మెయిన్ ఫీచర్

ఎల్లలులేనిది ప్రేమ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేకానీ, పెళ్ళి లాంటి నకిలీ బాంధవ్యాలకోసం ప్రేమను నాశనం చెయ్యకండి. ఇతరుల ఏకాంతంలో జోక్యం చేసుకోని ప్రేమ మాత్రమే అసలైన ప్రేమ. అది ఎప్పుడూ ఎదుటి వ్యక్తి స్వతంత్ర వ్యక్తిత్వాన్ని, ఏకాంతాన్ని గౌరవిస్తుంది.
కానీ, మీరు చూస్తున్న ప్రపంచంలోని ప్రేమికులందరూ ఎలాంటి దాపరికాలు లేకుండా రహస్యాలన్నీ బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నవారే. వారికి స్వతంత్ర వ్యక్తిత్వమంటే భయం. అందుకే వారు ఒకరి స్వతంత్ర వ్యక్తిత్వాన్ని మరొకరు నాశనం చేస్తారు. పైగా, అలా చేస్తేనే జీవితాలు చక్కబడతాయని వారు భావిస్తారు. అందుకే వారు మరీ దీనాతిదీనంగా తయారవుతారు.
మీరు ప్రేమిస్తూనే ఉండండి. కానీ, అసలైనది ఎప్పుడూ మారుతూనే ఉంటుందని గుర్తుంచుకోండి. ప్రేమ శాశ్వతమని మీకు బోధించారు. అది తప్పు. ఒకవేళ అది నిజమే అయితే, ఎప్పుడైనా ప్రేమ అదృశ్యమైతే అది నిజమైన ప్రేమ కానట్లే కదా! అసలైన గులాబీ శాశ్వతంగా ఉండదు. జీవించేవన్నీ ఏదో ఒక రోజు మరణించేవే. అస్తిత్వం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది.
ప్రకృతి ప్రసాదమైన ప్రేమ మీ ప్రయత్నం లేకుండానే అకస్మాత్తుగా వస్తుంది. అదే వాస్తవం. ఒకవేళ అది వచ్చినా, ఏదో ఒక రోజు అది అకస్మాత్తుగా పోతుందనే భయంతో దానిని మీరు అంగీకరించరు. ఎందుకంటే, అది ఎలా వస్తుందో అలాగే పోతుంది. అయినా పరవాలేదు. ఎందుకంటే, ఒక పువ్వు రాలినా కొత్త పువ్వులు వికసిస్తాయి. అది నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి, ఒకే పువ్వును పట్టుకుని వేలాడకండి. అదే జరిగితే, త్వరలో మీరు వాడిపోయిన పువ్వును పట్టుకుని వేలాడతారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. అందరూ జీవం లేని ప్రేమను పట్టుకుని వేలాడుతూ అక్కడే ఆగిపోయారు. ఆ ప్రేమ ఒకప్పుడు జీవమున్నదే. కానీ, అది ఇప్పుడు ఒక జ్ఞాపకంగా, ఒక బాధగా మిగిలిపోవడంతో మీరు అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే, చట్టం కారణంగా మీరు మీ మర్యాద గురించే ఆలోచిస్తారు.
ఒకప్పుడు సామ్యవాద వ్యవస్థలో పెళ్ళిళ్ళు లేవు. దానికి నాంది పలికినవాడు ‘‘కార్ల్‌మార్క్స్’’. అతని భావజాలం అదే. అందుకే రష్యా విప్లవం సంభవించిన తొలి నాలుగైదు సంవత్సరాలలో ‘‘కార్ల్‌మార్క్స్’’ సిద్ధాంతం ప్రకారం వివాహ వ్యవస్థను రద్దుచేసి ప్రేమకు స్వేచ్ఛనిచ్చే ప్రయోగాత్మక ప్రయత్నం చేశారు. దాని ఫలితాలు సమస్యాత్మకంగా పరిణమించాయి. వివాహవ్యవస్థ లేకపోవడంతో దేశానికి, సమాజానికి వెనె్నముక లాంటి కుటుంబ వ్యవస్థ అంతరించింది. అలా జరుగుతుందని ‘కార్ల్‌మార్క్స్’ ముందుగా ఊహించలేకపోయాడు. దాని ఫలితంగా దేశం అస్తవ్యస్తమైంది. వెంటనే వివాహ వ్యవస్థను సమర్థించడం, విడాకుల విధానాన్ని అయిష్టంగానే అంగీకరించడం జరిగిపోయింది. కానీ, కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం కాకుండా ఉండేందుకు విడాకుల వ్యవహారానికి అనేక ఆంక్షలు విధించారు. అలా దేశాన్ని బలోపేతం చేసే విషయంపై వారు శ్రద్ధ చూపారు. ఎందుకంటే, దేశమే లేకపోతే ప్రభుత్వముండదు, రాజకీయ నాయకులుండరు. అందుకే ‘‘కార్ల్‌మార్క్స్’’ సిద్ధాంతాలపై మళ్ళీ ఎవరూ నోరెత్తలేదు.
నేను కూడా కుటుంబ వ్యవస్థ ఉండాలని కోరుకోవట్లేదు. అంతేకాదు, ఈ ప్రపంచం దేశాలుగా విడిపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఏ సంతోషాన్నీ నిరిసించకుండా, స్వతసిద్ధమైన ప్రేమలో స్వేచ్ఛగా, సరదాగా జీవిస్తూ నరకానికి ఏమాత్రం భయపడకుండా, స్వర్గసుఖాలను ఏమాత్రం ఆశించకుండా- ఎందుకంటే, స్వర్గాన్ని మనం ఇక్కడే నిర్మించుకోగలం. ఆ సామర్థ్యం మనదగ్గర ఉన్నా, దానిని ఉపయోగించకుండా అన్నిరకాల అడ్డంకులను మనకుమనమే సృష్టించుకుంటున్నాం- నిశ్శబ్దంలో జీవించే స్వతంత్ర వ్యక్తిత్వమున్న వ్యక్తులతో నిండిపోయిన ఒకే ప్రపంచాన్ని నేను కోరుకుంటున్నాను.
నేను ప్రేమకు వ్యతిరేకిని కాను. నిజానికి, నేను ప్రేమనే ఎక్కువగా ప్రేమిస్తాను. అందుకే నేను బాంధవ్యాలకు, పెళ్ళికి వ్యతిరేకిని. మీరు విడిపోవాలని ఎవరూ చెప్పట్లేదు. ఇద్దరు వ్యక్తులు జీవితమంతా కలిసి జీవించడం సాధ్యమే. అయితే అది వ్యక్తిగత, ఆత్మానుగత విషయాలలో పరస్పర జోక్యం లేకుండా, ప్రేమ పునాదిగా జరగాలి. అదే వారి ఔన్నత్యానికి నిదర్శనం. ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్