మెయిన్ ఫీచర్

బాధ్యతతోనే నిజమైన స్వేచ్ఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారి మాటలు విన్న డయోజినెస్ వారితో ‘‘నేను మిమ్మల్మి చంపేస్తానని భయపడకండి. నేను అలాంటి పని ఎప్పుడూ చెయ్యను. మీరు నన్ను వేలంలో బానిసగా అమ్మాలనుకుంటున్నారు కదా!’’ అన్నాడు. ఆ నలుగురు దొంగలు కాస్త భయపడుతూనే ‘‘అవును. మేము చాలా కష్టాల్లో ఉన్న దరిద్రులం. మీరు ఒప్పుకుంటే వేలంలో మిమ్మల్ని చాలా ఎక్కువ ధరకు అమ్ముకుంటాం’’ అన్నారు. ‘‘సరే, ఈ రకంగానైనా నేను మీకు సహాయపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నాడు డయోజినెస్. ముందు ఆశ్చర్యపడినా, కాస్త భయపడుతూనే అతనిని బంధించేందుకు గొలుసులు తెచ్చారు ఆ దొంగలు.
‘‘మీ కోరిక తీర్చేందుకు నేనే ఒప్పుకున్నాను కదా! ఇక ఆ గొలుసులతో పనేముంది. పదండి వెళ్దాం. వేలంపాటలో నేను ఎంత ధర పలుకుతానో చూడాలని నాకు చాలా కుతూహలంగా ఉంది’’ అన్నాడు డయోజినెస్ వారితో.
స్వేచ్ఛగా జీవించే డయోజినెస్ తాను అమ్ముడుపోయే పరిస్థితిలో కూడా పూర్తి బాధ్యతను ఎలా స్వీకరించాడో గమనించారా!
చివరికి ఆ నలుగురు దొంగలు డయోజినెస్‌ను వేలంలో నిలబెట్టారు. అతనిని చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతో ఆకర్షణతో కూడిన అంతటి బలశాలి వేలంలో అమ్మకానికి నిలబడడం ఇంతవరకు ఎవరూ చూడలేదు. వేలంపాట ప్రారంభానికి ముందే ‘డయోజినెస్’ అందరితో ‘‘దయచేసి, అందరూ వినండి. ఈ నలుగురికి చాలా డబ్బు అవసరం. అందుకే నన్ను ఇక్కడకు అమ్మకానికి తీసుకువచ్చారు. గుర్తుంచుకోండి. ఒక గొప్ప గురువు అమ్మకానికి మీ అందరిముందు ఉన్నాడు. ఏ బానిస ఎక్కువ ధర ఇచ్చి నన్ను కొనుక్కోగలడో చూద్దాం. వేలం ప్రారంభించండి’’ అన్నాడు.
వేలం ప్రారంభమైంది. అందరూ పోటీ పడుతూ ధరను పెంచుతున్నారు. వేలాన్ని గమనిస్తున్న డయోజినెస్‌కు తమాషాగా ఉంది. చివరికి ఒక రాజు అందరికంటే ఎక్కువ ధర ఇచ్చి డయోజినెస్‌ను కొనుక్కున్నాడు. వెంటనే డయోజినెస్ ఆ నలుగురితో ‘‘ఇప్పుడు మీకు సంతోషమే కదా! దయచేసి నన్ను విడిచిపెట్టండి. నేను ఈ బానిసతో వెళ్లాలి’’ అని చెప్పి, తన కోసం సిద్ధంగా ఉన్న రాజు రథాన్ని ఎక్కాడు. మార్గమధ్యంలో రాజు అతనితో ‘‘నాకొక సందేహం. గొప్ప గురువునని చెప్పుకుంటున్న నువ్వు ఒక దేశానికి రాజునైన నన్ను బానిసగా సంబోధించావు. నీకేమైనా పిచ్చా?’’ అన్నాడు.
‘‘నాకేమీ పిచ్చిలేదు. మీరు నిజంగా పిచ్చివారని ఇపుడే నిరూపిస్తా. మీ వెనకాలే కూర్చున్న మీ రాణిగారికి నేను తెగ నచ్చేశాను. మీ పని అయిపోయింది. ఒక గురువును కొనడం ఎంత ప్రమాదమో ఇపుడు తెలిసిందా’’ అన్నాడు డయోజినెస్.
మతిపోయిన రాజు వెంటనే కత్తి దూసి ‘‘అతను చెప్పినది నిజమా? ధైర్యంగా నిజం చెప్తే నిన్ను ఏమీ చెయ్యనని ప్రమాణం చేస్తున్నాను. తప్పించుకునేందుకు ఇపుడు అబద్ధం చెప్పినా, తరువాత నాకు నిజం తెలుస్తుంది. అపుడు నిన్ను చంపేస్తాను’’ అన్నాడు రాణితో. ఆమె భయపడుతూనే ‘‘అవును. అతను చాలా అందంగా ఉన్నాడు. నాకు చాలా నచ్చాడు. ఏదో తెలియని ఆకర్షణ అతనిలో ఉంది. అతని ముందు మీరు ఎందుకూ పనికిరాదు. ఇది నిజం’’ అని చెప్పింది. ఆమె చెప్పినది నిజమే అని భావించిన రాజు డయోజినెస్‌తో ‘‘చాలా డబ్బు పెట్టి నిన్ను కొంటే కొన్నాను కానీ, ముందు రథం దిగు. నువ్వు నాకు బానిసగా ఉండక్కర్లేదు. నిన్ను ఇపుడే విడిచిపెడుతున్నాను. నిన్ను నా భవంతికి తీసుకువెళ్తే కొంప మునుగుతుంది’’ అన్నారు.
వెంటనే డయోజినెస్ ఆ రాజుతో ‘‘నేను ప్రతి విషయంలోనూ పూర్తి బాధ్యతను స్వీకరిస్తాను. అందుకే నన్ను ఎవరూ బానిసను చెయ్యలేరు. ఆ నలుగురి కోరికను తీర్చేందుకు నేను ఇష్టపడే వేలంలో అమ్మకానికి నిలబడ్డాను.
అంతేకానీ, వారు నన్ను బలంతంగా వేలానికి తీసుకురాలేదు. ఈ రథం మీది. మీరు నన్ను రథం దిగి వెళ్లిపొమ్మన్నారు. మంచిదే. నిజానికి, రథాలపై ప్రయాణించడం నా శరీరానికి పడదు. నా కాళ్ళు చాలా దృఢంగా ఉన్నాయి. ఎంత దూరమైనా నడిచి వెళ్లగలను. పైగా, నేను దిగంబరిని. ఇలాంటి బంగారు రథాలు నాకు సరిపడవు’’’ అన్నాడు.
పూర్తి బాధ్యతను స్వీకరించండి. అపుడు బాధల్లో, దరిద్రంలో, చివరికి చెరసాలలో కూడా మీకు మీరే గురువై స్వేచ్ఛగా, హాయిగా ఉంటారు. ఎందుకంటే, పూర్తి బాధ్యతను స్వీకరించిన వెంటనే స్వేచ్ఛ దానంతటదే మీకు లభిస్తుంది.
మీ మతాలన్నీ మిమ్మల్ని దేవుడు, విధి, అదృష్టాలపై ఆధారపడేలా చేస్తున్నాయి. అవన్నీ అస్తిత్వంలో లేనివాటి పేర్లే. స్వేచ్ఛ, బానిసత్వాలే మీ ముందు వుండే వాస్తవాలు. వాటిలో ఏదో ఒకటి ఉంచుకోండి. మీరు స్వేచ్ఛను ఎంచుకుంటే, మిమ్మల్ని బానిసగా చేసే వ్యూహాత్మక సంకెళ్ళన్నింటినీ మీరు తెంచుకోక తప్పదు. కాబట్టి, మీ సంకెళ్ళన్నింటినీ తెంపి, మీకు పూర్తి స్వేచ్ఛ దక్కేలా చేసి, మిమ్మల్ని మీరుగా తిర్చిదిద్దేందుకు నేను ఇక్కడ నిరంతరం ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే, మీరు మీరుగా మారిన మరుక్షణం పచ్చగా చిగురిస్తూ ఎదగడం ప్రారంభిస్తారు. అపుడు మీలో పుష్పాలు వికసించి మీ చుట్టూ పరిమళాలు వెదజల్లుతాయి. మీ మనసు వికసిస్తుంది. అప్పటినుంచి అంతా బాగుంటుంది.

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.