మెయన్ ఫీచర్

విస్తరించిన ఉగ్రవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్‌లోని సముద్రతీర నగరం నీస్‌లో ఫ్రాన్సు జాతీయ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ ఆనందంగా ప్రజలు నృత్య గీతాలతో వినోదిస్తున్నారు. 2016, జులై 14 గురువారం రాత్రి ఒక జిహాదీ ఉగ్రవాది తన ట్రక్కును సమూహం మీదికి నడిపాడు. ఫలితంగా 84 మంది అక్కడికక్కడే మరణించారు. ట్రక్కులోని, గ్రెనేడ్లు, తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐతే ఫ్రాన్స్‌పై దాడి జరగడం ఇది మొదటిసారి కాదు. లోగడ చిత్రకళామందిరంపైన, పత్రికా కార్యాలయంపైనా క్రీడాస్థలివద్ద దాడులు జరిగాయి. ఇది ఆ పరంపరలో భాగమే. భారతదేశంలో గత వెయ్యి సంవత్సరాలుగా ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అందుకని దాని తీవ్రత ఏమిటో ఈ దేశానికి తెలుసు. ఐతే యూరప్‌కు, అమెరికాకు ఉగ్రభూతం వేడి ఏమిటో ఇప్పుడిప్పుడే తెలియవస్తున్నది. 2002లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలి వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకోవడంతో అమెరికాకు కాక తగిలింది. పాకిస్తాన్ ఉగ్రభూతం అని ఏడు దశాబ్దాలుగా భారత్ చెబుతున్నా వినకుండా ఆయుధాల వ్యాపారం చేసుకుంటున్న అమెరికాకు ఇదొక భయంకర అనుభవం. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జూన్ 29న ఐసిస్ దాడి జరిగింది. సిరియాలోని చమురు క్షేత్రాల నగరాలను అబూబకర్ బాగ్దాదీ సైన్యం ఆక్రమించుకుంది. స్వపర భేదం లేకుండా అడ్డం వచ్చిన వారిని నిర్మూలించారు. రష్యా విహార యాత్రికుల విమానాలను కూల్చివేశారు. బుర్హాన్ వనీ, జకీర్ నాయక్, అఫ్జల్ గురు, యూకూబ్ మెమెన్ వంటి ఉగ్రవాదులకు రాజకీయ మాన్యత ఇవ్వడం మానవాళి చేసుకన్న పాపఫలం.
పాకిస్తాన్ ఉగ్రవాదదేశం అని భారత్ ఎన్నోసార్లు ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. పఠాన్‌కోట, ముం బయ, హైదరాబాదు, వారణాసి, బెంగళూరు, న్యూఢిల్లీ, కాబూల్, లండన్, ఢాకా వంటి ఎన్నోచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో పాకిస్తాన్ హస్తం ఉన్నదని తేలింది. ఐనా ఇటు చైనా కాని, అటు అమెరికా కాని తమతమ వైయక్తిక ప్రయోజనాల దృష్ట్యా పాకిస్తాన్‌ను శిక్షించడానికి ముందుకు రాలేదు సరికదా పాక్‌కు ఈ రెండు అగ్రరాజ్యాలు స్నేహహస్తాన్ని అందించాయి. అమెరికా తన ఆయుధాల అమ్మకానికి పాకిస్తాన్‌ను మంచి మార్కెట్‌గా ఉపయోగించుకుంది. చైనా తన సామ్రాజ్యవాద విస్తరణకు పాక్ నుండి భారత్ నుండి పాక్ ఆక్రమించుకున్న భూభాగాలను దానం పుచ్చుకుంది. ఇదం తా ఇటీవలి చరిత్రే.
మొన్న రెండు రహస్య సైనిక పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో కాబూల్ దాడులకు పాక్ సైనికాధికారులు జరిపిన కుట్రకు సంబంధించిన వివరాలున్నాయి. లెటర్ నెంబరు.422 ఇమాం రబ్బానీ పేరుతో విడుదలైంది. అందులో ఉగ్రవాదులకు డబ్బు ఇచ్చేందుకు పాక్ సైనికాధికారులు అంగీకరిస్తూ విడుదల చేసిన రహస్య పత్రమిది. లెటర్ కింద 2014, జులై 14-సంతకం ఫయాద్ రసూల్ అని ఉంది. ఇది నిజమైన లేఖ కాదు, బూటకపు సృష్టి అని పాక్ ప్రతినిధి అన్నారు. ఎవరైనా డబ్బు రహస్యంగా ఇవ్వదలిస్తే ఇలా ఉత్తరాల రూపంలో వెల్లడిస్తారా? అని పాక్ అధికార ప్రతినిధి ప్రశ్నించాడు. ఐతే లేఖ స్వయంగా రహ్మతుల్లా రిజ్వానీ అనే పాకిస్తాన్ మాజీ మిలిటరీ అధికారే బయటపెట్టాడు కాబట్టి నమ్మక తప్పదు. 2015, మార్చి 25వ తేదీన ఉన్న మరొక రహస్య పత్రాన్ని కూడా రహ్మతుల్లా వెలుగులోకి తెచ్చాడు. దీన్ని ఐక్యరాజ్య సమితి ఏం సమాధానం చెబుతుంది? కామన్‌వెల్త్ వంటి అంతర్జాతీయ శాంతి కాముక సంస్థలనుండి పాకిస్తాన్‌ను వెలివేస్తారా?
పాకిస్తాన్‌లో 32000 ఉగ్రవాద శిక్షణా కేంద్రాలున్నాయి. ఇందులో తాలీమ్ (విద్య) అందించబడుతున్నది. ఇందులోనుండి తాలిబన్లు వస్తున్నారు (తాలిబన్ అంటే విద్యార్థి అని అర్థం). యుఎన్ ఛార్టర్-1 ప్రకారం ఉగ్రవాదులకు ‘్ఫండింగ్’ చేయ డం నిషేధం. జకీర్‌నాయక్ అనే ఉగ్రవాది శిష్యులు అబ్దుల్ రహీం గ్రీన్, బిలాల్ ఫిలి త్ హుస్సేనీ వంటివారు అంతర్జాతీయంగా ఇస్లామేతర యూదు, హిందూ, కుర్దు, జాతుల నిర్మూలనకోసం ప్రచారం చేస్తున్నారు. వీరి ఇస్లామిక్ రీసెర్ఛ్ ఫౌండేషన్‌కు మిలియన్ల డాలర్లు ఎలా వచ్చాయి? బిలాల్ ఫిలిత్, జకీర్ నాయక్‌కు ప్రధాన సహాయకుడు. ఢాకా రెస్టారెంట్ పేలుళ్ల ప్రధాన సూత్రధారి. షేక్ హసీనా మాట్లాడుతూ పాక్ ఐఎస్‌ఐ వీరికి శిక్షణ ఇచ్చిందని చెప్పారు.
చర్చల ద్వారా పరిష్కారాలు లభిస్తాయి అని అనే వాక్యాన్ని మనం తరచూ ఉదారవాదులనుంచి వింటూనే ఉన్నాం. మరి గత డెబ్బయ సంవత్సరాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి కదా. వి.కె. కృష్ణ కాలంనుంచి, నేటి సుష్మా స్వరాజ్ రోజుల వరకు చర్చలే చర్చలు. మరి ఇవన్నీ ఎందుకు ఫలించలేదు? మూలకారణం ఏమంటే భారత ద్వేషం అనే మూల సిద్ధాంతం మీద పాక్ అనే దేశం ప్రభవించింది. వాహెబ్ పునరుజ్జీవనం వీరి లక్ష్యం. దీనే్న ఇస్లామిక్ రినైజాన్స్ అంటారు.
కేరళకు చెందిన కొందరు క్రైస్తవులు, ఐసిస్‌లో చేరారు. వీరు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరారు. కేరళ నుండి శ్రీలం క వెళ్లి అక్కడ రెండు నెలలు వాహెబ్- సలాఫీ ఉగ్రవాదాన్ని ప్రచారం చేశారు. శ్రీలంకలోని నెగొంబో అనేచోట సలాఫీ మదరసా ఉన్నది. భారతీయ నిఘావిభాగం కథనం ప్రకారం ఉగ్రవాదం శ్రీలంకకు చేరినట్టు తెలుస్తున్నది. సూఫీ సంప్రదాయం ఉదారవాదాన్ని ప్రోత్సహిస్తుంటే, సలాఫీ వాహెబిజం అతివాద ఉగ్రవాదన్నా బోధిస్తున్నది. జకీర్ నాయక్ ఈ శాఖకు చెందినవాడు. వాహెబ్ అనే మాటకు అరబిక్ భాషలో రక్షకుడు అని అర్థం. వీరు అతివాదులు. షియాలు, సుఫీలు మితవాదులు.
ఇరాక్ నుండి సిరియా, అక్కడినుండి ట ర్కీద్వారా ఐరోపాకు ఐసిస్ సంస్థ విస్తరించింది. దీని లక్ష్యం ప్రపంచంలో ఇస్లామేతర సంస్కృతి ఏదీ ఉండకూడదు అని. జకీర్ ఖాన్ సౌదీలోనక్కి, ఇండియాకు రాను అని తేల్చి చెప్పాడు. కశ్మీరులో ఐఎస్‌ఐఎస్ కల్లోలం సృష్టిస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో ములాయం ‘ఖాన్’ బహిరంగంగానే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నాడు. కేరళలో ఉమెన్ చాందీకి ముందు నుండే కాంగ్రెస్, కమ్యూనిస్టు ప్రభుత్వాలు ముస్లింలీగ్‌లో రాజకీయాధికాన్ని పంచుకున్నాయి. ‘మా కేరళ ముస్లిం లీగ్ సెక్యులర్ పార్టీ’ అని మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ ప్రకటించాడు.
2016, జులై 17న హైదరాబాద్‌లోని హెచ్‌సియులో బుర్హన్ వని సంతాపసభ జరిగింది. యూనివర్సిటీ బయట వ్యక్తులు లోపలికి ఏలా ప్రవేశించారో తెలియదు. ఈ సందర్భంగా వని స్వాతంత్య్ర సమరయోధుడని కీర్తించారు. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఇలా జరుగుతుందా? ఢాకా మీద దాడి జరిగిన తర్వాత షేక్ హసీనా పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా భావించింది. నైస్ సిటీపై దాడి జరిగిన తరువాత ఫ్రాన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చింది. కాని భారత ప్రభుత్వం కాని ప్రతిపక్షాలు కాని పాక్‌ను ఉగ్రవాద దేశంగా బహిరంగంగా ప్రకటించడానికి ఎందుకు జంకుతున్నాయి? పాక్‌పై చర్య తీసుకుంటే ఇండియాలో ముస్లింల ఓట్లు తమకు రావని ఈ భారతీయ రాజకీయ నాయకుల భయం. అంటే ఓట్లకోసం దేశ భద్రతను తాకట్టు పెట్టడం తగునా?
2016, జూలై 20వ తేదీన ఉగ్రవాద సా నుభూతి పరులను నాంపల్లి కోర్టులో హాజ రు పరచారు. కోర్టు అనుమతితో తదుపరి విచారణకు వారిని ఢిల్లీకి, ఎన్‌ఐఏ తీసుకొనిపోయింది. విచారణలో వెల్లడయిన కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి. ‘నియామతు ల్లా, అయతుల్లా రెహ్మాన్‌లు హైదాబాద్‌లోని బండ్లగూడకు చెందినవారు. వీరు ఐసిస్‌లో చేరాలని నిశ్చయించుకున్నారు. రెహ్మాన్ ఉగ్రవాద భావజాలంతో చేసే ప్రసంగాలు చాలా ప్రభావాన్ని చూపేవి. హైదరాబాదుతో పాటు దేశంలోని భిన్న ప్రదేశాల్లో తాము విధ్వంసం సృష్టించడానికి వ్యూహరచన చేసినట్టు వారు విచారణలో వెల్లడించారు. హుస్సేన్ అలియాస్ యాసీన్‌ను మాడ్యూల్ చీఫ్ (అమీన్)గా ప్రకటించారు. ఐతే తాము అందుకోసం ఒక్క విధ్వంసం కూడా సృష్టించలేదని, అం దుకోసం ప్రణాళిక మాత్రమే సిద్ధమైందని తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీరు నుండి ఉగ్రవాదులు కశ్మీరులోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి ఆక్రమిత కశ్మీరును ఖాళీ చేయాలని జూలైలో భారత ప్రభుత్వం పాక్‌ను అధికారికంగా కోరింది. అయితే భారత్ డిమాండ్‌ను నవాజ్ షరీఫ్ అంగీకరిస్తాడని భూమండలంపై ఉన్న ఎవరూ అనుకోరు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్ళు భయపడవు. మోదీ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి సహాయం తీసుకొని ఆక్రమిత కాశ్మీర్‌పై బలప్రయోగం చేసి విముక్తం చేయటం మాత్రమే పరిష్కారమార్గం అవుతుంది. గుజరాత్ నుంచి వచ్చిన మోదీకి, గుజరాత్‌కు చెందిన వల్లభాయ్ పటేల్ ఆదర్శం కావాలి.
2016, జులై 22న విశ్వహిందూ పరిషత్ నాయకుడు రామరాజు మాట్లాడుతూ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తీవ్రవాద భావజాలం ఉన్నవారున్నారేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఉగ్రవాదులకు మంచిర్యాల బాంబుల తయారీ కేంద్రంగా మారినట్టు విచారణలో తేలింది. నాసిర్, తవుల్లాలు వెల్లడించిన కథనాల ప్రకారం ముడి పదార్థాలు హైదారాబాద్ నుంచే సరఫరా అవుతున్నట్టు తేలింది. 2002లో అజాం ఘోరీ, 2013లో లతిఫ్ వసీలు మంచిర్యాలనుండి ఉన్నత విద్యాభ్యాసం కోసం సిరియా వెళ్లి అక్కడ ఐఎస్‌లో చేరడం యుద్ధంలో చనిపోవడం తెలిసిందే. జగిత్యాలకు చెందిన బ్యాంకు దోపిడీనోట్లు బెంగాల్‌లో కొంతకాలం క్రితం ప్రత్యక్షమైనాయి. 2016, జులై 22 రాత్రి జర్మనీలోని మ్యూనిచ్ నగరలోని ఒలింపిక్ స్టేడియంలో గల మెక్‌డొనాల్డ్ షాపింగ్ మాల్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో పది మంది వరకు మరణించారు. అంటే జిహాదీ వాహెబ్ పునరుజ్జీవన ఉగ్రవాదం విశ్వవ్యాప్తంగా పనిచేస్తున్నదని అర్థం.

- ముదిగొండ శివప్రసాద్