మెయిన్ ఫీచర్

అధ్యక్ష పదవే టార్గెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తులసి గబార్డ్ వయస్సు 37 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే అమెరికా రాజకీయాల్లో విస్తృతంగా చర్చకు వస్తోంది ఈ పేరు. ఇటీవల అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు, హిందువులతో పాటు ప్రపంచ హిందూ జనాభాలో, భారతీయుల్లో ఈ పేరు బాగా నలుగుతోంది. తులసి కర్మరీత్యా హిందువు. చైతన్య మహాప్రభు బోధించిన వైష్ణవాన్ని నిష్ఠగా ఆచరించే శుద్ధ శాకాహారి. అమెరికన్ సమోవా కేథలిక్ తండ్రికి, హిందూ తల్లికి పుట్టిన బిడ్డ తులసి గబార్డ్. చిన్నప్పటి నుంచి హిందువుగానే పెరిగింది ఈమె. హిందూ పురాణాలు, గ్రంథాలు, కర్మలు, ఆచారాలకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. అందుకేనేమో ఈమెకు వాళ్ల అమ్మ 3తులసి2 అనే పేరు పెట్టింది. ఈమెతో కలిపి ఐదుగురు సంతానం. వారి పేర్లు కూడా భక్తి, జై, నారాయణ్, బృందావన్.. ఇలా ఉన్నాయి..
తులసి సైన్యంలో పనిచేసింది. అలాగే ఆమె మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్ కూడా.. 2002లో ఎడ్వర్డో టమయోను పెళ్లిచేసుకుంది.. తరువాత వ్యక్తిగత కారణాల వల్ల 2006లో వారిద్దరూ విడిపోయారు. అప్పటి నుండి విడిగానే ఉన్న ఆమె 2015 ఏప్రిల్లో పూర్తిగా వైదిక సంప్రదాయంలో అబ్రహాం విలియమ్స్‌ను పెళ్లిచేసుకుంది. ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆమె తన హిందూ మత విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. హిందువు అనే కారణంగా ఆమెను అమెరికాలో పనిచేసే, స్థిరపడిన భారతీయులు ఆమెను అధికంగా అభిమానిస్తారు. అంతేకాదు ఆమెకు కూడా భారతదేశమన్నా, భారతీయులన్నా ప్రత్యేక అభిమానం. 2014లో అమెరికాకు వచ్చిన మోడీకి ఆమె హవాయి నుంచి తెప్పించిన ఓ అల్లం పూలదండను, భగవద్గీతను బహూకరించింది. తులసి మోడీకి వీరాభిమాని..
భారతీయులకు నష్టం వాటిల్లేలా ట్రంపు తీసుకునే హెచ్ 1బి, హెచ్ 4 వీసాల ఆంక్షలనూ ఆమె తప్పుపడుతోంది. ఇప్పుడు తులసి ఏకంగా 2020 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికే పోటీపడాలనే ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇటీవల తులసి అమెరికన్ కాంగ్రెస్ తొలి హిందూ ప్రతినిధిగా ప్రమాణం స్వీకారం చేసింది. ప్రమాణ స్వీకారమప్పుడు ఈమె భగవద్గీతపైనే ప్రమాణం చేసింది. ముందుకూడా తులసి భగవద్గీతను తన మార్గదర్శిగా చెప్పుకునేది. అదీ ఆమో నమ్మకం, ఆచరణ.. తనను తాను కర్మయోగిగా చెప్పుకునే ఆమెకు భారతదేశంలోని బృందావనం అంటే విపరీతమైన ఆరాధన, ప్రేమ, భక్తి.. 2020 ఎన్నికల్లో తులసి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే దిశగా ఆమె బృందం అప్పుడు విరాళాల సేకరణ, పబ్లిసిటీ వ్యూహాల్లో మునిగిపోయింది. అసలు అధ్యక్షపదవికి పోటీపడాలంటే సొంత పార్టీలోనే అనేక అడ్డంకులను దాటాలి.. అన్నింట్లోనూ ముందడుగు వేయాలి. తరువాత అసలు సిసలు ఎన్నికలు.. అసలే ట్రంపు అమెరికా జాతీయవాదాన్ని బలంగా ప్రచారం చేసుకుంటూ సాగుతున్న స్థితిలో.. ఓ హిందూ మతవిశ్వాసినిని అమెరికన్ పార్టీ ప్రతినిధులు ఏ మేరకు నెగ్గుకు రానిస్తారో వేచి చూడాలి. ఇవన్నీ ఆలోచించిన తరువాత కూడా ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎందుకంటే ముందు నుండీ ఆమె ఓ ఫైటర్. బరిలో ఉన్న ప్రత్యర్థిని చిత్తుచేయడంలో దిట్ట. అందుకే ఆమె తన సంకల్పాన్ని ఏమాత్రం వదలదల్చుకోవడం లేదు. ఆమె సంకల్పానికి జోహార్లు పలుకుతూ బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం.