మెయిన్ ఫీచర్

వ్యక్తిత్వానికి స్వేచ్ఛ?!( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకంటే, యుగయుగాలుగా ‘‘మేము స్వేచ్ఛగా ఉన్నాం’’ అని భావించినవారందరూ నిరాశకు గురైనవారే.
నా చిన్నతనంలోనే మా కుటుంబ సభ్యులందరూ భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నవారే. మా మామయ్యలు, చిన్నాన్నలు జైళ్ళలో ఉన్నందువల్ల వారు తమ చదువు పూర్తి చెయ్యలేకపోయారు. దాదాపు మా కుటుంబమంతా గృహ నిర్బంధంలో ఉంది. ఎప్పటికైనా, ఏదో ఒక రోజు స్వతంత్రం సిద్ధిస్తుందనే ఆశతో ప్రతిరోజూ అందరూ అనేక రకాల చిత్రహింసలు భరించారు. మొత్తానికి పోరు ముగిసింది. కానీ, అందరూ ఆశించిన ‘కొత్తరోజు’ ఇంతవరకూ రాకపోవడమే విచిత్రం. భారత ప్రజలను అమానుషంగా హింసించిన బ్రిటీష్ సామ్రాజ్యవాదులందరూ పలానయమయ్యారు. వారికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారులకే అధికారం దక్కింది కానీ, వారు కూడా బ్రిటీష్ సామ్రాజ్యవాదుల్లాగే ప్రవర్తిస్తున్నారు. కచ్చితంగా ఇది అందరూ ఆశించిన ‘స్వేచ్ఛ’ కాదు. త్వరలో ‘స్వర్ణయుగం’ ప్రారంభమవుతుందని అందరూ గొప్పగా ఊపిరి పీల్చుకున్న నా చిన్ననాటి రోజులవి. కానీ, అందరికీ పూర్తి నిరాశే ఎదురైంది తప్ప గొప్పగా ఏమీ జరగలేదు. బ్రిటీష్ పాలకుల స్థానంలో ఇపుడు భారతీయులు పాలిస్తున్నారు. కానీ వారు అనుసరిస్తున్నవన్నీ, బ్రిటీష్ పాలకుల వ్యూహాలే. వారి అధికార దాహం, ప్రజలను దోచుకునే విధానాలు ఏ మాత్రం మారకపోగా, పెత్తందారీ నిరంకుశత్వం మరింత ప్రబలడంతో ‘‘ఇలాంటి స్వేచ్ఛకోసమా మనం పోరాడింది? ఇలాంటి స్వేచ్ఛకోసమా మన యువకులు ప్రాణాలర్పించారు? ఇలాంటి స్వేచ్ఛకోసమా అనేక వేలమంది జైలుపాలై చిత్రహింసలు అనుభవించి మరణించారు? ఇలాంటి స్వేచ్ఛ కోసమా అన్ని త్యాగాలు చేశాం?’’ అనే దిగ్భ్రాంతికి దేశం గురైంది.
కచ్చితంగా, అది అసలైన స్వేచ్ఛ కాదు. విప్లవకారుడు కాకుండా ఎవరికీ తలవంచని తిరుగుబాటువీరుడు జన్మించేవరకు రాజకీయ ప్రపంచంలో బహుశా అలాంటి స్వేచ్ఛ ఎప్పటికీ రాదు. విప్లవకారులందరూ ఒకసారి కాదు, అనేక వందలసార్లు ఓటమిపాలైనవారే.
విప్లవకారుడు ఎప్పుడూ స్వర్గ సుఖాలను అందరికీ వాగ్దానం చేస్తూ చాలా గొప్పగా మాట్లాడతాడు. కానీ, అధికారం దక్కినవెంటనే అతడు గత నిరంకుశుల కన్నా గొప్ప నిరంకుశుడుగా నిరూపించుకుంటాడు. ఇది సహజం. కాబట్టి, దీనిని ఒక సిద్ధాంతంగా కూడా అంగీకరించవచ్చు.
అందువల్ల విప్లవకారులు చేసే వాగ్దానాలపై నాకు ఆశ లేదు. కానీ, ఏదో ఒక రోజు ఎవరికీ తలవంచని తిరుగుబాటువీరుడు (రెబెల్) జన్మిస్తాడనే ఆశ మాత్రం నాకు ఉంది. మీ గతం, మతం, దేశాల నుంచి మీ వ్యక్తిత్వానికి స్వేచ్ఛ దక్కడమే ముఖ్యంగా జరగవలసిన పరిణామం. ముఖ్యంగా ఇది ప్రతి రెబెల్‌కు ఉండవలసిన లక్షణం.
మీరొక విశిష్ట వ్యక్తిగా మారేందుకు ధ్యానం సహాయపడుతుంది. అలాంటి వ్యక్తుల సమూహానికి మాత్ర మే ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఉం టుంది. గతానికి దారితీసే వంతెనలను విచ్ఛిన్నం చేసిన ఆధ్యాత్మిక స్వేచ్ఛ గల వ్యక్తులు మాత్రమే సుదూర తారల తీరాలపై దృష్టి పెట్టగలరు.
ఒక రకంగా కవులు, స్వాప్నికులు, మార్మికులు, ధ్యానులు అలాంటివారే. అలాంటి వ్యక్తులతో ఈ ప్రపంచం నిండిపోవాలి. అప్పుడే అందరికీ అసలైన స్వేచ్ఛ దక్కినట్లు. అంతవరకు ఈ ప్రపంచం ఒక నిరంకుశత్వం నుంచి మరొక నిరంకుశత్వంలోకి మారుతూ ఉంటుంది. అదొక అర్థంలేని వ్యర్థ వ్యాయామం. మీరే ముఖ్యం. కాబట్టి, మీరు మీ మూలాలకు చేరుకుని, మిమ్మల్ని మీరే తెలుసుకుని, మీరే ఒక రెబెల్‌గా మారి వీలైనంతమందిని మీలా మార్చండి. భవిష్య మానవాళి బంగారు భవిష్యత్తుకు మీరు సాయం చెయ్యగల మార్గం అదొక్కటే బంధువులు, సన్యాసినులు, పూజారులు నన్ను తీర్చిదిద్దిన శిక్షణా విధానాలు పాతబడి ఎండిపోగా, వాటిలో చాలావరకు జీవాన్ని కోల్పోయాయి. మిగిలినవి ఆ నిస్సహాయ వృద్ధులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు ఎందుకూ పనికిరావనిపిస్తోంది. పైగా, నాకు బాహ్యంగా ఉన్నవాటికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడమనేది కాలాన్ని వృధా చెయ్యడమే అవుతుంది.
ఇంకావుంది...
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్