మెయిన్ ఫీచర్

సాయ తత్వ్తం... జీవన సత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తథాత్మానాం సృజామ్యహం॥
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్‌
ధర్మ సంస్థాప నార్థాయ సంభవామి యుగే యుగే॥
సమాజంలో ధర్మానికి హాని కలిగినప్పుడు భువిపై జన్మిస్తుంటానని ధర్మాన్ని కాపాడతానని భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. భగవద్గీత నాలుగో అధ్యాయం ఏడు, ఎనిమిది శ్లోకాల ద్వారా భగవంతుడైన శ్రీకృష్ణపరమాత్మ లోకానికి ఈ విషయం వెల్లడించాడు. సత్యం, ధర్మం, న్యాయం, నీతి తదితర దైవీ గుణాలను పెంపొందించేందుకు, కామ, క్రోధ, ఈర్ష్య, రాగ, ద్వేషాలైన రాక్షస గుణాలు తొలిగించేందుకు జన్మిస్తుంటానని కూడా భగవంతుడే స్పష్టం చేశారు.
ధర్మాన్ని కాపాడేందుకు భగవంతుడు మనిషి రూపంలో తరచూ జన్మిస్తుంటాడని అర్థమవుతోంది. త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడు. దశావతారాల గురించి సనాతన ధర్మం చెప్పింది. కేవలం దశావతారాలకే భగవంతుడు పరిమితం కాలేదు. కాలం గడుస్తున్న కొద్దీ భగవంతుడు భక్తులకు దగ్గరవుతున్నాతు. కలియుగంలో ఋషులు, మహర్షుల రూపంలో పరమాత్మ జన్మిస్తూ ఉన్నారు. భగవంతుడి రాకను అందరూ వెంటనే గుర్తించలేరు. మనిషి రూపంలో భగవంతుడు జన్మిస్తే, అందరికీ ఆదర్శంగా, ఉన్నతభావాలతో, ఉన్నత వ్యక్తిత్వంతో, దైవీగుణాలతో జీవిస్తాడు. ప్రకృతి ధర్మాన్ని పాటించాలంటూ ఈ లోకానికి తన అవతారం ద్వారా చాటి చెబుతున్నాడు. ధర్మానికి హాని కలుగుతోందన్న కారణంతో భగవంతుడు వేర్వేరు యుగాల్లో అనేక రూపాల్లో జన్మిస్తున్నాడు. యుగమంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర, కలియుగాలలో మనిషి జీవనశైలి, భగవంతుడిపై చూపే ప్రేమలో తేడా కనిపిస్తోంది. ప్రస్తుతం మనం కలియుగంలో జీవిస్తున్నాం. కలియుగంలో భగవంతుడు భక్తులకు అనేక రూపాల్లో దర్శనం ఇస్తున్నాడు. రామకృష ణపరమహంస, రమణ మహర్షి తదితరులను భగవంతుడి అవతారాలుగా చెప్పుకోవచ్చు. సత్యసాయిబాబా భగవత్ స్వరూపమే. అందులో ఎలాంటి అనుమానం లేదు. ధర్మాన్ని కాపాడేందుకు జన్మించానని చెప్పుకున్నారు. మనిషి రూపంలో జన్మించిన తర్వాత భగవంతుడైనా విమర్శలకు గురవుతూనే ఉంటాడు. శ్రీరాముడు, శ్రీకృష్ణులు కూడా విమర్శల ధాటిని ఎదుర్కొన్నవారే. భగవంతుడు వివిధ రూపాలలో జన్మిస్తున్నా నేడు కూడా విమర్శలకు గురి అవుతూనే ఉన్నాడు. విమర్శించడం అనేది మనిషి సహజమైన స్వభావంగా భావించాల్సి ఉంటుంది. తెలియనితనం అని కూడా అనుకోవచ్చు. భవనం, రోడ్డు తదితర కట్టడాల నిర్మాణం కష్టమైన పనికానీ, విధ్వంసం సులువైన పని. ఒక భవనాన్ని నిర్మించాలంటే సంవత్సరాల తరబడి పడుతుంది. అదే భవనాన్ని కూల్చడానికి ఒక రోజు సమయం సరిపోతుంది. అలాగే మనిషి సత్యం, ధర్మం, న్యాయమైన మార్గాల్లో పయనించేందుకు జీవితాంతం పాటుపడాల్సి ఉం టుంది. చెడువైపు సులువగా ఆకర్షితులవుతున్నారు.
‘డబ్బు పోతే నష్టమేమీ లేదు, మళ్లీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం చెడిపోతే కొన్ని రోజులు బాధపడాల్సి ఉంటుంది, శీలం (క్యారెక్టర్) కోల్పోతే అంతా కోల్పోయినట్టే, అంటే సదరు వ్యక్తి జీవితం సమసిపోయినట్టేనని సత్యసాయి తరచూ చెప్పేవారు. నీతి, న్యాయం, ధర్మం, శీలాన్ని గురించి ఎదుటి వారికి బోధించడం సులువే. కానీ వీటిని ఆచరించడమే కష్టం. అలా ఆచరణలో చూపిన వారిలో సత్యసాయిబాబాను ప్రధానంగా చెప్పుకోవచ్చు.
1926 నవంబర్ 23న సత్యసాయి జన్మించారు. ఆయన 93వ జయంతిని నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన పెద్ద వెంకమరాజు (పెద్ద వెంకప్పరాజు) ఈశ్వరమ్మలకు ఎనిమిదో సంతానంగా జన్మించిన వాడే సత్యనారాయణ (సత్యసాయిబాబా). పెద్దవెంకమరాజు-ఈశ్వరమ్మల మొదటి కుమారుడు శేషమరాజు, ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలు (వెంకమ్మ, పార్వతమ్మ). ఎనిమిదో సంతానమే సత్యసాయి. సత్యనారాయణ (సత్యం) తన 14 వ ఏట తాను సాయిబాబాను అని ప్రకటించుకున్నారు. చిన్న గ్రామమైన పుట్టపర్తి నేడు పట్టణంగా మారింది. సత్యసాయి నివాసం ఉం డే ప్రాంతం ‘ప్రశాంతి నిలయం’గా మారింది.
సత్యసాయి సొంతగ్రామమైన పుట్టపర్తి అనంతపురం జిల్లాలో మారుమూలలో ఉన్న చిన్న ఊరు. సత్యసాయి కుటుంబం నిరుపేద కుటుంబం. చిన్న గ్రామంలో జన్మించిన సత్యసాయి వల్ల ఈ గ్రామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైన ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు తెచ్చుకున్నది. ఆయన బోధనలు అంతర్జాతీయంగా ఆచరణయోగ్యంగా మారాయి. సత్యసాయి కుటుంబ సభ్యులు నేటికీ సాధారణ జవితమే గడుతున్నారు. సత్యసాయి జీవిత చరిత్ర గురించి తెలుసుకునేందుకు శ్రీ సత్యసాయి సాధనా ట్రస్ట్ పబ్లికేషన్స్ విభాగం వారు అనేక పుస్తకాలు ప్రచురించారు. సత్యసాయి తన బోధనాల ద్వారా ప్రపంచానికి ఏం చెప్పారు అని పరిశీలించాల్సిన అవసరం ఉంది.
మనిషి ఔన్నత్యాన్ని పెంచేందుకు భగవాన్ సత్యసాయి ప్రధానంగా ఐదు అంశాలను బోధించేవారు. సత్యం (ట్రూత్), ధర్మం (రైట్ కాండక్ట్), శాంతి (పీస్), ప్రేమ (లవ్), అహింస (నాన్-వయోలెన్స్) అనే మార్గాల్లో మనిషి నడవాలని సూచించారు. ఇవి సనాతన ధర్మ సౌధానికి మూలస్థంభాలలాంటివి అంటారు భగవాన్ సత్యసాయి. ‘అందరినీ ప్రేమించు-అందరినీ సేవించు’ (లవ్ ఆల్ సర్వ్ ఆల్), ‘అందరికీ సాయం చేయి-ఎవరినీ బాధించకు’ (హెల్ప్ ఎవర్- హర్ట్ నెవర్) అనేవి సాయి బోధనలో ప్రధానమైనవి. సత్యసాయి జీవితాన్ని నిశితంగా గమనిస్తే, బోధించడం కంటే ఆచరణలో బోధనలను అమలు చేయాలనే తహ, తహ ఆయనలో ఎక్కువగా కనిపించేది. ఇవే భగవత్ స్వరూపులకు ఉండే ప్రత్యేకత. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తల్లికంటే మించిన దైవం మరొకటి ఉండదు. అలాంటి తల్లి ఆదేశాలను శిరసావహించినవాడు సత్యసాయి. సామాన్యుడికి తాగునీరు, విద్య, వైద్యాన్ని అందించాలని తల్లి ఈశ్వరమ్మ కోరింది. ఆమె కోరికలకు ప్రతిరూపమే నేడు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన విద్య, వైద్య, తాగునీటి పథకాలు.
నీతులు నీడను ఇవ్వవు
సామెతలు సంపదలను ఇవ్వవు
ఆణిముత్యాలు ఆకలి తీర్చవు
మంచిమాటలు మరణాన్ని ఆపవు
కొటేషన్లు కోర్కెలు తీర్చవు
శ్లోకాలు స్థోమతలను ఇవ్వవు
ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు
తత్వాలు తలరాతలు మార్చవు..
కష్టపడి చేసే పని మాత్రమే జీవితానికి పరమావధి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
సత్యసాయి ఏనాడూ తనను భక్తులంతా పూజించాలని బోధించలేదు. భగవంతుడిని విశ్వసించండి-ప్రేమతో జీవించండి, నీతిగా ఉండండి, ధర్మాన్ని వదలకండి, సేవ చేయడాన్ని జీవితంలో ప్రధానమైన అంశంగా మార్చుకోండని బోధించారు. ‘డ్యూటీ ఈజ్ గాడ్-వర్క్ ఈజ్ వర్‌షిప్’ అని చెప్పేవారు. ప్రతి ఒక్కరూ తాము చేసే పనిని నిబద్ధతతో చేయాలని చెప్పేవారు. సేవ చేయడం అంటే ఆర్థికంగా సాయం అందించడమే కాదు, మాటల రూపంలో, శారీరకంగా సేవను అందించవచ్చు. ఆహారాన్ని అందించడం, ఆదాయంలో కొంతభాగమైనా సమాజం కోసం వెచ్చించాలని చెప్పేవారు. దాదాపుఏడు దశాబ్దాల పాటు భౌతికంగా భక్తుల మధ్య ఉన్న సత్యసాయి, భౌతికంగా లేకపోయినా తనదైన ముద్రను వేశారు. ప్రశాంతి నిలయంలో 2011 వరకు ఏ కార్యక్రమాలు జరిగేవో, గత ఏడేళ్లుగా అవి జరుగుతునే ఉన్నాయి. సత్యసాయి లేరని ఎవరూ అనుకోవడం లేదు. సాయి ఏర్పాటు చేసిన ‘మిషన్’ విజయవంతంగా నడుస్తోంది. భౌతికంగా సాయి మన మధ్య లేకపోయినా తమ మనసుల్లో పదిలంగా ఉన్నారన్న భావన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.

-పి.వి. రమణారావు 98499 98093