మెయన్ ఫీచర్

రక్షణ లేని భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.సోమేశ్వరరావు ఉత్తరాంధ్రలో తెలుగుదేశం ఎంఎల్‌ఏ. ఈయన లోగడ వై.ఎస్.ఆర్ పార్టీలో ఉండేవాడు. 23 సెప్టెంబర్ 2018 నాడు సోమేశ్వర్‌ను, మాజీ ఎంఎల్‌ఏ సోమను మావోయిస్టులు కాల్చిచంపారు. ఈ బృందానికి చలపతి అలియాస్ ప్రతాపరెడ్డి నాయకత్వం వహించాడు. దాదాపు యాభై మంది నక్సలైట్లు ఈ హత్యాకాండలో పాల్గొన్నారు. హత్య జరగడానికి ముందు తనను చంపవద్దు అంటూ సోమేశ్వరరావు ప్రాధేయపడ్డాడు. పైగా సోమ గిరిజన సామాజిక వర్గానికి చెందినవాడు కూడా. ‘‘మిమ్మల్ని ప్రజా కోర్టు శిక్షించింది కాబట్టి మరణం తప్పదు’’ అని మావోయిస్టులు తీర్పు చెప్పారు. ఈ వివరాలు గన్‌మెన్ చిట్టిబాబు ద్వారా తెలిశాయి. దీనిని చూచి అంతా దిగ్భ్రాంతి చెందారు. ఘాతుకం, దుర్మార్గం అంటూ పతాక శీర్షికలు వచ్చాయి. ఈ హత్య సందర్భంగా అరుణ, స్వరూప (్భమవరం) వంటి 50 మంది మహిళలు పాల్గొన్నారు. మరణించిన సర్వేశ్వరరావు ఎస్.సి (మాదిగ), శివిరి సోమ క్రైస్తవుడు. వీరిద్దరూ అట్టడుగు సామాజిక వర్గాలకు చెందినవారు. ఇపుడు మనం విశే్లషించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి.
- సోమేశ్వరరావు అక్రమ మైనింగ్ చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. ఐతే చత్తీస్‌ఘడ్ లోతట్టు ప్రాంతాల్లో మావోలు గంజాయి సాగు చేస్తూ అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
- ప్రజా కోర్టులు శిక్షలు విధిస్తే ఇక సుప్రీం కోర్టుకు రోమిల్లా థాపర్ వెళ్లి అర్బన్ నక్సలైట్ల అరెస్టును నిరసించడం ఎందుకు? సుప్రీంకోర్టుల మీద మాకు విశ్వాసం లేదు అని వీరు లోగడ చాలాసార్లు చెప్పారు కదా?
- ఆయుధాలు మా శరీరంలో అంతర్భాగం. వానిని వదిలే ప్రశ్న లేదు అని ఖండితంగా తేల్చి చెప్పారు. ‘తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది’ అనే మావోసేటుంగ్ సూక్తిని వీరు విశ్వసించారు. అలాంటప్పుడు కేరళ, తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనటం ఎందుకు?
- తన పార్టీ కేడర్‌కు రక్షణ కల్పించలేని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఐదు కోట్లమంది తెలుగువారిని ఎలా కాపాడగలడు? లోగడ అలిపిరి (తిరుపతి)లో ఈయన మీద కూడా హత్యా ప్రయత్నం జరిగింది. తృటిలో బ్రతికి బయటపడ్డాడు.
- ఇవ్వాళ ప్రజా ప్రతినిధులను మావోయిస్టులు హతమారుస్తుంటే ఈ మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ ఎక్కడున్నాయి. పి.ఎల్.విశే్వశ్వరరావు, జాన్ దయాల్, షబ్‌నం లోనీ, రోమిల్లా థాపర్, షబానా ఆజ్మీ, ప్రొఫెసర్ కోదండరామ్‌లు ఎందుకు మాట్లాడటంలేదు?
- జిగ్నేశ్ మెమన్ ఆయుధాల వ్యాపారి. ఇతనికి కాంగ్రెస్ పార్టీ నుండి భారీగా నిధులు అందుతున్నాయి. వాటిలో రాకెట్ లాంఛర్లు కొని జంగిల్ నక్సలైట్లకు సరఫరా చేస్తున్నాడు. రోనా విల్సన్, వరవరరావు, గోతం నవలక్క వంటి వారిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసినపుడు ‘ప్రజాస్వామ్యం ఖూనీ అయింది’ అని ఏచూరి సీతారాం ప్రకటించాడు. అటు అరుంధతీరాయ్ ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ అర్బన్ నక్సలైట్ల అరెస్టును నిరసించారు.
- రాజకీయ హత్యలు తెలంగాణలో కొత్తకాదు. డి.శ్రీపాదరావు, హయగ్రీవాచారి, ఇ.మాధవరెడ్డి, పోలీసు అధికారి కోట శ్రీనివాస్ వంటి ఎందరో లోగడ మావోల ఘాతుకానికి బలి అయినవారే. ఐనా సరే వీరికి రాజకీయ పక్షాలు ఎందుకు కొమ్ము కాస్తున్నాయి?
- భారత ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేయాలని వారు వ్యూహరచన చేశారు. ఐనా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు టీవీ చానెల్స్‌లో బహిరంగంగా బిజెపిని విమర్శిస్తున్నారు. విచిత్రం ఏమంటే లోగడ అందరికన్నా ఉగ్రవాదుల వలన భారీగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీయే. ఇద్దరు ప్రధానమంత్రులను ఆ పార్టీ ఉగ్రవాదుల దాడిలో కోల్పోయింది. ఐనా ఇవ్వాళ చత్తీస్‌గఢ్‌లోని ఉగ్రవాదులకు సోనియా గాంధీ నుండి నిధులు అందుతున్నాయని సాక్ష్యాధారాలు లభించాయి. ఇదేమి రాజకీయం?
***
పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కోపం వచ్చింది. న్యూయార్క్‌లో సెప్టెంబర్ నాల్గవ వారంలో జరుగవలసిన ఇండో-పాక్ విదేశాంగ మంత్రుల ద్వైపాక్షిక చర్చలను ఇండియా ఏకపక్షంగా రద్దుచేసింది. అందుకు ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతూ- ‘ఇండియాకు శాంతిపైన విశ్వాసం లేదు’ అన్నాడు. ఇతడు నిన్నటిదాకా క్రికెట్ ఆడుకుంటూ మాచ్ ఫిక్సింగ్‌లు చేసుకుంటూ బ్రతికినవాడు. ఇవ్వాళ ఐఎస్‌ఐ చేతిలో కీలుబొమ్మ. ఇండియాకు శాంతి అంటే ఇష్టం లేదా? సరిహద్దులల్లో భారతీయ జవాన్లను అపహరించి వారి కళ్లు పీకి శరీరాలను నరికి ఇండియాలో పడేయటం ‘శాంతి చర్య’ అవుతుందా? నవజోత్‌సింగ్ సిద్ధూ పాకిస్తాన్ వెళ్లి అక్కడి సైనికాధికారిని ఎందుకు కౌగిలించుకున్నట్లు? మణిశంకర్ అయ్యర్ కరాచి వెళ్లి దునియా టీవీలో ఐఎస్‌ఐ అధికారితో ఇలా చెప్పాడు. ‘నరేంద్ర మోదీని ఓడించాలంటే మాకు మీ సహాయం అవసరం’- ఇలాంటి ప్రకటన చేసిన తర్వాత కూడా బిజెపి ప్రభుత్వం మణిశంకర్ అయ్యర్‌ను ఏమీ చేయలేకపోయింది. ‘ఈ ప్రధాని నీచ కులానికి చెందినవాడు’ అని అయ్యర్ అన్నాడు. మరి మద్యం తాగి గోమాంసం తిని యజ్ఞోపవీతం లేకుండా ఉన్నవాడు బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు?
నరేంద్ర మోదీ లోగడ ఇందిరాగాంధీ, వాజ్‌పేయిలను ఆదర్శంగా తీసుకొని పాకిస్తాన్ విషయంలో కొన్ని కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా మారుతోంది. దేశరక్షణ అన్నింటికన్నా ప్రథమ కర్తవ్యం.
***
పంజాబ్ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. రాజస్థాన్‌లో వసుంధరా రాజే సర్కార్‌పై నిరసన గళాలు వినిపిస్తున్నాయి. సీమాంధ్రలో కనీసం ఒక్క అసెంబ్లీ స్థానం కూడా బిజెపి గెలుచుకునే అవకాశం లేదు. విహెచ్‌పి అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా బిజెపి మీద తిరగబడటం ఆందోళన కలిగించే విషయం. బిజెపి అధినాయకత్వం ఏం చేస్తున్నది! ‘చోర్’ (దొంగ) అని నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ బహిరంగంగా తిట్టాడు. సమంజసమేనా? ఒక ప్రతిపక్ష నాయకుని స్థాయికి తగిన పనికాదు. రాజకీయాలు ఎందుకిలా మారిపోతున్నాయి? కాంగ్రెస్ విజయావకాశాలను కాంగ్రెస్ వారే గండికొట్టుకుంటున్నారు. ‘‘ఈ రామచంద్ర కుంతియా మాకు శనిలాగా దాపురించాడు’’ అని కోమటిరెడ్డి బ్రదర్స్ అనటం పార్టీలో సంచలనం రేపింది. పాపం వి.హెచ్.హనుమంతరావు పార్టీ ప్రచార రథం కూడా తయారు చేసుకున్నాడు. ఐనా ఆయనకు పార్టీ ప్రచార కమిటీలో స్థానం కల్పించలేదు. దాంతో పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తిరుగుబావుటా ఎగురవేశాడు. తెలుగుదేశం వారు పొత్తులో భాగంగా 30 సీట్లు అడుగుతున్నారు. పది సీట్లకు మించి ఇవ్వము అని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓడిపోతే అందుకు కెసిఆర్ కన్నా ఆ పార్టీ అంతర్గత పోరు ప్రధాన కారణం అవుతుంది.
***
సోషల్ మీడియాను భ్రష్టుపట్టిస్తున్నదెవరు? చీరాల అల్లర్లకు కారణం ఎవరు? నిన్న అమెరికానుండి ఎవరో ఫోను చేశారు. చీరాల గొడవలకు కారణం ఏమిటి అని. జీసస్ ప్రభువును తిడితే క్రైస్తవులే కాదు నాలాంటివారు కూడా సహించరు. జీసస్‌ను, మహమ్మదును ఎందుకు తిట్టాలి? బైబిలును తగలబెట్టడం నేరమే. చీరాల అల్లర్లు రాజకీయ ప్రేరేపితమైనవి. అనంతపురం (ప్రబోధానంద) గొడవలు కూడా వాంఛనీయం కాదు. మతాధిపతులు సంయమనం పాటించాలి. కేరళలో ఫ్రాంకో ములక్కల్ వంటి ఆర్చి బిషప్పులు నన్స్‌ను రేప్ చేస్తున్నారు. ఇది దుర్మార్గం. వాటికన్‌లోని పోపుగారు రేపిస్టులను శిక్షించాలి.
***
సూది కోసం సోదికి పోతే పాత రంకులు బయటపడ్డాయి అని తెలుగులో ఒక జానపద సామెత ఉంది. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు అల్లరి చేసేసరికి ట్రైనీ విమానాల, అగస్తా కొనుగోళ్లు వెలుగులోకి వచ్చాయి. ‘‘హాల్ (హెచ్.ఎ.ఎల్) అంటే హిందూస్తాన్ ఏరోనాటికిక్స్ సంస్థ. ఇక్కడ స్వదేశీ పరిజ్ఞానంలో నిర్మాణాలు జరుగుతాయి. వీటిని కాదని ఫ్రాన్స్ దేశంలో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు?’’ అని ప్రశ్న
మరి ములాయంసింగ్ యాదవ్ 90వ దశకంలో రక్షణ మంత్రిగా ఉన్నపుడు ట్రైనీ విమానాల కొనుగోళ్లు ఎందుకు చేశాడు? అని ఎదురుప్రశ్న వేయవలసి వచ్చింది.
సంజయ్ భండారీ ఆయుధాల వ్యాపారి- ఆయన ఎనిమిది లక్షల విలువైన రెండు విమానం టిక్కెట్లు (పదహారు లక్షలు ఇచ్చి) కొని రాహుల్ గాంధీకి ఎందుకు ఇచ్చాడు? లండన్ హౌస్ చాలా విలువైన స్థలం (ప్రైమ్ ప్లేస్)లో ఉంది. కోట్ల పౌండ్లు ఖర్చు చేసి దానిని కొని రాహుల్ బాబుకు గిఫ్టు ఇచ్చారు. కేవలం లండన్ హౌస్ ఇంటీరియల్ డెకరేషన్ కోసం మిలియన్ పౌండ్లు దుబాయి షాండ్లియర్ మానిఫాక్చరింగ్ కంపెనీకి ముట్టాయి. ఇందుకు బదులుగా (క్విడ్‌ప్రోకో) సంజయ్ భండారి విమానం కొనుగోళ్ల కాంట్రాక్టు సంపాదించుకున్నాడు. రాఫెల్ డీల్ ఎ.కె.ఆంటోనీ, మన్మోహన్‌సింగ్ హయాంలో కుదిరింది. ఆ కమిషన్ సిగ్నోరా గాంధీకి అందకముందే నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందుకని రాహుల్ గాంధీ మోదీపై బురద చల్లుతున్నాడని ఆరోపణ. బురద నుండి కమలం స్వచ్ఛంగా వికసిస్తుంది అని మోదీ కవితామయంగా వ్యాఖ్యానించటం గమనార్హం.
***
రాఫెల్ 36 జెట్ యుద్ధ విమానాలు అణుశక్తి ప్రయోగ సామర్థ్యం కలవి. అవిశ్రాంత సైనికులకు అందితే ఇండియా యుద్ధ పటిమ పెరుగుతుంది. అందుకే దానిని పాకిస్తాన్ తన ఏజెంట్ల ద్వారా నిరోధించటానికి ప్రయత్నిస్తున్నది. రాహుల్ గాంధీని భారత ప్రధానిని చేయండి అంటూ మీడియా ద్వారా పాకిస్తాన్ ప్రత్యక్షంగా సందేశాలు పంపడంలోని ఆంతర్యం ఏమిటి? పాకిస్తాన్‌కు ఎవరు ప్రధాని కావాలో భారత్ ఎప్పుడైనా నిర్ణయించిందా?
బిజెపి అధికార ప్రతినిధి సంహిత్ పాత్రా 25-09-2018 నాడు సంచలనాత్మక రహస్య సమాచారాన్ని వెలికితెచ్చారు.
- రక్షణ విమానాల తయారీ వ్యవహారంలో కాంట్రాక్టుకు రాహుల్ గాంధీ ముడుపులు అందుకొని స్విస్ సంస్థకు ఇప్పించాడు.
- రాహుల్ గాంధీ బావమరిది రాబర్డ్ వాద్రాకు పది లక్షల స్విస్ ఫ్రాంక్ కరెన్సీ ముట్టింది.
- 42 స్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉండవలసిన వాయు సేనలో 32 దళాలకు యుపిఏ కుదించింది. అంటే దేశ రక్షణను పణంగా పెట్టింది.
- 2012లో ఫింబస్ (స్విస్) కంపెనీకి ముడుపులకు ఆశించి రాహుల్ కాంట్రాక్టు ఇప్పించాడు. ఈ నేరాలకింద అరెస్టు అవుతాము అనే భయంతో 2019లో రాజ్యాధికారం కోసం ఆరాటపడుతున్నారు.
- ఆఫ్‌సత్ ఇండియా సొల్యూషన్స్ సంస్థ సంజయ్ భండారీ అనే ఆయుధాల సరఫరా వ్యాపారిది. 2008-2014 మధ్యలో ఈయనతో రాహుల్ గాంధీ అనేక ఒప్పందాలు కుదుర్చుకున్న లేఖలు విడుదల చేశారు. ఈ దొంగ డబ్బు జూరిక్ బ్యాంకులో జమ చేయబడింది.
***
ప్రజలకు కోర్టులమీద నమ్మకం ఇంకా ఉంది. ఐతే ఒక్కొక్క కేసు రెండు మూడు తరాలు సాగతీయటం ఎంతవరకు న్యాయం? 1950 నుండి 2018 వరకు రామజన్మభూమి వివాదం కొనసాగుతూనే ఉంది. ఇది మత సమస్య అనే విషయంకన్నా భూ వివాదంగానే మేము పరిగణిస్తాము అన్నారు న్యాయమూర్తులు.
స్వలింగ లైంగిక సంపర్కం నేరం కాదు. స్ర్తిలు వ్యభిచారం చేయటం దోషం కాదు అని తీర్పునిచ్చారు. ఇవన్నీ మనం అంగీకరించాల్సిందే. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జీలే కాబట్టి.

--ప్రొ.ముదిగొండ శివప్రసాద్