మెయిన్ ఫీచర్

పరుగుల రేసుగుర్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం నాకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తాను. ఇందుకోసం పరుగుపెడతానంటున్నాడు పద్నాలుగేళ్ల పరుగుల బుడతడు బుధియాసింగ్. పదేళ్ల క్రితం ఒడిస్సా పేరును పతాకస్థాయి శీర్షికల్లోకి ఎక్కించిన నాలుగేళ్ల బుడతడు బుధియాసింగ్ గురించి తెలియనివారు ఉండరు. ఆనాడు బుధియా పూరి నుంచి భువనేశ్వర్‌కు దాదాపు 65 కిలోమీటర్లు ఆపకుండా పరుగుపెట్టి లిమ్కా బుక్ రికార్డ్సుల్లోకి ఎక్కాడు. నాలుగేళ్లకే ఆరంభమైన ఈ పరుగు నేడు 45 మారథాన్‌లు పూర్తిచేసే వరకు కొనసాగుతుంది.
వెంటాడే పుకార్లు
పరుగుతో ప్రపంచ రికార్డులు సాధించిన ఈ కుర్రాడు అదేస్థాయిలో వివాదాల చిక్కుముడుల్లోతరుచూ చిక్కుకుంటూనే ఉన్నాడు. గతంలో బుధియా ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడే కోచ్ బిరించీ దాస్ పసివాడ్ని పరుగు పేరుతో విపరీతంగా దండిస్తున్నాడని పుకార్లు వెల్లువెత్తాయి. మొన్నటి మొన్న స్పోర్ట్స్ హాస్టల్ నుంచి బుధియా వెళ్లిపోయాడని, ఎక్కడకు వెళ్లాడు? ఎందుకు వెళ్లాడు? అంటూ వార్తలు వచ్చాయి. కొన్ని ప్రసారమాధ్యమాల్లో అయితే ఎవరో బుధియాను కిడ్నాప్ చేశారని, ఆ కిడ్నాపర్లే చంపేశారని కూడా పుకార్లు షికారు చేశాయి.
ఈ పుకార్లకు సమాధానం ఇస్తూ.. తాను దేశం కోసం త్వరలో పరుగుపెడతానని, ఇందుకు అవసరమైన శిక్షణకు మంచి కోచ్ కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడించాడు. అలాగే తనపై రూపొందించిన సినిమా బుధియా సింగ్ - బర్న్ టు రన్‌పై తన అభిప్రాయాలను వెల్లడించాడు. బిరించీ సార్ ఉన్నపుడు ప్రాక్టీస్ బాగుండేది... మాజీ కోచ్ బిరించీ దాస్ తో ఉన్నపుడు పరుగు ప్రాక్టీస్ ఎక్కువగా చేసేవాడు. తెల్లవారుజామున 4గంటలకు లేచి ఆరింటి వరకు పరుగు ప్రాక్టీస్ చేసేవాడు. మళ్లీ స్కూలు నుంచి తిరిగిరాగానే ఒంటి గంట నుంచి 4 గంటల వరకు ప్రాక్టీస్ చేసేవాడిని. స్విమ్మిం గ్, ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయించేవాడని వెల్లడించాడు. కాని హాస్టల్‌కు పంపించిన తరువాత ఈ బుడతడి జీవితం రోటీన్‌గా మారిపోయింది. ఈ జీవితం అతనికి ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ కేవలం రెండు గంటల మాత్ర మే ప్రాక్టీస్ చేయగలుగుతున్నాడు. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్ హాస్టల్‌లో చదువుకుంటున్నాడు. సినిమాపైనే ఆశలు ఇంతకు ముందు రెండు డాక్యుమెంటరీలను బుధియాపై తీశారు. కాని ఆవేమి అతనికి క్రేజ్ సంపాదించిపెట్టలేదు. ఈసారి ఓ చిత్రమే రూపొందుతుంది. బుధియాగా పూణే కు చెందిన ఏడేళ్ల మయూర్ నటించాడు. అలాగే బుధియాను ప్రపంచ దృష్టికి తీసుకువచ్చిన బిరించీదాస్ పాత్రలో ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ నటించాడు. చిద్ర దర్శకుడు సౌమేంద్ర పధి ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. బుధి యా కథ కోసం ఎంతో పరిశోధన చేశా డు. బుధియా పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అలాగే 2008లో ఎటువంటి సంబంధంలేని వ్యక్తుల చేతిలో కాల్చ చంపబడిన కోచ్ బిరించీ, బుధియా మధ్య నెలకొన్న గురుశిష్యుల బంధాన్ని, బుధియా కష్టాలు తదితర అంశాలు ఈ సినిమాలో చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ఉత్తమ బాల ల చిత్రంగా అవార్డు దక్కించుకుంది. సౌమేంద్ర సార్ తన వద్దకు వచ్చినపుడు ఈ సిని మా గురించి విని ఎంతో సంతోషించానని, దీని ద్వారా తాను మరింత వెలుగులోకి వస్తానని ఆశలు పెట్టుకున్నట్లు బుధియా వెల్లడిస్తున్నాడు.
పర్సనల్ కోచ్ అవసరం..
ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలోని మురికివాడ నుంచి వచ్చిన విషయం తానెప్పుడు జ్ఞప్తికి తెచ్చుకుంటూనే ఉంటానని చెబుతూ తాను వెండి స్పూన్‌తో పుట్టలేదు కాబట్టే మంచి కోచ్‌ను, మంచి డైట్‌ను అందిస్తే పరుగులో పతకాలు తీసుకువస్తానని అంటున్నాడు. ప్రస్తుతం హాస్టల్ కోచ్ బాగానే శిక్షణ ఇస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా కోచ్‌ను ఏర్పాటుచేస్తే మరింత రాణించగలుగుతాననే ఆశాభావం వ్యక్తచేశాడు. క్రీడారంగంలో ఇటీవల కాలంలో పాన్‌సింగ్ టోమర్, మేరీ కోమ్, భాగ్ మిల్క్ భాగ్ తరువాత వస్తున్న చిత్రం బుధియాపైనే. ప్రభుత్వం పరుగుల వీరుడి కోరికను మన్నించి మంచి కోచ్‌ను ఏర్పాటుచేస్తే మరింత రాణించగలడని ఆశిద్దాం.

-టి.ఆశాలత