మెయిన్ ఫీచర్

సృజనాత్మకత ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకంటే, పనిచెయ్యడమంటే అందరికీ అసహ్యమే. అందుకే పనిచేసేందుకు ఎవరూ ఇష్టపడరు. కాబట్టి, పని విషయంలో అందరికీ ఇతరుల సహాయం ఎక్కువగా అవసరమవుతుంది. అందుకే పనులన్నీ గుట్టలుగుట్టలుగా పేరుకుపోతూ ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాలలో అది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. లంచమిస్తేనే పేరుకుపోయిన గుట్టలో ఎక్కడో అడుగున ఉన్న మీ దస్త్రం పైకి వస్తుంది. లేకపోతే అది అక్కడే ఉంటుంది. పెత్తందార్ల అధికారానికి ఆనందాన్నిచ్చేవి, వారి ప్రాముఖ్యాన్ని పెంచేవి పేరుకుపోయిన ఆ దస్త్రాల గుట్టలే.
నేను కూడా అరాచకవాదినే అయినా గతంలోని వారిలా కాదు. నా వైఖరి నాదే. ఎందుకంటే, విభిన్న ప్రాతిపదికతో కూడిన నా శైలి చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు నేను ఎప్పుడూ వ్యతిరేకిని కాదు. కానీ, అవి అవసరమయ్యే విధానాలకు నేను పూర్తిగా వ్యతిరేకిని.
మనిషి ఎలాంటి నియంత్రణలకు- ధార్మిక, రాజకీయ- గురికాకుండా జీవించే సమయం ఏదో ఒకరోజు తప్పక వస్తుందని నాకు తెలుస్తోంది. ఎందుకంటే, అప్పుడు మనిషి తనకుతానే ఒక ప్రవర్తనా నియమావళి అవుతాడు.
ప్రియతమ ఓషో,
‘‘దేనికోసం స్వేచ్ఛ- దేనినుంచి స్వేచ్ఛ’’- వీటి మధ్యగల తేడాలను దయచేసి వివరించండి. మీకొక దార్శనికత ఉంటుంది. అది వాస్తవరూపం దాల్చాలని మీరు కోరుకుంటారు. దానికోసం మీకు స్వేచ్ఛకావాలి. ఎందుకంటే, మీకు తెలియని దానిలోకి అడుగుపెడుతున్నారు, బహుశా, ఏదో ఒకరోజు మీరు తెలుసుకోలేని దానిలోకి కూడా అడుగుపెడతారు. అదే దాని ఆధ్యాత్మిక పార్శ్వం. అందుకే స్వేచ్ఛగా ఎగిరేందుకు మీకు రెక్కలొస్తాయి. కాబట్టి, ‘‘దేనికోసం స్వేచ్ఛ’’అనేది ఎప్పుడూ సృజనాత్మకమైనది, భవిష్యత్తుకు సంబంధించినదే.‘‘దేనినుంచి స్వేచ్ఛ’’అనేది సాధారణ లౌకిక విషయం. మనిషి ఎప్పుడూ అనేక విషయాలనుంచి స్వేచ్ఛకోసం ప్రయత్నించాడు. కాబట్టి, అది సృజనాత్మకమైనది కాదు. అది స్వేచ్ఛకు ప్రతికూలపార్శ్వం. అందుకే ‘‘దేనినుంచి స్వేచ్ఛ’’అనేది ఎప్పుడూ గతానికి సంబంధించినదే. మహా అయితే, అది మీ చేతి సంకెళ్ళను తొలగించగలదు. అంతమాత్రాన, అది లాభదాయకమైనదేమీ కాదు. గతించిన చరిత్ర అంతా అందుకు నిదర్శనమే.
మనుషులు నేను చెప్తున్న స్వేచ్ఛ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే, దానిని అర్థంచేసుకునే పరిజ్ఞానం వారికిలేదు. కంటికి కనిపించే బంధనాలైన చేతి సంకెళ్ళు, కాళ్ళ సంకెళ్ళనుంచి స్వేచ్ఛ పొందడం గురించే వారు నిరంతరం ఆలోచిస్తారు. తరువాత వాటితో ఏంచెయ్యాలో మీకు తెలియదు. పైగా, వాటినుంచి స్వేచ్ఛ కోరుకున్నందుకు మీరు పశ్చాత్తాపం కూడా పడవచ్చు.
ఫ్రెంచి విప్లవం కాలంలో బాస్టిల్లే కోటలో అదే జరిగింది. ఆ కోట అతి ప్రసిద్ధమైన ఫ్రెంచి కారాగారం. యావజ్జీవ కారాగారశిక్ష విధించిన వారికోసం దానిని ప్రత్యేకంగా కేటాయించారు. అందులోంచి ప్రాణాలతో బయటపడినవారు ఎవరూలేరు. ఎందుకంటే, దోషుల కాళ్ళకు, చేతులకు సంకెళ్ళు బిగించి ఆ కారాగారంలోకి నెట్టి, తాళంవేసి, ఆ తాళంచెవులను ఆ కోటలోని బావిలోకి విసిరేస్తారు. ఎందుకంటే, వాటితో ఇంక పనేముంటుంది? అందులోకి వెళ్ళినవారి జీవితం ముగిసినట్లే. అలా ఆ కారాగారంలో అయిదువేల మందికి పైగా ఉన్నారు.
ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్