మెయిన్ ఫీచర్

భలే భలే బాజుబంధ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనత్రయోదశి, దీపావళి రాబోతున్నాయ. అం దరూ బంగారం రూపులో లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నేటితరం అమ్మాయిలైతే ట్రెండీగానూ, సంప్రదాయంగానూ ఉండే బంగారు ఆభరణాలను ఎంచుకుంటారు. సందర్భానికి తగినట్లుగా తయారవడం ఈతరం అమ్మాయిలకు పుట్టుకతో వచ్చిన విద్య. ఒక సందర్భంలో జీన్స్, టీషర్టుల్లో, వదిలేసిన జుట్టుతో ట్రెండీగా కనిపించే అమ్మాయిలు.. పండుగ, వేడుక అనగానే లంగా, ఓణీలో నిండైన నగలతో తెలుగుదనానికి ప్రతీకలా తళుక్కుమంటారు. అందుకేనేమో సంప్రదాయ నగలు కూడా వీరికి తగినట్లుగానే తీరు మార్చుకుని కొత్తకొత్త డిజైన్లలో అందంగా మెరుస్తున్నాయి. అలాంటి వాటిల్లో మొదట నిలిచేది అరవంకీ..
అరవంకీలు ఇప్పుడు కొత్త కొత్త మోడళ్లలో వస్తున్నాయి. ఇప్పటి అమ్మాయిల్లో నగలపై మక్కువ ఎక్కువైంది. అందుకే డిజైనర్లు సైతం రోజుకోరకం నగలను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. నేటితరం సౌలభ్యం కోసం వాటి రూపురేఖల్ని సైతం మార్చేస్తున్నారు. ఇలాంటి వాటిల్లో ప్రధానంగా చెప్పుకోదగినది అరవంకీనే.. ఎందుకంటే ఆ పేరు చెప్పగానే కెంపులూ, పచ్చలు పొదిగిన చూడచక్కని వంకీ ఆకారమే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు వాటి స్థానాన్ని బాజుబంధ్‌లు ఆక్రమించేశాయి. వీటినే బాహిచూడి, అనంత, అంగద అనీ పిలుస్తారు. అలాగని ఇవి కొత్త నగలు కాదు. శతాబ్దాల నుంచీ వాడుకలో ఉన్నవే.. ముంజేది కడి లేదా కంకణాల మాదిరిగానే వీటిని మోచేతికి పై భాగంలో ధరించేవారు. వీటివల్ల రక్తప్రసరణ బాగుంటుందట. ఇంకా వివరంగా చెప్పాలంటే పూర్వం ఇది మగవాళ్ల ఆభరణమట. రకరకాల లోహాలతో చేసిన వాటిని యోధులు మోచేతి ఆభరణాలుగా ధరించేవారట. వీటినే యుద్ధ్భారణాలు అని కూడా పిలిచేవారు. వీళ్లను చూసి గ్రామీణులందరూ బాజుబంధ్‌లను పెళ్లి వేడుకల్లో ధరించేవారట. కాలక్రమంలో అది కాస్తా స్ర్తిల నగగా మారింది. అయితే ఉత్తరాదిన అది పట్టీ మాదిరిగా ఉంటే, దక్షిణాది కొచ్చేసరికి మాత్రం కాస్త వంపు తిరిగి అర్ధచంద్రాకృతిలోకి మారి అరవంకీగా స్థిరపడింది. ఏమైనా నగలన్నింటిలోకి అరవంకీ అందమే వేరు. కానీ చిన్నప్పుడు చేసిన వంకీ పెద్దయ్యాక పెట్టాలన్నా, లేక కాస్త లావయినా వాటిని చేతుల మీదుగా తొడగడం కష్టమే.. అందుకే ఈతరం డిజైనర్లు ఈ ఆలోచన చేసి వంకీకి బదులుగా బాజుబంధ్‌నే రకరకాలుగా తయారుచేస్తున్నారు. తయారుచేసే పద్ధతిలో బోలెడు వైవిధ్యాన్ని కనబరుస్తున్నారు. ఎలాగంటే.. అచ్చంగా బాజుబంధ్‌గానే వాడుకోగలిగే డిజైన్లయితే.. మరికొన్ని బాజుబంధ్‌తో పాటు నెక్లెస్‌లా, బ్రేస్‌లెట్‌లా కూడా ధరించగలిగే డిజైన్లు ఇంకొన్ని. ఇలాంటి వాటిల్లో హుక్ దగ్గర వెడల్పు తగ్గించుకునేలా, పెంచుకునేలా కూడా తయారుచేస్తున్నారు. ముత్యాల పతకాల తరహాలో మధ్యలో వెడల్పాటి రాళ్ల పతకాల బాజుబంధ్‌ల్నీ తయారుచేస్తున్నారు. వీటిల్లో గొలుసు మార్చుకుంటూనో, దాని పొడవు పెంచుకుంటూ, తగ్గించుకుంటూనే మెడలో నెక్లెలానూ వేసుకోవచ్చు. చుట్టూ రింగుల్లా ఉండే డిజైనయితే నేరుగా బ్రేస్‌లెట్ల మాదిరిగా వాడుకోవచ్చు. వీటిల్లో చిన్న చిన్న వేడుకల్లో కూడా ధరించేలా సింపుల్ డిజైన్లూ ఉన్నాయి. లేకపోతే చిన్న చిన్న నెక్లెస్‌లను, వెడల్పాటి బ్రేస్‌లెట్లను కూడా బాజుబంధ్‌లా చేతులకు అలంకరించుకోవచ్చు. ఇప్పుడు వీటిని కెంపులు, పచ్చలు, వజ్రాలు, ఆన్‌కట్‌లలో కుందన్‌కారి, మీనాకారి, పోల్కీ, నక్షీ, టెంపుల్, యాంటిక్.. పనితనాన్ని చొప్పిస్తూ బాజుబంధ్ డిజైన్లను రూపొందిస్తున్నారు. మోచేతిపై నెమలి పురివిప్పినట్లు, చిలుక వాలినట్లు, లక్ష్మీదేవి సాక్షాత్కరించినట్లు, పూలు విరిసినట్లో భిన్న డిజైన్లలో బాజుబంధ్‌ను చుట్టేస్తున్నారు.