ఎడిట్ పేజీ

యుగపురుషుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు గాంధీ మహాత్ముని 150వ జయంతి
*
ఆధ్యాత్మిక బోధలలోని సారాన్ని లౌకిక జీవనంలోకి ప్రవేశపెట్టడానికి కృషిచేసిన మహాత్మా గాంధి సంకుచితపు లోకుల దృష్టిలో వొక అంటరానివాడుగా పరిగణించబడ్డారు. ప్రాయోగిక ప్రవక్త పాత్రను పోషించిన అయన వొక మహారుషి సమానుడు. ఆయన తన విలువల బోధనలతో సామాన్యుడిని మహోన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి చేసిన కృషి అజరామరం, అనంతం, అవిశ్రాంతం. తాను పరీక్షించకుండా దేనిని ఇతరులకు ఆచరించమని చెప్పనని అయన చాలాసార్లు తన ప్రసంగాలలో పేర్కొనడం గమనించదగినది.
బుద్ధుడు సైతం సామాన్యులు - బోధకులూ వేరు అనే భావనలో ఉండేవాడు కానీ గాంధి అలాకాక తానూ - సామాన్యులూ వొక్కటేనని వక్కాణించేవారు. తాను చేసే ప్రతి క్లిష్ట కార్యాన్నీ సామాన్యులు సైతం చేయగలరనేవారు. త్వరితగతిన మారిపోతున్న ప్రపంచపు - మానవ విలువలను తిరిగి పునరుద్ధరించాలంటే దైవిక విలువలను - సామాన్యపు దేహ విలువలతో మమైకం చేయడమే అసలు సిసలు పరిష్కారమని గాంధి నమ్మారు. ఆధ్యాత్మిక జీవనం అందరికీ అందే పండు కాదని నమ్మి సత్యం-్ధర్మాలూ అనే రెండింటి సరళమైన సిద్ధాంతాలతో అయన సామాన్యుల ఎడారి జీవనంలో ఆధ్యాత్మిక జలాలను ప్రవహింప చేయడానికి నడుం బిగించారు. సేవ పేరిట వెలసిన పలు మతాల ధార్మిక సంస్థలు సామాన్యులకీ-ప్రవక్తలకి మధ్యనున్న అఘాతాలను పూడ్చడంలో పాక్షిక విజయాన్ని మాత్రమే సాధించడం గాంధీని ఆలోచింప చేసింది. ఇవి మనిషిలోని బలహీనతలనూ - ఇతరములైన లోపాలను సరిచేయడంలో విఫలమవడం ఆయన్ని కలచివేసింది. అందుకే ‘‘పరిష్కార మోక్ష సామర్థ్యం మీలోనే ఉంది’’ అనే ఓ కొత్త పంథాతో అయన ప్రజలను జాగృతం చేయడానికి ఉద్యమించారు. ఈ ఉద్యమంలో అయన మత వర్గాలనూ, సేవా సంస్థలను పక్కన పెట్టేయడం జరిగింది. హిందూ మత సూత్రాలను మాత్రమే అనుసరిస్తూ జీవ - పరమాత్మల అనుబంధం అసత్యము, అనిత్యమూ కాదని నమ్మి సత్య - నిత్యలైన ధర్మం వైపు జాతిని నడిపించడానికి మహాత్ముడు చేసిన కృషి శ్లాఘనీయమైనది. వీటి ఆధారంగా అయన రూపొందించిన సత్యాగ్రహ ఉద్యమాలు ఎదురు చూడని సత్ఫలాలను ప్రసాదించాయి. మనుషుల్లోని స్వల్పమైన దయ - ఉదాత్త వైఖరే సత్య పదార్థమైన బ్రహ్మమని గాంధి విశ్వశించారు. ఈ బ్రహ్మ మే ఆత్మ శక్తి అని, మనోబలమని గాంధి చెప్పేవారు. ఎవరైతే ఈ మనో బలమనే ఆత్మ శక్తిని సరైన సమయంలో, సరియైన మార్గంలో వ్యక్తం చేస్తారో వారినే సత్యగ్రహులు అంటారని ఆ మహానుభావుడు అనేవారు. అట్టివారు చేసేదే సత్యాగ్రహమని చెప్పేవారు. ప్రతి సమస్య పరిష్కారానికీ అయన ఈ సత్యాగ్రహనే్న వొక ఆయుధంలా వాడారు..
ఆత్మ శుద్ధత కోసం గాంధి ఎన్నో కష్ట్టమైన నియమాలను పాటించేవారు. మనలోని సత్యం ధర్మం ఎదుటి వారిలో మార్పు తీసుకొని రాకుంటే అప్పుడు మన సత్య-్ధర్మ ప్రవర్తనలో ఏదో లోపం ఉండి తీరాలనే వారు. ఎవరైనా తమ సిద్ధాంతాలకి మత గ్రంథాలను యెన్నుకుంటూ ఉండటం జరుగుతున్నది అయితే గాంధి మాత్రం తన అగాధపు వ్యక్తిత్వం నుంచే సిద్ధాంతాలకు రూపకల్పన చేసేవారు. గాంధి సమస్యా పరిష్కారానికి కేవలం దయ, సానుభూతి, సహృదయత, ప్రేమ అనే నాలుగింటిని మాత్రమే వాడేవారు. ఇది చూసేవాళ్ళకి కొత్తగానూ, వింతగానూ అనిపించేది. ఉప్పు సత్యాగ్రహం వెనుక దాగినది ఈ నాలుగు అంశాలు మాత్రమేనంటే ఎవ్వరూ నమ్మలేరు. అందుకే యావత్ ప్రపంచం సదరు ఉప్పు సత్యాగ్రహాన్ని ఎంతో ఆసక్తితో పరిశీలించింది. ఉప్పుసత్యాగ్రహం ప్రారంభానికి ముందు గాంధి ఇలా అన్నారు. ‘‘నా గడ్డపైన నా దేవుడు మాకు ఇచ్చిన సముద్రం వద్దకు వెళ్లి, నా చేతులతో స్వయంగా ఉప్పును తయారు చేస్తాను. ఇది నేను నమ్మిన ధర్మ సత్యం. ఇది తెల్లవారికి అర్థంకాక పోవచ్చు, అందుకు నన్ను చెరలో పెట్టవచ్చు గాక. నేను మాత్రం ఈ సత్య ధర్మం మీదనే నిలబడతాను’’ అని. అదే సందర్భంలో జీసస్-మొహమ్మద్ లు ఇద్దరూ సత్యాన్ని దర్శించినవారని అయితే వాళ్లు దానిపైన ఎటువంటి వ్యాఖ్యానాలతో వృధా రచనలు చేయక, దాని అందాన్ని తిలకించడంలో నిమగ్నులైనారని, ఇంకా తాను సత్యానే్వషణలోనే ఉన్నానని, సత్యం అంటే ఏదో కాదని నమ్మిన దానిని నిర్భయంగా ఆచరించడమే అని చెప్పారు. కొందఱు అటువంటి సత్యానే్న ఆత్మబోధ లేక అంతర్వాణి అని పిలుస్తారని గాంధీ పేర్కొనడం గమనించదగినది. అలా గాంధీ అంతర్బోధ వల్ల పొందిన అనుభవం జాతి మొత్తానికీ అంతర్వాణియైంది.
రాజకీయపరంగా ఏ రాజకీయ సిద్ధాంతాలనీ, వాటి సాంప్రదాయక - ఆచారాలనూ అయన అంగీకరించకపోవడం వొక విలక్షణమైన అంశంగా చెప్పాలి. మన మదిలో అనే్వషణా-ఆందోళనల మధ్యే జరిగే నిత్య సమరమే కురుక్షేత్ర యుద్ధమని అయన అనేవారు. ఈ రెండూ సాధనా-సాధ్యాలు అనే వాటి ప్రతిరూపాలే తప్పించి వేరు కావని అయన ప్రగాఢ నమ్మకం. ఇవి అవిభాజ్యాలైన అంశాలు. వొకదాని నుంచి మరో దానిని వేరు చేస్తే ఏదో వొకటే మిగిలి వొక అసంపూర్ణమైన యుద్ధం మిగులుతుంది. ఫలితం మీద ‘‘ఆశా-ఆపేక్షా’’ లేని యుద్ధమే ధర్మ యుద్ధం అవుతుంది. ఈ రెండూ ఉంటే దౌర్జన్యం చేయడం జరిగి అది ధర్మ యుద్ధమే అయినా నిరాశ మిగులుతుంది అంటారాయన.
స్వాతంత్య్రం అనే పదానికి గాంధి ఇచ్చిన నిర్వచనం చదివితే మనకి సంభ్రమం కలుగకమానదు. ‘‘స్వాతంత్య్రం అంటే విముక్తి కాదు, అలాంటి విముక్తిని గుప్పిట బిగించుకొన్న తెల్లవారు అనే దుష్ట శక్తుల నిర్మూలనమే’’ అని అయన స్వాతంత్య్రాన్ని నిర్వచించారు. అధికారం కోసం అర్రులు చాస్తే మిగిలేది స్వార్థమేనని ఆనాడే గాంధి నాయకులను హెచ్చరించారు. శాంతి మార్గం చేతకానితనం అని భావించవద్దని, అది చైతన్యపూరితమైన అసలైన మానవత్వానికి పరాకాష్ట అని అయన అనేవారు. పాలకుల దుష్ట తంత్రాలు లేకుంటే ప్రజలకు శాంతి దానంతట అదే లభిస్తుందని గాంధి అంటారు. హింస-అహింసలు రెండూ ప్రబలమైన అంటూ వ్యాధులే కానీ హింస వలన మరో హింసకి మార్గం సుగమమవుతుంది. అలాగే అహింస వలన సామరస్యం వ్యాప్తి చెందుతుంది అంటారు గాంధీజీ. ‘‘సత్యం జయించాలి - మానవులు జీవించాలి’’ అనే ఆదర్శంతో గాంధి మన మధ్య ‘‘పుట్టి- జీవించి- మరణించారు’’. మరల అటువంటి మహోన్నత యుగపురుషుడు ఈ త్యాగ పురుషుల గడ్డపైన పుడతాడా అనేది సందేహాస్పదమైన ప్రశే్న..

-జయదేవ్ చల్లా 09884675329