మెయిన్ ఫీచర్

ఆర్థిక తృప్తి... మానసికోల్లాసమూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షఃస్థలే కౌస్త్భుం నాసాగ్రే నవ
వౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనం చ కలయం... ఇలా ఈ పాట వినగానే నా మనస్సంతా కృష్ణుని రూపసౌందర్యానుభూతిలో మునిగిపోతుంది. కృష్ణుడంటే నాకు చాలా ఇష్టం. ఏ పని చేసినా కృష్ణా అని అనడం పరిపాటి. ద్వాపరయుగంలో పుట్టి చెరసాలలో ఉన్న తల్లిదండ్రులను విడిపించి అహంకారంతో విర్రవీగే కంసుని మదమణిచాడు. పుట్టి పుట్టగానే ఎందరో రాక్షసులను తన చాతుర్యంతో సంహరించాడు. జరాసంధుడి లాంటి అతి బలవంతులను, మూర్ఖులను, దుష్టులను దునిమాడాడు.
రేపల్లెల్లోని గోపికలందరి మనస్సులను దోచుకున్నవాడు. ఎందరికో బుద్ధిజ్ఞానాలను ప్రసాదించినవాడు, పార్థునికి సారథియైనవాడు, మేనత్త అయినాతన మేనల్లుడిని పరమాత్మగానే చూచిన కుంతీదేవికి ఆమె కోరుకున్నట్లుగా వరాలనుప్రసాదించినవాడు. కురుక్షేత్ర రణరంగంలో పాండవులకు విజయాన్ని చేకూర్చినవాడు. ఆయుధం పట్టనని మాటిచ్చినా తన భక్తునికోసం ఆయుధం పట్టినవాడు, తన మకర కుండలాల కాంతితో ఆకాశాన్నంతా కప్పివేసినవాడు. తన బాల్యచేష్టలతో బ్రహ్మాది దేవతలకు ముదమొనర్చినవాడు.
ఇంతటి కరుణామూర్తి, దయామూర్తి తన సంగడీలతో చేరి గోపబాలునివలె చద్దికుడిచినవాడు. భాగవతంలో పోతనామాత్యుని కృష్ణుని బాల్యచేష్టలను వర్ణించి పొంగిపోతే నేనుప్రతిరోజు ఆ కృష్ణయ్య బాల్యచేష్టలను స్మరించు మురిసిపోతుంటాను.ఆ చేష్టలనే పాడుకుంటూ తరిస్తుంటాను. అటువంటి ఆ చిన్నికృష్ణుని నాకొచ్చిన కుట్లు అల్లికల్లో రూపుకట్టించాలనుకొన్నాను. వెంటనే చీరలకు రకరకాల దారాలు, పూసలు కలుపుకుంటూ ముద్దులొలికే బాలకృష్ణుని దగ్గర నుంచి రాధాకృష్ణుల వరకు చిత్రాలను చీరలపై దిద్దుకున్నాను. అంతేకాదు మీరాబాయి, రాధా ఇలాంటి భక్తురాండ్రను కూడా నా చీరల అల్లికల్లో అల్లుకున్నాను.
నాడు కృష్ణయ్యతో ఆడుకున్న గోపికల తన్మయత్వాన్ని నేను కూడా అనుభవించాలని కృష్ణునితోనే మాట్లాడుతున్నాననుకుంటూ కృష్ణుడికి అలంకారాలు చేస్తున్నానుకొంటూ చీరలపైన, దుప్పట్టాలపైన, కర్టెన్లలపైనా కృష్ణుని రూపాలను దిద్దుకున్నాను. కేవలం కుట్లు అల్లికల్లోనే కాక పెయింటింగ్ వేస్తూ కూడా కృష్ణరూపాన్ని చీరలపై దిద్దుకున్నాను.
ఇలా ఎందుకు చేసానంటే మన భరతభూమి పుణ్యభూమి కర్మభూమి.కృష్ణుడే స్వయంగా ‘‘నాపై భారం మోపి ప్రతిఫలం ఆశించకుండా మీ మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. నేను మీ యోగక్షేమాలను చూస్తాను’’ అని చెప్పారు కదా. అందుకే మనసా, వాచా కర్మణా కృష్ణయ్యను స్మరించాలనుకుని ఇలా సంప్రదాయ అల్లికల్లోను, రంగుల అద్దకంలోను కృష్ణుని రూపును దిద్దుకున్నాను. ఇవే డిజైన్స్‌ను కలంకారీ డిజైన్ గా కూడా చేసుకొని ప్రేము కట్టించి ఇంట్లో గోడలకు తగిలించుకుంటే ఇల్లు ఎంతో బాగుంటుంది. నేను ఇలాంటిఫ్రేములు చేసి తెలిసిన వారికి బహుమానంగా ఇస్తుంటాను. వాటిని అందుకున్న వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. అపుడు నాకు మనసు తృప్తిగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలాంటివి చేసి అటు కాలక్షేపంగాను, కావాలనుకొన్న వారు ఆర్థికంగాను కూడా వీటిని ఉపాధిగా మార్చుకోవచ్చు. అడిగిన వారికి చేసి ఇస్తే కొంత ఆర్థికంగా కూడా ఈ కళ ఉపయోగ పడుతుంది. అంతేకాక మన సంస్కృతీ సంప్రదాయాలను నలుగురీ చెప్పిన వాళ్లము అవుతాం. మనం సదాచారాలను పాటించడానికి ఉత్సాహవంతులం అవుతాం.

- వాణి ప్రభాకరి