మెయిన్ ఫీచర్

మహిళా భద్రతలో నిజమెంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీటూ’ పేర మీడియాలో చెలరేగిపోతున్న ఉద్యమం తీరుతెన్నులు చూస్తే దీని నేపథ్యం, వెలికివచ్చిన తీరు, వ్యవహరిస్తున్న తీరు, రాగల కీడు ఇవన్నీ బేరీజు వేసుకోవాల్సిన అవసరం కన్పడుతున్నది. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తున్న సమయంలో అనేకమంది స్ర్తిలు ‘మీటూ’ అంటూ తాము గతంలో పడ్డ లైంగిక వేధింపులు, అందుకు కారణమైన వ్యక్తుల పేర్లు, వారి పోకడలు బయటపెడుతూ మీడియాలో పది రోజులపాటు నడిచాయి. స్ర్తిని దేవతగా ఆరాధించే దేశంలో ఈ తరహా కథనాలు, కవ్వింపులు, కదనకుతూహల విన్యాసాలు జరగడం ప్రతి వ్యక్తినీ ఆలోచింపచేస్తుంది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యాషన్ రంగాల్లో ప్రముఖులు ఈ ఆరోపణల్లో కేంద్ర బిందువులయ్యారు. కానీ ఆ ఆరోపణల్లో నిజమెంతో తేలాల్సి వుంది. లైంగిక వేధింపుల విషయమై అమెరికాలో 2017 అక్టోబర్‌లో ప్రారంభమైన మీటూ ఉద్యమం నేడు భారత్‌కు చేరింది. హాలీవుడ్ చిత్రాల నిర్మాత హార్వే విన్‌స్టన్‌కు వ్యతిరేకంగా అమెరికాకు చెందిన సామాజిక కార్యకర్త, మహిళ తారానా బుర్కి 2006లో ఈ పదాన్ని వాడింది. అమెరికన్ నటి అలీస్సామీలానో దీనికి బాగా ప్రచారం తెచ్చింది. అమెరికా చర్చిల్లో, యూరపు చర్చిల్లో జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ ఉద్యమం చర్చి టూ ఉద్యమంగా కూడా రూపొందింది. కేరళలో ఈమధ్య ఒక నన్‌పై బిషప్ ములక్కల్ జరిపిన అత్యాచారం సంగతి తెలిసిందే? ఆయన అరెస్టయి ఈ మధ్యనే బెయిల్‌పై విడులయ్యాడు. తర్వాత పంజాబ్‌లోని జలంధర్ వెళ్లినపుడు ఆయనకు భక్తులు పూలవర్షం కురిపించారు. నిజానికి క్రైస్తవం ప్రకారం అత్యాశ, రతిపిపాస భయంకరమైన పాపాలు. కానీ రాంచిలో మిషనరీస్ ఆఫ్ ఛారిటీలో నన్‌లు పసిపిల్లలను అమ్ముకుంటున్న వైనం గత జూలై నెల్లో వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థను సాక్షాత్తు మదర్ థెరీసా ప్రారంభించారు. ఈ పసిపిల్లలు అట్టడుగు వర్గాల ప్రజలకు చెందినవారు. ‘సేవ’ పేరున జరుగుతున్న మోసమిది. దీనిపై ప్రస్తుతం జార్ఖండ్ ప్రభుత్వం విచారణ జరుపుతున్నది. 450 మంది గర్భవతులు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థకు వస్తుండేవారు. కానీ రికార్డుల్లో 170 మంది పిల్లలే దొరికారు. మిగిలిన 280 మంది పిల్లలను అమ్మివేశారన్నమాట. ఇక తరువాత జరిగింది కొట్టాయంకు చెందిన నన్ జలంధర్ బిషప్ ములక్కల్‌పై చేసిన లైంగిక వేధింపుల తాలూకు ఆరోపణ. చర్చి అధికారులు ఫిర్యాదు చేసినా స్పందించలేదంది. 2014లో ఈ బిషప్ కొట్టాయంలోని కురువిలంగడు గ్రామానికి వచ్చాడని, తనను ఆ తరువాత 13 సార్లు రేప్ చేశాడని ‘నన్’ ఆరోపించింది. ఫిర్యాదు చేసినందుకు తనను కొలువులోంచి తీసేశారని ఆమె అంది. గత కొనే్నళ్లుగా చర్చిల్లో పిల్లలపై లైంగిక అత్యాచారాలు కూడా పెరిగిపోతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. అధికారిక చట్ట నిబంధనల్లో ఒకటైన ‘కల్చరల్ జినోసడ్’ కింద అనేమంది ఫాదర్‌లు, బిషప్‌లు అరెస్టుయ్యారు. బాధితులకు పరిహార చెల్లింపులు చేసి చేసి చర్చిలు దివాలా తీస్తున్నాయి. బాబాలే కాదు ఫాదర్‌లు బిషప్‌లలో కూడా ధార్మికత పేర దౌర్భాగ్యపు పనులు చేసేవాళ్ళు మీడియాలో కనిపించడంతో అంతర్జాతీయ చర్చికి దిక్కుతోచని స్థితి ఎదురైంది.
‘మీటూ’ అంటూ భారతీయ సమాజంపై మిటకరింపులు సర్వత్రా మొదలయ్యాయి. స్ర్తిని తల్లిగా భావించిన దేశం పరువు తీసేందుకు, భారతదేశమంటేనే లైంగిక వేధింపులకు లింగ వివక్షతకు మారుపేరనే రీతిలో అపప్రచారం, అధికప్రసంగం మొదలై మీడియాలో పుంఖానుపుంఖాలుగా ప్రాసారాలు పురుడు పోసుకున్న తీరు సభ్య సమాజం తలవంచుకునేలా చేసింది. ఎపుడో 10 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం జరిగినవో కావో తెలియని సంఘటనలను, సందర్భాలను తవ్వి తీసి మరీ అసలు సమస్యను పక్కదారి పట్టించిన ప్రబుద్ధుల మంత్రాంగం, తంత్రాంగం జాతి జనం గమనించకపోలేదు. చివరికి బిషప్ చేసిన అత్యాచారాలకు సాక్షి అయిన కురియోకోన్ కట్ట్ధుర జలంధర్‌కు సమీపంలోని దాసుయా వద్ద శవమై కనిపించాడు. తన్ను కూతురులా చూసుకున్న కురియోకోన్ మృతిపట్ల బిషప్ ములక్కల్‌తో అత్యాచారాలకు గురియైన నన్ అనుపమ భోరున ఏడ్చింది. బిషప్ ములక్కల్ పతనమవుతున్న చర్చి ప్రమాణాలకు నిదర్శనం. ఇంత జరుగుతున్నా మీడియా చోద్యం చూస్తోంది.
మరోప్రక్క సుప్రీంకోర్టు గత నెలాఖరులో వెలువరించిన తీర్పులు భారతీయ కుటుంబ వ్యవస్థను, భారతీయ స్ర్తి గౌరవాన్ని మంటగలిపేవిగా ఉన్నాయి. శబరిమలలో మహిళల దర్శనం గురించి శతాబ్దాల ఆలయ నియమాలను, మర్యాదలను కాలరాస్తూ వెలుడిన తీర్పులకు సెక్యులర్ మేధావులు జబ్బులు చరుచుకుంటున్నారు. మహిళా సాధికారతలో మహిళలకు భద్రత ఉంది. కాదలేం. కానీ సాధికారత విషయమై నిర్ణయం తీసుకున్న జడ్జిల ప్యానెల్‌లో ఐదుగురున్నారు. అందులో మహిళా జడ్జి శ్రీమతి ఇందు మల్హోత్రా శబరిమలలో మహిళల ప్రవేశం (10 సం. - 50 సం. మధ్యగలవారు)విషయమై విభేధించారు. మతాచారాలపై వేసిన పిల్‌వల్ల దేశ సెక్యులర్ స్వభావం దెబ్బతింటుందని, ఆర్టికల్ 14 సమానత్వం గురించి మాట్లాడుతున్నా- ఆర్టికల్ 25 మతస్వేచ్ఛ గురించి చెబుతున్నదని, మతాచారాలను ఏ మతంవారైనా స్వేచ్ఛగా అనుసరించే అవకాశం వుండాలని, దేశంలో 1000 అయ్యప్ప దేవాలయాలున్నాయని, అక్కడెక్కడా మహిళా ప్రవేశంపై నిషేధం లేదని, శబరిమలలో మాత్రం ఆయనది నైష్ఠిక బ్రహ్మచారి రూపమని, 10-50 ఏళ్ళ మధ్య వయసు మహిళల ప్రవేశం నిషేధం ఒక మత ప్రచారమని, ఆలయ నిబంధన అనీ, ఆర్టికల్ 17 చెబుతున్న ‘అంటరానితనం’ నిబంధన ఇక్కడ మహిళా ప్రవేశ నిషేధానికి ఎంతమాత్రం వర్తించదని ఆమె వాదించారు. అది హిందూ సమాజంలో కులం పేరున పాటించబడుతున్న అంటరానితనం అని ఆమె అన్నారు. ఒక మహిళగా ఆమెకున్న సమగ్ర చింతనాపరిధి సమాజాన్ని స్ర్తి, పురుష వర్గాలుగా విభజించే కొందరు బరితెగించిన పిటిషనర్లకు లేకపోయింది. భూమాత బ్రిగేడ్‌ను స్థాపించి లింగ సమానత్వం కోసం ఉద్యమిస్తున్న తృప్తిదేశాయ్‌కు ఆలయ ప్రవేశం విషయంలో భక్తికన్నా బడాయి ఎక్కువ కన్పడుతున్నది. శనిశింగణాపూర్‌లో మహిళా ప్రవేశంపై విజయం సాధించిన తృప్తి దేశాయ్ 2016లో ముంబైలోని హాజి అలీ దర్గాలో ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమైంది. రెండవసారి కూడా ఆమె మసీదులోకి చాలా రక్షణ బలగాలమద్య ప్రవేశించినా మహిళా ప్రవేశం నిషేధించబడిన చోటికి చేరలేకపోయింది. శబరిమలలో మహిళల ప్రవేశాన్ని నిరసిస్తున్న కేరళలో మహిళా ఉద్యమం ఊపందుకుంది. దేవుడే లేడు అని చెప్పే కమ్యూనిస్టులు, అక్కడి కమ్యనిస్టు పార్టీ ముఖ్యమంత్రి మాత్రం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామంటున్నాడు. నిజమైన భక్తితత్వం తెలిసిన భారతీయ మహిళకు అయ్యప్పను ఎపుడు దర్శించాలో తెలుసు. అందుకే హిందూ మహిళలెవరూ అయ్యప్ప ఆలయంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించలేదు. ఒక నాస్తికురాలు లిబి-గ్జిటియన్, ఒక జర్నలిస్టు, నాస్తికురాలు సుహాసిని రాజ్, కవితా జక్కల్ (గ్జిటియన్), రపానా ఫాతిమా ఒక ముస్లిం, మేరీ స్వీటి ఒక గ్జిటియన్ మాత్రమే అయ్యప్ప ఆలయానికి వెళ్లాలని ప్రయత్నించి విఫలురయ్యారు. 800 ఏళ్ళ నుంచి పాటిస్తున్న ఆలయ నియమం, సదాచారం, ఈ ఐదుగురు లాంటి హిందువులు కాని మహిళల సాధికారత కోసం బలిపెట్టాలా? వాళ్ళు మతాల్లో సంస్కరణలకోసం వారెందుకు ఉద్యమించరు? మహిళలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలపై వారెందుకుద్యమించరు? హిందూ దేవాలయాలమీద వారికెందుకంత నాటకాన్ని తలపించే శ్రద్ధ్భక్తులు? కమ్యూనిస్టులకు కుటుంబం లేదు, దేశం లేదు, మతం లేదు. అదే వారి సిద్ధాంతం. మహిళా సాధికారత, భద్రత పేర ఉన్మాదం రెచ్చగొడుతున్నరు. కోట్లాది మహిళల, అయ్యప్ప భక్తుల మనోభాలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. ఒక కుటుంబానికి, వంశానికి, గ్రామానికి, ప్రాంతానికి కొన్ని నియమాలు, కట్టుబాట్లు ఉంటాయి. పరస్పర గౌరవంతోనే జాతి మనుగడ సాగిస్తుంది. అందునా దేశంలో మెజారిటీ హిందువుల మాటకు, మనుగడకే మన్నన లేకపోతే ఎలా? కేరళ దేవభూమి పరశురాముడి భూమి. అహిందూ పోకడకు పరశురామప్రీతి పట్టకముందే అక్కకడి ఉద్యమ ప్రభావాన్ని అందరూ గుర్తించాలి. బిజెపి అక్కడి ఉద్యమాన్ని బలపరచడంలో ఏ మాత్రం తప్పులేదు. వాజ్యంతో మహిళా సాధికారిత సాధించలేరు. సుప్రీం తీర్పును సవాలు చేస్తూ 19 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పునరుత్పత్తి వయసు కలిగిన మహిళల ప్రవేశానికి అనుమతించబోమంటూ తమ వంశీయులు అయ్యప్ప స్వామికిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సుప్రీంకోర్టు తీర్పు ఆటంకం కల్గిస్తుందని పందాలం సంస్థానం పెద్దలు ప్రకటించారు. సింహాసనాన్ని త్యజించి అయ్యప్పగా మారిన శ్రీమణికంఠ ఒక పౌరుడని శబరిమల చరిత్ర చెబుతోంది.
మీటూ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొన్న భారత విదేశాంగ సహాయ మంత్రి ఎం.జె. అక్బర్ రాజీనామా చేసిన తరువాత అంతా సద్దుమణిగింది. మరి ఆరోపణలు ఎదుర్కొన్న మిగిలిన వాళ్ళ సంగతేమిటి? నానా పటేకర్, చేతన్‌భగత్, అలోక్‌నాథ్, రజత్‌కపూర్, గురిస్మరన్ కంభా, కైలాస్‌కేర్ (పద్మశ్రీ సన్మానితుడు), సయ్యద్ నాగర్‌కర్, ఉత్సవ్‌చక్రవర్తి, ముత్తుస్వామి రామస్వామి, జతిన్‌దాస్ (పద్మభూషణ్), వినోద్ దువా, జఫర్‌ఖాన్ (కాంగ్రెస్ నాయకుడు), సిద్ధార్థ్ భాటియా, ఉత్తమ్‌సేన్ గుప్తా, తరుణ్ తేజ్‌పాల్- వీళ్ళ సంగతేమిటి? కొందరు క్షమాపణలు చెప్పారు. కొందరు ‘తమ న్యాయవాదులు మాట్లాడవద్దని చెప్పారు’ అన్నారు. ఇందులో వినోద్ దువా జర్నలిస్టు. వామపక్ష మేధావి. చిత్ర నిర్మాత నిష్ఠా జైన్ ఈయనమీద ఆరోపణలు చేసింది. నిషా బోరా పెయింటర్ జతిన్‌దాస్‌పై ఆరోపణలు చేసింది. వామపక్ష మేధావి, అదే వామపంక్తికి చెందిన ఆయన కూతురు నందితాదాస్ ఆయన్ను సమర్థిస్తోంది. నిషా బోరాకు హెచ్చరికలు జారీ చేసింది. నిజానికి తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన పద్మభూషణ్‌ను వాపసు ఇచ్చి ఉండాల్సింది. కానీ మీటూ లెఫ్ట్, రైట్‌లమధ్య విడిపోతున్నదా, వీగిపోతున్నదా? అన్న అనుమానం కలుగుతోంది. సెలబ్రిటీలుగా తాము ఎదిగేందుకు గతంలో తాము వేసిన అడుగులు ఇపుడు వారికి ఎదుటివారి తప్పటడుగులుగా కన్పడడం, మీటూ ఉద్యమం పేర జరిగిన ఇన్నాళ్ళ ప్రహసనంపై ఎక్కడా ఫిర్యాదులు, పోలీసులు విచారణ విభాగానికి అందకపోవడం, ఎక్కడా దీనిపై విచారణ ప్రారంభం కాకపోవడం చూస్తే వారం పది రోజుల్లోనే ఈ ఉద్యమం వివాదాస్పదమైపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఎక్కడా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాలేదు. ఎవరూ కోర్టులకెక్కలేదు. ఋజువులు చూపలేదు. కోర్టుల్లో ఎవరికీ నమ్మకం లేదు. దేశంలో మహిళా హక్కులపై ఎవరికీ నమ్మకం లేదు. కేవలం సామాజిక మాధ్యమాలకు విషయం వదిలేసి చోద్యం చూడడంలో మీటూ ఉద్యమం భవిష్యత్తు వెతుక్కోవడమెందుకు? ఇందులో నిజమెంత? వాజమెంత?

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్ 96761 90888