మెయిన్ ఫీచర్

మోసాలపై ఆత్మ తిరుగుబాటు సాధ్యమా? (ఓషో బోధ.... )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓషో నవజీవన మార్గదర్శకాలు
-- అనువాదం: భరత్

అది అర్థం లేని పని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఇపుడు నేనొక పూజారిని, సిద్ధాంతకర్తను. అదే నాకు మరింత నిరాశ కలిగిస్తోంది. అందువల్ల నేనే నా ఆత్మకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాననిపిస్తోంది. కాబట్టి, అది నాకు ఉండవలసిన తిరుగుబాటు చెయ్యగల ఆత్మ-నిజస్వరూపం-కాదని నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే, నాది మోసపూరిత శిక్షణ పొందిన ఆత్మ. కానీ, నాకు తెలిసి, నాకున్న ఆత్మ అదే. దానితోనే నేను తిరుగుబాటు చేస్తున్నా. మోసపూరిత శిక్షణ పొందిన ఆత్మ మోసానికి వ్యతిరేకంగా ఎలా తిరుగుబాటు చేస్తుంది?
నేను మాట్లాడుతున్న తిరుగుబాటు ఎవరికీ వ్యతిరేకంగాచేసేది కాదు. అసలు అది నిజంగా తిరుగుబాటు కాదు. అది కేవలం ఒక అవగాహన. మీరు మీ బాహ్య, అంతర్గత పూజారులు, సన్యాసినులు, బంధువులతో పోరాడకూడదు. ఎందుకంటే, వారు మీ నుంచి వేరుగా ఉన్నారు. అంటే బాహ్య, అంతర్గతాలు వేరు వేరుగా ఉన్నట్లే కదా!అంతేకాదు, అంతర్గతంలో ఉన్నవి బాహ్యంగా ఉన్న వాటి ప్రతిబింబాలే. అందువల్ల బాహ్య, అంతర్గతాలు ఒక విషయమే కాదు.
‘‘ఆ నిస్సహాయ వృద్ధులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడమనేది కాలాన్ని వృధా చేసే అర్థం లేని పని అనుకుంటున్నాను’’ అని మీరు వాస్తవాన్ని చాలా చక్కగా చెప్పారు. నేను కూడా ‘‘వారికి, వారు మీకు బోధించిన వాటికి వ్యతిరేకంగా పోరాడమని’’ మీకు చెప్పట్లేదు. మీరు మీ మనసుకు వ్యతిరేకంగా పోరాడితే అది ప్రతిస్పందన అవుతుందే కానీ, తిరుగుబాటుకాదు. తేడా గమనించండి.
కోపం నుంచి ప్రతిస్పందన పుడుతుంది. అందుకే అది హింసాత్మకంగా ఉంటుంది. అపుడు మీరు గుడ్డిగా ఆవేశపడుతూ ఒక హద్దును దాటి మరొక హద్దుకు వెళ్లడం ప్రారంభిస్తారు. ఉదాహరణకు, ‘‘పరిశుభ్రంగా ఉండమని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పదే పదే పీడిస్తుంటే ఏదో ఒక రోజు అది మీకు విసుగనిపిస్తుంది. అప్పటినుంచి మీరు చాలా మురికిగా ఉండడం ప్రారంభిస్తారు. అంటే మీరు ఒక హద్దు నుంచి మరొక హద్దుకు చేరుకున్నట్లు. అది కోపంతో, ఆవేశంతో చేసిన ప్రతీకారమే. అదే ప్రతిస్పందన. అంతేకానీ, అది తిరుగుబాటు కాదు.
అయితే తిరుగుబాటు అంటే ఏమిటి? తిరుగుబాటు అంటే స్వచ్ఛమైన అవగాహన. మీరు అసలు విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అందువల్ల మీరు ఎలాంటి ఆవేశానికీ, కోపానికీ గురి కాకుండా పరిశుభ్రంగా ఉంటారే కానీ, మురికిగా ఉండరు. కాబట్టి, ఎవరూ ఎలాంటి మానసిక దౌర్బల్యానికి గురికాకూడదు. ఎందుకంటే, మానసిక దౌర్బల్యం ఒక రోగం.
ఉదాహరణకు, ఒక వ్యక్తి అదేపనిగా రోజంతా చేతులు కడుగుతూ ఉంటే, అది ఒక మానసిక దౌర్బల్యం. చేతులు కడుక్కోవడం మంచి పని. కానీ, రోజంతా చేతులు కడుక్కోవడం పిచ్చి పని. అలాగే అసలు చేతులు కడుక్కోకపోవడం కూడా పిచ్చిపని. అవగాహన కలిగిన వ్యక్తి అవసరమైనపుడు చేతులు కడుక్కుంటాడు, లేకపోతే మానేస్తాడు. సహజమైన సమయస్ఫూర్తితో అవసరానికి తగినట్లు తెలివిగా జీవించడమంటే అదే.
తెలివికి, ఎక్కువగా ఆలోచించే అతి తెలివికిమధ్య పెద్ద తేడా ఏమీ లేదు. ఉదాహరణకు, దారిలో పాము కనపడగానే తెలివైన వ్యక్తి భయంతో దూరంగా పారిపోతాడు. ఆ తెలివి లేని మూర్ఖుడు పాము దగ్గరే ఉండి ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటాడు. కాబట్టి, పామును చూడగానే భయపడడం తెలివి. అయితే అతిగా ఆలోచిస్తూ అనవసరంగా అతిగా భయపడడం అతి తెలివి. ఉదాహరణకు, ‘‘ఏ క్షణంలో అయినా ఇల్లు కూలిపోవచ్చు’’ అని అనుక్షణం భయపడడం తెలివికాదు, అతితెలివి. అలా ఎవరైనా ప్రతిదాని గురించి ఆలోచించగలగరు. అతిగా ప్రతిస్పందించడమంటే అదే. అలా చేస్తే పిచ్చి పడుతుంది.
కాబట్టి, తిరుగుబాటు అంటే ఒక విషయంపై చాలా లోతైన అవగాహన కలిగి ఉండడం. అది ఎప్పుడూ మిమ్మల్ని మధ్యలో సమతుల్యంగా ఉంచుతుంది. మీరు ఎవరితోనూ- బాహ్య, అంతర్గతాలలో ఉన్న- పోరాడకూడదు. అందుకు కారణం పోరు ఎప్పుడు ఆపాలో మీకు తెలియదు కాబట్టి. ఎందుకంటే, పోరులో ఎవరికీ ఎరుక ఉండదు. అందువల్ల ఎవరైనా ఎంతకైనా తెగిస్తారు. అది మీరు గమనించే ఉంటారు.

-- ఇంకావుంది...
----------------------------
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.