మెయిన్ ఫీచర్

‘మిషెలిన్ స్టార్’ అరోరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడవారు చేసిన వంటను ఎవరైనా పొగిడితే వారికి కలిగే ఆనందం వర్ణనాతీతం. మరింత హుషారుగా తినేవారికి కొసరి కొసరి వడ్డిస్తారు. అలాంటిది ఆమె చేసిన వంటకు అంతర్జాతీయ అవార్డు వస్తే.. ఆ ఆనందం వర్ణించ తరమా.. ఇప్పుడా స్థితిలోనే ఉంది గరిమా అరోరా.. అరోరా బ్యాంకాక్‌లో సెటిలైన భారతీయ మహిళ. ఆమె బ్యాంకాక్‌లోని ‘గా’ అనే రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘మిషెలిన్ స్టార్’ గుర్తింపు ‘గా’కు లభించింది. దీనితో ఆమె ఆనందంలోని అత్యున్నత స్థితిని అనుభవిస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఓ సంస్థ ఈ గుర్తింపును అందిస్తుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ అరోరానే.. నిజానికి వంట చేయడమనేది చాలా పెద్ద చాకిరీగా భావిస్తారు ఈ కాలంలోని అమ్మాయిలు. అందుకే ఎక్కడపడితే అక్కడ కర్రీ పాయింట్లు వెలిశాయి. అలాంటిది వంటతోనే అంతర్జాతీయ స్థాయిని సంపాదించింది అరోరా. మొదట్లో వంట చేయడం కష్టంగానే అనిపించింది అరోరాకి. కానీ తరువాత అదే ఇష్టంగా మారింది ఆమెకు. వివరాల్లోకి వెళితే..
అరోరా ముంబయిలో స్థిరపడిన పంజాబీ అమ్మాయి. తన ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో వంట చేయడం మొదలుపెట్టింది. పాకశాస్త్రంలో శిక్షణ కోసం ప్యారిస్‌లోని కార్డన్ బ్లూ కలినరీ స్కూల్లో చేరింది. పంజాబీ కుటుంబానికి చెందిన మహిళ కావడంతో మొదటినుంచీ వంటలపై అమెకు విపరీతమైన ఆసక్తి అట. ఎందుకంటే చిన్నప్పటి నుంచీ తన తండ్రి చేసే వంటకాలను చూస్తూ పెరిగిందట ఆమె. చాలామంది భారతీయులకు ఇప్పుడు పరిచయం లేని వంటకాలను కూడా ఆయన తొంభైల్లోనే చేసేవారట. పాకశాస్త్రంపైన అభిరుచి పెరగడానికి తండ్రి ప్రభావమే కారణమంటారామె. అందుకే వంట చేయడంలో తండ్రే తనకు స్ఫూర్తి అని చెబుతుంది ఆమె. అప్పటినుంచీ ఆమె పాకశాస్త్రాన్ని అవపోసన పట్టడం మొదలుపెట్టింది. తరువాత ఆమె గోర్డన్ రామ్సే, రెనె రెజెపి, గగన్ ఆనంద్ వంటి ప్రముఖ షెఫ్‌ల దగ్గర ఆమె పనిచేసింది. గత ఏడాది బ్యాంకాక్‌లో తన సొంత రెస్టారెంట్ ‘గా’ను తెరిచింది. అందులో భారతీయ రుచులతో పాటు ఇతర దేశాల ప్రజల అభిరుచులను మేళమించి రెస్టారెంట్ మెనూను రూపొందించింది ఆమె. తండ్రిలాగే అరోరా కూడా సృజనాత్మకతను జోడించి వంట చేస్తుంది కాబట్టి అందరూ ఆమె వంటను ఇష్టపడటం మొదలుపెట్టారు. తాను విదేశాల్లో నేర్చుకున్న వంటకాలకు, భారతీయతను జోడించి కొత్త కొత్త రకం వంటలు హోటల్‌కు వచ్చేవారికి వడ్డించడానికి అరోరా ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. ‘ఇలాంటి ఆహారాన్ని ముందెప్పుడూ తినలేదే’ అనుకుంటూ వినియోగదారులు లొట్టలేస్తుంటే ఆమెకు ఎక్కడలేని ఆనందం కలుగుతుందంట. అలాగే ఆ హోటల్ సిబ్బంది కూడా చాలా ఒద్దికగా ఉంటారట. అందుకే ఆమె రెస్టారెంట్ చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. మిషెలిన్ స్టార్ల ద్వారా అరోరా రెస్టారెంటుకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో రెస్టారెంటుకు వచ్చే వినియోగదారుల సంఖ్య పెరిగింది. దాంతో అరోరా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.