మెయిన్ ఫీచర్

వారాంతం.. ఉల్లాసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రతి మనిషి యాంత్రిక జీవనాన్ని గడుపుతున్నాడు.. ఎలా అంటే స్విచ్ వేస్తే బల్బు వెలిగినట్లుగా.. మనిషి ముప్ఫై రోజులు పనిచేసి ఒకటో తారీఖు కోసం ఎదురుచూస్తుంటాడు జీతంకోసం. జీతం రాగానే దేనికెంత ఖర్చుపెట్టాలో అంతా తీసి పక్కనపెట్టి మిగతావి పొదుపు చేస్తాడు. ఒకటో తారీఖున జీతం కోసం ఎదురుచూసే మనిషి కనీసం వారానికి ఒక రోజు కూడా ప్రశాంతంగా భార్యా, పిల్లలు, కుటుంబంతో గడుపుదామని ఎందుకు ఎదురుచూడలేకపోతున్నాడు?
వారంలో ఐదు నుండి ఆరు రోజులు ఉద్యోగం చేసిన మనిషికి అలాంటి ఆలోచనలు రావా అంటే వస్తాయి. కానీ మనిషి అలా అలవాటుపడిపోతాడు. శరీరానికి, మనసుకు విశ్రాంతి అవసరం. శరీరం అలసట వచ్చినపుడు సేద తీరటానికి విశ్రాంతిని కోరుకుంటుంది. మెదడుకు కాస్త ఆలోచనలు ఎక్కువయితే మానసిక ప్రశాంతత కోరుకుంటుంది. ప్రస్తుతం ఇంట్లో భర్త ఒక్కడే పనిచేస్తే (ఉద్యోగం చేస్తే) ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు వగైరా వాటికి సరిపోవటల్లేదు. కాబట్టి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో తలమునకలయిన తల్లిదండ్రులు శారీరక, మానసిక ఒత్తిడితో పిల్లలను కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. వారి ప్రేమ, ఆప్యాయతానురాగాలు వారికి పంచలేకపోతున్నారు. పిల్లల ముద్దు ముద్దు మాటలను ఆస్వాదించలేకపోతున్నారు. ఫీజులు కట్టడం, వారు అనుకున్నది కొనివ్వడం తప్ప, వారు ఎలా చదువుతున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితి. మరి ఏం లాభం? వేలల్లో ఫీజులు కట్టి పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిస్తున్నప్పటికీ పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలు, బంధుత్వాలు, మానవత్వం విలువలు తెలియడంలేదు. లక్షలు సంపాదించి పెడుతున్నారు. కానీ వారితో రోజూ కాసేపు ఆడుతూ పాడుతూ గడపలేకపోతున్నారు. అలాంటి బాధ తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. కానీ వారి పిల్లల భవిష్యత్తుకోసమే, వారికి మంచి జీవితాన్ని ఇవ్వడం కోసమే వారు కష్టపడుతున్నారు.
పిల్లలు కూడా తల్లిదండ్రుల ప్రేమను పొందలేక టీవీలు, వీడియో గేమ్‌లతో సమయం గడుపుతుంటారు. పిల్లలకు బయటికి వెళ్లాలని, పార్కులు, ఎగ్జిబిషన్లకు వెళ్లాలని, దేవాలయాలకు, పిక్నిక్‌లకు, విహారయాత్రలకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లాలని ఆ చిన్నారి మనసు కోరుకుంటుంది. లక్షలు సంపాదిస్తున్నది వారికోసమేనని వారికి అర్థం కాని వయసులో ఉండడంవల్లవారి మనస్సు ఆటపాటలను, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని మాత్రమే కోరుకుంటుంది. తల్లిదండ్రులు కూడా వారం మొత్తం కష్టపడి వారి వృత్తి, ఉద్యోగాల్లో తలమునలకై ఉంటారు కాబట్టి కనీసం ఒక్క ఆదివారం రోజైనా పిల్లలను తీసుకొని సినిమాలకో, దేవాలయాలకో, పార్కులతో, పిక్నిక్‌లకో వెళ్తే అందరికీ ఎంతో సంతోషంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఒక్క రోజు గడిచిన తీరును స్మరిస్తూనే వారం రోజులు గడిచిపోతాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఎఫెక్షన్స్, రిలేషన్స్ పెరిగిపోతాయి. ఇలాంటి జ్ఞాపకాలు దూరాన్ని దగ్గరగా చేస్తాయి. దగ్గరగా ఉన్నవారిని విడదీయలేనంతగా చేస్తాయి.
మనిషికి మానసిక ప్రశాంతత ఎంత అవసరమంటే- బాధలో వున్న వ్యక్తిని ఓదార్చితే ఎంత ఉపశమనం, బరువు తగ్గిపోతుందో అంతటి ప్రశాంతత, మనసు తేలికగా ఉంటుంది. వేలు, లక్షలు పెట్టి దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు దాటిపోనక్కర్లేదు. స్టార్ హోటళ్లలో ఉండాల్సిన పనిలేదు. మానసిక ప్రశాంతతకోసం, ఆ ఒక్కరోజు సంతోషంగా గడపడం కోసం పక్కనే వున్న దేవాలయాలు, ఊర్లో వున్న సినిమా థియటేర్‌కి, పార్కులు, ఎగ్జిబిషన్‌కి వెళ్తే చాలు. మనదైన బడ్జెట్‌లో గంటలకాలం క్షణాల్లో గడిచిపోతుంది. వారం మొత్తం ఒక యుగంలా గడిచిన మనసుకు ఆ జ్ఞాపకాలతో ఆ రోజు క్షణంలో కరిగితుంది. పట్టణాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, మంచి మంచి స్థాయిల్లో ఉన్నవారు వీకెండ్ వచ్చిందంటే చాలు, జీవితం మొత్తం ఆ ఒక్క రోజులోనే అనుభవించే ప్రయత్నం చేస్తారు. అలాంటిది మధ్యతరగతివారు ఇటువంటి సమయాన్ని, సందర్భాన్ని ఇంకా ఎక్కువగా ఆస్వాదించగలరు. వారం రోజుల కష్టాలను మరిచిపోయి ఆహ్లాదంగా ఉండటమే వీకెండ్స్ ప్రత్యేకత.

-శ్రీనివాస్ పర్వతాల 9490625431