మెయన్ ఫీచర్

యువతకు సరైన దిశానిర్దేశం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాణి, వీణ అవిభక్త కవలలు. నీలోఫర్ ఆసుపత్రిలో నరకాన్ని అనుభవిస్తున్నారు. కవలల్ని విడదీసి వార్తల్లోకి ఎక్కిన గుంటూర్ డా.నాయుడమ్మ నుంచి ఆస్ట్రేలియా వైద్యుల దాకా స్పందించినా వారికింకా విముక్తి దొరకలేదు. వీరి దీన గాధను తెరకెక్కించాలని ఏ నిర్మాతకూ తట్టలేదు. తల్లిదండ్రుల అక్రమార్జనకు కొవ్వెక్కి తాగి తందనాలాడి, విచ్చలవిడిగా ప్రవర్తించే వారిపైగాని, వారు నడిపే కారుకిందపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న అభాగ్యులపై కాని ఒక్క సినిమా కనపడదు. అభివృద్ధి పేరున భూములు లాక్కోబడి నిర్వాసితులవుతున్న రైతుల నేపథ్యంలో ఓ సినిమా చేయాలనే ఆలోచన ఏ నిర్మాతకూ రాదు. అనంత కరువులపైగాని, మహబూబ్‌నగర్ వలసలపై గాని వార్తా కథనాలు తప్ప కనీసం ఒక లఘు చిత్రం వుండదు.
అధవా ‘ఉడుతా పంజాబ్’ లాంటి సినిమాలు వచ్చినా సెన్సార్ కత్తెరకు అడ్డే వుండదు. వీటన్నింటినీ అధిగమించి బయటకు వచ్చినా పంపిణీదారులు, ప్రదర్శకులు దొరకరు. పౌరాణికమైనా లవకుశ నేటి మేటి తరం చిత్రంగా గుర్తింపు పొం దింది. జానపదమైనా సువర్ణ సుందరి మనసుల్ని రంజింపచేస్తుంది. సాంఘికమైనా గుండమ్మ కథ మనింట్లో కథలాగానే ఉంటుంది. కిస్సా కుర్చీకా, ఎంఎల్‌ఎ ఏడుకొండలు అలనాటి రాజకీయాలనే కాదు నేటి రాజకీయాల దుమ్ము దులపగలవు. మదర్ ఇండియా ఓ భూమి చుట్టూ తిరిగే కథనే కాదు, తప్పుదారిన నడిచే కొడుకు పట్ల తల్లి కఠిన వైఖరికి అద్దం పడుతుంది. ప్రేమకథలే అయినా మొగల్ ఎ యాజాం, దేవదాసు లాంటి సినిమాలు మరిమరీ చూడాలనిపిస్తుంది. శ్రీ420, నయదౌర్ లాంటి సినిమాలు ఆర్థిక వ్యవస్థకు, శ్రమ జీవులకు ఊతం నిచ్చాయి. నిన్నటి భారతీయ సినిమాకు ఇలాంటివి బంగారు తునకలే!
ఇంతనో, అంతనో హిందీ సినిమాలు కొంతలో కొంత హద్దుల్లో ఉన్నట్టు, సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు జనం నోట నానినట్టు కనపడినా ముంబాయి మాఫియాల కనుసన్నల్లోనే అనేది కాదనలేని సత్యం. ప్రయోగాత్మకంగా తీసే మరా ఠీ, అస్సామీ, బెంగాలీ, ఒడియా, కొంకణి, మళయాలి, కన్నడి, తెలుగులోకి డబ్ చేయబడిన తమిళ సినిమా కాంచీపురం, కుల వ్యవస్థను ప్రశ్నిస్తూ తీసిన ‘1940లో ఓ గ్రామం’ లాంటి సినిమాలు కేవలం దూరదర్శన్ ప్రసారాలకే పరిమితంగా ఉంటున్నాయి. ప్రభుత్వ బడులు, ఆసు పత్రులు లాగానే ప్రభుత్వ దూరదర్శన్ కూడా ప్రేక్షకులకు నిషిద్ధంగా మారిపోయింది.
ప్రపంచ స్థాయి సినిమాలకు హాలీవుడ్ పెట్టింది పేరు. ఎన్నో ప్రతిష్ఠాత్మక సినిమాలు తీసిన ఘనత దీనికి ఉంది. అత్యుత్తమ సినిమాల పేరున ఇచ్చే ఆస్కార్ అవార్డులు వీటి చుట్టే తిరుగుతాయి. అయ్యో! మన సినిమాలకు ఈ భాగ్యం లేదు అని వాపోతూ వుంటాం. కానీ, ఈ హాలీవుడ్ కూడా అమెరికా కనుసన్నల్లోనే నడిచే సెల్యులాయిడ్ అన్నది ఓ కఠోర సత్యం. ఇప్పటికి ఓ వియత్నాం యుద్ధంపైగానీ, రెండో ప్రపంచ యుద్ధ గాయాలపై గాని, గల్ఫ్‌లో విస్తారంగా లభించే చమురుపై గుత్త్ధాపత్యం సాధించడానికై రసాయన ఆయుధాలున్నాయని నెపం మోపి ఉరితీసిన సద్దాం హుస్సేన్‌పైగాని, వెంటాడి వేటాడి చంపిన గడాఫీ జీవితంపై గానీ హాలీవుడ్ ఒక్క సినిమాను తీయలేకపోయింది. తీయలేదు కూడా! తీస్తే నిర్మాతకు, దర్శకునికి అమెరికాలో లేదా ఏ ఇతర దేశంలోనైనా నూకలు చెల్లినట్టే!
ఇదే ధోరణి భారతీయ సినిమాలపై కూడా బలంగా వుంది. వస్తే, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, ఫ్రెంచ్ వారికి వ్యతిరేకంగా పోరాడిన యోధులపైకొన్ని సినిమాలు రావచ్చు! భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులపైన, చిట్టగాంగ్ మహిళల వీరగాధలపైన, చౌరాచురి రైతుల సాహసంపైన గాంధీ సినిమాలా అంతర్జాతీయ స్థాయి లో గుర్తుండే ఒక్క సినిమా నేటికీ రాలేకపోయింది. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో జరిగిన ఇలాంటి కథనాలపై సినిమాలు తీయలేని సినిమా పరిశ్రమ, మధ్యభారత్‌లో ఆదివాసులపై జరుగుతున్న దమనకాండపై సినిమాలు తీస్తారనుకోవడం ఓ భ్రమనే! వచ్చిన సినిమాలు కూడా నక్సల్ పోరాట సమస్యగానే చూపాయి తప్ప ఆదివాసుల బతుకు పోరాటాలను చూపలేకపోయాయి.
ఈ మధ్యన దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు, తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి. వీటి కథా నేపథ్యం ఏంటో కథా రచయితకే తెలియదు. నిర్మాత, దర్శకుడు చెప్పిన విధంగా కథ మెలికలు తిరగాల్సిందే. హీరోల చుట్టు కథల్ని అల్లి విపరీతమైన ప్రచారాన్ని చేసి, అభిమాన సంఘాల్ని ముందర వేసి సినిమాల్ని విజయవంతం చేసుకోవడం ఓ లేటెస్టు ట్రెండ్‌గా మారింది. ఈ కోవలోనే బాషా, లింగ, బాహుబలి లాంటి సినిమాలు రాగా ఇప్పుడు కబాలి వచ్చింది. ఈ సినిమాలు సమాజానికి కాకున్నా యువతకు ఎలాంటి సందేశాన్నిచ్చాయో కనీసం నటించిన మాస్ హీరోలకు కూడా తెలియదు. శ్రీమంతుడు ఓ సాధారణ సైకిల్‌ను తొక్కితే, ఆ సైకిల్‌ను వేలం వేసి జనాల్ని వెర్రిగా మార్చారు. ఈ బుర్రిపాలెం బుల్లోడు దత్తత తీసుకున్న మహబూబ్‌నగర్ జిల్లా సిద్దాపూర్ గ్రామాన్ని సందర్శించడానికే తీరికేలేదు.
సాధించిన ప్రగతికి సంతృప్తిని చెంది- ఇదే విజయమనుకుంటే పొరపాటేనో యి..’ అని ఏబయవ దశకంలోనే హెచ్చరించిన శ్రీశ్రీ పాటను 15వ ఆగస్టు, 26 జనవరిన వినడానికి తప్ప 70 సంవత్సరాల స్వాతంత్య్రం ఎటు పోతుందో మన మనసుల్ని కదిలించలేకపోతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు ఉడుకుతున్నాయి. కాశ్మీర్ కాగుతున్నది. విశ్వ విద్యాలయాలు భావాలపరంగా సంఘర్షించుకోవడానికి బదులు ఘర్షణ పడుతున్నాయి. అధ్యాపకుల మధ్యన చర్చలకే తావు లేకుండాపోయింది. ఓ బుందేల్‌ఖండ్ ఆకలి, ఓ విదర్భ రైతుగాధ, ఓ చత్తీస్‌గఢ్ సోనీసొరి కథనాలు సినిమాలుగా వస్తే జనాల ఆలోచనల్లోనే కాదు, రాజకీయ రంగులు మారుతాయి. అణు విద్యుత్ కేంద్రాల స్థాపనకు వ్యతిరేకంగా పోరాడుతున్న కొవ్వాడ, కొడంకుళం లాంటి సమస్యలు కూడా పట్టని నిర్మాతలు, యువతను పక్కదారి పట్టించే సినిమాలతో సొమ్ము చేసుకోవడం అలవాటుగా మారింది. గతంలో జాతీయస్థాయి గ్యాంగ్‌స్టర్లపైన సినిమాలు వస్తే ఇప్పుడంతా అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్లే సినిమా వస్తువుగా మారారు. ఓ పంచ్ డైలాగు, హీరోయినే ఐటంసాంగ్ చేస్తూ ఓ మందలో స్టెప్పులు వేస్తుంది.లవ్ అనే కుంభకోణంలో ఇరు కుటుంబాల తల్లిదండ్రులే మేటి విలన్లు!
రోజుకొకటి చొప్పున ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతూ కార్మికుల్ని రోడ్డు న పడేస్తున్నాయి. వీరు వారు అనే తేడాలేకుండా పాలకులందరూ ప్రైవేటు పెట్టుబడులకై వెంపర్లాడుతున్నారు. గ్రామాలు వల్లకాడుగా మారుతున్నాయి. అభివృద్ధి పేరున ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. వలసబాట పడుతున్నారు. గల్ఫ్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు ఉపాధి పేరున ఎగుమతి చేయబడుతున్నారు. కుటుంబ వ్యవస్థ దెబ్బతిన్నది. సామాజిక వ్యవస్థ రోగ గ్రస్తమైంది. ఏం చదువుతున్నారో ఎందుకు చదువుతున్నారో, ఇష్టంలేని ఉద్యోగాల్ని ఎందుకు చేస్తున్నారో తెలియని అయోమయం. అన్యోన్యం తెలియని యువజంటలు, పర దేశంలో కూ డా వేధింపులు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, హత్యలు! కృత్రిమ నవ్వు. యాంత్రిక జీవనం. స్మార్ట్ఫోనే్ల జీవిత భాగస్వామి. ఇలా అభద్రతతో ఆత్మన్యూనతతో, అసంతృప్తితో ఎదుగుతున్న యువతకు దశను.దిశను నిర్దేశించే సినిమాలు కావాలి! వారిని చైతన్యపరిచే ప్రసార సాధనాలు, సాహిత్యం రావాలి! వీటిని వీక్షించేలా, చదివేలా బోధనలు కావాలి. ఈ బాధ్యతల్ని మీదేసుకునే అధ్యాపకులు, రచయితలు, సినీ నిర్మాతలు పత్రికా యజమానులు నేటి వ్యవస్థకు అత్యవసరం. కార్టూనిస్టులు, కళాకారులు ఎదిగి రావాలి. ఈ నేపథ్యంలో సినిమాలు రావాలి. యువతను ఆలోచింపచేయాలి.
రియలెస్టేటు ద్వారా, నల్లబజారు వ్యా పారం ద్వారా, అడుగడుగునా బార్ షాపుల్ని తెరిచి ఆర్జించిన సొమ్ము ద్వారా, ప్రకృతి సంపదల్ని దోచుకున్న డబ్బుతో యువతను పక్కదారి పట్టించే సినిమాల్ని తీసి, అక్రమ వ్యాపారాన్ని నిరంతరం కొనసాగించేలా చేసుకోవడమే వీరి జాతీయత! అందుకే మోటారు సైకిళ్లు, కార్లు, వాహనాలు, టీషర్టులే కాదు, చివరికి విమానాలు కూడా ఈ సినిమాలకు ప్రచార మాధ్యమాలుగా మారుతున్నా యి. ఒక ఫైనాన్స్ సంస్థ(ఈ సినిమాలు ఇలాంటి బాపతువారిదే!) కబాలి పేరున వెండి నాణాల్ని విడుదల చేసి ప్రచారంతోపాటు సొమ్ము చేసుకుంటున్నది. గతంలో ఓ సినిమా బాగుందని తేలితే ముఖ్యమైన ఇతర భాషల్లోకి మార్చబడేది. ఇప్పుడంతా మారిపోయింది. డిజిటల్ విప్లవం అందుబాటులోకి రావడంతో యావత్ ప్రపంచంలో ఒకేరోజు రిలీజు అవుతున్నాయి. అమెరికాలోనే 400 థియేటర్లలో కబాలి విడుదలయందంటే సినీ పరిశ్రమ ఎంతగా పుంజుకున్నదో తెలుస్తున్నది. చివరికి చైనా, థాయిలాండ్, మలయా భాషల్లోకి డబ్ చేయబడిందంటే కబా లీనా, మజాకా! కాలేజీలకే కాదు, సినిమా రిలీజైన రోజున ఉద్యోగాలకే రాని బాపతును దృష్టిలో పెట్టుకుని స్వయానా టికెట్లను కొని పంచి, కొన్ని సంస్థలు సెలవుల్ని ప్రకటించాయంటే, ఈ సినిమాలో పెట్టుబడుల వ్యవహారమేంటో అర్ధమవుతుంది. సత్యజిత్‌రే, పాల్కే, రాజ్‌కపూర్, బాపులు బతికుంటే ఇప్పుడేం చేసేవారో!