మెయిన్ ఫీచర్

అద్భుతాల ఆవిష్కర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత జనరేషన్‌లో కష్టమైన కెరీర్ అంటూ అమ్మాయిలు అనుకోవటం లేదు. క ష్టాన్నైనా ఇష్టంగా చేసుకుని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఏ రంగమైనా ఆ రంగంలోని నిష్ణానితులను తలదనే్నలా తమని తాము తీర్చిదిద్దుకుంటున్నారు. చిన్న వయసులోనే సినిమా ఫొటోగ్రఫీ రంగంలోకి వచ్చి తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న అంజూలీ శుక్లా అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే జాతీయస్థాయి అవార్డును సొంతం చేసుకుంది. కేరళకు చెందినన అంజూలీ శుక్ల టీనేజ్ వయసులో ఉన్నపుడు ఎడాపెడా అన్ని భాషల టీవీ ఛానల్స్ చూసేసేది. ఒక కథను విభిన్న భాషలలో ఎంత సృజనాత్మకంగా దృశ్యరూపంలో చూపుతున్నారోపసిగట్టింది. కథల్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కిస్తున్న విశేషాలను తెలుసుకోవాలని ఉబలాటపడేది. సినిమాటోగ్రఫీపై పెరిగిన మోజు ఆర్ట్స్ రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో(ఎఫ్‌టిఐఐ)లో జాయిన్ అయ్యింది. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో విభిన్న వ్యక్తిత్వాలు ఉన్న మనుషులతో ఏర్పడిన పరిచయమే ఎన్నో విషయాలను నేర్పిందని శుక్లా చెబుతారు. వారి సృజనాత్మకత, ఐడియాలజీ నుంచి ఎంతో నేర్చుకున్నానని చెబుతోంది. అక్కడ నేర్చుకున్న శిక్షణా నైపుణ్యంతో ఆమె తీసిన ‘‘ఉర్మి, ‘‘ కుట్టి ష్రాంక్’’ సినిమాలు నేషనల్ అవార్డులు గెలుచుకోవటం ఆమె సృజనాత్మకతకు నిదర్శనంగా చెప్పవచ్చు. విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కించిన ఈ రెండు చిత్రాలు మరుపురాని దృశ్యకావ్యాలుగా నిలిచిపోయాయి.
తొలిసారి ఫొటోగ్రఫీ విభాగంలో ఓ యువతి రెండు జాతీయ స్థాయి అవార్డులను గెలుచుకోవటం విశేషం. చిత్ర పరిశ్రమలో సక్సెస్ అనేది ప్రజాధరణ, ఖ్యాతి మీద ఆధారపడి ఉంటుంది. కాని తన వెనుక ఎలాంటి పెద్దల అండదండలు లేకుండానే స్వతహాగా, సృజనాత్మకతతో ఆమె వాటిన తన సొంతం చేసుకుంది. వాస్తవికి ప్రపంచంలో ఎంతోమంది అద్భుతాలు సృష్టిస్తున్నారని, వారంతా విజయాన్ని సాధించినవారేనని ఆమె అంటుంది. ఏదిఏమైనప్పటికీ గ్లామరస్‌తో నిండిన సినిమా ప్రపంచంలో అవకాశాలు వెల్లువెత్తుతున్నా ఆచితూచి అడుగువేస్తూ.. శుక్లా సహజ సిద్ధమైన నటనే నిజమైన అందం అని తన చిత్రాల ద్వారా చూపుతోంది.
*