మెయిన్ ఫీచర్

ముస్లిం మహిళల ఆశాజ్యోతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో మైనారిటీల సంరక్షణ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే ప్రచారం జరుగుతున్నది. అందుకు కారణం స్వాతంత్య్రానికి ముందునుండి కూడా ముస్లిం సంతుష్టీకరణతో కాంగ్రెస్ వ్యవహరించడం. దేశ విభజన చేసింది కాంగ్రెస్ పార్టీయే. ముస్లిం, క్రైస్తవ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నది కాంగ్రెస్. పాక్ అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీయే.
భారతీయ జనతాపార్టీ ముస్లిములకు శత్రువు అని ప్రచారం జరుగుతున్నది. తద్వారా ఎన్నికలలో దశాబ్దాలుగా లబ్ధిపొందుతున్నది. ఇంతకూ బిజెపి ముస్లిములను ద్వేషిస్తున్నదా? అదే నిజమైతే అబ్దుల్ కలాంను భారత రాష్టప్రతిగా చేసింది బి.జె.పి. ఆయనను వ్యతిరేకించింది కాంగ్రెస్, కమ్యూనిస్టు వర్గాలు. ఇదొక చారిత్రక సత్యం. హిందువైనా, ముస్లిమైనా, క్రైస్తవుడైనా మనిషి మనిషే. ఐతే దేశభక్తి, జాతీయత భారతీయులకు ముఖ్యం అనేది బి.జె.పి. మూల సూత్రం.
ఈ విషయాలు ఇప్పుడు ఎందుకు గుర్తుచేసుకోవలసి వచ్చిందంటే గల్ఫ్ దేశాలలోని హిందువులనే కాదు ముస్లిము మహిళలను కూడా బి.జె.పి. కార్యకర్తలు రక్షిస్తున్నారంటే వినడానికి వింతగా అనిపిస్తుంది. కానీ మనకు స్పష్టమైన సాక్ష్యాధారాలు లభించాయి.
తిగుళ్ల శర్మగారు లోగడ అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కేంద్ర ప్రభుత్వోద్యోగిగా పనిచేశారు. ఆయన ఇంగ్లీషులో మంచి విద్వాంసుడు. వారి కుమారుడు శ్రీనివాస్. గుజరాత్ ఆనంద్‌లో కొంతకాలం పనిచేసి ప్రస్తుతం దుబాయ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన బి.జె.పి. మైనారిటీ సెల్‌లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివశిస్తున్నాడు. జాతీయ భావాలతో బాటు మానవీయ దృక్పథం కల శ్రీనివాస్ విదేశాలలో ముస్లిం మహిళలకు ఏ కష్టం వచ్చినా ‘నేనున్నాను’ అంటూ ముందు నిలిచాడు. త్రిపుల్ తలాక్ మానవీయ న్యాయానికి విరుద్ధం అంటూ బి.జె.పి. ప్రచారం చేసింది. విచిత్రమేమంటే స్ర్తివాద సమాజాలు, సూడో సెక్యులరిస్టులు ముస్లిం మహిళలను ఆదుకోవడానికి ముందుకు రాకపోవడం.
మాల్దీవులు, మలేషియా, యుకె, దుబాయి వంటి ప్రాంతాల్లో ఎందరో ముస్లిం మహిళలు వివక్షకు గురి అవుతున్నారు. వారిని ఎన్ని విధాల ఉపయోగించుకోవాలో అన్ని విధాలుగా స్వార్థశక్తులు వాడుకుంటున్నారు. వారికి బి.జె.పి. గల్ఫ్ ఎన్‌ఆర్‌ఐ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు టి.ఆర్. శ్రీనివాస్ ఆశాజ్యోతిగా కన్పిస్తున్నాడు. ఎట్టి ప్రచార ఆర్భాటాలూ, ప్రతిపక్షాలేక్ష లేకుండా ఆయన చేస్తున్న కృషిని దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ప్రశంసించింది.
గల్ఫ్ బాధితులు టి.ఆర్.ఎస్. ప్రభుత్వాధికారుల చుట్టూ తిరిగారు. హైదరాబాద్‌లోని ఎం.ఐ.ఎం. నాయకుడు అసదుద్దీన్ ఓవైసి చుట్టూ తిరిగారు. ఐనా ప్రయోజనం కలుగలేదు. శ్రీనివాస్‌కు ఫోన్ చేశారు. అంతే! ఈ బి.జె.పి. నాయకుడు రంగంలోకి దిగాడు. అనాథలైన ముస్లిం మహిళలను పాపకూపాలనుండి కాపాడి సురక్షితంగా ఇండియాకు చేర్చాడు.
శ్రీనివాస్ రక్షించిన యువతులు తెలంగాణ ప్రాంతానికి మాత్రమే చెందినవారు కాదు- గుజరాత్, కేరళ, ఉత్తర భారత ప్రాంతాలకు చెందిన ముస్లిం మహిళలూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. శ్రీనివాస్‌కు రెండు రకాల ఫోన్లు వస్తుంటాయి. ఒకటి ‘మా అమ్మాయి మాల్దీవులలో కష్టాలలో ఇరుక్కున్నది, రక్షించండి’ అంటూ ఆ మహిళ తల్లిదండ్రులు లేదా రక్తసంబంధీకులు ఫోన్లు చేస్తారు. రెండో రకం ఫోన్లు డాన్, మాఫియా గాంగ్ నుండి వస్తుంటాయి. ‘మేము డబ్బు తీసుకొని ఆ పిల్లలను విదేశీ షేక్‌లకు అమ్మాము. మా బ్రోకర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోద్దు’ అంటూ కమీషన్ తీసుకున్న ముఠాల బెదిరింపులు. శ్రీనివాస్ వాటిని లెక్క చేయకుండా మానవీయ దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నాడు.
దాదాపుగా 15 సంవత్సరాలుగా ఈ నిశ్శబ్ద విప్లవం సాగుతున్నది. పత్రికలలో ఇతర సోషల్ మీడియా ప్రచార ప్రసార సాధనాల్లో ఎక్కువగా కనిపించని మానవతా కార్యక్రమం ఇది.
‘దమ్మమ్’కు చెందిన సాద్ గ్రూపులో 8 నెలలుగా జీతాలు లేకుండా భారతీయ కార్మికులను పని చేయించుకుంటున్నారు. సౌదీ అరేబియాలోని ఇండియా దౌత్య కార్యాలయం దృష్టికి శ్రీనివాస్ ఈ విషయం తీసుకొని వెళ్లి బాధితులకు సత్వర న్యాయం జరిగేటట్లు చేయగలిగాడు.
ఎగ్జిట్ వీసాకు సంబంధించి నో ఆబ్జెక్టు సర్ట్ఫికెట్టు ఇప్పించి బాధితులకు అండగా నిలిచాడు. తక్కువ జీతం ఎక్కువ పనిచేయించుకుంటున్నవారిని నిలదీశాడు.
హఫీజాబా అనే అమ్మాయి శారీరక మానసిక హింసకు రియాద్‌లో గురిచేయబడింది. ఆమె అక్కడ ఒక మేడ్ సర్వెంటుగా ఉంది. హఫీజాబాను రక్షించటంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించాడు.
2018 సెప్టెంబర్‌లో షహజ్ బేగంను కాపాడటం కూడా ఈ బిజెపి ఎన్‌ఆర్‌ఐ లీడర్ చేసిన సేవా కార్యక్రమాల్లో ప్రముఖమైనదే. ఆయూబ్ ముఠా ఈమెను విదేశాలకు పంపింది.
ఆయూబ్ గాంగ్‌నుండి శ్రీనివాస్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం షహాజ్ బేగం అనారోగ్యంతో చికిత్స పొందుతున్నది.
శ్రీనివాస్ చేస్తున్న పనికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రిణి సుష్మస్వరాజ్, విదేశాంగ కార్యదర్శి వి.కె. సింగ్ ఇతోధిక సహకారాలు అందిస్తున్నారు. ఆయా దేశాలలోని భారతీయ దౌత్యాలయాలు కూడా శ్రీనివాస్ చేస్తున్న సామాజిక సేవను అభినందిస్తూ చేయూతనందిస్తున్నాయి.
ప్రశ్న : మీరు ముస్లిం మహిళలనే ఎందుకు రక్షిస్తున్నారు?
జవాబు : వేధింపులకు, అన్యాయానికి ఎవరు గురి అయినా వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ విషయంలో జాతి ప్రాంత మత భాషా భేదాలు పాటించడం లేదు. అయితే బాగా గల్ఫ్ దేశాల్లో ఇండియా నుండి వెళ్లిన మహిళలు ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువ బాధలకు గురి అవుతున్నారు. వారి మొర ఆలకించే నాథుడే లేడు. ఇలాంటి సంఘటనలు వందల సంఖ్యలో నా దృష్టికి వచ్చాయి.

-ఎం.ఎస్.