మెయన్ ఫీచర్

‘కూటమి’కి గ్రహణం.. అసెంబ్లీ ఎన్నికలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా అన్ని విపక్షాలను ఒక వేదికపైకి తీసుకువచ్చి, వచ్చే ఎన్నికలలో నరేంద్ర మోదీ మళ్లీ అధికారం చేపట్టకుండా కట్టడి చేయడంతో పాటు, రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అందరి ఆమోదం పొందేందుకు కాం గ్రెస్ పార్టీ వేస్తున్న ఎత్తుగడలు ఫలించడం లేదు. అనూ హ్యంగా ఎదురు దెబ్బలు తగలడంతో ఇప్పుడు ప్రతి పక్షాల ఐక్యత గురించి కాంగ్రెస్ ఏమీ మాట్లాడటం లేదు. ప్రస్తుతానికి మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపించడం లేదు.
కర్నాటకలో కేవలం 38 సీట్లు గెల్చుకున్న హెచ్‌డి కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా- 80 సీట్లు గెల్చుకున్న పార్టీ అధినేతగా రాహుల్ చాలా ఉదారంగా వ్యవహరించారని పేరు తెచ్చుకున్నారు. భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ‘మహాఘట బంధన్’ ఏర్పాటుకు ఆయన చొరవ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. దాంతో ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ గాంధీకి మద్దతు కూడదీయడంలో కీలక మలుపు తిరిగినట్లే అని అందరూ భావించారు. అయితే పరిస్థితులు అనూ హ్యంగా మారాయి. రాహుల్‌ను ప్రధాన మంత్రి అభ్యర్ధిగా కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పలేదని ఆ పార్టీ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రకటించారు. అంతకు రెండు వారాల ముందు ఓ సదస్సులో- ప్రతిపక్షాలు ప్రతిపాదిస్తే తాను ప్రధాని పదవిని చేపట్టడానికి సుముఖంగా ఉన్నానని రాహుల్ చెప్పడాన్ని ఎవ్వరూ ఇంకా మర చిపోలేదు. చిదంబరం ప్రకటనకు రెండు రోజుల తర్వాత- రాహుల్‌కి అటువంటి అవకాశమే లేదని ఎన్‌సీపీ నేత శరద్ పవార్ కుండబద్దలు కొట్టారు. రాఫెల్ విమానాల కుంభకోణంపై నిత్యం రాహుల్ చేస్తున్న ఆరోపణలను ఆయన ప్రస్తావిస్తూ, ‘‘ఆయన వద్ద ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయోమో.. నా వద్ద మాత్రం లేవు’’ అన్నారు. ఇదంతా చూస్తుంటే రాహుల్‌ను ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్ మిత్ర పక్షాలు ఒప్పుకోవడం లేదని తేలింది. దీంతో ఈ విషయంలో కాంగ్రెస్ వెనుకడుగు వేయక తప్పడం లేదు.
మరోవంక- ప్రస్తుతం అయదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే మహాకూటమిని ఏర్పాటు చేసి, ప్రతిపక్షాలకు కేంద్ర బిందువుగా కాంగ్రెస్‌ను మార్చాలని రాహుల్ వేసిన ఎత్తుగడకు బిఎస్పీ అధినేత్రి మాయావతి గండికొట్టారు. కాంగ్రెస్‌తో తమకు పొత్తు లేదని ఏకపక్షంగా ప్రకటించడమే కాదు, ఆమె తన దారి తాను చూసుకొంటున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలలోనే ఆ పార్టీతో కలసి పోటీ చేయడానికి ఇతర పక్షాలు సిద్ధపడడం లేదు. దీంతో ప్రస్తుతానికి ‘‘మహాకూటమి’’ ఆలోచనలకు కాంగ్రెస్ స్వస్తి పలుకు తోంది. అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించడం ద్వారా ముందుగా తన బలాన్ని స్థిరీకరించుకొనే ప్రయత్నం చేస్తున్నది. మరోవైపు భాజపా కూడా తన మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వంటి వారు ఈ విషయమై వత్తిడి తెస్తున్నా ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలలో తీరిక లేకుండా ఉన్నానని, ఎన్నికల తర్వాత ఆలోచిద్దామని భాజపా అధ్యక్షుడు అమిత్ షా దాటవేస్తున్నారు. అయదు రాష్ట్రాల ఎన్నికలతో సంబంధం లేని పక్షాలు కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాత పొత్తుల సంగతి చూద్దాంలే... అనే ధోరణితో వ్యవహరించడం గమనార్హం. అయదు రాష్ట్రాల ఎన్నికలతో కాంగ్రెస్ అస్తిత్వ సమస్యను ఎదు ర్కొంటున్నది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల చేపట్టిన తర్వాత మొదటి సారిగా జరుగుతున్న ఎన్నికలు.
కనీసం ఒకటి, రెండు రాష్ట్రాలలోనైనా కాంగ్రెస్ అధికారం చేపట్టని పక్షంలో అది మరో ప్రాంతీయ పార్టీగా మారి పోవలసిందే. పొత్తుల విషయంలో ప్రాంతీయ పార్టీలు చెప్పినట్లు కాంగ్రెస్ వినక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటప్పుడు ప్రధాని పదవి వైపు చూసే అవకాశం కూడా ఉండదు. అయదు రాష్ట్రాల ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని ఉత్తర ప్రదేశ్ లో సైతం ప్రతిపక్షాలు పొత్తుల విషయంలో ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. పొత్తుల విషయమై అఖిలేశ్ యాదవ్, మాయావతి, అజిత్ సింగ్ ఇప్పటికే మాట్లాడు కొన్నా, ఇంకా ఒక నిర్ణయానికి రాలేక పోతు న్నారు. పొత్తులకు సంబంధించి బిహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, మహారాష్టల్రు కుడా కీలకమైనవే. అయదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2019 లోక్‌సభ ఎన్నికలపై నిర్ణయాత్మక ప్రభావం చూపే అవకాశం ఉంది. అయదు రాష్ట్రాల ఎన్నికలలో భాజపా ఘన విజయం సాధిస్తే మహారాష్టల్రో శివసేన, బిహార్‌లో జేడీయూలను ఆ పార్టీ లెక్క చేయవలసిన అవసరం ఉండదు. తమ షరతులకు లోబడి వారుంటే సరే, లేని పక్షంలో ఒంటరిగా పోటీ చేయడానికి భాజపా రెడీ అవుతోంది. కనీసం రెండు రాష్ట్రాలలో అయినా అనుకోని పరాజయం ఎదురైతే శివసేన, జేడియుల డిమాండ్లకు భాజపా తలొగ్గి వారితో అవగాహనకు రాక తప్పదు. అందుకనే వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై అనూహ్య ప్రభావం చూపే అవకాశం ఉంది.
వాస్తవానికి బిహార్‌లో లోక్‌సభ సీట్ల సర్దుబాట్ల గురించి గత నెలలోనే అమిత్ షా, నితీశ్ కుమార్ ఒక అవ గాహనకు వచ్చినట్లు తెలుస్తున్నది. బిజెపి 17, జేడియూ 16 సీట్లలో పోటీ చేయడానికి ఒప్పుకున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి 5, ఉపేంద్ర కుష్వా చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి రెండు సీట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. గత ఎన్నికలలో మూడు సీట్లు గెల్చిన కుష్వా ఇప్పుడు ఎక్కువ సీట్లు అడుగుతున్నారు. అందుకోసం ఒకవంక ఆర్‌జేడీ పార్టీతోనూ ఆయన సంప్ర దింపులు చేస్తున్నారు. బేరం కుదరకపోతే వామపక్షాలతో కలసి మరో కూటమి ఏర్పాటుకు పావులు కదుపుతారు. కుష్వా ఎత్తుగడల గురించి తెలుసుకున్న భాజపా- ఎన్ డీఏ నుండి మరో పార్టీ వెళ్ళడం ఇష్టం లేక ప్రస్తుతం పొత్తు ఫార్ములాను బైట పెట్టడం లేదని తెలుస్తున్నది.
కాంగ్రెస్ సైతం కనీసం రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని పక్షంలో బిహార్ లో నితీశ్ కుమార్ ను మహాకుటమిలోకి తీసుకు రావడం కోసం చేస్తున్న ప్రయత్నాలకు లాలూ ప్రసాద్ కుమారులు అడ్డు పడ తారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ పొత్తులకు ఏ మాత్రం ఒప్పుకోరు. ఉత్తరప్రదేశ్ లో నాలుగైదు సీట్లకు కాంగ్రెస్ పరిమితం కావలసిందే. సమాజ్‌వాదీ పార్టీ, బిఎస్పీ, ఆర్‌జేడీ, ఎన్‌సీపీ, డీఎంకే, టీడీపీ వంటి పార్టీల ముందు కాంగ్రెస్ మోకరిల్లక తప్పదు. అందుకనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు కీలకం కానున్నాయి. ఇక మహారాష్టల్రో సీట్ల సర్దుబాటులో శరద్ పవార్‌దే పైచేయి అవుతుంది. కర్ణాటకలో జెడిఎస్ అడిగినన్ని సీట్లు ఇవ్వక తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాలపై నాలుగైదు సీట్లకు కాంగ్రెస్ పరిమితం కావలసి ఉంటుంది. తెలంగాణ, రాజస్తాన్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు జరిగితే రాహుల్ గాంధీ ప్రాధాన్యత విపక్షాలలో ఒకేసారి పెరుగుతుంది. లోక్‌సభ సీట్ల సర్దుబాటులో పైచేయి కాగలదు. మరిన్ని కొత్త పక్షాలు కాంగ్రెస్‌తో పొత్తులకు సుముఖత చూపే అవకాశం ఉంటుంది. అందుకనే అయదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పట్ల ఒక వంక బిజెపి, మరో వంక కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి.
బిజెపి వ్యూహంలో సైతం తెలంగాణ, మిజోరంలలో తమ పార్టీకి మెజారిటీ రాకున్నా, కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. కాంగ్రెస్ లేకుండా మిగిలిన ప్రతిపక్షాలు చెప్పుకోదగిన ఇబ్బందులు సృష్టించే అవకాశం లేదని తెలుసు. శరద్ పవార్, దేవగౌడ, నవీన్ పట్నాయక్, కేసీఆర్ వంటి నేతలు కాంగ్రెస్ మరింత బలహీనమైతే భాజపాను ఎదిరించే అవకాశాలు ఉండ కపోవచ్చు. మహారాష్టల్రో శివసేన ప్రస్తుతం బిజెపిపై ఎన్ని విమర్శలు ఘాటుగా చేస్తున్నా కాంగ్రెస్, ఎన్‌సీపీలతో చేతులు కలపడం సాధ్యం కాదు. దానితో రాజకీయ అస్తిత్వం కోసం బిజెపి అండ తప్పక పోవచ్చు. బిజెపి, శివసేన కలిస్తే గనుక- మహారాష్టల్రో కాంగ్రెస్, ఎన్‌సీపీ, మిగిలిన ప్రతిపక్షాలు కలిసినా ఘన విజయం సాధించే అవకాశాలున్నాయి. అయితే సీట్ల బేరసారాలే ఇక్కడ కీలకం కానున్నాయి. అందుకనే తాము ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన అధినేత ఉద్దావ్ థాకరే చెబుతున్నా, ఆ పార్టీతో కలసే పోటీ చేస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశంలో దాదాపు ప్రాంతీయ పార్టీలన్నీ హంగ్ పార్లమెంట్ ఏర్పడాలని కోరుకొంటున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భాజపాకు తప్ప మరే పార్టీకి కూడా సొంతంగా మెజారిటీ సీట్లు గెల్చుకొనే సత్తా లేదు. అయితే మ్యాజిక్ నెంబర్‌కు భాజపా చేరుతుందా? భాజపా బలం తగ్గడం అంటే పరోక్షంగా కాంగ్రెస్ బలం పెరగటమే కాగలదు. భాజపా బలహీనతలే కాంగ్రెస్‌కు వరంగా మా రే అవకాశం ఉంది. అందుకనే భాజపాను నిలువరించి, తన బలం పెంచు కొంటే మిగిలిన పార్టీలు వాటిఅవసరాల కోసమైనా తమతో రాకపోతాయా? అన్నది కాంగ్రెస్ ధీమా.

-చలసాని నరేంద్ర