మెయిన్ ఫీచర్

మహిళలూ వెళ్లొచ్చు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే యాత్రికులు పవిత్రమైన పద్దెనిమిది మెట్లపై నుండి వెళ్లాల్సి ఉంటుంది. అత్యంత నిష్ఠతో నలభై ఒక్క రోజుల పాటు నియమాల మాల వేసుకుని, నలుపురంగు దుస్తులు మాత్రమే ధరిస్తూ స్వామివారిని దర్శించుకుంటారు. మందిరంలోకి ప్రవేశించే ముందు కూడా భక్తులు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ కేవలం మగవారికే. ఎందుకంటే ఆడవారికి ఈ ఆలయప్రవేశం నిషిద్ధం.
అయితే తాజాగా శబరిమల అయ్యప్ప ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రస్తుతం రుతుస్రావం కారణాలతో పది నుంచి యాభై ఏళ్ల వయసు మహిళలకు ఆలయంలో ప్రవేశం నిషేధించారు. ఇది లింగసమానత్వానికి విరుద్ధమంటూ 2006లో మహిళా న్యాయవాదుల బృందం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. అయ్యప్పస్వామి 3బ్రహ్మచారి2 అని.. అందుకే ఈ ఆచారాన్ని పాటిస్తూ, రుతుస్రావం వచ్చే అమ్మాయిలను, మహిళలను ఆలయంలోకి అనుమతించడం లేదని దేవస్థానం అధికారులు గతంలో తెలిపారు. శబరిమల దేవస్థానం మహిళలపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ 2006లోనే కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై 2016లో విచారణ జరిగింది.
ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని 2016లో కేరళ ప్రభుత్వం వ్యతిరేకించింది. 2017 నవంబరులో జరిగిన విచారణ సమయంలో మాత్రం ఆ పిటిషనర్లకు మద్దతు తెలిపింది. అన్ని వయసుల మహిళలనూ మందిరంలోకి అనుమతించేందుకు తాము సిద్ధమేనని చెప్పింది. విశ్వాసాలు, కట్టుబాట్ల పేరుతో మహిళలను వివక్షకు గురిచేస్తున్నారని, పురుషుల్లాగే మహిళలు కూడా ఆలయంలోకి వెళ్లి పూజలు చేసుకునే అనుమతివ్వాల్సిందే అని పిటిషన్ వేసిన లాయర్ల సంఘం ప్రతినిధి ఇందిరా జైసింగ్ అన్నారు. ఆలయంలోకి మహిళలను నిషేధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందా? తప్పనిసరిగా పాటించాల్సిన మతపరమైన ఆచారం కిందకు వస్తుందా? అన్న విషయాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు 2017లో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
ఆలయాల్లో లింగవివక్షకు తావులేదని, మహిళలకు తక్కువగా బలహీనులుగా చూడడానికి వీల్లేదని చెప్పింది సుప్రీంకోర్టు. ఈ దేశంలో ఒకవైపు మహిళలను దేవతల రూపంలో పూజిస్తూ, మరోవైపు లింగ వివక్షతతో ఆంక్షలు విధిస్తున్నామని, పురుషులకంటే మహిళలు దేనిలోనూ తక్కువ కాదని, మహిళలపై నిషేధం హిందూ మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని, మతమనేది జీవన విధానంలోని భాగమని తీర్పు సందర్భంగా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.