మెయిన్ ఫీచర్

భేదభావాలు విడనాడితే అంతా దైవమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భేషజాలవల్ల మానవత్వం నశిస్తుందని, ఎక్కువ తక్కువ భేదభావాలను విడనాడాలని చెబుతుండే వారు. బాబా ఆత్మానుసంధానంగా మునిగి ఉంటే కొందరు భక్తులు శ్రావ్యంగా, సుతిమెత్తగా వాయిద్యాలను మ్రోగించేవారు. ఇంకొందరు అర్ఘ్యపాద్యాలను సమర్పించేవారు. మరికొందరు బాబాకు చందనం, అత్తరు పూసి, ఆ అలంకారంలో బాబాను చూసి మురిసిపోయేవారు. తాంబూలాలు సమర్పించేవారు. నైవేద్యాలుపెట్టి భక్తితో బాబాకు చేతులు జోడించేవారు.
నిజంగావారు బాబాకు సేవచేయటమే తప్ప తమకోసం కోరుకునేది చాలా తక్కువగా ఉండేది. అందుకే బాబా వారికి ప్రేమను పరిపూర్ణంగా పంచిపెట్టారు. బాబాకు ప్రీతిపాత్రులైన నిజభక్తులు ధన్యులు వారు ముక్తి ప్రదాతలు.
శిరిడీ హారతులు- విశిష్టత
శివుడు అభిషేక ప్రియుడు. కాసింత జలాన్ని లింగంపై చిలకరిస్తే పులకరించి పోయే దైవం ఆ కాశీ విశే్వశ్వరుడు. అందుకే శివుడిని ‘అభిషేక ప్రియాయ నమః’ అని పూజిస్తారు. విష్ణువు అర్చన ప్రియుడు. విఘ్నేశ్వరుడు తర్పణప్రియుడు. దోసిళ్లతో నీళ్లను తీసుకుని తర్పణంగా వదిలితే బొజ్జ గణపయ్య మనపై కురిపించే కరుణ వెల్లువెత్తుతుంది. అలాగే శిరిడీ సాయిబాబా హారతిప్రియుడు. హారతులంటే బాబాకు మిక్కిలి ఇష్టం. ఎక్కడ హారతి పాటలు వినిపిస్తాయో అక్కడ బాబా ఏదోరూపంలో ప్రత్యక్షమై వౌనంగా ఆ గాన మాధుర్యాన్ని ఆలకిస్తారని ప్రతీతి. అంతిష్టం కాబట్టే బాబా హారతి పాటలను స్వయంగా రాయించుకున్నారు. జాగ్రత్తగా గమనిస్తే హారతి పాటల్లో బాబా గురించి ఎక్కడా కీర్తిస్తూ వర్ణనలు ఉండవు. వాటిల్లోకూడా మనిషి సంస్కారం, జీవనశైలి, ఆధ్యాత్మిక రహస్యాల గురించే ప్రస్తావన ఉంటుంది. ప్రతిరోజూ నియమిత సమయానికి అందరూ విధిగా ముక్తకంఠంతో హారతి పాటలను ఆలపిస్తే... వాటిని వింటుంటే మనసు భక్తిపారవశ్యంలో మునిగి తేలుతుంది. హారతి పాటల్లోని ‘ప్రేమే యా అష్టకాశి’ అనే పాటను ఎవరైతే భక్త్భివంతో ఆలపిస్తారో వారి మానసిక ఇబ్బందులన్నీ తీరి ప్రశాంతతను పొందుతారని బాబా స్వయంగా హారతి పాటల రచయిత కృష్ణశాస్ర్తీ జోగేశ్వర్ భీష్మతో చెప్పారు.
హారతి పాటలను మనకు అందించి మన జీవితాలను ధన్యంచేసిన కృష్ణశాస్ర్తీ జోగేశ్వర్ భీష్మ నాగపూర్ జిల్లాలోని భోరీ గ్రామంలో జన్మించారు. 1908లో శ్రావణ మాసంలో ఒకనాడు ఆయనకు కలలో ఒక నల్లటి బ్రాహ్మణుడు కనిపించి వార్తాపత్రికను చూపించాడు. దానిపై ‘సచ్చిదానంద’అనే అక్షరములు నేర్చుకో అని రాసినట్టు భీష్మకు కనిపించింది. భీష్మ ఆ విషయమై పరిచయస్తులవద్ద ప్రస్తావించగా, సచ్చిదానంద స్వరూపుడైన సాయినాథుడే ఆ రూపంలో కనిపించి అగ్రహించారని చెప్పారు. కొన్నాళ్లకు భీష్మ బాబావారి దర్శనార్థం శిరిడీ వెళ్లారు. బాబా ఆయనను చూస్తూనే ‘జై సచ్చిదానంద’అని నవ్వుతూ ఆహ్వానించారు. నన్ను గుర్తించావా మిత్రమా? అని పలకరించారు. భీష్మ మనసు ఆనందంతో తేలియాడింది. తనకు వచ్చిన కల, ఇక్కడ బాబా సమక్షంలో కలిగిన అనుభవం భీష్మను గొప్ప ఆధ్యాత్మికానుభూతికి గురిచేశాయి. నిజానికి అప్పటివరకు భీష్మకు బాబాపై గురిఉంది కానీ బాబా పాదతీర్థాన్ని పుచ్చుకునేవారు కారు. ఈ అనుభవం కలిగాక అతని మానసిక స్థితిలో మంచి మార్పు వచ్చింది.
ఇది జరిగిన కొద్దిరోజులకు భీష్మకు మరో అనుభవం కలిగింది. బాబా కూర్చునే గోనె పట్టా కొద్దిరోజులకు చింకిపోయి పాడైపోతుండేది. భక్తులు అప్పుడప్పుడూ పాత గోనెపట్టా తీసివేసి కొత్తది వేస్తుండేవారు. ఈ క్రమంలో ఒకసారి బాబా లెండీ తోటకు వ్యాహ్యాళికి వెళ్లారు. ఆ సమయంలో ఒక భక్తుడు పాత గోనె పట్టాను తీసి పక్కన పారవేసి కొత్తది పరిచాడు. బాబా మసీదుకు తిరిగి వచ్చి తన పాత గోనె పట్టా ఏదని అడిగారు. అది చిరిగిపోయిందని కొత్తది వేశామని భక్తులు చెప్పారు. బాబా కోపోద్రిక్తులై కొత్త గోనె పట్టాను ధునిలో పారవేశారు. చివరకు భక్తులు పాత గోనె పట్టాను వెతికి పట్టుకు వచ్చేవరకు బాబా శాంతించలేదు
. అటువంటిది ఒకసారి బాబా భీష్మను పిలిచి తాను కూర్చుండే పాత గోనె పట్టా తీసివేసి కొత్తది వేయమని సూచించారు. కానీ భీష్మ ఆ పనిని వెంటనే చేయలేకపోయాడు. హారతి అయ్యాక భక్తులందరూ బాబా చుట్టూ చేరారు. అప్పుడు భీష్మ పాత పట్టా తీసివేసి కొత్తది వేయమంటారా అని సైగల ద్వారా బాబాను అడిగాడు. బాబా సరేనన్నారు. భీష్మ సూచనతో దాదాసాహెబు పాత గోనెపట్టా తీసివేసి కొత్తది వేశాడు. అనంతరం బాబా దానిపై కూర్చుని చిలుము పీల్చి భీష్మకు కూడా అందించారు. ఏ సంకోచం లేకుండానే భీష్మ దానిని తీసుకుని పొగ పీల్చి మళ్లీ బాబాకు ఇచ్చేశాడు. అ
పుడు బాబా భీష్మతో ‘‘మేం అన్నిచోట్లా ఉన్నాం. బొంబాయి, పూణే, సతారా, నాగపూరు... ఏదైనా రామమయమే. తెలిసిందా మిత్రమా?’’అన్నారు. మళ్లీ కొద్ది నిమిషాలసేపు వౌనంగా ఉన్న బాబా ‘‘నువ్వు నాకు పెట్టకుండా ఒక్కడివే తింటావు. కనీసం ఇపుడైనా అయిదు లడ్లు పెట్టు’’ అన్నారు. ఆ మాటలు భీష్మలో విపరీతమైన పరివర్తనను కలిగించాయి. ఎందుకో ఆ క్షణంలో భీష్మకు గతంలో తనకు కలలో కనిపించిన వైష్ణవుడు బాబానే అనిపించింది. వెంటనే అక్కడున్న సేవకుల్లో ఒకరిని పిలిచి బాబా పాద తీర్థాన్ని ఇవ్వమని కోరాడు. దానిని తీసుకుని తాగి బాబా పాదాలపై భీష్మ తన తలపెట్టి రెండునిమిషాలపాటు అలాగే ఉండిపోయాడు. అనంతరం బాబా అతని తలపై చేయివేసి ఆశీర్వదించారు.
*
సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566