మెయిన్ ఫీచర్

నమ్మకమే వ్యాధికి మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారు కుర్రవాడిని బాబా ఎదుట కూర్చోబెట్టారు. బాబా కురుపుమీద తన చేతిని తిప్పారు. ప్రేమాదాస్పద చూపుల్ని బాలునిపై ప్రసరించారు. ఊదీ రాసిన పిమ్మట కొద్దిరోజులకు కురుపు తగ్గిపోయింది. ఇది తెలిసి కుర్రవాడి మేనమామ అయిన డాక్టరు బొంబాయి వెళ్తూ మార్గమధ్యంలో ఆగి బాబాను చూడాలనుకున్నాడు. కానీ, మాలేగాంలోను, మన్మాడులోను ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పటంతో శిరిడీ వెళ్లటం మానుకున్నాడు. దీంతో తిన్నగా బొంబాయి వెళ్లి తన సెలవురోజులను అలీబాగ్‌లో గడపాలనుకున్నాడు. బొంబాయిలో ఉండగా వరుసగా మూడు రాత్రులు ‘‘ఇంకా నన్ను నమ్మవా?’’ అనే కంఠధ్వని వినిపించింది. ఆ సమయంలో అతను ఒక అంటురోగికి చికిత్స చేస్తున్నాడు. రోగికి ఇంకా నయం కాలేదు. అతను బాబాను పరీక్షించదల్చుకుని ‘ఈ రోగికి ఈ రోజే నయమైతే రేపే శిరిడీకి వస్తాను’ అనుకున్నాడు. అలా అనుకున్న మరుక్షణంనుంచే ఆ రోగి మొండి వ్యాధి తగ్గటం ప్రారంభించింది. వెంటనే డాక్టరు శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాడు. బాబా అతనికి తన సమక్షంలో గొప్ప అనుభవాన్ని కలిగించారు. అనంతరం కాలంలో డాక్టరు బాబాకు గొప్ప భక్తుడయ్యాడు. నాలుగు రోజులు మసీదులోనే గడిపి బాబా ఊదీని, ఆశీర్వాదాన్ని అందుకుని బొంబాయి తిరుగుప్రయాణమయ్యాడు. అటు తరువాత పదిహేను రోజులకే ఆ డాక్టరుకు జీతం పెరగటంతోపాటు బీజాపూరుకు బదిలీఅయ్యాడు. అలా ఆ డాక్టరు తన మేనల్లుడి కారణంగా బాబాను దర్శించుకోగలిగాడు. అప్పట్నుంచి అతను బాబాకు గొప్ప భక్తుడిలా మసులుకున్నాడు.
బాబా పటంవద్ద బూడిదైనా ఊదీయే!
నారాయణ మోతీరాంజాని నాసిక్ నివాసి. బాబాకు భక్తుడైన ఇతను రామచంద్ర వామనమోదక్ అను మరో బాబా భక్తునివద్ద పనిచేస్తుండేవాడు. నారాయణ ఒకసారి తన తల్లితో కలిసి శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాడు. అపుడు బాబా అతనితో మోదక్‌వద్ద పనిచేయటం మానుకుని సొంతగా ఏదైనా చేసుకోమని సలహాఇచ్చారు. కొన్నిరోజులకు బాబా చెప్పిన మాట నెరవేరింది. నారాయణ మోదక్‌వద్ద పని మాని, సొంతగా ‘ఆనందాశ్రమం’అనే హోటలు పెట్టుకున్నాడు. అది తరువాత కాలంలో బాగావృద్ధిలోకి వచ్చింది. ఒకసారి నారాయణరావు స్నేహితుడిని తేలు కుట్టింది. భరింపలేనంత నొప్పితో నారాయణ స్నేహితుడు విలవిలలాడిపోసాగాడు. అటువంటి సమయాల్లో బాబా ఊదీ దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నారాయణ నమ్మకం. వెంటనే ఊదీకోసం వెతికాడు. కానీ, సమయానికది లభించలేదు. చేసేదిలేక బాబా పటం ఎదుట నిల్చుని బాబా సహాయాన్ని అర్థించాడు. బాబా నామాన్ని ముమ్మార్లు జపించి, బాబా పటంవద్ద రాలిపడి ఉన్న అగరుబత్తి బూడిదను చేతిలోకి తీసుకున్నాడు. దానినే బాబా ఊదీగా భావించి స్నేహితుడికి తేలు కుట్టినచోట రాశాడు. కొద్దిసేపటికే నొప్పి హరించింది.
మరో అనుభవం..
నారాయణను అందరూ భక్తనారాయణ అని పిలిచేవారు. బాబా మహా సమాధి చెందిన మూడు సంవత్సరాలను అతనికి శిరిడీ వెళ్లాలనిపించింది. కానీ వెళ్లలేకపోయాడు. బాబా సమాధి చెందిన ఏడాదికే నారాయణ తీవ్రంగా జబ్బుపడ్డాడు. మంచానపడి లేవలేకపోయేవాడు. చికిత్సలు చేయించుకున్నా గుణమివ్వలేదు. బాబాపైనే భారంవేసి రాత్రింబవళ్ల సాయి నామానే్న జపించేవాడు. ఒకనాడు ఒక కల వచ్చింది. అందులో బాబా అతనిని ఓదారుస్తూ ‘‘ఆందోళన పడకు. రేపటినుంచి నీకు బాగవుతుంది. వారంలో నువ్వు లేచి నడుస్తావు’’ అన్నారు. బాబా కలలో చెప్పినట్టే వారంరోజులకే నారాయణరావు నడవగలిగాడు. ‘‘శరీరం ఉన్నన్నాళ్లు బాబా బతికి ఉన్నట్టు.. శరీరం విడవగానే చనిపోయినట్టా? కానేకాదు. బాబా ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు, ఉంటారు.
బాబాను ఎవరు హృదయ పూర్వకంగా పూజించి ఆరాధిస్తారో వారి హృదయంలోనే బాబా కొలువుంటారు’’అని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు నారాయణరావు.

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566