మెయిన్ ఫీచర్

పసిహృదయాలు.. సమ్మెట దెబ్బలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు మనసు చాలా సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే ఒక ద్రవ పదార్థాన్ని తీసుకుని ఏ పాత్రలో పోస్తే ఎలా ఉంటుందో మనం అంటే ఇంట్లోని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, చుట్టుప్రక్కల వాళ్ళు ఎలా వుంటే వాళ్ళు అలా కనెక్ట్ అయిపోతారు. ఏది మంచి, ఏది చెడు అనేది వారికి తెలియదు. తెలుసుకునేంత వయస్సుకాదు, అంతటి పరిజ్ఞానం ఉండదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, చుట్టాలు, స్నేహితులు, సమాజం ఇవన్నీ పిల్లల పెంపకం, పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాలి. ప్రశాంతమయిన, సున్నితమయిన, విలువలతో కూడిన పరిసరాల్లో పెంచాలి. కొన్నికొన్ని కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య చీటికి మాటికి, అవసరమున్నా లేకున్నా గొడవలు, డిస్కషన్స్ జరుగుతుంటాయి. అలాంటి గొడవలు, డిస్కషన్ చిలికి చిలికి గాలివానగామారి తుఫానులా మారి దాంపత్య జీవితానే్న ఛిద్రం చేసేలా తయారవుతాయి. చీటికి మాటికి పోట్లాడుకోవడంవల్ల మనసులు దూరం అవుతాయి, మనుషులు దూరం అవుతారు. మనిషి జన్మ చాలా గొప్పది. ఎన్నో జన్మలు, ఎనె్నన్నో పుణ్యకార్యాలు తరువాత గానీ మానవజన్మ సిద్ధించదు. మనిషిగా పుట్టడం ఒక గొప్ప వరం. మనిషిగా పుట్టగానే అంతటితోనే అయిపోలేదు. మనిషిగా బ్రతకాలి.
అన్ని బంధాలకన్నా దాంపత్య బంధం మరీ గొప్పది. చాలా పవిత్రమయినది. పెళ్ళి అనేది కేవలం ఇద్దరు మనుషుల్ని శారీరకంగా కట్టిపడేసేది కాదు. రెండు మనుషుల్ని, ఇరు కుటుంబాల్ని, బంధాలు బంధుత్వాలు అనే నైతిక విలువలతో కట్టి దగ్గరికి చేసేది. దాంపత్యం, దాంపత్య జీవితం, పిల్లలు, సంసారం, కుటుంబం అనేవి సమాజానికి గొప్ప మెసేజ్ ఇచ్చేవి. ఇవి బాగుంటేనే సమాజం బాగుంటుంది. అయితే ప్రతిదానికీ గొడవపడే తల్లిదండ్రులను చూసి పసి మనసులు చాలా క్షోభ అనుభవిస్తాయి. తల్లిదండ్రులు ఎందుకు గొడవపడుతున్నారో తెలియదు. ఏమీ తెలియక ఆ చిన్ని మనసు నిశే్చష్టుడిలా ఉండిపోతాడు. భార్యాభర్తలు పిల్లలముందు డిస్కషన్స్ చేయకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, టీవీలు చూస్తున్నప్పుడు, భోజనాలు చేస్తున్నపుడు, పడక గదుల్లో, నల్గుర్లో ఉన్నప్పుడు కయ్యానికి కాలుదువ్వొద్దు. నువ్వెంతంటే, నువ్వెంతంటే దుమారం చెలరేగుతుంది. ఎడబాట్లు, విడాకుల వరకు దారితీసే ప్రమాదాలుంటాయి. ఒకరు గట్టిగా ఇబ్బందిపెట్టే మాటలు, సూటిపోటి మాటలు అంటున్నప్పటికీ, ఇంకొకరు ఓపికతో, టాపిక్ డైవర్ట్‌చేసే విధంగా మాట్లాడితే కొంతవరకు సమస్యలు తగ్గిపోతాయి. అయితే పిల్లలు ప్రక్కనే ఉన్నప్పుడు భార్యభర్తను మాటలంటుంటే ఓపిక పట్టలేక భర్త ఒక దెబ్బ కొట్టినట్లయితే ఆ సమస్య చాలా దూరంపోతుంది. ఆ ఓ సంఘటనకు తండ్రిపై పిల్లలకు ద్వేషం, ఆవేశం, చెడు ముద్ర పడిపోయి తన తల్లిని కొట్టినందుకు తండ్రిపై ప్రేమ తగ్గిపోతుంది. తల్లిదండ్రుల మధ్య సమస్య ఏంటనేది ఆ పసి హృదయానికి తెలియదు. కానీ తనను ఎప్పుడూ దగ్గరగా వుండి ప్రేమతో లాలించి, పాడించి, ఆడించి, అన్నం తినిపించి ముద్దుమాటలు చెప్పే తల్లికి బాధ కలిగేసరికి ఆ పసి హృదయం తల్లడిల్లిపోతుంది. స్ర్తిలుకూడా (్భర్యలు) భర్తలు ఎన్నో ఆలోచనలతో (వృత్తిరీత్యా) ఉంటారు. వచ్చిరాగానే ప్రేమతో కాఫీ ఇవ్వాలి కానీ విసగెత్తే మాటల్తో భర్తల్ని ఇబ్బందిపెట్టకూడదు. కాస్త విచక్షణతో ఉండాలి. లేకపోయినట్లయితే చిన్నపిల్లల మనసులో ఇలాంటి సంఘటనలు బలంగా నాటుకుపోయి తర్వాత ఎవరి జీవితాల్ని ఛిద్రంచేస్తాయో తెలీదు. పిల్లల ముందు ఎలాంటి డిస్కషన్స్ చెయ్యకూడదు. పిల్లలు లేనప్పుడు ఎంత గొడవ పడినప్పటికీ ఆ తరువాత సమస్యకు సానుకూల పరిష్కారంచేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకునేంత శక్తికి పెద్దవాళ్ళకి ఉంది. కానీ పసి హృదయాలకు అంత ఆలోచన, శక్తి ఉండదు.
ఇంట్లోకానీ, ఉద్యోగం చేస్తున్న దగ్గరకానీ, ఆర్థికంగా గానీ ఏ సమస్య ఉన్నాకూడా పిల్లలముందు మాట్లాడకూడదు. అసలు ఒక విషయం కరెక్టుగా చెప్పాలంటే పిల్లలకు చదువు, ఆటపాటలు, సంతోషం తప్ప ఎటువంటి విషయాలు తెలియనివ్వకూడదు. పెద్దలు బాధపడుతుంటే వారి మనసుకూడా ఏదో ఆలోచనలో పడిపోతుంది. కాబట్టి పిల్లలతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడసలే స్పీడ్ టెక్నాలజీ, రాకెట్ యుగం నడుస్తోంది. బంధాలు, బంధుత్వాలు తెలియడం లేదు. ఇంకా వారిముందు ఇలాంటివి జరిగితే వారి భవిష్యత్ దెబ్బతింటుంది. తల్లిదండ్రులు పడే కష్టాలు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విడమరిచి చెప్పకూడదు. వాటిని భార్యాభర్తలే సాల్వ్‌చేసుకోవాలి. ఉదాహరణకు ఒకబ్బాయి క్లాస్‌లో ఫస్ట్. ఆటలు, పాటలు, చదువు అన్ని రంగాల్లో ముందున్నాడనుకుందాం. అతడికి ఇంకా పెద్దపెద్ద కాంపిటీషన్స్‌లో పాల్గొని జిల్లాస్థాయి, రాష్టస్థ్రాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయికి వెల్ళాలనుంటుంది. కానీ ఇంట్లోకి ఆ అబ్బాయి స్కూల్‌నుండి వచ్చేసరికి తల్లిదండ్రులు గొడవ పడుతుంటే అదిచూసిన ఆ అబ్బాయి ఏమీ చెప్పలేడు. అందువల్ల వాడికున్నటువంటి శ్రద్ధ, నాలెడ్జి అన్నీ వానిలోనే దాగిపోతాయి. భవిష్యత్‌లో ఏమీసాధించలేడు. గొప్పవాడు కాలేడు. ఇంతటి తీవ్ర విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నట్టయితే ఇల్లు, పిల్లలు, కుటుంబం, సమాజం అన్నీ బాగుపడతాయి. లేకుంటే సంఘ విద్రోహకశక్తులుగా కూడా మారే అవకాశం లేకపోలేదు. బంధాలు, బంధుత్వాలు, కుటుంబాలు బాగుంటే పిల్లల్ని భావిభారత పౌరులుగా దేశానికి, సమాజానికి, ముందుతరానికి అందించవచ్చు.

- శ్రీనివాస్ పర్వతాల