మెయన్ ఫీచర్

సమైక్యతా సారథి.. సదా స్మరామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రం లభించిన 1947 సంవత్సరాన్ని తీసుకుంటే... ఆ ఏడాది మొదటి అర్ధ్భాగం భారతదేశ చరిత్రలోనే కీలక సమయం. వలస పాలన తప్పని పరిస్థితుల్లో ముగియనున్న సమయమది. అంతేకాదు.. భారతదేశ విభజన కూడా తప్పనిసరి అయింది. అయితే, అంతుపట్టని విషయమేమంటే భారతదేశం నుంచి విడిపోయే ప్రాంతాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటాయా? అనేది. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆహార కొరత సర్వసాధారణమైంది. అన్నిటికన్నా ఎక్కువగా ఆందోళన కలిగించిన విషయం.. దేశ ఐక్యత ప్రమాదంలో పడిన సమయమది.
అలాంటి కీలక పరిస్థితుల్లో.. 1947 మధ్యలో రాష్ట్రాల వ్యవహారాలను చూసే విభాగం (స్టేట్స్ డిపార్ట్ మెంట్) ఏర్పడింది. నాటికి దేశంలో గల 550 రాజా స్థానాలతో సంప్రదింపులు చేయడమే ఈ విభాగం ముఖ్యమైన పని. పరిమాణం, జనాభా, భౌగోళిక, ఆర్ధిక స్థితిగతులు మొదలైనవాటి పరంగా చూసినప్పుడు ఈ రాజాస్థానాలు వేటికవే ప్రత్యేకంగా ఉండేవి. ‘‘ఇటువంటి సంస్థానాల విలీనం కోసం కృషి చేసిన పటేల్ గురించి..’’ అని మహాత్మా గాంధీ వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యం లేదు. ఇక్కడ మహాత్మాగాంధీ మీరు అంటూ సంబోధించినది మరెవరినో కాదు సర్దార్ వల్లభాయి పటేల్‌ను. ఈ రోజున ఆయన జయంతిని జరుపుకుంటున్నాం. ఆయనకు మన ఘన నివాళులు అర్పించుకుంటున్నాం.
తనదైన శైలిలో వ్యవహరిస్తూ తన పనిని పటేల్ ఎంతో కచ్చితత్వంతో, దృఢంగా, పరిపాలనాపరమైన సామర్థ్యంతో నిర్వహించారు. సమయం చాలా తక్కువ. చేయాల్సిన పని బ్రహ్మాండమైనది. కానీ ఆ పనిని చేస్తున్న వ్యక్తి కూడా సామాన్యుడు కాదు. ఆయన సర్దార్ పటేల్. భారతదేశం సమున్నతంగా నిలబడాలన్న ఆకాంక్షతో పని చేశారు. ఒకదాని తర్వాత మరొకటి.. అప్పటికి ఉన్న అన్ని సంస్థానాలతో సర్దార్, ఆయన బృందంలోని సభ్యులు సంప్రదింపులు జరిపి, అన్నిటినీ భారతదేశంలో ఐక్యం చేశారు. సర్దార్ పటేల్ అవిశ్రాంతంగా పని చేయడం వల్లనే ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశ చిత్ర పటం ఆ ఆకారంలో మనకు కనిపిస్తోంది.
దేశానికి స్వాతంత్య్రం రాగానే ప్రభుత్వ పదవీ బాధ్యతల నుంచి వైదొలగాలని వీపీ మీనన్ అనుకున్నారట. కానీ సర్దార్ పటేల్ ఒప్పుకోలేదు. ఇది ప దవీ విరమణ చేసి, విశ్రాంతి తీసుకునే సమయం కాదు అని చెప్పారట. ఇదీ సర్దార్ పటేల్ దృఢ సంకల్పం. అలా వీపీ మీనన్‌ను రాష్ట్రాల వ్యవహారాలను చూసుకునే విభాగానికి కార్యదర్శిగా నియమించారు. వీపీ మీనన్ తాను రాసిన పుస్తకం ‘ది స్టోరీ ఆప్ ది ఇంటిగ్రేషన్ ఆప్ ఇండియన్ స్టేట్స్’ (్భరతదేశంలో రాజాస్థానాల విలీన గాథ)లో సర్దార్ పటేల్ గొప్పదనాన్ని చాటారు. సర్దార్ పటేల్ ఎలా ముందుండి తమను నడిపించిందీ, తమ బృందం మొత్తం పని చేయడానికిగాను ఎలా స్ఫూర్తిని నింపిందీ ఈ పుస్తకంలో మీనన్ వివరించారు. భారతదేశ ప్రయోజనాలే ముఖ్యమని భావించి ఆ విషయంలో ఎలాంటి శషభిషలకు తావు లేకుండా పని చేశారని, ఎలాంటి విషయంలోను రాజీ పడలేదని మీనన్ తన పుస్తకంలో వివరించారు.
1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. నూతన ప్రస్థానం మొదలైంది. కానీ, ఆ సమయానికి జాతి నిర్మాణమనేది సుదూరంగానే ఉండిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి మొదటి హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేప ట్టారు సర్దార్ పటేల్. వెంటనే ఆయన పరిపాలనాపరమైన నియమ నిబంధనల తయారీకి ఒక వేదికను రూ పొందించారు. రోజువారీ పాలనకు సంబంధించిన వ్య వహారాలను నిర్వహించడం, ప్రజల ప్రయోజనాలను కాపాడడం, ముఖ్యంగా పేద, అణగారిన వర్గాలకు చేయూతనివ్వడం మొదలైన విషయాల్లో సర్దార్ పటేల్ అందరికీ మార్గదర్శకునిగా నిలిచారు. సర్దార్ పటేల్ అనుభవమున్న పరిపాలనా దక్షుడు. అహమ్మదాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా 1920లలో పని చేశారాయన. ఈ అనుభవం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ పాలనా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయనకు ఉపయోగపడింది. ఆయన అహమ్మదాబాద్‌లో పని చేసే సమయంలో నగరంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్య తనిచ్చారు. నగర వ్యాప్తంగా స్వచ్ఛ వాతావరణం ఉండేలా చూశారు. మురుగు నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూశారు. రహదారులు, విద్యుత్, విద్యలాంటి పట్టణ ప్రాంత వౌలిక సదుపాయాల మీద దృష్టిని కేంద్రీకరించారు.
ప్రస్తుతం దేశంలో సహకార రంగం ఉజ్వలంగా ఉందంటే ఆ ఘనతలో అధిక భాగం పటేల్‌కు దక్కుతుంది. ‘అమూల్’ సంస్థ మూలాలను చూస్తే దీని వెనక ఆయన దూరదృష్టియే కారణమని తెలుస్తుంది. స్థానిక కమ్యూనిటీలను ముఖ్యంగా మహిళల్ని సాధికారులను చేయడానికి ఆయన పనిచేశారు. సహకార రంగంలో గృహనిర్మాణం చేపట్టే సొసైటీలను ప్రోత్సహించాలనే ఆలోచన ఆయనదే. తద్వారా అనేక మందికి నివసించడానికి వీలుగా గౌరవప్రదమైన గూడు దొరికింది.
పటేల్ పేరు చెబితే చాలు రెండు సుగుణాలు గుర్తుకొస్తాయి. అవి నమ్మకం, నిజాయితీ. మన దేశంలోని అన్నదాతలు ఆయనపైన అపారమైన విశ్వాసం ఉంచారు. ఆయన రైతుబిడ్డ. బర్డోలీ సత్యాగ్రహాన్ని ముందుండి నడిపించిన నాయకుడు. కార్మికులు ఆయనలో ఓ ఆశాజ్యోతిని చూశారు. తమ కోసం గొంతు ఎత్తే నేత ఆయనేనని భావించారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, దేశ ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేసే దార్శనికుణ్ణి చూశారు. ఆయనతో కలిసి పని చేయడానికి ముందుకొచ్చారు. ఆయన రాజకీయ సహచరులు కూడా ఆయనపై విశ్వాసం ఉంచారు. ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం పొందడానికి మహాత్మా గాంధీ అందు బాటులో లేకపోతే తాము పటేల్‌ను ఆశ్రయించేవారమని ఒక సందర్భంలో ఆచార్య కృపలానీ అన్నారు. 1947లో రాజకీయ సంప్రదింపులు జోరుగా సాగుతున్న సమయంలో సర్దార్ పటేల్‌ను ఉద్దేశించి సరోజినీ నాయుడు మాట్లాడుతూ నిర్ణయాలను తీసుకోవడంలోను, కార్యాచరణలోను ఆయనకు ఆయనయే సాటి అని ప్రశంసించారు. అందరూ ఆయనపైన నమ్మకం ఉంచారు. ఆయన మాటలపైన, ఆయన కార్యాచరణపై అచంచల విశ్వాసం ప్రకటించారు. కుల, మత, వర్గాలకు అతీతంగా చిన్నా పెద్దా అందరూ ఆయనకు గౌరవమిచ్చారు.
ఈ ఏడాది సర్దార్ జయంతి మరింత ప్రత్యేకమైనది. 130 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులతో ఈ రోజున ‘ఐక్యతా విగ్రహాన్ని’ ఆవిష్క రించుకుంటున్నాం. నర్మదా నది తీరాన ఏర్పాటు చేసుకున్న ఈ మహా విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినది. భూమి పుత్రుడు సర్దార్ పటేల్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వైనం మనకు కనిపిస్తోంది. ఆయన ఎల్లప్పుడూ మనకు మార్గదర్శనం చేస్తూ స్ఫూర్తిని అందిస్తూ వుంటారు. పటేల్‌కు ఘన నివాళి అర్పించేందుకు రూపొందిన ఈ మహా విగ్రహాన్ని వాస్తవరూపంలోకి తేవడానికి రాత్రి పగలూ అనే తేడా లేకుండా పని చేసినవారందరికీ నా అభినందనలు. ఈ విశిష్టమైన ప్రాజెక్టుకోసం పునాది రాయి వేసిన 2013 అక్టోబర్ నెల 31వ తేదీ నాకు గుర్తుకొస్తోంది. ఆ రోజున మొదలైన ఈ భారీ ప్రాజెక్టు రికార్డు టైములో పూర్తయింది. ఇది ప్రతి భారతీయునికి గర్వకారణమైన విషయం. రాబోయే రోజుల్లో ఈ మహా విగ్రహాన్ని సందర్శించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
ఐకమత్యానికి, మన మాతృభూమి భౌగోళిక స మగ్రతకు, దేశ ప్రజల ఐకమత్యానికీ ఈ ‘ఐక్యతా విగ్రహం’ సంకేతంగా నిలుస్తోంది. అనైక్యత కారణంగా విడిపోతే మనకు మనమే మొహం చూపించుకోలేమనీ, సమాధానం చెప్పుకోలేమనీ... అంతా కలిసి ఉంటే ప్రపంచాన్ని ఢీకొనవచ్చనే సందేశాన్ని ఈ విగ్రహం అందిస్తోంది. ఐకమత్యంతో మాత్రమే అభివృద్ధిని, ప్రాభవాన్ని సాధించి ఉన్నత శిఖరాలను అధిగ మించగలం.
సామ్రాజ్యవాద శక్తుల పాలనను అంతమొం దించ డానికి పటేల్ మెరుపు వేగంతో పని చేశారు. జాతీయ స్ఫూర్తితో కూడిన భౌగోళిక ఐక్యత ఆయన వల్ల సాధ్యమైంది. భారతదేశం ముక్కలు చెక్కలు కాకుండా ఆయన కాపాడారు. జాతీయ స్రవంతిలో అన్ని ప్రాంతాలూ విలీనం చెందేలా చర్యలు తీసుకొన్నారు. ఈ రోజున 130 కోట్ల మంది భారతీయులం భుజం భుజం కలిపి బలమైన, సౌభాగ్యవంతమైన, అందరినీ కలుపుకుపోయే నూతన భారతదేశం కోసం కృషి చేస్తున్నాం. బడుగు, బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందడానికి, ఎలాంటి అవినీతికీ, బంధుప్రీతికి తావు లేకుండా మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. పటేల్ కోరుకున్న రీతిలో పాలనను అందిస్తున్నాం.

-నరేంద్ర మోదీ, భారత ప్రధాని