మెయిన్ ఫీచర్

ప్రకృతితో పరమళించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేయాలనుకొంటే మార్గాలు వాటంతట అవి తెలుస్తుంటాయి. మొట్టమొదట ఆలోచన వస్తే చాలు దాన్ని అల్లుకుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి. కేరళలో ప్రకృతి విలయతాండవం చూసి ప్రతి ఒక్కరి మనస్సు బెంబేలెత్తింది. ఇట్లా ప్రకృతి వికృతించడానికి కారణం మనమే కదా. ప్రకృతిని పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం కనుక ఎక్కడో ఒకచోట ప్రకృతి తన కోపాన్ని చూపిస్తోంది. ఎన్నో వేల కోట్లు నష్టం జరిగిపోతుంది. నష్టం అంటే అటు మానవులు వారితోపాటు మూగజీవులు పాపం ప్రాణాలు కోల్పోతున్నారు. మనిషి ప్రకృతికి విరుద్ధమైన పనులు చేస్తుంటాడు అనుకోండి. కానీ మూగ జీవాలు, చెట్లు ప్రకృతిని కాస్త కూడా నిర్లక్ష్యం చేయవు కదా. వాటి ప్రకృతి ధర్మాలను బట్టే అవి జీవనాన్ని సాగిస్తుంటాయి. మనం వాటిని ఆలోచన లేని జంతువులు అని పక్కన పెట్టేస్తాం. కాని అవి సూర్యాస్తమయం తర్వాత పడుకుంటాయి. సూర్యోదయానికి స్వాగత గీతికలు ఆలపిస్తాయి. మరి మనం అర్థరాత్రి దాటినా మన పనులు తెగవు. మన ఆటలు , పాటలు ఇంకా జోరందుకుంటాయి. ప్రకృతి పడుకోండి అని చీకటిని పులిమితే విద్యుత్ కాంతులను పెట్టుకున మరీ వెలుగులు విరజిమ్ముతున్నాం అంటాం.
వేయి వెలుగులతో సూర్యుడు పరుగు లంకించుకున్న తరువాత కూడా బద్దకంగా కృతిమ చీకటి నుంచి బయటకు వస్తాం. కిటికీలు మూసేసుకొని వెలుగును రానివ్వం.
అంతేనా ఇంకా కూర్చున్నచోటే అన్నింటినీ కానిచ్చేస్తాం. అడుగులు ఎక్కువ వేయకుండానే కాలకృత్యాల కార్యాన్ని ముగించేస్తాం. తర్వాత వెండివెలుగులు విరజిమ్మే బయటకు వెళ్లాలంటూ ఎండస్పర్శ తగలకుండా ఎసి కారుల్లో తిరిగేసి ఎసి గదుల్లో కూర్చుని సంపాదన ఆర్జిస్తుంటాం. ఇక ప్రకృతికి మనం చేసేదేముంది?
అందుకే ఈ విలయతాండవాలు, వైపరిత్యాలు.. వీటిని అదుపు చేయాలంటే ప్రతిమనిషి తనవంతు బాధ్యతగా మొక్కలు పెంచాలి. అది అపార్ట్‌మెంట్స్ లో ఉన్నా విడివిడిగా ఇళ్లు నిర్మించుకొన్నా సరే మొక్కలు తప్పనిసరిగా నాటాలి.వాటి పెరుగుదలకు కావాల్సిన అన్ని సదుపాయాలను మనిషే చేయాలి.
దానికి స్ఫూర్తిగానే ఇంట్లోనే ముందురూమ్‌లో చక్కని క్రీపర్స్ అంటే తీగగా సాగే మొక్కలను కుండీల్లో పెట్టుకోండి. అటు అందం ఇటు ఆరోగ్యం లభిస్తుంది. ఇక పడకింటిలో అయితే మంచి సువాసన ఇచ్చే పూలున్న కుండీలను అమర్చుకోండి. కమ్మటి నిద్ర తెల్లవారగానే ఆహ్లాదకరమైన శుభోదయానికి మీకు ఆ మొక్కలు స్వాగతం చెప్తాయి.
ఇక వంటిట్లో అయితే కొత్తిమీర, మెంతి, కరివేపాకు,పాలకూర, బచ్చలి, పచ్చిమిరిప లాంటి చెట్లు పెంచండి. అటు మీకు తాజా కూరలను అందిస్తాయి. ఆ చెట్లనుంచి వచ్చే సువాసనతో వంటింట్లో ఉన్నా పచ్చటి ప్రకృతి మధ్య జీవిస్తున్న అనుభూతిని కల్పిస్తాయి. అంతేకాదు బాల్కనీలోను ఇంటి బయట కూడా మీకు ఇష్టమున్న చెట్లను కుండీల్లోనే పెంచుకోండి. వీటిని పెంచడానికి ఎక్కువ కష్ట పడక్కర్లేదు. మూడు నాల్గు నెలలకొకసారి మట్టి మారుస్తుంటే చాలు.. కొద్దిపాటి ఎరువులు వేస్తున్నా అవి మంచి సువాసనను, మీకు కావాల్సిన కూరలను, మీకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. ఇక టెర్రస్ పైన అయితే వంగ, టమాట, బెండ, దొండ, కాకర, ఆఖరికి పుచ్చకాయను కూడా పండించవచ్చు. ఏ కొద్ది సమయం మీకు కలిగించుకున్నా చక్కని పెరటి తోటను మీ ఇంటిపైన పెంచుకోవచ్చు.
ఇక పెరడు ఉండేవాళ్లయితే ఇక కావల్సినన్ని చెట్లు పెంచుకుని పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.
అంతేకాదు మనం వాడే ప్యాస్టిక్ బాటిల్స్ ను కుండీలుగా మార్చుకోవచ్చు. యూజ్ అండ్ త్రో వస్తువులు కాక చక్కని ఆకులను, లేక చాలామార్లు వాడుకోగలిగే మెటల్‌ను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇలా ఎవరికి వారు వారి వారి బాధ్యతలు నెరవేరిస్తే తప్పక పర్యావరణం లో మార్పులు వస్తాయి. ప్రకృతి వైపరిత్యాలు కాక ప్రకృతి పరిమళాలను ఆస్వాదించవచ్చు.

- చివుకుల రామమోహన్