మెయిన్ ఫీచర్

నిద్రలో ఆమె వయసు తగ్గింది!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదేం శీర్షిక అనుకుంటున్నారా? నిజంగానే ఆమె 32 సంవత్సరాల వయస్సులో పడుకుంటే, 15 సంవత్సరాల వయస్సులో మెలకువ వచ్చింది. ఇదేం చిక్కుముడి.. అసలేం జరిగింది? అనే కదా మీ సందేహం.. వివరాల్లోకి వెళితే..

అది బ్రిటన్‌లోని మాంచెస్టర్ నగరం..
ఆ ఉదయం నయోమీ జాకబ్స్ నిద్రలేచింది. తనెవరో ఆమెకు గుర్తుకు రాలేదు. తను అక్కడ ఎందుకు ఉందో అర్థం కాక కంగారుపడిపోయింది. మెలకువ రాగానే తను ఓ పదిహేను సంవత్సరాల అమ్మాయినని ఆమె అనుకుంది. కానీ నిజానికి ఆమె వయస్సు 32 సంవత్సరాలు. మొదటి కొన్ని సెకన్లపాటు ఆమె కల కంటున్నట్లు అనుకుంది. ఆ గది ఆమెకు గుర్తులేదు. ఆ పరదాలు.. అల్మారా.. పడుకున్న పడక.. అన్నీ కొత్తగా, వింతగా అనిపించసాగాయి ఆమెకు. తరువాత ఆమెకు ఏదో గుర్తుకు వచ్చి తన శరీరం వైపు చూసుకుంది. వింతగా అనిపించింది ఆమెకు.. వెంటనే అద్దం వైపుకు పరిగెట్టింది. ఆమె ముఖం ఆమెకు కొత్తగా అనిపించింది. ఒక్కసారిగా వయసుపెరిగిపోయినట్లు అనిపించి గట్టిగా అరిచింది. అప్పుడు ఆమె గొంతు వేరేలా అనిపించింది ఆమెకు. తను భవిష్యత్తులోకి ఎలా వెళ్లానో నయామీకి అర్థం కాలేదు. ఆమెలోని భావనలన్నీ పదిహేను సంవత్సరాల వయస్సున్న అమ్మాయివి. ఓ ఇరవై నాలుగ్గంటల వరకు అసలు తను ఇలా ఎందుకు ఉందన్న విషయం తెలియక విలవిల్లాడింది. తరువాత..
నయోమీకి నిజం తెలిసింది.. నయోమీ పదేళ్ల బిడ్డకు తల్లిఅని తెలియగానే ఆమె షాక్‌కు గురైంది. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయింది. తరువాత నయోమీ కొడుకు నవ్వుతూ వస్తుంటే ఆ అబ్బాయిని అలా చూస్తుండిపోయింది ఏం చేయాలో తెలీక.. నయోమీ పదిహేను సంవత్సరాల వయసులో విలేకరి లేదా రచయిత్రి కావాలనుకుంది. ప్రపంచమంతా తిరగాలనుకుంది.. తనకు అంతమాత్రమే గుర్తుంది. ఇప్పుడు తనెక్కడుంది? తనకు పెళ్లి ఎప్పుడు అయింది? తనకు కొడుకు ఎప్పుడు పుట్టాడు అనే విషయాలేవీ ఆమెకు గుర్తులేవు. వెంటనే నయోమీ ఓ డాక్టరు దగ్గరకు వెళ్లి తన సమస్య చెప్పుకుంది. ఆ డాక్టరు నమ్మలేదు. పైగా ఆమెను విచిత్రంగా చూసి వెంటనే వెళ్లిపొమ్మని చెప్పాడు. నయోమీకి ఏం చేయాలో తోచలేదు. తన జ్ఞాపకాలను తనే వెతుక్కోవడం మొదలుపెట్టింది.
నయోమీకి మొదటి నుంచీ తన సోదరి సిమోన్, తన ప్రాణ స్నేహితురాలు కేటీ సాయం చేస్తూ వచ్చారు. నయోమీ, సిమోన్‌ను విషయం అడగ్గా ‘నువ్వు టీనేజీలో ఉన్నప్పుడు వార్తాపత్రికలను బాగా రాసేదానివి. ఆ పేపర్లో ఇంట్లో ఎక్కడో పెట్టుంటావు చూడు’ అని చెప్పింది నయోమీ సోదరి. వెంటనే నయోమీ ఇంటిని వెతకడం మొదలుపెట్టింది. కాసేపు వెతికిన ఆమెకు తన పడక కింద వార్తాపత్రికలు ఉన్న ఒక పెట్టె కనిపించింది. అందులో ఆమె పోగొట్టుకున్న పదహారు సంవత్సరాల జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె మెదడును తొలిచేస్తున్న అనేక ప్రశ్నలకు జవాబులు దొరికాయి. వార్తాపత్రికల్లో కనిపించిన చాలా వార్తలు ఆమె మనసును ముక్కలు చేశాయి. వార్తాపత్రికల ద్వారా ఆమె తనకు డ్రగ్స్ వ్యసనం ఉన్నట్లు తెలుసుకుంది.
ఒకప్పుడు తనకు సొంత వ్యాపారం, సొంత ఇల్లు ఉండేదని.. డ్రగ్స్‌కు బానిసైన తరువాత వ్యాపారం దివాలా తీసింది. ఇల్లు పోగొట్టుకుంది. వ్యసనం మాత్రం పోలేదు. దివాలా తీసిన సమయంలో ఆమెకు 3బైపోలార్ డిజార్డర్2 ఉన్న విషయం తెలుసుకుంది. వార్తాపత్రికల ద్వారా తెలిసిన మరో విషయం ఏమిటంటే.. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయి అనే వార్త.. పదిహేను సంవత్సరాలు ఉన్నాయని అనుకుంటున్న ఒక అమ్మాయి, చిన్నతనంలో తనపై జరిగిన ఘోరం గురించి రాసిన వార్తను, ఏళ్ల తర్వాత మళ్లీ తనే చదవడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో ఊహించడం కూడా కష్టం.
నయోమీకి 15 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వయస్సు మధ్య గడిపిన జీవితం అస్సలు గుర్తులేదు. ఆమెకు 15 సంవత్సరాల వయస్సులో ఏం జరిగింది? అయినా ఆమెకు పదిహేను సంవత్సరాలే ఉన్నట్లు ఎందుకు అనిపిస్తోంది అనే ప్రశ్నలకు ఆమె దగ్గర సమాధానం లేదు. జ్ఞాపకాలను పోగొట్టుకున్న తర్వాత నయోమీ ప్రతి సమస్యనూ ఎదుర్కొవడానికి సిద్ధపడింది. ఒకరోజు ఉదయం అంటే తన జ్ఞాపకాలు కోల్పోయిన దాదాపు మూడు నెలల తర్వాత నయోమీకి మెలకువ రాగానే ఒక్కసారి అంతా భిన్నంగా అనిపించింది. ఓ గంటపాటు ఆలోచిస్తే ఆమె జ్ఞాపకాలు ఆమెకు తిరిగివచ్చాయి. తన వయస్సు 32 సంవత్సరాలని ఆమెకు గుర్తుకు వచ్చింది. అప్పటినుంచి మూడు సంవత్సరాల తర్వాత తనకేం జరిగిందో తెలిసింది నయోమీకి..
జ్ఞాపకాలు తిరిగి వచ్చాక నయోమీ ఓ మంచి సైకాలజిస్టును కలిసింది. ఆయనకు జరిగినదంతా పూస గుచ్చినట్లు వివరించింది. ఆ సైకాలజిస్టు ఆమెపై చాలా రీసెర్చ్ చేశాడు. ఆమె సహచరులతో మాట్లాడాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత డాక్టరు ఓ నిర్ణయానికి వచ్చాడు. నయోమీ3‘డిసోసియేటివ్ అనీషియా’తో బాధపడిందని ఆ డాక్టరు తేల్చాడు. ఇది ఒక అరుదైన అనీషియా రకం. ఆమె తన జ్ఞాపకాలను కోల్పోలేదు. తీవ్రమైన ఒత్తిడి వల్ల ఆమె మెదడు షాక్‌కు గురైంది. దాని ఫలితంగా పదిహేను సంవత్సరాల వయసప్పుడు ఆమె ఎలా ఉందో అలా మారిపోయింది. తర్వాత జరిగిన తీవ్ర పరిణామాలు, మానసిక ఒత్తిడి, డ్రగ్స్ వ్యసనాలు ఆమెకు గుర్తులేవు. ఆలోచించగా, వార్తాపత్రికలు చదవగా, ఒత్తిడికి లోనుకాకపోవడం మూలంగా ఆమెకు తన జ్ఞాపకాలు మళ్లీ వచ్చేశాయని తేల్చాడు డాక్టర్. వ్యాధి గురించి తెలిసిన తర్వాత నయోమీకి కాస్త ఉపశమనం లభించింది. తర్వాత నయోమీ పూర్తిగా మారిపోయింది. తనకు వచ్చిన వ్యాధి గురించి తన అనుభవాల గురించి ‘ద ఫర్గాటన్ గర్ల్’ పేరుతో నయోమీ ఒక పుస్తకం రాసి రచయిత్రి కావాలనే తన చిన్ననాటి కలను నెరవేర్చుకుంది.

-ఎస్.ఎన్.ఉమామహేశ్వరి