మెయిన్ ఫీచర్

మార్పే విప్లవం ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతకన్నా పాత ఇంట్లో ఉండడమే మంచిది కదా’’అని వారితోపాటు, మా ఇంట్లో ఉండే భారత స్వతంత్ర పోరాట ప్రముఖ నాయకులతో కూడా వాదించేవాడిని. కానీ, ఏ నాయకుడు నా వాదనకు సరియైన సమాధానం చెప్పలేదు. ఎందుకంటే, స్వతంత్రమొచ్చిన తరువాత ఏంచెయ్యాలో వారికి ఏమాత్రం తెలియదు. అందుకే దేశానికి స్వతంత్రమొచ్చిన వెంటనే హిందువులు, మహమ్మదీయుల పోరాటం మొదలైంది. ఆ పోరాటంలో అనేక లక్షల మంది ఒకరినొకరు చంపుకున్నారు. దేశవ్యాప్తంగా దోపిడీలు రాజుకోవడంతో రైళ్ళు, పట్టణాలు దగ్థమయ్యాయి. అలా అందరి జీవితాలు ప్రమాదంలో పడ్డాయి.
అందుకే నేను మళ్ళీ ఆ నాయకులతో ‘‘మన దేశం బ్రిటిష్ బానిసత్వంలో ఉండగా ఇలా ఎప్పుడూ జరగలేదు. కానీ, మనకు స్వతంత్రం వచ్చిన వెంటనే ఇలా జరగడం మరీ విడ్డూరంగా ఉంది. ఎందుకంటే, స్వతంత్రమంటే ఏమిటో, అది వచ్చిన తరువాత ఏంచెయ్యాలో మీకు ఏమాత్రం తెలియదు కాబట్టి, అలా జరిగింది’’ అన్నాను.
అందుకే స్వతంత్రం లభించిన వెంటనే దేశం రెండు ముక్కలైంది. అలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. రైళ్ళను, జైళ్ళను తగలబెట్టడంలో, వంతెనలు కూల్చడంలో, ప్రజలను చంపడంలో ఘనులైన విప్లవ నాయకుల చేతికి అధికారం దక్కడంతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. వారు పోరాడి, గెలిచి, అధికారాన్ని సాధించుకున్నప్పటికీ, అలాంటి అసమర్థ నాయకత్వంలో నూతన దేశాన్ని నిర్మించడం అసాధ్యమవుతుంది. అందుకే ఏ విప్లవకారునికీ అధికారమివ్వకూడదు. ఎందుకంటే, వారికి ఎలా నాశనం చెయ్యాలో తెలుసుకానీ, ఎలా సృష్టించాలో, ఎలా నిర్మించాలో తెలియదు. వారిని బహుమతులతో, బంగారు పతకాలతో సత్కరించండి. అంతేకానీ, అధికారాన్ని వారి చేతుల్లో ఎప్పుడూ పెట్టకండి.
ఏ విప్లవంలోనూ పాల్గొనని సృజనాత్మకులను మీరే తెలుసుకోవాలి. ఇది చాలా సున్నితమైన అంశం. ఎందుకంటే, అలాంటి వ్యక్తులు వారి పనిలో వారుంటారే కానీ, పాలకులెవరనేది ఏమాత్రం పట్టించుకోరు. వారు ఎప్పుడూ తమ శక్తిని తాము సృష్టించే పనికి పూర్తిగా ధారపోసే పనిలో నిమగ్నమై ఉంటారు. అంతేకానీ, వారు విప్లవంలో భాగస్వాములు కారు. అందుకే విప్లవకారులు వారికి అధికారాన్ని దక్కనివ్వరు.
అధికారం సహజంగానే విప్లవకారుల చేతుల్లోకి పోతుంది. వారికి ఎలా నాశనం చెయ్యాలో తెలుసుకానీ, ఎలా సృష్టించాలో, ఎలా నిర్మించాలో తెలియదు. అందుకే ఇంతవరకు ప్రపంచంలో జరిగిన విప్లవాలన్నీ పూర్తిగా ఓడిపోయాయి. అంతేకాదు, ఎలా సృష్టించాలో, ఎలా నిర్మించాలో తెలిసిన సృజనాత్మకులకు అధికారం దక్కకపోవడం కూడా విప్లవాల ఓటమికి మరొక ముఖ్యకారణం. కాబట్టి, నేను చెప్పేది స్పష్టంగా అర్థం కానంతవరకు విప్లవాలన్నీ ఓడిపోక తప్పదు.
విప్లవం రెండు రకాలు. మొదటిది ‘‘దేనినుంచో పుట్టిన విప్లవం’’. రెండవది ‘‘దేనికోసమో చేసే విప్లవం’’. అలాగే విప్లవకారులు కూడా రెండురకాలు. ‘‘దేనినుంచో పుట్టిన విప్లవం’’- అంటే ‘‘దేనినుంచో లభించే స్వేచ్ఛ’’-కోసం పనిచేసే విప్లవకారులు మొదటి రకం. ‘‘దేనికోసమో చేసే విప్లవం’’-అంటే ‘‘దేనికోసమో స్వేచ్ఛ’’-కోసం పనిచేసే విప్లవకారులు రెండవ రకం. మొదటి రకం విప్లవకారుల పని- ‘‘దేనినుంచో పుట్టిన విప్లవం’’- ముగిసిన వెంటనే రెండవ రకం విప్లవకారులు ‘‘దేనికోసమో చేసే విప్లవం’’- అంటే ‘‘దేనికోసమో స్వేచ్ఛ’’కావాలనే విప్లవం- మొదలవుతుంది. అదే పెద్ద సమస్య. ఎవరూ దానిని పరిష్కరించలేరు. ఎందుకంటే, అందరూ అధికారాన్ని కోరుకునేవారే.
మొదటి రకం విప్లవకారులు విజయం సాధించిన వెంటనే అధికారం వారి చేతుల్లోకి పోతుంది. దానిని వారు ఇతరులకు ఇవ్వలేరు. అందువల్ల దేశం గందరగోళంలో పడుతుంది. ఎందుకంటే, వారికి ఎలా నాశనం చెయ్యాలో తెలుసుకానీ, ఎలా సృష్టించాలో, ఎలా నిర్మించాలో తెలియదు.
అందుకే నేను ఎప్పుడూ విప్లవాన్ని బోధించను. కానీ, తిరుగుబాటు ఎలా చెయ్యాలో మీకు బోధిస్తాను. విప్లవం గుంపుకు సంబంధించినది. తిరుగుబాటు వ్యక్తికి సంబంధించినది. కాబట్టి, అతడు అధికార వ్యవస్థ ఎలాఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా తన ఉనికి తీరును తానే మార్చుకుని కొత్తమనిషిగా మారతాడు.

ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్