మెయిన్ ఫీచర్

మందపాల జరితలు (భారతంలో ఉపాఖ్యానాలు -- 27)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారి మాటలు విన్న జరిత ఇలా అన్నది - ‘‘ఈ వృక్షం దగ్గర ఎలుక కన్నం ఉంది. దీనిలోకి త్వరగా ప్రవేశించండి. అప్పుడు మీకు అగ్నివల్ల భయం ఉండదు. మీరు అందులోకి వెళ్లిన తర్వాత ధూళితో ఆ రంధ్రాన్ని మూసివేస్తాను - మీరంతా రక్షింపబడడానికి ఇది ఒక్కటే మార్గం. అగ్ని చల్లార్చిన తర్వాత ధూళిని తీసి మిమ్మల్ని విడిపిస్తాను.’’
జరిత తల్లిగా పిల్లల రక్షణ గురించి భయపడి పైవిధంగా చెప్పగా అది విన్న పక్షి పిల్లలు ఇలా అన్నాయ - ‘‘రెక్కలు లేని మాంసపు ముద్దలైన మమ్మల్ని కలుగులోకి వెళ్లితేఅక్కడ ఎలుక తినేస్తుంది. కనుక మేము ఆ బిలంలోకి పోము. అగ్ని మమ్ములను ఎలా దహింపడో, ఎలుక ఎలా మమ్మల్ని నాశనం చేయదో, మా తండ్రి సత్కర్మ ఎలా వ్యర్థం కాదో, మా తల్లి ఎలా జీవించగలదో - వీటిగురించి ఆలోచిస్తున్నాం. బిలంలో ఉండే ఎలుకవల్ల నాశనం తప్పదు. ఆకాశంలోకి ఎగరడానికి ప్రయత్నిస్తే అగ్ని వల్లనూ నాశనం తప్పదు. అగ్నిలోపడి మరణించడమే ఉత్తమం ఎలుక చేత చావడం అధమం. ఒకవేళ ఎలుక బిలంలో మమ్మల్ని తినివేస్తే అప్పుడు మా మృత్యువు నింద అవుతుంది. అదే అగ్నిలోపడి మరణిస్తే అది శిష్టాచారం అవుతుంది’’.
అప్పుడు జరిత ఇలా అంది - ‘‘పిల్లలారా ఆ ఎలుకను ఒక డేగ ఇప్పుడే తన్నుకు పోయంది. కనుక ఇక ఎలుక భయం లేదు.’’
అప్పుడు పక్షి పిల్లలు ఇలా అన్నాయ- ‘‘ఈ ఎలుకను డేగ తన్నుకుపోతే ఇంకా చాలా ఎలుకలు అక్కడ ఉండవచ్చు. కనుక వాటి వల్ల భయం ఉంది. కాని అగ్ని ఇక్కడి దాకా వస్తుందో లేదో చెప్పలేం. ఇంకొకవైపు దహించవచ్చు. తల్లీ సంశయ రహితమైన చావు కంటె సంశయాత్మకమైన చావు మంచిది. కనుక నువ్వు ఆకాశంలోకి ఎగురు. తిరిగి మంచి పుత్రులను పొందు’’.
జరిత ఇలా అంది - ‘‘నేను బిలం నుంచి ఎలుకను ఎత్తుకుపోతున్న డేగను ఆశీర్వదించాను. తర్వాత ఇక్కడికి వచ్చాను. కనుక ఏ సంశయమ్మ లేకుండా బిలంలోకి వెళ్ళండి. మీకు ఏ భయం లేదు.
పిల్లలు మరల అన్నాయ ‘‘తల్లీ నీవు మా భయం పొగొట్టడానికి ఇలా చెప్పవచ్చు. సందేహం ఉన్నప్పుడు ఆ కార్యం చేయరాదు. నీకు మా గురించి ఏమీ తెలియదు. మేమెవరమో తెలియదు. నీకు మాకు బాంధవ్యం ఈ జన్మలో మాత్రమే. నీవు వనంలో ఉన్నావు. ఇంకొక పతిని పొంది పిల్లలన పొందు. మేము అగ్నిలో పడి దహించిపోతాం. ఉత్తమలోకాలను చేరతాము.. ఒక వేళ మేము చావకపోతే నీవు తిరిగి ఇక్కడకు అంటే మా దగ్గరికి రా’’.
పక్షి పిల్లల మాటలు విని జరిత ఎగిరిపోయంది. అగ్ని బారి నుండి తనను రక్షించుకుంది. ఆ తర్వాత అగ్ని జ్వాలలు మందపాలుని పిల్లలైన పక్షుల దగ్గరకు వచ్చాయి. పక్షులు తమలో తాము ఇలా అనుకొన్నాయ. జరితారి మొదట అగ్నితో ఇలా అన్నాడు. ‘‘తెలివితేటలు ఉన్న పురుషుడు ఆపద రాకముందే మేల్కొంటాడు. అప్పుడు కష్టకాలంలో వ్యధ చెందడు. కాని మూఢుడు ఆపదను తెలుసుకోకుండా కష్ట సమయం వచ్చాక బాధపడినా శ్రేయస్సును పొందడు.’’
రెండవ వాడు నారిసృక్కుడు ఇలా అన్నాడు ‘‘నీవు ధీరుడవు. ఇప్పుడు మా ప్రాణాలు ఆపదలో పడ్డాయ. చాలా లో ప్రాజ్ఞుడు శూరుడు ఒక్కడే ఉంటాడు. స్తంబమిత్రుడు ఇలా అన్నాడు. ‘‘పెద్ద అన్న తండ్రితో సమానం. చిన్నవారిని కష్టాలనించి విడిపిస్తాడు. పెద్దన్న ఆపదని గుర్తించకపోతే చిన్నన్న ఏం చేయగలడు? నాలుగవ వాడు ద్రోణుడు ఇలా అన్నాడు ‘‘అగ్ని అన్నింటినీ దహిస్తూ పెద్ద మంటలతో వృక్షాలను కూడా భస్మం చేస్తూ మనవైపు వస్తున్నాడు’’.
మందపాలుని పక్షి పిల్లలు ఈ విధంగా ఒకరిలో ఒకరు మాట్లాడుకుని ఏకాగ్ర చిత్తంతో అగ్నిదేవుని ఇలా స్తుతించారు - జరితారి మొదట ఇలా అన్నాడు. ‘‘ఓ అగ్నిదేవా! మీరు వాయుదేవునికి ఆత్మ స్వరూపులు. లతలకు, జలాలకు మీ వీర్యమే కారణం. సూర్య కిరణాలతో సమానంగా మీ జ్వాలలు అన్ని వైపులా ప్రసరిస్తాయ’’. తర్వాత సారిసృక్కుడు ఇలా స్తుతించాడు. ‘‘ఓ ధూమ కేతూ! మరణ భయంతో మాతల్లిమమ్ముల్ని విడిచిపెట్టింది. మా తండ్రి జాడ మాకు తెలియదు. మాకు ఇంకా రెక్కలు రాలేదు. నీవు తప్ప మాకింకెవ్వరూ దిక్కులేరు. నీవే మమ్ము రక్షించాలి. ఏడు జిహ్వాలతో నీ రూపం అత్యంత మంగళ ప్రదమైంది. ఓ దేవా అన్ని ప్రదేశాలలో సూర్యునితో సమానంగా తపించే శక్తి కలవారు మీరే. మేము చిన్న ఋషులం. మా నుంచి దూరంగా తొలగి మమ్ము కాపాడండి’’.
స్తంబమిత్రుడు ఇలా అన్నాడు. ‘‘దేవా! నీవే జగత్తుకు అధిష్టాతవు. పాలకుడవు. నిన్ను అనేక రూపాలతోను ఏక రూపంతో కూడా భావిస్తారు. నీవు జగత్పతివి’’.
తర్వాత ద్రోణుడు ఇలా అన్నాడు. ‘‘ప్రాణుల శరీరంలో ఉండి అన్నాన్ని పచనం చేస్తావు. నీవే సూర్య కిరణాల ద్వారా భూమిపైనించి రసాలను గ్రహించి సరియైన సమయంలో తిరిగి వర్ష రూపంలో భూమికి ఇస్తావు. నీనుంచే ఆకులు చెట్లు ఓషధులు నదులు సముద్రం ఏర్పడ్డాయ. శరీర రూపమైన మా ఇంటికి రసాధిపతి వరుణుడు దిక్కు. నీవు చల్లబడి మమ్మల్ని కాపాడి, చిన్ని పక్షులమైన మేము నీ తీవ్రతను తట్టుకోలేం.. మా మీద దయచూపి ఇంకొక మార్గంలో వెళ్ళు.’’

(ఇంకావుంది)

-- డాక్టర్ ముదిగొండ ఉమాదేవి