మెయిన్ ఫీచర్

శుభాలనొసగే కార్త్తీకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీకం అన్నిమాసాల్లోకి పవిత్రమైన మాసంగా భావించబడుతోంది. ‘న కార్తీక సమో మాసః’ అని అత్రి మహాముని వచనము. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్థం. కార్తీక మాసంలో చేయదగిన పుణ్య కార్యక్రమాలలో నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, శ్రవణం, దీపారాధనం, దీప దానం, తులసిమాల ధారణం, సాలగ్రామ పూజ, దైవ పూజ, వనభోజనం మున్నగునవి. వీటిలో విశేష పుణ్య ఫలాలను ఇచ్చేది కార్తీక స్నానం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది.
చైత్ర పౌర్ణిమ రోజున చంద్ర సంచారము చిత్తా నక్షత్రమున అవుతుంది కనుక ఆ మాసానికి చైత్ర మాసమని, విశాఖ నక్షత్రమందు సంచరించుట వలన వైశాఖ మాసమని, ఇలా పనె్నండు మాసాల పౌర్ణిమలలో చంద్రుని సంచారం ఆధారంగా పేర్లను నిర్ణయించారు. ‘‘చంద్రుడు పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రములో సంచరించే మాసం కార్తీక మాసం’’. అంబా, దులా, నితంతా, అభ్రయంతీ, మేఘయంతీ, వర్షయంతీ, చూపూణికా అనే పేర్లతో పిలవబడే షట్కృత్తికలు కార్తీక మాసమునకు అధిపతులుగా చెప్పబడ్డారు. కృత్తికా నక్షత్రము కృత్తికలకు అధిష్టానము, అగ్ని స్వరూపము. అశ్విన్యాది 27 నక్షత్రములు దేవతలకు ఇంద్రియములుగా చెప్పబడ్డాయి.
‘నక్షత్రం దేవమింద్రియం’ అని శృతి. వాటిలో అతి ముఖ్యమైన తేజస్సును దేవతలకు అందించే నక్షత్రం కృత్తికా. అట్టి కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణిమాస్య కలిగిన ఈ మాసము కార్తీక మాసముగా, విశేష పుణ్యఫలదముగా చెప్పబడ్డది. చాంద్రమాన రీత్యా ఎనిమిదవ మాసమైన కార్తీకమునకు ఒక విశేష స్థానము కలదు. శరదృతువు ఉత్తరభాగములో వచ్చే కార్తీక మాసము నెలరోజులు పర్వదినాలుగానే భావిస్తారు.
కార్తీకమాసమందు చేయదగిన శుభకర్మలలో అత్యంత ప్రాధాన్యత కలిగినది, విశేష పుణ్య ఫలాలను ఇచ్చేదీ కార్తీక స్నానము. పవిత్ర తీర్థములలోనే గాక తమతమ గృహములందు కూడా సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నాన, దీపారాధనలను ఆచరించవచ్చు. దీపారాధన సంబంధంగా, రవి తులా రాశిలో సంచరించే కాలం అంటే కార్తీక మాసములోప్రతిరోజు సాయంకాలం విష్ణు అర్పణముగా ఎవరైతే నూనెతో దీపము పెడతారో వారికి సకల శుభాలు కలుగుతాయని, దీపావళి నుంచి ప్రతి దినము గృహమున దీపముంచటం ఒక ఆచారముగా అనాదినుంచి వస్తున్నది. భగవద్భక్తులు వారి వారి అభీష్టము మేరకు తులసీ, రుద్రాక్ష, స్పటికాదుల మాలలను వారి వారి ఇష్టదైవముల చిహ్నముగా ధరించడం జరుగుతున్నది. రామాయణ కాలంనుండి భగద్భక్తులు తమ భక్తిని చాటే విధంగా మాల ధారణం చేయడం జరుగుతుండగా, విష్ణ్భుక్తులు తులసి, కమలా మాలలు, శివ భక్తులు రుద్రాక్ష, స్ఫటిక మాలలను ధరిస్తారు. కార్తీక శుద్ధ విదియను ‘‘యమ ద్వితియా’’ అంటారు. దక్షిణ దిశాధిపతి, మృత్యు లోకాధిపతియైన యముని సోదరియైన యమున తన సోదరునికి భోజనము పెట్టి ఆరాధించినది. అందువలన ఈ రోజుకు యమ ద్వితియా అని పేరు వచ్చింది. ఈ రోజున ‘‘్భగినీ హస్త భోజనం’’ గావించాలని ధర్మశాస్తమ్రులందు తెలుపబడింది. కార్తీక శుద్ధ ఏకాదశి - ఉత్థాన ఏకాదశి ప్రత్యేకత ననుసరించి, ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతముగా చెప్పబడుచున్నవి.
మహావిష్ణువు ఆషాడశుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉండునని, తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థానము చెందును కావున దీనిని ఉత్థాన ఏకాదశి అనికూడా పిలుస్తారు. పీఠాధిపతులు, యతీశ్వరులు, మునులు ఈ వ్రతమును ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆహార నియమాలతో చేయడం జరుగుతున్నది. కార్తీక శుద్ధ పూర్ణిమా రోజున కృత్తికా దీపోత్సవమును ఆచరించడం, ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు గావించి, దీపారాధన గావించుట అత్యంత పుణ్యప్రదం. కార్తీక కృష్ణ త్రయోదశీ రోజున యముని ప్రీతి కొరకు దీపదానము చేసిన అకాల మృత్యు భయము తొలగునని విశ్వాసం.
కార్తీక కృష్ణ చతుర్దశి నాడు ఉదయము చంద్ర దర్శనమగు సమయమున అభ్యంగన స్నానము నువ్వుల నూనెతో చేసిన నరకబాధ తొలగునని చెప్పబడింది. కార్తీక అమావాస్య నాడు దారిద్య్ర నిర్మూలనముకు లక్ష్మీపూజ గావించుట శ్రేష్టం. అమ్మవారిని శ్రీ సూక్తాది సూక్తములతో అర్చించి, నైవేద్యమును సమర్పించిన దారిద్య్ర నాశనమయి కలకాలం సుఖ, సౌభాగ్యములతో తుల తూగుతారన్నది సంప్రదాయాచారణ.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494