మెయిన్ ఫీచర్

విదేశాల్లో పత్రికాధిపతి వీణారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజల జీవితాల్లోకి సామాజిక మాధ్యమాలు ప్రవేశించాక యువత వార్తాపత్రికలను చదవడం బాగా తగ్గిపోయింది. విదేశాల్లో పెద్ద పెద్ద సంస్థలే పత్రికలను మూసేశాయి. మరికొన్ని సంస్థలయితే ఉచితంగా పత్రికలను అందిస్తున్నాయి. అలాంటి గడ్డు పరిస్థితుల్లో పనె్నండు సంవత్సరాలుగా వీణారావు అనే భారతీయ మహిళ అమెరికాలో సొంతంగా ఓ వార్తాపత్రికను నడిపిస్తోంది. భారతదేశం వెలుపల వార్తాపత్రికను నడిపిస్తున్న తొలి భారతీయ మహిళగా ఆమె ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించుకుంది.

2006లో వీణ ‘ఎన్‌ఆర్‌ఐ పల్స్’ మాస వార్తాపత్రికను నెలకొల్పింది. అప్పటినుంచీ పత్రికను ఆమె ఉచితంగా పాఠకులకు అందిస్తోంది. అప్పటివరకు దక్షిణాసియా ప్రజలు, ముఖ్యంగా భారతీయుల సమస్యల గురించి ప్రచురించే పత్రికలేవీ జార్జియాలో లేవు. దాంతో వీణారావు ఆ బాధ్యతను తీసుకుంది. అమెరికాలో పత్రికలకు ఆదరణ బాగా తగ్గిపోతోంది. డబ్బులు పెట్టి వాటిని కొనేవారి సంఖ్య మరీ తక్కువ. అందుకే పాఠకుల ఉచితంగా పత్రికను ఇవ్వాలనుకుందట.. కేవలం ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆమె పత్రికను నడిపిస్తోంది. అమెరికాలోని జార్జియా రాష్ట్రంతో పాటు ఇతర ఆగ్నేయ రాష్ట్రాల్లో స్థిరపడిన దక్షిణాసియా ప్రజలే లక్ష్యంగా ప్రతి నెలా వెలువడే వార్తాపత్రిక ఇది. జార్జియాలోని అట్లాంటా నగరంలో స్థిరపడిన వీణారావు దీనికి ఎడిటర్. అగ్నేయ అమెరికాలో స్థిరపడిన భారతీయురాలు.
అమెరికాకు రాకముందు వీణ భారతదేశంలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో పనిచేసింది. ఆమె కర్ణాటకలోని మంగుళూరులో పుట్టి పెరిగింది. పూణెలో పీజీ చదివింది. తరువాత అక్కడే జర్నలిజంలోనూ పీజీ డిప్లొమా చేసి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో కెరీర్‌ను మొదలుపెట్టింది. ఆమెకు మొదటినుంచీ రచనలు చేయడమంటే ఇష్టం. అందుకే జర్నలిజం చేసింది ఆమె. కాలేజీలో చదివేటప్పుడే ‘విమెన్ ఎరా, ఫెమినా’ వంటి మేగజైన్స్‌కి కథనాలను రాసేది. అమెరికా వెళ్లాక కూడా స్థానిక పత్రికల్లో జర్నలిస్టుగా కెరీర్‌ను కొనసాగించింది. అక్కడే వార్తల రిపోర్టింగ్‌తో పాటు పత్రిక డిజైనింగ్, ఇంకా ఇతర విషయాల్లో పట్టు సాధించింది. ఆ క్రమంలోనే ఆమెకు చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. అవే తను పత్రికను స్థాపించడానికి, పత్రికను నడపడానికి సాయపడ్డాయి. పత్రికారంగం డబ్బుకోసం పనిచేసే రంగం కాదు. అలాగని డబ్బు లేకుండా పత్రికను నడపలేం. అందుకే మొదటి నుంచీ బడ్జెట్‌ను అదుపులో పెట్టుకోవడానికే ప్రాధాన్యమిచ్చానని చెబుతుంది వీణారావు. అందుకే చాలా పనులు తనే చేస్తుంది. భారతీయులకు చట్టపరంగా ఎదురయ్యే సమస్యలు, వీసా చిక్కులు, చదువుకుంటూ పనిచేసే వాళ్ల ఇబ్బందులు, పండుగలు, కమ్యూనిటీ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు, భారతీయులు నడిపే వ్యాపారాలు, వాళ్ల విజయగాథలకు సంబంధించిన సమాచారం పత్రికలో ఇవ్వాలని ముందుగానే ప్రణాళిక వేసుకుందట వీణారావు.
2008లో ఆర్థికమాంద్యం సమయంలో ప్రకటనలు ఇచ్చేవారు దొరకడం చాలా కష్టమైంది. దాంతో పత్రిక బడ్జెట్‌ను కుదించాల్సి వచ్చింది. ఆ సమయంలో వార్తల సేకరణతో పాటు పేజీ లే అవుట్, డిజైనింగ్ వంటి పనులన్నింటినీ ఆవిడే చూసింది, చేసింది. తరువాత పరిస్థితులు మళ్లీ మామూలు స్థితికి చేరడంతో పత్రికను కొనసాగించింది. తరువాత మూడేళ్ల క్రితం మళ్లీ ఆవిడకు ఆర్థిక సమస్య తలెత్తింది. ఈసారి ఆవిడ పత్రికను మూసేయడానికి నిర్ణయించుకుంది. అనుకున్నట్టుగానే ఓ నెల పత్రికను ప్రచురించలేదు. దాంతో ఆమెకు చాలా ఈమెయిల్స్ వచ్చాయి. అందులో ఒకరు ‘వచ్చే సంచికకు నేను పూర్తి పేజీ ప్రకటన ఇస్తాను. పత్రికను మాత్రం ఆపొద్దు’ అని మెయిల్ చేశారట. దాంతో ఇక ఎన్ని సమస్యలు ఎదురైనా పత్రికను నడిపి తీరాల్సిందే అనే పట్టుదల పెరిగింది. పత్రికను ముందుకు నడపాలన్న నిర్ణయం తీసుకున్నాక ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ప్రకటనల పరంపర పెరిగి.. గత మూడేళ్లలో ఎన్ ఆర్ ఐ పల్స్ వేగంగా విస్తరించింది.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్
భారతదేశం వెలుపల ఓ పత్రికను నడిపిస్తున్న తొలి ఎన్‌ఆర్‌ఐ మహిళగా వీణారావు అరుదైన గుర్తింపును సాధించింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ నుంచి ఆ విషయాన్ని ధృవీకరిస్తూ వచ్చిన ఈమెయిల్‌ను ఆమె మొదట నమ్మలేదు. 2010లో లిమ్కా బుక్‌లో చోటు దక్కడంతో స్థానికంగా ‘ఎన్‌ఆర్‌ఐ పల్స్’కి గుర్తింపు బాగా పెరిగింది, పరిధి కూడా బాగా విస్తరించింది. కొన్నాళ్ల క్రితం ఆమె ఓ పుస్తకం రాడయం మొదలుపెట్టింది. ఎన్‌ఆర్‌ఐ పల్స్ పత్రికతో పాటు అదే పేరుతో ఓ న్యూస్ వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తున్నారు ఆమె. ప్రస్తుతం అమెరికాలోని ఆగ్నేయ రాష్ట్రాలన్నింటికీ ఎన్‌ఆర్‌ఐ పల్స్ చేరుతోంది. దాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవడమే తన లక్ష్యం అని చెబుతోంది వీణారావు.
ఇటీవలే వీణారావు స్థాపించిన ఈ పత్రిక పనె్నండో వార్షికోత్సవాన్ని పూర్తిచేసుకుంది. తన పత్రిక విజయోత్సవం గురించి ఆమె మాటల్లోనే..
మొదట్లో పత్రికలను ప్రింట్ చేశాక నేనే వాటిని స్వయంగా కారులో తీసుకెళ్లి సరఫరా చేసేదాన్ని. నాకు కారు డ్రైవింగ్ అంటే చాలా భయమేసేది. హిందూ దేవాలయాలు, షాపింగ్ కాంప్లెక్సులు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార ప్రాంగణాల్లో అరలను ఏర్పాటుచేసి అక్కడ పత్రికను ప్రజలకు అందుబాటులో ఉంచేదాన్ని. పత్రిక ఉచితమే కాబట్టి చాలామంది దాన్ని తీసుకునేవాళ్లు. అలా క్రమంగా పత్రిక గుర్తింపు పెరగడం మొదలైంది. మొదటిరోజు దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ డెబ్భైకి పైగా కేంద్రాల్లో పత్రికను సరఫరా చేసేదాన్ని. హైవేపై కారు నడపడం కష్టమనిపించి ఇతర మార్గాల్లో ప్రయాణించేదాన్ని. దాంతో దూరం పెరిగి, పత్రికను సరఫరా చేయడానికి చాలా రోజులు తిరగాల్సి వచ్చేది. కాస్త అలవాటు పడ్డాక, ఆత్మవిశ్వాసం పెరిగాక సొంతంగా కారు కొనుక్కుని హైవే పై ప్రయాణించడం మొదలుపెట్టా. ఒకసారి కారులోనుంచి పత్రికలు తీసి ర్యాకులో పెడుతున్నప్పుడు.. నన్ను చూసి డ్రైవర్ అనుకుని ‘ఈ పత్రిక ఎడిటర్ ఎవరు? ఈ పత్రిక ఎక్కడ ప్రచురితమవుతుంది?’ అని ఓ పెద్దాయన అడిగారు. ‘నేనే పత్రిక ఎడిటర్’ని అని చెబితే ఆ పెద్దాయన చాలా ఆశ్చర్యపోయాడు. తర్వాత అభినందనలు తెలిపాడు. ఆ క్షణం నాకు చాలా గర్వంగా అనిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశంలోనైనా పత్రికను నడపడం చాలా కష్టం. పనె్నండేళ్లుగా ఆ కష్టాన్ని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నా. అమెరికాలో తప్ప మరే దేశంలోనూ ఇది సాధ్యమవుతుందని నేను అనుకోవడం లేదు. ఇక్కడ మహిళలకు లభించినంత ప్రోత్సాహం మరెక్కడా దొరకకపోవచ్చు. అలాగే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నా పేరు నమోదవడం నేను నమ్మలేకపోయాను. పాత్రికేయ రంగంపై ఉన్న ఇష్టంతో, ఆమెరికాలోని భారతీయుల జీవితంతో ముడిపడిన అంశాల్ని వెలుగులోకి తెచ్చే ఉద్దేశ్యంతో ఈ పత్రికను మొదలుపెట్టా. కానీ ప్రపంచంలోనే ఇలా పత్రికను మొదలుపెట్టిన తొలి భారతీయురాలిని నేనే అని మాత్రం నాకు తెలీదు. నేను బహుశా తొలి ఎడిటర్‌నే కాదు, పేపర్‌గాళ్‌గా పనిచేసిన తొలి భారతీయురాలిని కూడా నేనేనేమో.. అంటూ నవ్వుతుంది వీణ.