మెయన్ ఫీచర్

రావణ దహనం.. చెడుపై విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవరాత్రి పర్వదినాలు చివరి దశకు చేరాయ. ఎక్కడ చూసినా దసరా కోలాహలమే. భార తావనిలో దసరా ఒక ముఖ్యమన పండుగ. దసరా లేదా విజయదశమి చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే పండుగ. శ్రీరాముడి చేతిలో రావణుడి ఓటమి దసరా దశమి నాడే జరి గిందంటారు. విష్ణుమూర్తి దశావతారాలలో ఏడవ అవతారమైన రామావతారంలో రాక్షసరాజు రావణుడిని యుద్ధంలో ఓడించి చెరలోనున్న తన భార్య సీతను విడిపించుకుంటాడు రాముడు. రామలీలాలో భాగంగా రావణ దహనం అంటే, రావణ, కుంభకర్ణ, మేఘనాథ దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఇంతకీ- ఈ రావణుడు ఎవరు? అతడిని ఎందుకు మంచివాడని ఎవరూ అనరు? తెలుసుకోవడం ఆసక్తికరమైన విషయమే.
రావణాసురుడు దేవుడనీ, దసరా నాడు రావణ దహనం తప్పనీ ఇటీవల కొందరు పని కట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. ఆ మాటకొస్తే ఒక్క రావణుడే కాదు... మహిషాసురుడు, నరకాసురుడు, హిరణ్య కశిపుడు, శిశుపాలుడు... ఇలా మన పురాణాలలో, ఇతిహాసాలలో రాక్షసులుగా ముద్రపడిన ప్రతి వారినీ వారు దేవ తలంటున్నారు. రావణుడిని అగ్రవర్ణాల వారు అణ గదొక్కారని కూడా నేడు కొందరు వాదిస్తున్నారు. రావణుడు పుట్టింది బ్రాహ్మణ, క్షత్రియ జంటకు. అ లాంటప్పుడు అతడు వెనుకబడిన వర్గానికి చెందిన వాడెలా అవుతాడు? సుమాలి అనే రాక్షస రాజు తన కూతురు కైకసిని విశ్రవసువును వివాహం చేసు కోమంటాడు. విశ్రవసుడికి కైకసి వివాహిత భార్య కాలేకపోయింది. కొంతకాలానికి ఆమె- నిడుపాటి కోరలు, పది తలలు, ఎర్రని వెంట్రుకలు, ఇరవై చేతులతో భయంకరమైన ఆకారం కలవాడిని కంటుంది. వాడికి దశకంఠుడు అని పేరు పెట్టాడు తండ్రి విశ్రవసుడు. ఆ తరువాత వాడికి రావణుడనే పేరు మిగిలింది. రావణుడి తండ్రి బ్రాహ్మణుడైనప్పటికీ, తల్లి రాక్షస రాజకన్యక అయనందున, బ్రాహ్మణుడికి క్షత్రియ స్ర్తీయందు కలిగిన వాడు క్షత్రియుడే. బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా- రావణుడు మనం అనుకునే వెనుకబడిన కులాలకు చెందిన వాడు మాత్రంకాదు!
రావణాసురుడు తనకు బుద్ధి తెల్సినప్పటి నుంచే ఘోరాలు, నేరాలు చేసిన వాడే!. సవతి సోదరుడు కుబేరుడిని వర బలంతో లంక నుంచి వెళ్ల గొట్టాడు. ము ల్లోకాలను బాధ పెట్టడం అతడికొక దిన చర్య. అడ్డూ-అదుపూ లేకుండా క్రూరుడై, దేవతలను, ఋ షులను, యక్షులను చంపసాగాడు. అలా చేయడం తప్పని చెప్పిన అన్న కుబేరుడి మీద యుద్ధానికి పోయి పుష్పక విమానాన్ని లాక్కుంటాడు. శౌర్యవంతులైన రాజులను ఇబ్బందులకు గురి చేస్తూ, యుద్ధంలో ఎదిరించిన వారిని చంపుకుంటూ, ఓడిన వారిని బెదిరిస్తూ రోజులు గడిపేవాడు. నందీశ్వరుడిని అవమానించి శాపానికి గురయ్యాడు. కామంతో వేదవతిని అవ మానించాడు. అయోధ్య రాజు అనరణ్యుడిని అవ మానించి ఆయన శాపానికీ గురవుతాడు. యముడి మీదకు, ఇంద్రుడి మీదకు దండెత్తుతాడు. బలగర్వంతో రాజ స్ర్తీలను, మునికన్యలను, దానవ కుటుంబినులను, దేవతా స్ర్తీలను, కంటకనబడిన స్ర్తీలందరినీ బలాత్కారం చేస్తాడు. రంభను చెరిచి నలకూబరుడి శాపానికి గురవుతాడు. చివరకు సీతాదేవిని అపహరిస్తాడు.
హిమవత్పర్వత ప్రాంతంలో రావణుడికి వేదవతి కనిపించింది. కామంతో కళలు మూసుకున్న రావణుడు ఆమెను చేరబోయాడు. తలవెంట్రుకలు పట్టుకుని వేదవతిని లాగుతాడు. రావణుడు అవమానించిన ఆ దేహాన్ని ఇక తాను ఉంచుకోనంటుంది. అగ్ని ప్రవేశం చేస్తానని, రావణుడి గర్వమణచడానికి మళ్లీ జ న్మించుతానని అంటూ చెప్పినట్లే చేస్తుంది. ఆ విధంగా రావణ వినాశానికి బీజాలు పడ్డాయి. ఆ వేదవతే- జనక మహారాజు కూతురై, భూమిలో పుట్టి, సీత పేరుతో శ్రీరాముడిని వివాహమాడింది. అయోధ్యకు వెళ్లాడు రావణుడు. ఆ సమయంలో అనరణ్యుడు అయోధ్యను పా లించేవాడు. అతడిని యుద్ధానికి పురిగొల్పాడు రావణుడు. యుద్ధంలో ఓడిపోయాడు అనరణ్యుడు. తన వంశంలోనే దశరథ మహారాజు కుమారుడైన రాముడు- యుద్ధంలో రావణుడిని చంపుతాడని శపించాడు.
యముడిని చంపడానికి రావణుడు పోతాడు. యమ-రావణ యుద్ధం జరుగుతుంది. ఇరువురూ సరిసమానంగా పోరు చేశారు. యముడిని గెలిచినట్లు ప్రకటించుకున్న రావణుడు యమపురిని విడిచి లంకా నగరానికి పోతూ, రాజ స్ర్తీలను, మునికన్యలను, దానవ కుటుంబినులను, దేవతా స్ర్తీలను, కంటకనబడిన స్ర్తీలందరినీ బలాత్కారం చేస్తాడు. ఆ స్ర్తీలందరూ విలపించినా రావణుడు పట్టించుకోడు. పరస్ర్తీలను తన భార్యలుగా చేసుకోవాలను కోవడం కంటే పాప కార్యం లేదని, తమను కామంతో వశ పర్చుకో చూస్తున్నాడని, తామే పతివ్రతలమైతే, రావణుడు పరస్ర్తీ కారణంగానే చంపబడతాడని శపించారు వారందరు. అలా మరో శాపం తగిలింది.
రావణుడు మరోసారి దేవతల మీదకు దండయాత్రకు పోతాడు. మార్గమధ్యంలో, దేవతా సౌందర్యవతి రంభను చూసి ఆమె చేయి పట్టుకుంటాడు. రావణుడు తనకు తండ్రి లాంటి వాడని, ఇలా చేయడం తగదని వేడుకుంటుంది రంభ. రావణుడా మాటలు పట్టిం చుకోకుండా రంభను చెరిచి విడిచి పెట్తాడు. రావణుడు చేసిన చెడ్ద పనిని భర్త నలకూబరుడి (కుబేరుడి కొడుకు) తో చెబుతుంది రంభ. పరస్ర్తీని చెరిచినట్లయితే రావణుడు మరణించుతాడని నలకూబరుడు శపించుతాడు. రా వణుడు బలవంతంగా ఎత్తుకుని వచ్చిన పతివ్రతా స్ర్తీలు ఆ శాపం గురించితెలిసి కొని సంతోషించారు. రావణుడి వలన భయం వదిలారు. ఆ దినం మొదలుకుని, పర స్ర్తీ సంగమం విషయంలో మనసు పోనిచ్చేవాడు కాదు రావణుడు. రావణుడు కనిపించిన ప్రతి వారినీ, రాజులందరినీ బాధించుతూ, భుజ బల గర్వంతో, కళలు మూసుకొనిపోయి, ఒకనాడు మాహిష్మతీ నగరాన్ని పాలిస్తున్న కార్తవీర్యార్జునుడి మీదకు యుద్ధానికి పోతాడు. కార్తవీర్యార్జునుడు వాడిని బంధించి చెరసాలలో పడేశాడు. ఇది తెలుసుకున్న రావణుడి తాత పులస్త్యుడు అక్కడకు చేరుకుని, రావణుడిని చెరసాల నుంచి విడవమని కోరాడు. ఆయన కోరికను మన్నించాడు కార్తవీర్యా ర్జునుడు. రావణుడు కార్తవీర్యార్జునుడితో స్నేహం చేస్తూ, తరువాత- మళ్లా రాజులను ఓడించాలన్న కోరికతో, పొగ రు పడుతూ, భూమి మీద తిరుగుతుండేవాడు. రావణుడు పలు లోకాలలో సంచరిస్తూ, ఒకనాడు కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి పిలిచాడు.
ఆ సమయంలో వాలి సంధ్య వార్చడానికి నాలుగు సముద్రాలకు పోయాడు. అప్పుడు దక్షిణ సముద్రంలో సంధ్య వారుస్తున్నాడని తెలుసుకుని పుష్పక విమానం ఎక్కి అక్కడకు చేరుకుంటాడు రావణుడు. వాలిని వెనుక నుంచి వెళ్ళి బంధించాలనుకుంటాడు. వాడి ఉద్దేశం కనిపెట్టిన వాలి- రావణుడిని తన చంకలో ఇరికించి, ఆకాశ మార్గంలో పోయి, పడమటి సముద్రంలో, ఉత్తర సముద్రంలో, తూర్పు సముద్రంలో సంధ్య వారుస్తాడు. కిష్కింధకు తిరిగొచ్చి రావణుడిని విడిచి, ఏమీ తెలియని వాడివలె అతడి క్షేమ సమాచారం అడుగుతాడు. తాను వాలితో యుద్ధం చేయడానికి వచ్చానని, తనకు గర్వభంగం అయందనీ, అగ్ని సాక్షిగా అతడితో స్నేహం చేయాలని ఉందని అంటాడు. ఆ తరువాత వారిరువురూ స్నేహితులవుతారు. సన్యాసి వేషంలో వెళ్లి సీతను రావణుడు బలాత్కారంగా ఎత్తుకుని పోతాడు. సీతతో లంక చే రుకుంటాడు. సీత వద్ద రాక్షస స్ర్తీలను కాపలాగా ఉంచుతాడు. సీత తనను కామించడానికి పనె్నండు నెలల గడువిస్తాడు. రావణుడి రూపం, తేజం, బలం, ధైర్యం అనుపమానవైనవే. సౌందర్యం, సంపద, ఆకర్షణ రాముడిలో ఎంత ఉన్నాయో, రావణుడి దగ్గర కూడా అంతే మోతాదులో ఉన్నాయనవచ్చు. ఐతే, ఇతరుల పట్ల కరుణ, రక్షించాలనే బుద్ధి రాముడిలో ఉన్నాయి కాని రావణుడిలో లేవు. వాడిది కఠినమైన మనస్సు. భూతదయ ఏ మాత్రం లేనందునే జనులు దూషించారు. దేవ దానవులు మాత్రం అతడి అకృత్యాలతో వణికారు.
రావణుడు ధర్మ శాస్త్రాలను చక్కగా అధ్యయనం చేశాడు. ప్రపంచం మెచ్చే రీతిలో తపస్సు చేశాడు. ఎంతో కష్టపడి తపస్సు చేసినా, అది మర్చిపోయి- తపో ధర్మం వల్ల కలిగే సత్ఫలితాలను పాడుచేసే పనులెన్నో చేశాడు. అతడి తపస్సు వ్యర్థమైపోయింది. తన తపస్సుతో దేవదానవులెవరూ జయించకుండా వరం పొంది, ఇంక తనకేం భయం లేదని గర్వపడ్డాడు. వాస్తవానికి, ఆ వరాలేవీ అతన్ని ఎల్లప్పుడూ రక్షించ లేవనే సంగతి అతడి ఆలోచనకే రాలేదు. తప్ఫఃలం వల్ల రావణుడు తనకు పాప ఫలం రాదనుకున్నాడు! సకల భోగాలను అనుభవించే వాడికి రోగాలు రావా? రావణుడి తపస్సు అతడికి దీర్ఘాయువు ఇవ్వాలి. కాని, అతడు చేసిన పర స్ర్తీల అపహరణ అనే పాపపు పని వల్ల త్వరగా చావాలి. ఈ రెండూ ఏకకాలంలో జరగవు కాబట్టి, అతడి చావు రాముడొచ్చేవరకూ ఆగింది. చివరకు నరవానరుల చేతిలో మరణించాడు.
రావణుడు బలవంతంగా ఎత్తు కొచ్చిన సీతాదేవిని, ఇతర స్ర్తీలను వారి కుటుంబీకులకు అప్పగించిన్లతే అతడి దోషం పోయేది. తప్ఫఃలం సదా రక్షిస్తుందనే మాట భ్రాంతే! తప్ఫఃలం పుణ్యమనుభవించిన కొద్దీ క్షీణిస్తుంది. శాశ్వతంగా మిగిలిపోదు. రామ రావణ యుద్ధం మొద లవుతుంది. శ్రీరాముడు మూల బలాల్ని సంహరిస్తాడు. పౌరుషోక్తులు పలుకుతూ రావణుడు యుద్ధానికి వెళ్తాడు. ఇరువురూ దివ్యాస్త్రాలతో పోరాడుతారు. రావణుడు పరాజితుడై లంకకు పరుగెత్తుతాడు. రామరావణుల కడపటి యుద్ధం ప్రారంభమవుతుంది. బ్రహ్మాస్త్రంతో రావణుడిని వధించాడు రాముడు. రావణుడి మరణానికి లోకాలన్నీ సంతోషించాయి.
శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి ఉంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా సంద ర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి. రావణుడి పాత్ర కూడా అందులో భాగమే! ఆ పాత్రను చెడుపాత్రగా చిత్రించడానికి కారణం అతడు చెడ్డవాడు కావడమే. ఏదేమైనా, రావణ వధతో ఒక యుగంలోని చెడు అంతరించి పోయింది. దానికి గుర్తుగా ఏటేటా దసరానాడు రావణ దహనం జరుపుకోవడం ఆచారంగా మిగిలిపోయింది.

-వనం జ్వాలా నరసింహారావు 80081 37012