మెయిన్ ఫీచర్

పుస్తక పఠనం .. జ్ఞానాభివృద్ధికి మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ భువిలో మనసును కుదుట పర్చి, చల్లనిమాట చెప్పి , కలతను దూరం చేసి, ధైర్యంబు కలుగచేసి, తల్లిదండ్రుల వలె సదుపదేశంచేసేదే పుస్తకం!
పుస్తకం లేని ఇల్లు కిటికీ లేని గది అని చెప్పవచ్చు. విశ్వమాత విజాన రూపిణి యిన సరస్వతి ప్రత్యక్ష ఆలయమే గ్రంథాలయాలు. స్వాతంత్య్ర సమరంలో గ్రంథాలయాది ఒక ముఖ్యమైన పాత్రే. గ్రంథాలయాల ఉద్యమంలో ఎందరో మహానుభావులు పాల్గొన్నారు. వారంతా దేశంలో నిరక్ష్యరాస్యత పోగొట్టి అక్షరదీపాన్ని వెలిగించాలని తపించినవారే.
నాడు అక్షర్యాసత అంతగా ఉండేది కాదు. అందులోను మహిళలు మరింత వెనుకబడి ఉండేవారు. కందుకూరి వీరేశలింగం, రాజారామమోహన్‌రాయ్, చిలకమర్తి ఇలాంటి వాళ్లెందరి కృషినో స్ర్తి విద్యకు శ్రీకారం చుట్టారు. ఆ స్ర్తి విద్యను పెంచి పోషించడానికి ఈగ్రంథాలయాలు ఎన్నోవిధాలుగా ఉపయోగపడ్డాయి. అప్పటికాలంలో వ్యక్తిగతంగాను, సమిష్టిగాను సంచార గ్రంథాలయాలను నడిపేవారు. ఇంటింటికి తిరిగి గ్రంథాలను ఇచ్చి ప్రజల్లో పఠనాసక్తిని పెంచడానికి కృషి చేసేవారు.
అటువంటి వారిలో పాతూరి నాగభూషణం గారొకరు. వారికి ఆంధ్రాయూనివర్సిటీ కళాప్రపూర్ణ నిచ్చి సత్కరించింది. గ్రంథాలయాల ఉద్యమంలో పాల్గొనడం, ప్రతివారికి చదువుపట్ల ఆసక్తిని కలిగించడంలో ఆయన మహోన్నతమైన సేవ చేశారు. ఆయన సొంతంగా ఇంట్లో గ్రంథాలయాన్ని నడిపేవారు. ఆయన వారసత్వాన్ని అందుకోవడానికి నాగభూషణం గారి కుమార్తె డా. శ్రీమతి రావి శారద ముందుకు వచ్చారు. చిన్నప్పటి నుంచి గ్రంథాలయాల పట్ల మక్కువ ఏర్పరుచుకున్నారు. నిరంతరం చదవాలని చెప్పే తండ్రికి తగ్గట్టుగానే ఎన్నో పుస్తకాలను చదువుతూ ఉండేవారు.
ఆ శారదనే నేడు బిఎస్‌సిడిగ్రీని మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్‌స్ పొందారు.. ప్రిన్సిపాల్ స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్‌స్ గా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లైబ్రరీస్ అసోసియేషన్‌లో వివిధ పదవుల్లో పనిచేశారు. గ్రంథాలయ సర్వస్వానికి ఎడిటర్‌గా ఉన్నారు. లైబ్రరీ సైన్స్ లో పిహెచ్.డి పట్టా తీసుకొన్నారు. ఇన్ని చేస్తూనే వ్యక్తిగతంగా ప్రతివారు చదువు పట్ల ఆసక్తి కలిగి ఉండాలని నిరంతరం ఉపన్యాసాల రూపంలోను తానే స్వయంగా పాఠశాలలకు, మహిళా మండలలులకు వెళ్లి విజ్ఞానాభివృద్ధికోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. శారదగారిలోని సేవాభావం, ఆమె చేసే కృషికి తగ్గట్టుగా 2016లో హంస అవార్డ్ శారదను వరించింది.
విజ్ఞానాభివృద్ధి చేయాలనే పనుల్లో భాగంగానే పద్య పఠన పోటీలను, వకృత్వపోటీలను, డిబేట్స్‌ను పెట్టి పిల్లల్లో పఠనాసక్తిని కల్గించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు.
ప్రతిసంవత్సరం గ్రంథాలయాల వారోత్సవాలను ఇంట్లో పండుగలా చేస్తారు. మీడియా ప్రభావం టీవీల ఆకర్షణ ఎక్కువైన ఈకాలంలోకూడా పిల్లలు, పెద్దలు చదువు పట్ల ఆసక్తిని తగ్గించుకోకూడదంటారు రావి శారద. దృశ్యం కనుల ముందు కనిపించి తిరిగి మాయమవుతూ మరోదృశ్యాన్ని వెళ్లిపోయే దృశ్యమాధ్యమాలు మనుష్యుల మెదడు కట్టివేస్తాయికానీ మనిషి ఆలోచనాశక్తిని పెంచవు. పుస్తక పఠనం మనిషిలో ఆలోచనాతరంగాలను ఉవ్వెత్తున రేకెత్తిస్తాయ. పైగా మానసిక వికాసానికి కూడా పుస్తకాలే మార్గదర్శకాలు అవుతాయి. దృశ్యం చూసినంత సేపు మనసు నిలుస్తుంది కానీ పుస్తకంలోని అక్షరాలు చదువు ఆపేసినా నిద్రపోతున్నా ఆలోచనలు రగిలిస్తూ నే ఉంటాయన్నది శారద ఉద్దేశం. అందుకే ప్రతివారు కనీసం రోజుకు గంట చదువాలన్న నిబంధనను పెట్టుకోవాలంటారుశారద.
శారద మాటల్లో ...నాడు గ్రంథాలయ ఉద్యమాలు జరుగుతున్నపుడు పల్లెల్లో రచ్చబండ దగ్గర, లేక గ్రంథాలయాల్లో ఊరి పెద్దనో, మునుసుబునో,కరణమో ప్రతిరోజు పేపరు చదివి దానిలో ఉండే విషయాలను ఊరి వారందిరికీ వినిపించే పద్ధతి ఉండేది. ఒక్కోరోజు ఆ పత్రిక చదివేవారు నాకు బాగాలేదనే నాటకం ఆడేవారు. కాని ఊరిప్రజల పత్రికలోవిషయాలను ఎలాగైనా చెప్పమని అడుగుతుంటే అందుకే ప్రతివారు చదువుకోవాలి. ఎవరి జోలి లేకుండా అక్షరాలు వస్తే ఎవరికివారే చదువుకోవచ్చు అంటూ వారికి చదువుకుంటే ఎన్నిలాభాల్లో ఉన్నాయో విడమర్చి చెప్పి మరీ చదివించేవారు. నా వృత్తిరీత్యా పాఠశాలల్లోదాదాపుగా 1200 గ్రంథాలయాల ఏర్పాటులో భాగమైనందుకు నేను ఎంతో సంతోషపడుతుంటాను. మనిషికి విద్యను మించిన ధనం ఎక్కడా ఉండదు.విద్యాగంధం చేత సుసంపన్నమైన జీవితాన్ని అనుభవించవచ్చు.
సరస్వతీ దేవి పుస్తకం ఉన్న పూరిగుడిసె లోనైనా ఉండడానికి ఇష్టపడుతుంది కానీ పుస్తకం లేని మహాసౌధంలో నివసించడానికి ఇష్టపడదు. కనుక ఆ సరస్వతీదేవిని మనింట్లో కూర్చోబెట్టుకోవాలంటే ముందుగా మనం అక్షరాలను నేర్చుకోవాలం టాను. మరీ ఈ మధ్య పిల్ల్లల్లో పెద్దల్లో పఠనా శక్తి తగ్గి పోతోంది కదా .. అందులో పిల్లల్లో కేవలం క్లాసు పుస్తకాలు చదవడం.. ,అవి కూడా కార్పోరేటు స్కూల్స్‌లో స్టడీ మెటరీయల్ అని ఇస్తున్నారు దానితో ఏదోబట్టీ కొట్టడం తప్ప చదవడం అనేది తగ్గిపోయింది కదా మరి వారిలో పఠనాసక్తిని పెంచేమార్గాల గురించి కాస్త వివరించండి అంటే దీనికి తరుణోపాయం తరుణుల దగ్గరే ఉంది. ముందు తల్లులంతా పుస్తకాలు చదివితే పిల్లలు చెప్పకుండానే పుస్తకాలు పట్టుకుంటారు. అంతేకాక 30 రోజుల్లో క్రాష్ కోర్స్ అని పెట్టే అక్షరజ్యోతి కార్యక్రమాల ద్వారా కూడా పఠనాసక్తిని పెంచుకోవచ్చు. వీటివల్ల కూడా ప్రయోజనం పొందవచ్చు.
మరీ ముఖ్యంగా ఈ తరం పిల్లలను చదువు వైపుకు మర్చలాంటే గర్భిణిగా ఉన్నప్పుడే చదువు పట్ల ఆసక్తి కనబరిస్తే పుట్టే పిల్లలు కూడా చదువు పట్ల ఆసక్తిని కనబరుస్తారు. విదేశాలల్లో మూడునాల్గేండ్ల పిల్లలకు అక్కడి తల్లులు పుస్తకాలు చదివి పిల్లలకు ఆ చదివింది వినిపిస్తుంటారు. ఇక్కడ కూడా ఆ పద్ధతి అవలంబిస్తే బాగుంటుంది. అంతేకాక ప్రతి సాయంత్రం పెద్దలు పిల్లలకు ఒక కథను చెప్పితే కూడా పిల్లల్లో చదువు కోవాలనే అభిలాష కలుగుతుంది. టీవీల్లాంటి ప్రసార మాధ్యమా ల వల్ల ప్రపంచంలో జరిగే వింతలు విడ్డూరాలు తెలుసుకోవచ్చు కానీదానివల్ల పుస్తకం పఠనాసక్తిని కోల్పోనక్కర్లేదు. పుస్తక ప్రాధాన్యం పుస్తకానికే ఉంటుంది.
ఫారన్‌కంట్రీస్ లో విదేశాల్లో అందరూ పుస్తకాలు కొనడం కోసం ఖర్చుపెడతారు. ఆ పుస్తకాలు వారు చదవడమే కాక పిల్లల చేత కూడా చదివిస్తారు. మనమూ విధిగా పుస్తకాలు కొని వాటిని మనం చదువుతూ మన వారసులను కూడా చదివిస్తే తిరిగి పుస్తకం రాణింపుకు వస్తుంది. దృశ్యమాధ్యమాలనైతే ఒక చోట కూర్చుని విద్యుత్ సౌకర్యం ఉంటేగాని చూడలేము. కానీ పుస్తకం చదువుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే చాలు. అక్కడహాయగా చదువుకోవచ్చు. అటు ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఇటు పుస్తకజ్ఞానాన్ని అందుకోవచ్చు. కనుక అందరూ చదువు పట్ల ఆసక్తిని రోజురోజుకు పెంచుకోవాలి అంటారు రావి శారద. ప్రతి సంవత్సఠం ఇంటింటి దగ్గర పుస్తకాల సేకరణ జరిపి , గ్రంథాలయాల వారోత్సవాల్లోభాగంగా నిర్వహించే పుస్తక ప్రదర్శనలో- సేకరించి పుస్తకాలను ప్రజలకు ఉచితంగా కూడా ఇస్తూ ప్రజలల్లో పఠనాసక్తిని పెంచడానికి మావంతు కృషి చేస్తున్నామని శారద చెప్పారు. మరి మనమూ రావి శారదతో ఏకభవించవచ్చుగదా. ఇక పుస్తక పఠనం ప్రారంభిద్దామా

-వాణి ప్రభాకరి