మెయిన్ ఫీచర్

బంగారం కొంటున్నారా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధనత్రయోదశి అనీ, ధన్‌తేరస్ అనీ, ధన్వంతరి జయంతి అనీ పేరు. నేడు ధనత్రయోదశి. ఈ రోజు బంగారం కొనుక్కునేందుకు మంచి రోజన్న భావనలోనే ఉండిపోతున్నారు అందరూ. ధనత్రయోదశి నాడు ఏదన్నా కొత్త వస్తువు తీసుకోవడం శుభసూచకమే కానీ ఈ పండుగలో అంతకు మించిన విశేషాలు ఉన్నాయి అంటారు పెద్దలు. అసలు చాలా ప్రదేశాల్లో దీపావళి పండుగ సంబరాలు ధనత్రయోదశి నుంచే మొదలు అవుతాయి.
లక్ష్మీదేవి పుట్టినరోజు
ధనత్రయోదశినాడే లక్ష్మీదేవి క్షీరసాగరమధనం నుంచి ఉద్భవించిందంటారు. అందుకే లక్ష్మీదేవి ఆవిర్భావానికి సూచనగా ఆమె చిహ్నాలైన బంగారపు వస్తువులను కొందరు పాలతో కడుగుతారు. అయితే లక్ష్మీదేవి అంటే కేవలం సంపద మాత్రమే కాదు కదా! సంతానం, విద్య, అధికారం, కీర్తి.. ఇలా ఈ సంసారాన్ని దాటేందుకు అవసరమయ్యే సాధనాలన్నింటినీ ఆమె ప్రసాదిస్తుంది. అంతటి లక్ష్మీదేవి ఈ రోజున తమ ఇంటికి వచ్చి ఆశీస్సులను అందించాలని కోరుకుంటారు. శుభ్రత ఉన్నచోటే ఆమె ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటిని శుభ్రపరచుకుని గుమ్మం దగ్గర రంగురంగుల ముగ్గులు వేస్తారు. అమ్మవారికి తమ ఇంటికి దారిచూపేందుకు, దుష్టశక్తులను దూరంగా ఉం చేందుకు నూనె దీపాలను వెలిగిస్తారు. కొందరైతే అమ్మవారికి లోపలకు ఆహ్వానిస్తూ కుంకుమ, బియ్యపుపిండితో కలిపిన చిన్న చిన్న పాదాలను ముద్రిస్తారు. ఇక లక్ష్మీదేవిని ఆరాధిస్తూ భజనలు చేయడం, పాటలు పాడటం సరేసరి! లక్ష్మీదేవి సంపదను అందించే తల్లి కాబట్టి ఈవేళ వెండి, బంగారం వంటి ఆభరణాలను కానీ ఇతరత్రా కొత్త వస్తువులను కానీ తీసుకోవడం శుభమని నమ్ముతారు. అయితే విలువైన వస్తువులే కొనాలని కానీ, ఏ వస్తువైనా కొని తీరాలని కానీ ధార్మిక గ్రంథాలలో ఎక్కడా కనిపించదు. గోమాత కూడా లక్ష్మీదేవికి ప్రతిరూపమే కనుక చాలా ప్రాంతాల్లో ఈ రోజున గోపూజ చేసే సంప్రదాయం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపారపరమైన లెక్కలను చూసుకునేందుకు కూడా శుభకరమైన రోజుగా భావిస్తారు.
ధన్వంతరి జయంతి
అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి మందరపర్వతంతో పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతభాండాన్ని ఒక చేతితో, శంఖువును మరో చేతితో, మూలికలు, చక్రం మిగిలిని చేతులతో ధరించి ఆశ్వయుజ బహుళ ద్వాదశినాడు ఉద్భవించాడు ధన్వంతరి అని పురాణ కథనం. ఈయనను పూజించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. అపరవైద్యుడు ధనంతరి కూడా క్షీరసాగరమధనంలో, ఈ రోజునే ఉద్భవించాడని నమ్మిక. అసలు ధనత్రయోదశి అన్న పేరు ధన్వంతరి నుంచే వచ్చిందని వాదించేవారూ లేకపోలేదు. భూలోకంలో అనారోగ్యంతో ఉన్నవారికి తగిన ఔషధులను సూచించేందుకు, ఆ విష్ణుమూర్తే ధన్వంతరిగా అవతరించాడంటారు. దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందాలన్నా, ఎలాంటి అనారోగ్య సమస్య నుంచైనా తక్షణం తేరుకోవాలన్నా ధన్వంతరిని ప్రార్థిస్తే ఫలితం ఉంటుందట. ఆయుర్వేదానికి, వైద్యానికి ధన్వంతరి ఆదిగురువు కాబట్టి, ఈ రోజున వైద్యులంతా ఆయనను తల్చుకోవడం పరిపాటి.
యమ దీపం
ఇంకో కథనం ఏంటంటే.. పూర్వం హిమ అనే పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఒకడే కుమారుడు. ఆ కొడుకుని చిన్నప్పటి నుంచీ అల్లారుముద్దుగా పెంచారు. క్షత్రియుడు కనుక కత్తిసాము మొదలైన క్షత్రియ విద్యలన్నీ నేర్పించారు. కానీ ఈ రాకుమారుడు జాతకరీత్యా అతనికి వివాహం జరిగిన నాలుగో రోజుకు మరణిస్తాడని పురోహితులు చెప్తారు. అయినా ఓ రాకుమారి అతడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటానని శపథం చేస్తుంది. నాలుగో రోజు.. రాకుమారుడి గది ముందు ఆభరణాలు రాశులుగా పోస్తుంది. దేదీప్యమానంగా దీపాలను వెలిగిస్తుంది. రంగురంగుల రంగవల్లులు దిద్దుతుంది. తన ఆరాధ్య దేవతైన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతుంది. రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు పాము రూపం ధరించి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి, ఆ గదంతా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆ నెరుపు తళుకులకు ఈ పాము చూపు మందగిస్తుంది. అడుగు ముందుకు వేయలేకపోతాడు యముడు. పైపెచ్చు యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మరిచిపోయి, ఆమె సంగీతం వింటూ ఉంటాడు. ఇంతలోనే తెల్లారిపోతుంది. యమ ఘడియలు దాటిపోవడంతో ఖాళీ చేతులతో వెళ్లిపోతాడు. అందువల్ల ఈ రోజు యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు. ఉత్తరాదిలో ఈరోజు సాయంత్రం ఆరుబయట, అన్నాన్ని రాశిగా పోసి యమదీపం వెలిగిస్తారు.
ఆశ్వయుజ బహుళ త్రయోదశి అంటే నరక చతుర్దశికి ముందు వచ్చే తిథి. ఈనాటి రాత్రి అపమృత్యువు నివారణకై నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి, పూజించి, ఇంటి ముందు ఉంచాలి. దీనికి ‘యమదీపం’ అని పేరు. యముని అనుగ్రహం పొందడం కోసం దీపాన్ని వెలిగించాలి. యమున్ని ప్రసన్నం చేసుకునేలా ధనత్రయోదశి రాత్రివేళంతా దీపాలను వెలిగించే ఆచారం కూడా ఉత్తరాదిన విస్తృతంగా కనిపిస్తుంది.
మరణించిన పూర్వీకులు ఆకాశం నుండి తిరిగి వస్తారని కొందరి నమ్మకం. దాని ప్రకారం ధనత్రయోదశి రోజు సాయంకాలం రోడ్డుపై దక్షిణ దిక్కుగా ఉండేలాగా దీపం ఉంచుతారు. ఈ దీపం మరణించిన పితృదేవతలకు దారి చూపిస్తుందని వారి విశ్వాసం. ఈనాటి నుంచి ప్రతి ఇంట్లోనూ సాయంత్ర దీపాలని ఉంచడం సంప్రదాయంగా మారింది. రాబోయే కార్తీక లక్ష్మికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ప్రతి ఇల్లూ సాయంకాలం శుభ్రపరిచి ఇంటి ఇల్లాలు దీపాలతో అలంకారం చేయడం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది.
బంగారం కొనటం
ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో ప్రదర్శనాలు నవరాత్ర వ్రతం అనేది జరుపుతారని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో రాశారు. వెండి కొనడానికి ముఖ్యమైన రోజుగా చెప్తారు. అక్షయ తృతీయ బంగారం కొనడానికి ముఖ్యమైన రోజుగా చెప్పుకుంటే, ధనత్రయోదశి వెండి లోహాన్ని కొనడానికి ప్రశస్తమైనదిగా చెబుతారు. ఈ రోజు గుజరాతీయులకు సంవత్సరాది. దీపావళి సంవత్సరం తర్వాత గుజరాతీయులు, పొరుగువారైన మహారాష్టవ్రారు కలిసి కొన్ని పండుగలు జరుపుకుంటారు. వారు తమ ఇళ్లను శుభ్రం చేస్తారు. వాకిలి అలికి రంగురంగుల ముగ్గులు పెడతారు. శుచిగా, శుభ్రంగా ఉంటే మహాలక్ష్మి వృద్ధి చెందుతుందని వారు నమ్ముతారు. నిజానికి ఈ రోజు నుంచే దీపాలు అలంకరించడం ప్రారంభమవుతుంది. ధనత్రయోదశి రోజు తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని పండుగ జరుపుకుంటారు. ఇంట్లో ఉండే బంగారు వస్తువులను, వెండివస్తువులను పాలతో కడిగి, తరువాత నీళ్లతో శుభ్రం చేసి పువ్వులతో పూజించి అమ్మవారు తమ ఇంట్లో కొలువుండమని ప్రార్థన చేస్తారు. వ్యాపారులైతే ఈ రోజు తమ వ్యాపారం లాభాలు కలగాలని ప్రత్యేక పూజలు చేస్తారు. *