మెయన్ ఫీచర్

చరిత్ర పునరావృతం అవుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లిం జనాభా అధికంగా ఉండే దేశాల్లో మలేసియా ఒకటి. ఇక్కడికి జకీర్ నాయక్ రావడంపై నిషేధం విధించారు. ఇంకా 16 ముస్లిం దేశాలలో ఈ యనపై నిషేధం అమల్లో ఉంది. ఢాకాలో, కిషన్‌గంజ్‌లో వరుస బాంబుపేలుళ్లు జరిగిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్రమత్తమై జకీర్ ప్రసంగాల వీడియోలపై నిషేధం విధించింది. ఆ దేశపు హోంశాఖామాత్యులు ప్రసంగిస్తూ, ‘జకీర్ ప్రసంగాలు, వీడియోలు పర్యటనలపై నిఘావిభాగం దృష్టి పెట్టింద’ని ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని అతిపెద్ద గౌతమ బుద్ధుని విగ్రహం (బనియాన్‌లో) ఉగ్రవాదులు నేలకూల్చడాన్ని జకీర్ సమర్ధించాడు. హిందూ దేవీ, దేవతా విగ్రహాలు, శివుడు- గణేశ్ వంటి వారిని నిందించాడు. సౌదీ అరేబియాలో పుట్టిన వాహిద్ మతాన్ని భారత్ సహా పలు దేశాల్లోకి దిగుమతి చేస్తున్నాడు. 2008లో నిఘా విభాగం భారత హోంశాఖకు ఇతని కార్యకలాపాల గురించి నివేదిక పంపింది. కాని నాటి హోంమంత్రి ఆ నివేదికను చెత్తబుట్టలో పడేశారు. ముస్లిం ఆడపిల్లలు చదువుకోకూడదు అన్నాడు. ఇస్లాంను రక్షించుకోవడానికి ముస్లింలు మానవ బాంబులుగా మారితే తప్పేంటన్నాడు.
***
బుర్హానీ వని అనే ప్రమాదకరమైన ఉగ్రవాదిని కశ్మీరులో ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతాదళాలు కాల్చి చంపడంతో హింస చెలరేగింది. దీనికి వ్యూహరచన ఇస్లామాబాద్‌లో జరిగింది. ఇప్పుడు ముఫ్తి నస్రుల్ ఇస్లాం వంటివారు ‘కాశ్మీరు భారత్‌లో అంతర్భాగం కానేకాదు, మేము పోరాటాలు చేస్తూనే ఉంటాము. బుర్హాన్ వని ఒక స్వాతంత్య్ర సమరయోధుడు’ (2016, జూలై 12) అని చెప్పాడు. కాశ్మీరు ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ పాకిస్తాన్ ఏజెంటులా ప్రవర్తిస్తోంది. సిఆర్‌పిఎఫ్ దళాలను ఉగ్రవాదులు కాల్చి చంపుతుంటే, సామాన్య ప్రజలకు అక్కడ రక్షణ ఏమి ఉంది? ‘చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దాలి’ అని ఓ సెక్యులరిస్టు సలహా ఇచ్చాడు. చర్చలు గత డెబ్బయి సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యమీద రెండుసార్లు యుద్ధం కూడా జరిగింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు. సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉంది.
***
ఇంగ్లీషులో హిస్టరీ రీపీట్స్ ఇట్‌సెల్ఫ్ అని ఒక నానుడి. చరిత్ర పునరావృతం అవుతుంది అని ఈ వాక్యానికి అర్థం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి తెలంగాణ మళ్లీ బలికాబోన్నదా అనే సందేహం కలుగుతున్నది. ఎందుకంటే దేశంలో ఉగ్రవాద మూలాలు పాతబస్తీలో ఉన్నాయి. హైదరాబాద్‌లో 3 జూలై 2015 నాడు మజ్లిస్ బచావో తహరిక్ ఆధ్వర్యంలో జైషే మాముద్ ఖురాన్ కార్యక్రమం పాతబస్తీలోని మక్కా మసీదులో జరిగింది. ఇది రంజా న్ నెల కావటంతో వంద చోట్ల సర్కార్ ప్రభు త్వ ఖర్చుతో ఇఫ్తార్ విందునిచ్చింది. రంజాన్ కానుకగా తెలంగాణ ప్రభుత్వం రూ. 26 కోట్ల ఖర్చుతో కానుకలు సమర్పించింది. ఇమామ్‌లకు నెలకు వెయ్యి రూపాయల గౌరవ భృతి చెల్లిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇఫ్తారు విందులు హలీం వడ్డిస్తారు. లక్షా తొంభై ఐదువేల పేద ముస్లిములకు బట్టలు కుట్టిస్తారు. మసీదు కమిటీలు ఇప్పటికే గౌరవ భృతి చెల్లిస్తున్నాయ. అదనంగా వక్ఫ్‌బోర్డు కేటాయింపులకు మద్దతుగా ఈ పనె్నండు కోట్లు ప్రభుత్వ కేటాయింపు వుంటుంది. మజ్లిస్ బచావో అంటే ‘ఇత్తెహాదుల్ మజ్లిస్‌ను రక్షించండి’ అని ఈ ఉర్దూమాటకు అర్థం. ఇం తకూ ఈ మజ్లిస్ అంటే ఏమిటో ఈ తరం వారికి తెలియదు. ఇదంతా తెలంగాణలో 1948కి పూర్వం జరిగిన చరిత్ర.
అప్పుడు ఉస్మాన్ అలీ ఖాన్ అనే ఏడవ నిజాం తెలంగాణను పరిపాలిస్తూ ఉండేవాడు. ఇతనికి ధనాశ ఎక్కువగా ఉండేది. పేద రైతుల నోళ్ళు కొట్టి దానితో తన ఫలక్‌నామా ప్యాలెస్‌లోని ధనాగారాన్ని నింపుకొనేవాడు. ప్రతిరోజూ అక్కడి బంగారాన్ని రత్నాలను చూసుకొని చేతితో తాకి మురిసిపోయేవాడు. ‘‘తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాజరికంబు దక్కునే’’ అని దాశరథి కృష్ణమాచార్యుల వారు కవిత్వం వ్రాసినది ఈ సందర్భాన్ని పురస్కరించుకునే.
1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతం త్య్రం వచ్చింది. కాని తెలంగాణకు రాలేదు. కారణం నిజాం తన రాజ్యాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానికి అంగీకరించలేదు. అంతేకాదు పాకిస్తాన్‌తో సంబంధాలు పెట్టుకొని తనది స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు. అప్పుడు ఒక వైపు సాయుధ కమ్యూనిస్టు పోరాటం మరోవైపు ఆర్యసమాజ ఉద్యమం తెలంగాణలో వూపు అందుకున్నాయి. తిరుమల శేషాచార్యులుగారు నటుడు, విద్యావేత్త. ఇటీవలే స్వర్గస్థులైనారు. వారు తమ స్వానుభవాలు ఇలా చెప్పారు. ‘ఇక్కడ రామాయణ భారతం వంటి నాటకాలు ప్రదర్శించడానికి వీలులేదు. బహిరంగంగా ఆంధ్ర భాష మాట్లాడకూడదు. రోషనారా నాటకం మేము ప్రదర్శిస్తుంటే నిజాం ప్రభుత్వం నిషేధించింది. కారణం అందులో ఛత్రపతి శివాజీ గొప్పతనం వర్ణింపబడి ఉండటమే.’
ఆరోజుల్లో చెర్విరాల బాగయ్య అనే రచయిత భారత రామాయణాల కథలతో యక్షగానాలు వ్రాసి రహస్యంగా ప్రదర్శించేవారు. అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. అప్పటి జనసంఖ్య ఒక కోటి. వీరిలో హిందువులు అధిక సంఖ్యాకులు. పాలకుడు మాత్రం ముస్లిం. వీరిలో నూటికి ఎనిమిది శాతం వారి మాతృభాష అయిన ఉర్దూను అధికార భాషగా ప్రకటించి దేశ భాష అయిన తెలుగు సంస్కృతాలను అణిచివేశారు. వీరి దృష్టిలో హిందువులంటే బానిసలు. నీళ్ళు తోడే కూలీలు. (‘పోలీస్ యాక్షన్ ఎగనెస్ట్ హైదరాబాదు .......కుటుంబరావు -12 పుట). ‘‘హిందూ ధార్మిక సంస్థలను దేవాలయాలను నశింపచేస్తూ విదేశీ ముస్లిం సంస్థలకు విరివిగా విరాళాలిచ్చేవారు.’’ (అదే గ్రంథం అదే పుట)
భారతదేశంతో కలియడానికి నిజాం నవా బు నిరాకరించటంతో బాటు స్థానిక హిందువులపై దోపిడీలు, హత్యలు, మానభంగాలు మొదలు పెట్టించాడు. అందుకోసం పుట్టిన సంస్థ పేరే ఇత్తెహాదుల్ మజ్లీస్. ఈ దుర్మార్గానికి విద్యాలంకార వినాయక్ నాయకత్వంలో ప్లీడర్లు, విద్యాధికులు సమావేశమై నిరసన తెలిపారు. కాని అప్పటికే రజాకార్ సైన్యం రెచ్చిపోయింది. ఆనాటి రజాకార్ సైన్యానికి కమాండర్ పేరు కాశీం రజ్వీ. అతని సైన్యాలు 2 లక్షలు 30 వేలమంది. దినసరి కూలీసేన. తెలంగాణలోని 87 శాతం ఉన్న హిందువులను చంపటం లేదా కూలీలుగా మార్చటం వీరి లక్ష్యం. ఇతని సహాయకుని పేరు అబ్దుల్ లతీఫ్. ఇతని పత్రిక క్లారియన్. ‘‘మొత్తం దక్షిణ భారతదేశంలోని కోటి యాభై లక్షల మంది ముస్లిములు హైదరాబాదు రావాలి. ఇక్కడి రెండు కోట్ల హిందువులు ఆస్తులు వదులుకొని ఇండియా యూనియన్ లోకి వెళ్లిపోవాలి. అని క్లారియన్ పిలుపు నిచ్చింది.
వెంటనే ఈ ప్రణాళిక అమలు చేశారు. ఏడు లక్షలమంది ముస్లిములు హైదరాబాద్ సంస్థానంలోకి దిగుమతి చేయబడ్డారు. యాభై లక్షలమందిని తెలంగాణ నుండి తరిమిమవేశారు. వారంతా సాగరాంధ్ర, కర్ణాటక వంటి ప్రాంతాలకు పారిపోయి తల దాచుకున్నారు. ‘‘దివ్య స్థలంబుల దేవాలయంబుల మధు మాంస దుర్గంధమయ మొనర్చి / విహ్రంబులనెల్ల విధ్వంసము చేసి మూత్రాభిషేకాలు ముంచి యెత్తి అర్చక స్ర్తిల గర్భాలయముల బట్టి చెప్పగా రాని విధముల చెరిచి’’నారు (మఘవలయము- వానమామలై వరదాచార్యగారి రచన). ఇదంతా చేసింది కాశింరజ్వీ. ఆయన సంస్థ పేరు ఇత్తెహాదుల్ మజ్లిస్. ‘‘తెలంగాణ’’ (కుందుర్తి), త్వమేవాహం (ఆరుద్ర), అగ్నిధార (దాశరధి) వంటి గ్రంథాలు అప్పుడు వచ్చినవే. ‘‘ఓ నిజాము పిశాచమా నిన్నుబోలువాడు మరొకడు కానరాడు’’ అని దాశరథి ఎలుగెత్తి గర్జించాడు.
‘‘దగాకోరు ఛడాబోరు రజాకారు పోషకుడవు. దిగిపొమ్మని జగత్తంతా నగారాలు కొడుతున్నది’’ అని దాశరథి విప్లవ శంఖం పూరించారు. ఇట్టి ఇత్తెహాదుల్ మజ్లిస్ సంస్థ ‘మజ్లీస్ బచావో’ అని 2015, జూలై 3వ తేదీ మక్కా మసీదులో మళ్లీ సమావేశాలు పెట్టడం ఏమిటి? దీనికి 26 కోట్లు ప్రభుత్వ ధనం ఇవ్వటం ఏమిటి? అంటే తిరిగి తెలంగాణలో 1948కి ముందున్న పరిస్థితులు పునరావృతం కాబోతున్నయా? మజ్లిస్ కమాండర్ కాశింరజ్వీ 1948 సెప్టెంబరు నెలకు ముందు ఇలా అన్నాడు. ‘‘మాది షెర్వాణీ కల్చర్, మాది బిర్యానీ కల్చర్- తెలంగాణాలోని హిందువులను ఇక్కడినుండి భారతదేశంలోకి తరిమికొట్టండి’’.
1948 సెప్టెంబర్ 17వ తేదీ గుజరాత్‌నుండి వచ్చిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ తెలంగాణలోని ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశాడు. 2015లో గుజరాత్ నుండి వచ్చిన నరేంద్ర మోదీ ఈ పాతబస్తీ ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కొంటాడో వేచి చూడాలి. హైదరాబాద్ ముస్లిం సమస్యను అఖిల భారతీయ స్థాయిలో విశే్లషించాలి. లక్నోలో ములాయం సింగ్ యాదవ్ (మాజీ ముఖ్యమంత్రి) మాట్లాడుతూ ఉగ్రవాద విద్యార్థి సంస్థ సిమీ మా సమాజ్‌వాద పార్టీకి విద్యార్థి విభాగం అని ప్రకటించాడు. ఉత్తరప్రదేశ్, హైదరాబాదు, మలప్పురం (కేరళ) బంగ్లాదేశ్ పాకిస్తాన్‌ల మధ్యగల రహస్య సంబంధాలను నిఘా విభాగాలు పసిగట్టి వెలువరించాలి.
కాంగ్రెసు పార్టీకి చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ (3-7-2015) ముస్లిములకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నారు. వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును తిరగతోడాలి అన్నారు. షాదీ ముబారక్ స్కీం ఏమైంది? అని ప్రశ్నించారు. అంటే టిఆర్‌ఎస్ కంటే కాంగ్రెసు వారే ముస్లిముల శ్రేయోభిలాషులు అని ప్రకటించుకునే ఓట్ల వేట ప్రయత్నాలలో ఇవి అంతర్భాగాలు. మాల్టానుండి పాతబస్తీకి దొంగనోట్లు చేరినట్లు నిఘా వర్గాలు నిర్థారించాయి. ఐఎస్‌ఐ, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థల రిక్రూట్‌మెంటులు పాతబస్తీ నుండి జరిగాయని పోలీసు వర్గాలు పేర్కొన్నారు. వీటిపైన విచారణ జరిపించాలని రాజకీయ పార్టీలు ఎందుకు కోరటంలేదు? దేశభద్రతకన్నా ఎన్నికల విజయాలే ముఖ్యమా? హైదరాబాద్‌లోని ముస్లిముల ఓట్లపై టిఆర్‌ఎస్ పార్టీకి పేటెంటు హక్కు లేదు కదా అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా గౌరవనీయులైన శ్రీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గారి నాయకత్వంలో 2016 జూలై రెండవ వారం నుండి చిల్లుల చోటీలు పెట్టుకొని ఇఫ్తారు విందులు ఇవ్వటం మొదలుపెట్టింది.
పాకిస్తానీ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ హవాలా పద్ధతిలో బ్రిటన్ నుండి భారత్‌లోని ఉగ్రవాదులకు, జిలానీ వంటివారికి అయూబ్ ఠాకూర్ ద్వారా పెద్ద మొత్తాలు ఎలా పంపించిందో మాజీ ‘రా’ అధిపతి దులత్ ఇటీవల వెల్లడించారు. ఇఫ్తారు విందులు ఇచ్చే రాజకీయవేత్తలు ఈ దేశద్రోహానికి ఏం సమాధానం చెపుతారు?

- ముదిగొండ శివప్రసాద్