మెయిన్ ఫీచర్

బాబా పలుకులే దివ్యౌషధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలారామ్ సోదరులైన బాబుల్జీ, వామనరావు శిరిడీ వెళ్లారు. వారు బాబాను దర్శించుకుని సంతోషించారు. బాబా సమక్షంలో తమకు కలిగిన ఆనందాన్ని, మనశ్శాంతిని ఇతరులతో వర్ణించి చెప్పేవారు. అదే విషయాన్ని తమ సోదరుడైన బాలారామ్‌కు కూడా చెప్పారు. దాంతో బాలారామ్‌కు బాబాను చూడాలనే ఆత్రం పెరిగింది. ఒకసారి అందరితో కలిసి శిరిడీ ప్రయాణమయ్యారు. వారు శిరిడీకి రావటానికి ముందే బాబా మసీదులో వున్న కొందరు భక్తులతో, ‘‘ఈరోజు నా దర్బారు జనులు వస్తున్నారు’’ అని పలికారు. నిజంగానే కొంతసేపటికి బాలారామ్ తదితరులు శిరిడీ వచ్చారు. మీరు వస్తున్నట్లు బాబా ఇంతకుముందే చెప్పారని తోటి భక్తులు చెప్పగా బాలారామ్ ఆశ్చర్యపోరు. తాము వస్తున్న విషయం బాబాకు కానీ, మరెవరికీ కాని చెప్పలేదని వారు చెప్పారు.
బాలారామ్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాతో కబుర్లాడుతూ కూర్చున్నారు. బాబా అక్కడకున్న భక్తులతో ‘‘వీరే నా దర్బారు జనులు. ఇంతకుముందు నేను చెప్పింది వీరి గురించే’’ అన్నారు. అనంతరం బాలారామ్ దురంధర్ తదితరులతో బాబా ‘‘గత అరవై సంవత్సరాలనుంచి మనం ఒకరికొకరం పరిచయస్తులమే’’ అన్నారు. బాలరామ్ సోదరులు మిక్కిలి వినయ విధేయతలు గలవారు. వారందరూ బాబాకు మరోసారి నమస్కరించారు. బాలారామ్ బాబా పాదాలు వత్తుతూ కూర్చున్నారు. యోగీశ్వరుల నిజమైన దర్శనం కలిగినపుడు భక్తులకు శరీరం జలదరించటం, కంటతడి కావటం, రోమాలు నిక్కబొడచటం, గొంతుకు ఆర్చుకుపోవడం జరుగుతుందట. బాలారామ్, అతని సోదరులకు అదే అనుభవమైంది.
భోజనానంతరం బాలారామ్ తిరిగి మసీదుకు వచ్చి బాబా దగ్గర కూర్చుని, బాబా పాదాలు వత్తసాగాడు. బాబా కొంత చిలుము పీల్చి బాలారామ్‌కు కూడా అందించారు. నిజానికి బాలారామ్‌కు చిలుము పీల్చే అలవాటు లేదు. కానీ బాబా మాట కాదనలేక ఇబ్బందిగానే దానిని పీల్చాడు. తిరిగి వినయ విధేయతలతో దానిని బాబాకు అందించాడు. నిజానికది శుభ సమయం. బాలారామ్ అప్పటికి ఆరు సంవత్సరాలుగా తీవ్రమైన ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాడు. అతను బాబా చేతులమీదుగా తీసుకుని పీల్చిన చిలుము పొగ అతని వ్యాధిని పూర్తిగా నయం చేసింది. మరెప్పుడూ అతను ఉబ్బసం వ్యాధితో బాధపడలేదు. ఇది జరిగిన ఆరు సంవత్సరాల తరువాత అతనికి మళ్లీ ఉబ్బసం వ్యాధి తిరగబెట్టింది. సరిగ్గా అది జరిగిన రోజునే బాబా మహాసమాధి చెందారు.
ఇక విషయానికి వస్తే, బాలారామ్ శిరిడీ వచ్చినది గురువారంరోజు. ఆ రోజు బాలారామ్‌కు, అతని సోదరులకు ఆ రోజు రాత్రి చావడి ఉత్సవాన్ని తిలకించే అదృష్టం లభించింది. చావడిలోనే హారతి సమయంలోనే బాలారామ్‌కు బాబా ముఖంలో పాండురంగని తేజస్సు కనిపించింది. మరుసటి రోజు ఉదయం కూడా కాకడి హారతి వేళలోనూ బాబాలో బాలారామ్ పాండురంగని ప్రకాశాన్ని చూశాడు. బాలారామ్ ధురంధర్ మరాఠీలో తుకారామ్ జీవితాన్ని రాశాడు. అది వెలువడకముందే ఆయన మరణించారు. 1928 సంవత్సరంలో ఆ పుస్తకాన్ని బాలారామ్ సోదరులు వెలుగులోకి తెచ్చారు. ఆ పుస్తకం మొదటి పేజీల్లో బాలారామ్ తన జీవిత విశేషాలను పేర్కొన్నారు. అందులోనే బాబాతో తనకు కలిగిన పరిచయ భాగ్యాన్ని, అనుభవాల విశేషాలను కూడా పేర్కొన్నారు.
విశ్వాసం, ఓపిక ఉంటే ఏ రోగమైనా నయమవుతుంది
విశ్వాసం, ఓపిక... ఈ రెండూ ఉన్నవారిని బాబా కంటికి రెప్పలా కాపాడుతారు. బొంబాయికి చెందిన హరిశ్చంద్ర పితళే కుమారుడికి మూర్ఛ రోగం. ఎందరో వైద్యుల చుట్టూ తిరిగారు. ఎన్నో ఇంగ్లీషు ఔషధాలు వాడారు. ఎంతకీ నయం కాలేదు. యోగులు పాదాలపై పడటమే ఈ రోగానికి విరుగుడని భావించారు. బొంబాయి ప్రెసిడెన్సీలో 1910 సంవత్సరంలో దాసగణు బాబా కీర్తిని హరికథల రూపంలో ప్రచారం చేయటం ద్వారా పితళే బాబా గురించి తెలుసుకున్నాడు. ఇతరుల ద్వారా కూడా బాబా మహిమాన్వితుడని విన్నాడు. బాబా తన దృష్టిచేత, స్పర్శచేత, ఊదీ ద్వారా నయంకాని మొండి రోగాలను కూడా బాగుచేస్తారని తెలుసుకున్నాడు. వెంటనే సాయిబాబాను దర్శించుకోవాలనుకున్నాడు. బాబాకు ఇచ్చేందుకు కానుకలు తీసుకుని పితళే తన భార్య, కుమారుడిని తీసుకుని శిరిడీకి వెళ్లాడు. మసీదులోకి ప్రవేశించిన వెంటనే పితళే బాబాపాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తన కుమారుడిని కూడా బాబా పాదాలవద్ద పడుకోబెట్టాడు. బాబా ఒకసారి తీక్షణంగా దృష్టిసారించి ఆ బాలుడి వైపు చూశారు. బాబా దృష్టి సోకి బాలుడు కళ్లుతిరిగి పడిపోయాడు.
నోట్లోంచి చొంగ కారసాగింది. ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. కొడుకుని ఆ స్థితిలో చూడగానే పితళే దంపతులు కంగారుపడ్డారు. ఇంతకుముందు కూడా తమ కుమారుడికి మూర్ఛలు వచ్చేవి కానీ, మరీ ఇంత తీవ్రంగా ఇంతకు మునుపెన్నడూ వచ్చిన దాఖలాలు లేవు. చాలాసేపటి వరకు బాలుడు స్పృహలేకుండా పడి ఉన్నాడు.
పితళే భార్య కంట కన్నీరు కాలువలు కట్టింది. ఆమె స్థితి చాలా దారుణంగా ఉంది. పులికి భయపడి గుహలోకి పారిపోతే కసాయి చేతికి చిక్కినట్టు, దొంగల బారినుంచి తప్పించుకుని ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకుంటే ఆ ఇల్లే నెత్తిన కూలినట్టు, తలదాచుకునేందుకు చెట్టు నీడకువెళ్తే, చెట్టుమీద కూలిపడినట్టు, బాబాను నమ్ముకుని వస్తే ఇలా అయిందేమిటని వారు పరిపరి విధాలుగా విలవిల్లాడిపోయారు. ఇంకాఉంది

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566