోవాలి. ఈ అహంకారము, కులమును బట్టి రావచ్చును. అందాన్ని బట్టి రావచ్చును, సమూహాన్ని బట్టి కూడా రావచ్చును. ఏ మార్గంలోనైనా తనకు కొంత బలం ఏర్పడిందని అనుకుంటే అహంకారం చోటుచేసుకోవచ్చును. ఎందుంటే ధనమూ, అధికారమూ, జన సమూహము అనేవి ఒక్కసారిగా మాయమయ్యే వీలుంది కనుక. ధనం కదిలే మేఘం లాంటిది. ఇక అధికారం యొక్క అహంకారం చూద్దామా- అంటే, అవి ఎప్పుడు వుంటుందో, అది ఎప్పుడు ఊడుతుందో తెలియదు. అహంకారము లేనిదీ, తరగనిదీ ఒక్క విద్యమాత్రమే. ఇది వినయ సంపత్తిని సమకూరుస్తుంది. సమత్వము అలవడుతుంది. అందువలన మానవులైనవారు మంచి గుణాలనూ, మంచి నడవడికనూ సదా అలవర్చుకునే ప్రయత్నం గావించాలి. చిత్తమును ఆనందంగా నిర్మలంగా, నిశ్చలంగా, నిస్వార్థంగా వుంచుకునే ప్రయత్నం గావించాలి.

- డా పులివర్తి కృష్ణమూర్తి